
రిలయన్స్ జియో తన యూజర్ల కోసం 11 నెలల ప్లాన్ వెల్లడించింది. కేవలం 895 రూపాయలు రీఛార్జ్ చేసుకోవడం ద్వారా.. 330 రోజుల కంటే ఎక్కువ అపరిమిత కాల్స్, లిమిటెడ్ ఎస్ఎమ్ఎస్ & డేటా వంటి వాటిని పొందవచ్చు. ఈ ప్లాన్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఒకసారి రూ. 895తో రీఛార్జ్ చేస్తే.. రోజుకు దాదాపు మూడు రూపాయల కంటే తక్కువ ఖర్చు చేసినట్లు అవుతుంది. 11 నెలలు (336 రోజులు) అపరిమిత కాల్స్ కాకుండా.. 600 ఎస్‌ఎమ్‌ఎస్‌లు, 24 జీబీ డేటా లభిస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఈ ప్లాన్ కేవలం జియో ఫోన్ ఉన్నవారికి మాత్రమే. స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ ప్లాన్‌ను ఉపయోగించుకోలేరు.
ఎస్‌ఎమ్‌ఎస్‌లు & డేటా వివరాలు
ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 28 రోజుల పాటు 50 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లను అందిస్తుంది. అంటే నెలకు 50 ఎస్‌ఎమ్‌ఎస్‌లు మాత్రమే లభిస్తాయి. ఆలా 12 సార్లు 50 ఉచిత ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందవచ్చు. డేటా విషయానికి వస్తే.. ఈ ప్లాన్ మొత్తానికి 24 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. ఎక్కువ డేటా అవసరం లేదు అనుకున్నవారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. సాధారణ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు 336 రోజులు యాక్టివ్‌గా ఉంచడానికి రూ.1748 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు.
రూ.1748 ప్లాన్ ప్రయోజనాలు
జియో రూ.1748 ప్లాన్‌లో.. వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్, 3600 ఎస్‌ఎమ్‌ఎస్‌లు పొందుతారు. ఈ ప్లాన్‌లో జియోటీవీ, జియోక్లౌడ్ ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్లాన్‌లో కాలింగ్, ఎస్ఎమ్ఎస్ వంటివాటితో పాటు డేటా కూడా లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment