Arvind Swami
-
'సత్యం సుందరం' ట్రైలర్.. మరో హిట్ ఖాయం
కార్తి - అరవింద్ స్వామి కాంబినేషన్లో వస్తున్న సినిమా 'మెయిళగన్'. తెలుగులో 'సత్యం సుందరం' పేరుతో థియేటరలో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రేమ్ కుమార్ తెరకెక్కించారు. సూర్య-జ్యోతిక నిర్మించారు. ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో అరవింద్ స్వామి, కార్తి.. బావ-బావమరిదిగా నటించడం విశేషం. సెప్టెంబర్ 28న ఈ చిత్రం విడుదల కానుంది.తమిళంలో '96' వంటి ఫీల్ గుడ్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సి.ప్రేమ్‌కుమార్ నుంచి ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య, జ్యోతికలు దీనిని నిర్మించారు. -
తలైవి: ఎంజీఆర్ లుక్ రిలీజ్
నిజ జీవిత పాత్రలు చేయాలంటే ఆషామాషీ కాదు. అందులోనూ ప్రముఖుల జీవిత కథల్లో నటించేటప్పుడు వారి హావభావాలు, ఊతపదాలు, నడత, నడక అన్నీ వారిని తలపించేలా ఉండాలి. స్వయంగా ఆ ప్రముఖులు మళ్లీ కళ్లముందు కనిపించేలా మ్యాజిక్ చేయాలి. నటుడు అరవింద్ స్వామి కూడా ఈ విషయంలో సక్సెస్ సాధించినట్లే కనిపిస్తోంది. నేడు దివంగత నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రమ్(ఎంజీఆర్) వర్దంతి. ఈ సందర్భంగా 'తలైవి' సినిమాలో పురట్చి తలైవర్(విప్లవ నాయకుడు) ఎంజీఆర్ పాత్రకు సంబంధించిన ఫొటోలను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి ఒదిగిపోయారు. ఈ పాత్ర ఒప్పుకున్నప్పుడే ఆయన ‘డెంటిస్ట్’ దగ్గరకు వెళ్లి తన పళ్లు ఎంజీఆర్ పళ్లకి మ్యాచ్ అయ్యేలా ఉన్నాయా? అని కూడా చెక్ చేసుకున్నారంటే ఆయన ఎంత పర్ఫెక్షనిస్టో అర్థం చేసుకోవచ్చు. (చదవండి: బ్రెయిన్ డెడ్: ఏదైనా మిరాకిల్ జరగాలి) దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా దర్శకుడు ఏఎల్ విజయ్ 'తలైవి' సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో తలైవిగా బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్, ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి నటించారు. జనవరి 17న ఎంజీఆర్ జయంతి సందర్భంగా ఈ ఏడాది విడుదల చేసిన అరవింద్ స్వామి లుక్‌కి విశేషమైన స్పందన లభించింది. తలైవి సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. విష్ణు వర్దన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ నిర్మాతలుగా, హితేష్ తక్కర్, తిరుమల్ రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. (చదవండి: నేను ఎంజీఆర్ రాజకీయ వారసుడ్ని: కమల్) It was not just an honour to play the role of Puratchi Thalaivar MGR, but a great responsibility. I thank director A.L. Vijay & producers @vishinduri @shaaileshrsingh for having faith in me. I humbly post these pics in Thalaivar’s memory, today.#Thalaivi #MGR #ArvindSwamiasMGR pic.twitter.com/F4KY07Q4Dt — arvind swami (@thearvindswami) December 24, 2020 -
తలైవికి తలైవర్ రెడీ
తమిళసినిమా: తలైవికి తలైవర్ రెడీ అయిపోయారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్కు ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఆమె జీవిత చరిత్రతో ఆధారంగా దర్శకుడు గౌతమ్ మీనన్ రూపొందించిన వెబ్ సిరీస్ నిర్మాణం పూర్తయింది. కానీ, విడుదలలోనే ఇది సమస్యలను ఎదుర్కొంటోంది. మరోవైపు నవ దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ పేరుతో జయలలిత బయోపిక్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో జయలలితగా నిత్యామీనన్ నటించబోతున్నారు. ఇంకోవైపు దర్శకుడు విజయ్ కూడా అమ్మ జీవితకథను ప్రతిష్టాత్మకంగా తెరపై ఆవిష్కరించబోతున్నారు. దీనికి తలైవి అనే టైటిల్‌ను ఖారారు చేశారు. ఇందులో జయలలితగా బాలీవుడ్ సంచలన నటి కంగనారనౌత్ నటించనున్నారు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రంలో ‘మక్కళ్తిలగం’ ఎంజీఆర్ పాత్రను నటుడు అరవిందస్వామి పోషించబోతున్నారు. ఈ మేరకు చిత్ర వర్గాలు ధ్రువీకరించాయి. సో తలైవిగా కంగనా, తలైవర్‌గా అరవిందస్వామి నటించబోతుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. దీనికి బాహుబలి చిత్రం ఫేమ్ విజయేంద్రప్రసాద్ కథను సిద్ధం చేస్తుండగా.. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. విష్ణు ఇందూరి, సైలేశ్లు నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ డిసెంబర్లో గానీ, 2020 ప్రథమార్ధంలో గానీ సెట్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమా కోసం ప్రస్తుతం కంగనా భారతనాట్యం కూడా నేర్చుకుంటున్నారు. -
దర్శకుడిగా మారనున్న విలక్షణ నటుడు
సెకండ్ ఇన్నింగ్స్‌లో విలక్షణ పాత్రలతో దూసుకుపోతున్న దక్షిణాది నటుడు అరవింద్ స్వామి. తనీ ఒరువన్ సినిమాలో ప్రతినాయక పాత్రలో ఆకట్టుకున్ అరవింద్ స్వామి తరువాత ఆ సినిమాకు తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ధృవలోనూ అదే పాత్రలో నటించి మెప్పించారు. భాస్కర్ ఒరు రాస్కెల్ సినిమాతో హీరోగానూ సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం శతురంగవేట్టై, నరకసూరన్, వనంగాముడి సినిమాలతో పాటు మణిరత్నం దర్శకత్వంలో సెక్క సివంద వానం సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. నటుడిగా ఫుల్ బిజీగా కొనసాగుతూనే దర్శకుడిగా మారే ప్రయత్నాల్లో ఉన్నారు అరవింద్ స్వామి. ఇప్పటికే కథ రెడీ చూసుకున్న ఈ విలక్షణ నటుడు ప్రస్తుతం స్క్రీన్‌ప్లే, సంభాషణలు రాస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. -
మణిరత్నం సినిమాకు నో చెప్పిన యంగ్ హీరో
గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం సినిమాలో నటించేందుకు స్టార్ హీరోలు క్యూ కడతారు. యువ తరం హీరోలకైతే మణి సినిమాలో నటించటం ఓ కల. అందుకే మణిరత్నం సినిమాలో నటించే అవకాశం వస్తే ఎవరూ వదులుకోరు. కానీ ఓ యంగ్ హీరో మాత్రం అలాంటి గోల్డెన్ ఛాన్స్ కు కూడా నో చెప్పేశాడట. చెలియా సినిమా తరువాత లెజెండరీ దర్శకుడు మణిరత్నం ఓ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. శింబు, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, అరవింద్ స్వామిల కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో ఓ పాత్రకు ముందుకు విజయ్ దేవరకొండను తీసుకోవాలని భావించాడట మణిరత్నం. కానీ ఆ పాత్రలో నటించేందుకు విజయ్ అంగీకరించకపోవటంతో మరొకరిని తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. మణి సినిమాకు విజయ్ ఎందుకు నో చెప్పాడో మాత్రం బయటి రాలేదు. అదే సమయంలో మరో యంగ్ హీరో నానికి కూడా మణి సినిమాలో అవకాశం వచ్చింది. ఈ విషయాన్ని నాని స్వయంగా తెలిపారు. డేట్స్ అడ్జస్ట్ కాని కారణంగా మణిరత్నం సినిమాలో నటించే అవకాశం వదులుకున్నట్టుగా తెలిపాడు. -
ఆయనతో నటించడం మంచి అనుభవం: నటి
ఆయనతో చాలా విషయాలను పంచుకుంటానని అంటోంది సంచలన నటి అమలాపాల్. హీరోయిన్గా ఎదుగుతున్న సమయంలోనే దర్శకుడు విజయ్ను ప్రేమించి, పెళ్లి చేసుకుందీ ఈ మాలయాళీ భామ. రెండేళ్లు కాకముందే భర్తకు విడాకులు ఇచ్చి నటన బాట పట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హీరోయిన్గా బిజీగా ఉన్న అమలాపాల్ హీరో అరవిందస్వామికి జంటగా నటించిన భాస్కర్ ఓరు రాస్కెల్ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఈ చిత్రంలో నటించిన అనుభవాన్ని పంచుకుంటూ.. ఇందులో తాను కారైక్కుడి యువతిగా నటించానని చెప్పింది. ముక్కపుడక, లంగా వోణి అంటూ పాత గెటప్ కొత్తగా ఉంటుందని తెలిపింది. ఇందులో ఒక పిల్లకు తల్లిగా నటించానని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ చూసి ఆనందించే విధంగా దర్శకుడు సిద్ధిక్ తీశారని చెప్పారు. నటుడు అరవిందస్వామితో కలిసి నటించడం మంచి అనుభవం అన్నారు. ఈ చిత్రం ద్వారా తనకూ లభించిన మంచి స్నేహితుడు ఆయన.. చాలా విషయాలు ఆయనతో పంచుకుంటున్నానని అమలాపాల్ చెప్పారు. తన జీవితంలో ఇది మంచి టైమ్‌గా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఇటీవల స్త్రీ ప్రధాన ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రాలకు ప్రేక్షకాదరణ లభించడం మంచి పరిణామంగా పేర్కొంది. నయనతార నటించిన అరమ్ చిత్రం అందిర ప్రశంసలను పొందుతోందనీ, అలాంటి సామాజిక అంశాలతో కూడిన అదో అంద పరవై అనే చిత్రంలో తానూ నటిస్తున్నానిని ఈ మళయాళీ బ్యూటీ తెలిపారు. తన అందాన్ని కాపోడుకోవడానికి యోగా, ఎక్సర్సైజ్లు నిత్యం చేస్తున్నారని, తన సంతోషానికి ప్రధాన కారణం యోగానేనని అమలాపాల్ స్పష్టం చేశారు. -
జాతీయగీతంపై నటుడి కీలక ప్రశ్న
చెన్నై: సినిమా హాళ్లలో జాతీయగీతం ప్రదర్శితమవుతున్న సమయంలో ప్రేక్షకులు తమ దేశభక్తిని నిరూపించుకునేందుకు కచ్చితంగా లేచి నిలబడాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. సినిమా హాలులో జాతీయగీతం వస్తున్నప్పుడు లేచి నిలబడని వారికి దేశ భక్తి తక్కువ ఉందని అనుకోకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఈ వివాదాస్పద అంశంపై స్పందించిన నటుడు అరవిందస్వామి సోషల్ మీడియా ద్వారా కొన్ని విలువైన ప్రశ్నలు సంధించారు. 'జాతీయ గీతం వినిపించినప్పుడు నేను లేచి నిలబడి ఆ గీతాన్ని ఆలపిస్తాను. దీన్ని చాలా గౌరవంగా భావిస్తాను. అయితే ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులు, అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యే ముందు ప్రతిరోజూ జాతీయగీతాన్ని ఎందుకు ఆలపించరని' ట్వీట్ ద్వారా నటుడు ప్రశ్నించారు. అలాంటి కీలక ప్రదేశాలు, కార్యాలయాల్లో పాటించని జాతీయగీతం ప్రదర్శనను.. కేవలం థియేటర్లలోనే ఎందుకు తప్పనిసరి చేశారో అర్థం కావడం లేదంటూ మరో ట్వీట్ చేశారు. మరోవైపు దేశ భక్తిని భుజాలపై మోయాల్సిందిగా ప్రజలను ఎవరూ బలవంతపెట్టలేరని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సినిమా షోకు ముందు జాతీయగీతం ప్రసారానికి సంబంధించిన నిబంధనలను సవరించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేంద్రానికి సూచించింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ నటుడికి మంచి గుర్తింపు ఉంది. ఇటీవల రాంచరణ్ నటించిన ధృవ మూవీలో స్ట్రాంగ్ విలన్ రోల్ పోషించి తెలుగు ప్రేక్షకులను మరోసారి మెప్పించారు అరవిందస్వామి. Why not everyday in all govt offices, courts, before assembly and parliament sessions? — arvind swami (@thearvindswami) 24 October 2017 -
ఓపీఎస్‌కు వెల్లువెత్తిన 'సినీ' మద్దతు!
చెన్నై: బలపరీక్షలో ఓడిపోయినప్పటికీ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి సినీ ప్రముఖుల నుంచి మద్దతు వెల్లువెత్తడం గమనార్హం. బలపరీక్షను తీవ్రంగా తప్పుబట్టిన ప్రముఖ సినీ నటి గౌతమి నేరుగా ఓపీఎస్‌కు మద్దతు ప్రకటించారు. బలపరీక్షలో గెలిచిన శశికళ నమ్మినబంటు పళనిస్వామి బృందాన్ని ఖండించారు. 'అంకెల గారడీ' ద్వారా ప్రజాస్వామ్యాన్ని వంచించలేరని, ఇది ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజాస్వామ్యం కొనసాగుతుందని ఆమె ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాడాపాండి.. ముఖ్యమంత్రి ఓపీఎస్సే కావాలంటూ ఆమె యాష్‌ట్యాగ్ జోడించారు. Democracy can't be manipulated by "Number Games" It's the VOICE OF the PEOPLE. BY the PEOPLE. FOR the PEOPLE #SaveDemocracy #OPSForCM — Gautami (@gautamitads) 16 February 2017 ఇక సీనియర్ నటుడు కమల్ హాసన్ కూడా పరోక్షంగా పన్నీర్ సెల్వానికి మద్దతు పలికారు. బలపరీక్ష జరిగిన తీరును వ్యంగ్యంగా ఎండగట్టిన ఆయన.. బలపరీక్షపై గవర్నర్‌కు తమ గళాన్ని వినిపిస్తూ ఈమెయిళ్లు పంపించాలని, ఈ మెయిళ్లలో హుందాగా, అసభ్యత లేకుండా చక్కని భాషతో తమ అభిప్రాయాన్ని తెలియజేయాలంటూ.. గవర్నర్ ఈమెయిల్ ఐడీ (Rajbhavantamilnadu@gmail.com) ట్వీట్ చేశారు. ఇక మరో నటుడు అరవింద స్వామి అయితే.. ఏకంగా మరోసారి ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రీ ఎలక్షన్ ఒక్కటే మార్గమని, బలపరీక్ష ప్రజాతీర్పును ప్రతిఫలించడం లేదని పేర్కొన్నారు. In my opinion, The only solution that is acceptable under the circumstances is a re- election. This is not the people's mandate. — arvind swami (@thearvindswami) 18 February 2017 Rajbhavantamilnadu@gmail.com ங்கற விலாசத்துக்கு நம் மன உளைச்சலை மின் அஞ்சலா அனுப்புங்க. மரியாதையா பேசணும் அது அசம்பளியில்ல Governor வீடு — Kamal Haasan (@ikamalhaasan) 18 February 2017 -
కమల్ టు ఖుష్బూ! సినీ 'పన్నీర్' జల్లు!!
-
కమల్ టు ఖుష్బూ! సినీ 'పన్నీర్' జల్లు!!
జయలలిత మృతిపై, తన రాజీనామాపై తొలిసారి పెదవివిప్పిన తమిళనాడు ఆపద్ధర్మ సీఎం ఓ. పన్నీర్ సెల్వంపై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. తొలిసారి ధైర్యంగా మాట్లాడి.. మనస్సులో మాటలో బయటపెట్టినందుకు, వెన్నుముక కలిగిన నేతగా నిరూపించుకున్నందుకు ఆయనను కొనియాడారు. కమల్ హాసన్, అరవింద స్వామి, ఖుష్బూ, గౌతమి తదితరులు పన్నీర్ సెల్వాన్ని ప్రశంసించారు. మంగళవారం మెరీనా బీచ్‌లో అమ్మ సమాధి వద్ద దీక్ష అనంతరం ఆయన శశికళకు వ్యతిరేకంగా మాట్లాడిన తీరును కొనియాడారు. వారు ఏమన్నారంటే.. కమల్ హాసన్: తమిళనాడు ప్రజలారా త్వరగా పడుకోండి. రేపు వాళ్లు మనకంటే ముందే నిద్రలేస్తారు. గుడ్‌నైట్. సిద్ధార్థ: మెరీనాలో ఓపీఎస్. తమిళనాడు రాజకీయాలు గేమ్ ఆఫ్ థోర్న్స్, హౌస్ ఆఫ్ కార్డ్స్ (హాలీవుడ్ మూవీ)ను తలపిస్తున్నాయి. ఆర్య: సరైన సమయంలో ఓపీఎస్ సర్ గొప్పగా, ధైర్యంగా మాట్లాడారు. ఆయనకు నా హాట్సాప్. అరవింద స్వామి: బటానీలు తింటూ న్యూస్ చూస్తున్నా. హుప్స్ (ఓపీఎస్) ఒకటి పగిలింది. ఇక పాప్‌కార్న్ తింటాను గౌతమి: అందుకే అమ్మ ఓపీఎస్‌ను ఎంచుకున్నారు. అంతరాత్మ మేరకు నడుచుకునే ధైర్యం ఆయనకు ఉంది. ఇది తమిళనాడుకు, అమ్మకు న్యాయం చేయడమే. (ప్రధాని నరేంద్రమోదీకి ట్యాగ్ చేశారు) ఖుష్బూ: ఓపీఎస్ మౌనాన్ని వీడారు. ఒక హీరోగా ముందుకొచ్చారు. డ్రామా ఇప్పుడే మొదలైంది. దేశ రాజధానికి చెందిన 56 ఇంచుల ఛాతి ఉన్న నాయకుడి తరఫున ఓపీఎస్ పనిచేయడం లేదని నేను ఆశిస్తున్నా. -
రాస్కెల్‌తో ప్రేమ!
అరవింద్ స్వామి, నయనతార జంటగా నటించనున్నారా? గురువారం చెన్నైలోని కోడంబాక్కమ్‌లో ప్రచారమైన వార్తల ప్రకారం అవునని తెలుస్తోంది. మలయాళ చిత్రం ‘భాస్కర్ ది రాస్కెల్’ తమిళ రీమేక్‌లోనే ఈ ఇద్దరూ నాయకా నాయికలుగా నటించనున్నారట. మాతృకలో మమ్ముట్టి, నయనతార నటించారు. ఆ చిత్రంలో చేసిన పాత్రనే తమిళంలోనూ నయనతార చేయనున్నారట. మమ్ముట్టి చేసిన పాత్రను అరవింద్ స్వామి చేస్తారట. ఇందులో హీరోకి ముక్కు మీద కోపం ఉంటుంది. దూకుడుగా ఉంటాడు. అందుకే అందరూ అతన్ని రాస్కెల్ అంటుంటారు. ‘భాస్కర్ ది రాస్కెల్’ అని టైటిల్ పెట్టడానికి కారణం అదే. క్లాస్‌గా కనిపించే అరవింద్ స్వామి రాస్కెల్‌గా రఫ్ క్యారెక్టర్లో కనిపించడం కొత్తగా ఉంటుందని చెప్పొచ్చు. మలయాళ చిత్రానికి దర్శకత్వం వహించిన సిద్ధిక్ దర్శకత్వంలోనే తమిళ రీమేక్ రూపొందనుందట.