జయలలిత మృతిపై, తన రాజీనామాపై తొలిసారి పెదవివిప్పిన తమిళనాడు ఆపద్ధర్మ సీఎం ఓ. పన్నీర్ సెల్వంపై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. తొలిసారి ధైర్యంగా మాట్లాడి.. మనస్సులో మాటలో బయటపెట్టినందుకు, వెన్నుముక కలిగిన నేతగా నిరూపించుకున్నందుకు ఆయనను కొనియాడారు. కమల్ హాసన్, అరవింద స్వామి, ఖుష్బూ, గౌతమి తదితరులు పన్నీర్ సెల్వాన్ని ప్రశంసించారు. మంగళవారం మెరీనా బీచ్‌లో అమ్మ సమాధి వద్ద దీక్ష అనంతరం ఆయన శశికళకు వ్యతిరేకంగా మాట్లాడిన తీరును కొనియాడారు. వారు ఏమన్నారంటే..