
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ విద్యుత్ ఉపకరణాల సంస్థ ‘హావెల్స్’ దక్షిణాది మార్కెట్‌కు బ్రాండ్ అబాసిడర్లుగా సినీతారలు నయనతార, విఘ్నేష్ శివన్‌లను ఎంచుకుంది. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం దక్షిణాదిలో హావెల్స్ పట్టును మరింత బలోపేతం చేస్తుందని ఆశిస్తున్నట్లు బుధవారం హావెల్స్ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
నయనతార, విఘ్నేష్ శివన్ లు జంటగా తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక కావడం ఇది తొలి సారి అని వెల్లడించింది. దక్షిణాదిలో సంస్థ ఉనికిని మరింత బలోపేతం చేయడమేకాకుండా అభివృద్ధికి కొత్త మార్గాలను అందిపుచ్చుకోవడానికి ఊతమిస్తుందని హావెల్స్ ఇండియా సేల్స్ విభాగం ప్రెసిడెంట్ పేర్కొన్నారు.
నయనతార, విఘ్నేష్ శివన్ లను హావెల్స్ కుటుంబంలోకి ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందని హావెల్స్ ఇండియా ఈవీపీ బ్రాండ్ అండ్ మార్‌కామ్ రోహిత్ కపూర్ పేర్కొన్నారు. సంస్థ బ్రాండ్ విలువలను వాస్తవికంగా ప్రతిబింబించే వ్యక్తులతో కలిసి పనిచేయడం ఎంతో అవసరమన్నారు. కాగా.. హావెల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్లు ఎంపిక కావడం పట్ల నయతార, విఘ్నేష్ శివన్ హర్షం వ్యక్తం చేశారు. సృజనాత్మకత, నాణ్యత, విశ్వాసానికి పేరున్న హావెల్స్‌తో అనుబంధం చాలా సంతోషకరమన్నారు. దక్షిణాది మార్కెట్లలో బ్రాండ్ స్థానాన్ని బలోపేతం చేయడానికి తాము హావెల్స్‌కు పూర్తిగా మద్దతు ఇస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment