రాస్కెల్‌తో ప్రేమ! | ARVIND SWAMI AND NAYANTHARA TO PAIR UP? | Sakshi
Sakshi News home page

రాస్కెల్‌తో ప్రేమ!

Published Thu, Sep 29 2016 11:53 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM

రాస్కెల్‌తో ప్రేమ!

రాస్కెల్‌తో ప్రేమ!

అరవింద్ స్వామి, నయనతార జంటగా నటించనున్నారా? గురువారం చెన్నైలోని కోడంబాక్కమ్‌లో ప్రచారమైన వార్తల ప్రకారం అవునని తెలుస్తోంది. మలయాళ చిత్రం ‘భాస్కర్ ది రాస్కెల్’ తమిళ రీమేక్‌లోనే ఈ ఇద్దరూ నాయకా నాయికలుగా నటించనున్నారట. మాతృకలో మమ్ముట్టి, నయనతార నటించారు. ఆ చిత్రంలో చేసిన పాత్రనే తమిళంలోనూ నయనతార చేయనున్నారట. మమ్ముట్టి చేసిన పాత్రను అరవింద్ స్వామి చేస్తారట.

 ఇందులో హీరోకి ముక్కు మీద కోపం ఉంటుంది. దూకుడుగా ఉంటాడు. అందుకే అందరూ అతన్ని రాస్కెల్ అంటుంటారు. ‘భాస్కర్ ది రాస్కెల్’ అని టైటిల్ పెట్టడానికి కారణం అదే. క్లాస్‌గా కనిపించే అరవింద్ స్వామి రాస్కెల్‌గా రఫ్ క్యారెక్టర్‌లో  కనిపించడం కొత్తగా ఉంటుందని చెప్పొచ్చు. మలయాళ చిత్రానికి దర్శకత్వం వహించిన సిద్ధిక్ దర్శకత్వంలోనే తమిళ రీమేక్ రూపొందనుందట.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement