Narakasuran
-
వేసవికి నరకాసురుడు
అరవింద్ స్వామి, సందీప్ కిషన్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నరకాసురుడు’. తమిళంలో తెరకెక్కిన ‘నరగాసురన్’ సినిమాకు ఇది తెలుగు వెర్షన్. కార్తీక్ నరేన్ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘థ్రిల్లర్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది పూర్తయిన తర్వాత విడుదల తేదీని ప్రకటిస్తాం. ఈ వేసవిలోనే తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది’’ అన్నారు. ఆత్మిక, ఇంద్రజిత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మణికందన్, సంగీతం: రాన్ ఏతాన్ యోహాన్, కెమెరా: సుజిత్ సారంగ్. -
దర్శకుడిగా మారనున్న విలక్షణ నటుడు
సెకండ్ ఇన్నింగ్స్‌లో విలక్షణ పాత్రలతో దూసుకుపోతున్న దక్షిణాది నటుడు అరవింద్ స్వామి. తనీ ఒరువన్ సినిమాలో ప్రతినాయక పాత్రలో ఆకట్టుకున్ అరవింద్ స్వామి తరువాత ఆ సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ధృవలోనూ అదే పాత్రలో నటించి మెప్పించారు. భాస్కర్ ఒరు రాస్కెల్ సినిమాతో హీరోగానూ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం శతురంగవేట్టై, నరకసూరన్, వనంగాముడి సినిమాలతో పాటు మణిరత్నం దర్శకత్వంలో సెక్క సివంద వానం సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. నటుడిగా ఫుల్ బిజీగా కొనసాగుతూనే దర్శకుడిగా మారే ప్రయత్నాల్లో ఉన్నారు అరవింద్ స్వామి. ఇప్పటికే కథ రెడీ చూసుకున్న ఈ విలక్షణ నటుడు ప్రస్తుతం స్క్రీన్‌ప్లే, సంభాషణలు రాస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. -
ప్రతి నాయకిగా శ్రియ
నరకాసురన్‌కు నటి శ్రియ విలన్‌గా మారనుందా? ఈ ప్రశ్నకు కోలీవుడ్‌లో అవుననే సమాధానమే వస్తోంది. శ్రియకు మళ్లీ అవకాశాలు పెరుగుతున్నాయి. చారిత్రాత్మక కథా చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిలో బాలకృష్ణకు జంటగా నటించి మంచి మార్కులు కొట్టేసిన ఈ బ్యూటీ, టాలీవుడ్లో మరోసారి అదే హీరోతో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కోలీవుడ్‌లో శింబుతో ‘అన్బానవన్ అసరాధవన్ అడంగాధవన్’ చిత్రంలో రొమాన్స్ చేస్తోంది. కాగా తాజాగా ప్రతినాయకిగా మారడానికి ఏ మాత్రం సంకోచించకుండా నరకాసురన్ అనే చిత్రంలో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. వివరాల్లోకెళ్లితే ఇటీవల చిన్న చిత్రంగా విడుదలై చాలా పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం దృవంగళ్ పదునారు. దీనికి సృష్టికర్త నవ దర్శకుడు కార్తీక్‌నరేన్. తొలి చిత్రంతోనే శభాష్ అనిపించుకున్న ఈ వర్ధమాన దర్శకుడు తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రం పేరే నరకాసురన్. ఇందులో అరవిందస్వామి ప్రధాన పాత్ర పోషించనున్నారు. యవ కథానాయకుడిగా టాలీవుడ్ యువ నటుడు నాగచైతన్య నటించడానికి అంగీకరించినా, ఇప్పుడు ఆయన వైదొలగినట్లు టాక్ స్ప్రెడ్ అయ్యింది. కారణం ఆయన త్వరలో తన ప్రేయసి సమంతను వివాహమాడబోతుండడమేనని సమాచారం. ఆయన పాత్రలో మరో టాలీవుడ్ నటుడి కోసం వేట మొదలైందని తెలుస్తోంది. ఇందులో ప్రతినాయకిగా శ్రియ నటించనున్నారట. కథ వినగానే తన పాత్ర తెగ నచ్చేయడంతో విలనీయం ప్రదర్శించడానికి శ్రియ సిద్ధం అనేసిందట. మరో విషయం ఏమిటంటే ఆ చిత్ర కథ నచ్చడంతో ప్రముఖ దర్శకుడు గౌతమ్‌మీనన్ తానే నిర్మించడానికి ముందుకు వచ్చారట.అయితే చిత్ర దర్శకుడు కార్తీక్‌నరేన్ కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకోనున్నారని తెలిసింది. చిత్ర షూటింగ్ ఆగస్ట్‌లో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం.