
తెరపై నవరసాలను అలవోకగా పలికించే నటి నయనతార. అంతటి అభినయాన్ని మ్యాచ్ చేసే ధైర్యం లేక.. ఆమె అందాన్ని మ్యాచ్ చేసే పోటీలో మేమూ నిలబడతామన్న కొన్ని ఫ్యాషన్ బ్రాండ్స్ ఏంటో ఇక్కడ చూద్దాం..
నా ముఖంలో వచ్చిన మార్పులకు చాలామంది ప్లాస్టిక్ సర్జరీ కారణమని అనుకుంటుంటారు. కాని, నాకు తరచు ఐబ్రోస్ చేయించుకోవటం ఇష్టం. అవి గేమ్ చేంజర్ లాంటివి. ఆహారం, బరువులో వచ్చే తేడాలతో పాటు నా డిఫరెంట్ ఐబ్రోస్ స్టయిల్స్ కూడా నా లుక్స్‌ని మారుస్తాయని చెబుతోంది లేడీ సూపర్ స్టార్ నయన తార.
అందాల చేతులకు సెలబ్రిటీ టిప్
చేతిగాజులు చేతులకే అందాన్ని తెస్తాయి. కాని, అవి సంప్రదాయ దుస్తులకే సెట్ అవుతాయి. జీన్స్, వెస్టర్న్‌వేర్ దుస్తులకు గాజులు నప్పవు. అలాంటప్పుడు ఈ సింపుల్ సెలబ్రిటీ స్టయిల్ ఫాలో అయితే, మీ చేతులను అందంగా మార్చేయచ్చు. సింపుల్‌గా ఉండే బ్రాస్‌లెట్‌తో పాటు మరో రెండు, మూడు రకాల బ్రాస్‌లెట్స్‌ను ఒకేసారి ధరిస్తే మీ చేతులకు ఎలిగెంట్, ట్రెండీ లుక్ సొంతం అవుతుంది.
ఇలా మీ రెండు చేతులకు లేదా ఒక చేతికి కూడా ధరించొచ్చు. ఈ విధంగా హెవీగా చేతులను స్టయిల్ చేసినప్పుడు మెడను, చెవులను కూడా సింపుల్‌గా స్టయిల్ చేసుకోవాలి. అప్పుడే మీ చేతులు హైలెట్ అయి అందంగా కనిపిస్తారు. ఈ టెక్నిన్‌నే నటి నయనతార కూడా ఫాలో అయింది. ఈ ఫొటోలు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా జ్యూలరీ షాపింగ్ చేసేటప్పుడు మూడు నాలుగు రకాల బ్రాస్‌లెట్స్‌ను కూడా కార్ట్‌లో యాడ్ చేసుకోండి.
(చదవండి: విద్యార్థులే రచయితలుగా మాసపత్రిక..!)
Comments
Please login to add a commentAdd a comment