Gautami
-
విశాఖపట్నం బీచ్‌రోడ్డులో పింక్ శారీ వాక్ సినీనటి గౌతమి సందడి (ఫొటోలు)
-
యాసిడ్ దాడి నిందితుడు గణేష్ ఎక్కడ?
అన్నమయ్య, సాక్షి: పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతిపై ఉన్మాదంతో నాశనం చేయాలని చూసిన నిందితుడు గణేష్ ఇంకా పరారీలోనే ఉన్నాడు!. నేరం జరిగిన కాసేపటికే నిందితుడి ఆచూకీ గుర్తించినట్లు తొలుత పోలీసులు ప్రకటించినా.. ఆ వెంటనే మాట మార్చేశారు. దీంతో.. ఈ కేసులో పోలీసుల అలసత్వంతో పాటు, రాజకీయ నేతల జోక్యం ఉందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శాంతి భద్రతలు ఘోరంగా క్షీణించాయి.మరీ ముఖ్యంగా చిన్నారులు, మహిళలలపై అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్నాయి. నంద్యాల ముచ్చుమర్రి బాలిక కేసులో ఇప్పటికీ న్యాయం జరగలేదు. వీటికి తోడు ఉన్మాద ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నా.. కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలైతే కనిపించడం లేదు.తాజాగా.. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం నడిమికండ్రిగ పంచాయతీ పరిధిలోని ప్యారంపల్లెలో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. త్వరలో వివాహం కావాల్సిన ఓ యువతిపై.. ప్రేమ పేరుతో వేధిస్తున్న ఓ యువకుడు యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. బాధితురాలిని గ్రామానికి చెందిన గౌతమిగా గుర్తించగా.. నిందితుడు అమ్మచెరువుమెట్టకు చెందిన గణేశ్‌గా పోలీసులు ప్రకటించారు. ఘటన జరిగిన 15 నిమిషాల్లోపే నిందితుడి ఆచూకీ గుర్తించినట్లు తొలుత పోలీసులు ప్రకటించినా.. తర్వాత అతని జాడ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. చివరకు.. అతను పరారీలో ఉన్నాడని, గాలింపు కోసం ప్రత్యేకంగా నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని పోలీసులు ప్రకటించారు. దీంతో బాధితురాలి బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా.. నిందితుడు గణేష్ తండ్రి సుంకారపు మురళి టీడీపీ నేత. మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషాకు ప్రధాన అనుచరుడు. అంతేకాదు.. కదిరి టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా సన్నిహితుడే. దీంతో నిందితుడిని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అని బాధితురాలి బంధువులు నిలదీస్తున్నారు. అయితే ప్రభుత్వ పెద్దలు ఈ కేసులో న్యాయం జరిపిస్తామని హామీ ఇస్తున్నా.. ఇంత వరకు కేసులో ఎలాంటి పురోగతి చోటు చేసుకోలేదు. ఉన్మాది దాడి ఇలా..యువతి డిగ్రీ వరకు చదువుకుని మదనపల్లెలోని ఓ బ్యూటీ పార్లర్లో పనిచేస్తోంది. పట్టణంలోని అమ్మచెరువుమెట్టకు చెందిన గణేశ్ అనే యువకుడు ఆమెను ప్రేమ పేరుతో తరచూ వేధింపులకు గురిచేసేవాడు. యువతికి ఈనెల 7న బంధువుల అబ్బాయితో నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 29న ఆమె పెళ్లి జరగనున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న గణేశ్.. శుక్రవారం ఉదయం 6 గంటలకు గ్రామానికి చేరుకున్నాడు. యువతి తల్లిదండ్రులు పొలానికి వెళ్లిన సమయంలో ఆమె వద్దకు వెళ్లి ముఖంపై యాసిడ్ పోసి కత్తితో దాడి చేశాడు. యువతి కేకలు వేయడంతో చుట్టు పక్కలవాళ్లు వచ్చారు. అప్పటికే నిందితుడు పరారయ్యాడు. కుటుంబ సభ్యులు యువతిని 108 వాహనంలో మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యాసిడ్ దాడి వల్ల బాధితురాలి ముఖంపై గాయాలయ్యాయి. దీంతో బెంగళూరు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమెకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు ప్రకటించారు. బాధిత కుటుంబ ఫిర్యాదుతో కొండ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. స్థానిక న్యాయమూర్తి బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న బాధితురాలి తల్లిదండ్రులకు ఇద్దరు సంతానం కాగా కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అంతా సవ్యంగా జరుగుతోందని సంతోషంగా ఉన్న సమయంలో తమ కుమార్తె పరిస్థితిని తలుచుకుని తల్లడిల్లిపోతున్నారు.దుశ్చర్యను ఖండించిన వైఎస్ జగన్ఇది దిగజారిన శాంతి భద్రతలు, రెడ్‌బుక్ పాలనకు పరాకాష్టఅన్నమయ్య జిల్లాలో ఓ యువతిపై ప్రేమోన్మాది యాసిడ్‌తో దాడి చేయటాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించి ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలకు ఇదొక నిదర్శనమని, రెడ్‌బుక్ పాలనకు పరాకాష్ట అని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, ఇకనైనా వారి భద్రతపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. యువతిపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. రాష్ట్రంలో నిత్యం మహిళలపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, హోంమంత్రులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని మండిపడుతున్నారు. -
యాసిడ్ తాగించి.. కత్తితో పొడిచి!
గుర్రంకొండ (అన్నమయ్య జిల్లా), మదనపల్లె, పీలేరు: అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండతో కామ పిశాచాలు వరుసగా అఘాయిత్యాలకు తెగబడుతున్నాయి. ఒకరు కాదు.. ఏకంగా ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు తమ కుటుంబం వెనుక ఉన్నారని.. రెడ్‌బుక్ రాజ్యాంగ పాలనలో తమను ఏమీ చేయలేరనే ధీమాతో అన్నమయ్య జిల్లాలో ఓ ఉన్మాది నిశ్చితార్థం జరిగిన యువతిపై అత్యంత కిరాతకంగా యాసిడ్‌తో దాడి చేసి కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. మరి కొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన బాధితురాలు ఆస్పత్రిలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. వారం క్రితం నిశ్చితార్థం.. మరో రెండు నెలల్లో పెళ్లి.. ఇక జీవితమంతా ఆనందంగా సాగుతుందని కలలు కన్న ఆ యువతి జీవితంలో ప్రేమికుల రోజు రోజే ఈ విషాద ఘటన చోటు చేసుకొంది. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం నడిమికండ్రిగ పంచాయతీ ప్యారంపల్లెలో శుక్రవారం ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితుడి తండ్రి సంకారపు మురళి మదనపల్లె, కదిరి టీడీపీ ఎమ్మెల్యేలకు సన్నిహితుడు కావడం గమనార్హం. మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా ప్రధాన అనుచరుడైన మురళికి టీడీపీలో క్రియాశీల సభ్యత్వం కూడా ఉంది.వేధింపులతో ఉద్యోగం మానేసి..ప్యారంపల్లెకు చెందిన దాసరి జనార్దన్, రెడ్డెమ్మల కుమార్తె గౌతమి (21) డిగ్రీ తరువాత బ్యూటీషియన్ కోర్సు చేసి మదనపల్లెలోని ఓ బ్యూటీ పార్లర్లో పని చేస్తోంది. మదనపల్లెలోని అమ్మచెరువు మిట్ట ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడు మురళీ కుమారుడు గణేష్ (24) ప్రేమ పేరుతో బాధితురాలిని తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నాడు. అతడి ఆగడాలు భరించలేక బాధితురాలు మూడు నెలల కిందట ఉద్యోగం వదిలేసి సొంత గ్రామమైన ప్యారంపల్లెలో తల్లిదండ్రుల వద్దే నివసిస్తోంది. పీలేరుకు చెందిన మేనత్త కుమారుడితో ఆమెకు తల్లిదండ్రులు వివాహం నిశ్చయం చేశారు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్‌తో ఈనెల 7వ తేదీన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. వచ్చే ఏప్రిల్ 29 తేదీన వీరిద్దరికీ వివాహం చేయాలని నిర్ణయించారు. ఏడాదిగా బాధితురాలిని వేధిస్తున్న నిందితుడు గణేష్ ఆమెను అంతమొందించేందుకు 15 రోజుల కింద ప్యారంపల్లెకు వెళ్లి రెక్కీ నిర్వహించాడు. శుక్రవారం ఉదయం బాధితురాలి తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్లిన సమయంలో ఇంట్లోకి చొరబడి గడియ వేశాడు. తనతోపాటు తెచ్చుకున్న యాసిడ్ బాటిల్‌తో ఆమెపై దాడి చేసి బలవంతంగా తాగించాడు. తలపై కూడా పోశాడు. పథకం ప్రకారం తన వెంట తెచ్చుకొన్న కత్తితో ఆమెపై దాడి చేసి పలుచోట్ల కత్తితో పొడిచాడు. అనంతరం ఆమె వద్ద నుంచి సెల్‌ఫోన్ లాక్కుని పరారయ్యాడు. పొలం నుంచి పరుగులు తీస్తూ..బాధితురాలి ఇల్లు గ్రామం చివరిలో ఉండటం, అందరూ పొలం పనులకు వెళ్లడంతో ఈ దాష్టీకం ఎవరి కంట పడలేదు. అయితే తన తల్లి సెల్‌ఫోన్‌ను ఇంటి వద్దనే ఉంచి వెళ్లడంతో తండ్రికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. పొలం నుంచి పరుగులు తీస్తూ ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో ఉన్న తమ కుమార్తెను చూసి కుప్పకూలిపోయారు. తొలుత 108 వాహనంలో గుర్రంకొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ ఎవరూ లేకపోవడంతో మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం బెంగళూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక న్యాయమూర్తి బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న బాధితురాలి తల్లిదండ్రులకు ఇద్దరు సంతానం కాగా కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అంతా సవ్యంగా జరుగుతోందని సంతోషంగా ఉన్న సమయంలో తమ కుమార్తె పరిస్థితిని తలుచుకుని తల్లడిల్లిపోతున్నారు.దుశ్చర్యను ఖండించిన వైఎస్ జగన్ఇది దిగజారిన శాంతి భద్రతలు, రెడ్‌బుక్ పాలనకు పరాకాష్టఅన్నమయ్య జిల్లాలో ఓ యువతిపై ప్రేమోన్మాది యాసిడ్‌తో దాడి చేయటాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించి ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండాలని సూచించారు.రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతలకు ఇదొక నిదర్శనమని, రెడ్‌బుక్ పాలనకు పరాకాష్ట అని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, ఇకనైనా వారి భద్రతపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. –సాక్షి, అమరావతినిత్యం మహిళలపై దాడులు..యువతిపై యాసిడ్ దాడికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు. రాష్ట్రంలో నిత్యం మహిళలపై దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, హోంమంత్రులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. బాధిత కుటుంబాన్ని సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత, మంత్రి లోకేశ్ ఫోన్లో పరామర్శించారు. మంత్రి రాంప్రసాద్, ఎమ్మెల్యే షాజహాన్‌బాషా బాధితురాలిని పరామర్శించేందుకు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఘటన జరిగిన 15 నిమిషాల్లోనే పోలీసులు స్పందించి నిందితుడి ఆచూకీ గుర్తించినట్లు ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చెప్పారు. నిందితుడిని పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. నిందితుడి కోసం నాలుగు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. -
డాక్టర్ సీటొచ్చినా.. కూలి పనికి
తుంగతుర్తి: డాక్టర్ కావాలన్నది ఆ అనాథ బిడ్డ తపన. అందుకోసం కూలీ పనులు చేస్తూనే కష్టపడి చదివింది. నీట్ పరీక్షలో 507 మార్కులు సాధించింది మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సాధించింది. కానీ కనీసం పుస్తకాలు, దుస్తులు, ఫీజు చెల్లించడానికి డబ్బులు లేక ఎప్పటిలాగే తాత, నానమ్మతో కలిసి కూలీ పనులకు వెళ్తోంది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన శిగ గౌతమి తన మూడేళ్ల వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయింది. దీంతో గౌతమిని తాత శిగ రాములు, నాయనమ్మ వెంకటమ్మ కూలి పనులు చేస్తూ పోషించారు. గ్రామంలోని సర్కారు బడిలో ఐదో తరగతి వరకు, పసునూర్ ఆదర్శ పాఠశాలలో పదో తరగతి, ఇంటర్మీడియట్ చదివించారు. గౌతమి పదో తరగతిలో 10/10 జీపీఏ, ఇంటర్ బైపీసీలో 992/1000 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. వైద్యురాలు కావాలనే కోరికతో నీట్‌కు హాజరై మొదటి ప్రయత్నంలోనే దంత వైద్య కళాశాలలో సీటు సాధించింది. దంత వైద్యురాలు కావడం ఇష్టం లేక మళ్లీ నీట్ రాయాలనుకున్న ఆమెకు ఆర్థిక సమస్యలు గుదిబండగా మారాయి. అయినప్పటికీ నానమ్మ పుస్తెలతాడు తాకట్టుపెట్టి హైదరాబాద్‌లో కోచింగ్‌కు పంపారు. గౌతమి డాక్టర్ కావాలనే లక్ష్యంతో తాత, నానమ్మతో కలిసి కూలి పనులకు వెళ్తూనే రెండోసారి నీట్‌కు సిద్ధమైంది. ఈసారి నీట్లో 507 మార్కులు సాధించి ఇటీవల జరిగిన ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌లో మంచిర్యాల ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సంపాధించింది. కానీ ఎంబీబీఎస్ చదవడానికి ఏడాదికి రూ.1,50,000 ఖర్చు అవుతుందని, అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో చేసేది లేక కూలి పనులకు వెళ్లున్నట్లు శిగ రాములు తెలిపారు. ఫీజుకోసం అమ్మటానికి కూడా వారికి ఎలాంటిఆ ఆస్తులు లేకపోవడంతో దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తే తమ బిడ్డ ఆశ నెరవేరుతుందని గౌతమి తాత, నానమ్మ వేడుకుంటున్నారు. సహాయం చేయాలనుకున్న దాతలు ఫోన్ పే నంబర్ 93989 19127కు ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు. -
నటి గౌతమిని మోసం చేసిన సినీ ఫైనాన్సియర్
నకిలీ పత్రాలను సృష్టించి తన భూమిని కబ్జా చేసిన వారిపై న్యాయపోరాటం చేస్తున్నారు సినీ నటి గౌతమి. ఈ కేసులో తనకు న్యాయం దక్కేవరకు పోరాడుతానని ఆమె తెలిపారు. రామనాథపురం జిల్లాతో పాటు చెన్నై పరిసర ప్రాంతాల్లో నటి గౌతమికి సుమారు 150 ఎకరాల భూములు ఉన్నాయి. కారైక్కుడికి చెందిన సినీ ఫైనాన్సియర్ అళగప్పన్.. గౌతమికి చెందిన స్థలం అమ్మిపెడుతానని చెప్పి ముందుగా ఆ పత్రాలను పరిశీలించారు. ఆపై వాటికి నకిలీ పత్రాలను సృ ష్టించి తన సొంతానికి విక్రయించారు.ఈ క్రమంలో గౌతమి నుంచి రూ. 3కోట్లు తీసుకుని మోసం చేసినట్లు తెలుస్తోంది. దీంతో రామనాథపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో గౌతమి ఫిర్యాదు చేశారు. సి.అళగప్పన్, ఆయన భార్య నాచ్చాళ్, కుమారుడు శివ, కోడలు ఆర్తి, బంధువు భాస్కర్, కారు డ్రైవర్ సతీష్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. ఏడాది నుంచి వారు ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వారు మళ్లీ బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. అయితే, వారికి బెయిల్ ఇవ్వకూడదని తనకు జరిగిన అన్యాయాన్ని కోర్టుకు తెలుపుకున్నారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతానని ఆమె పేర్కొన్నారు. -
వారిపై న్యాయపోరాటం చేస్తున్న నటి గౌతమి
నకిలీ పత్రాలను సృష్టించి తన భూమిని కబ్జా చేసిన వారిపై న్యాయపోరాటం చేస్తున్నారు నటి గౌతమి. ఈ కేసులో తనకు న్యాయం దక్కేవరకు పోరాడుతానని ఆమె తెలిపారు. రామనాథపురం జిల్లాతో పాటు చెన్నై పరిసర ప్రాంతాల్లో నటి గౌతమికి భూములున్నాయి. కారైక్కుడికి చెందిన అళగప్పన్.. గౌతమికి చెందిన స్థలం కొనుగోలు చేస్తానని చెప్పి ముందుగా ఆ పత్రాలను పరిశీలించారు. ఆపై వాటికి నకిలీ పత్రాలను సృ ష్టించి తన సొంతానికి విక్రయించారు. సుమారు రూ. 3కోట్లకు గౌతమి భూమిని ఆమె ప్రమేయం లేకుండా విక్రయించారు. దీంతో రామనాథపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో గౌతమి ఫిర్యాదు చేశారు. సి.అళగప్పన్, ఆయన భార్య నాచ్చాళ్, కుమారుడు శివ, కోడలు ఆర్తి, బంధువు భాస్కర్, కారు డ్రైవర్ సతీష్ కుమార్‌పై కేసు నమోదు చేశారు. ఏడాది నుంచి వారు ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా వారు మళ్లీ బెయిల్ పిటిషన్ వేశారు. అయితే, వారికి బెయిల్ ఇవ్వకూడదని గౌతమి తరఫున హాజరైన న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. -
రిలేషన్షిప్లో అది దాటొద్దు.. నేను నేర్చుకున్న గుణపాఠమిదే: గౌతమి
హీరోయిన్‌గానే కాకుండా కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ చిత్రపరిశ్రమలో పని చేసింది గౌతమి. కానీ తన జీవితాన్ని మాత్రం సరిగ్గా డిజైన్ చేసుకోలేకపోయింది. తెలుగు, తమిళంలో స్టార్స్‌తో కలిసి నటించిన ఈమె వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. మొదట్లో బిజినెస్మెన్ సందీప్ భాటియాను పెళ్లాడిన ఈమెకు కూతురు సుబ్బలక్ష్మి జన్మించింది. పాప పుట్టిన ఏడాదే అతడికి విడాకులిచ్చేసింది. 13 ఏళ్ల ప్రేమతర్వాతి కాలంటో కమల్ హాసన్‌తో ప్రేమలో పడింది. వీరిద్దరూ సహజీవనం చేశారు. కాలం కన్ను కుట్టిందో ఏమో కానీ 2016లో విడిపోయారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రిలేషన్‌షిప్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నీ బలం నువ్వే.. బాధేసినప్పుడు నచ్చిన వ్యక్తి వీడియోలు చూడటమో లేదా నీలో ధైర్యాన్ని నింపే వ్యక్తి మాటలు వినడమో చేస్తుంటాం. ఒక్కొక్కరు ఒక్కో దారి అనుసరిస్తుంటారు. అలా ప్రతి ఒక్కరినీ ఏదో ఒక అంశం ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. దానికి అట్రాక్ట్ అవుతారు.ఆ పాయింట్ దాటొద్దుకానీ నిజమైన బలం వేరెవరూ కాదు.. నాకు నేను, నీకు నువ్వే అసలైన బలం. ఒక రిలేషన్షిప్ వర్కవుట్ కాలేదంటే దానికి పూర్తి బాధ్యత నీదేనని నీ నెత్తిన వేసుకోవాల్సిన అవసరం లేదు. అది ఏ రిలేషన్ అయినా సరే.. ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఒక కేంద్ర బిందువు ఉంటుంది. ఇద్దరు సమానంగా అక్కడికి చేరుకోవాలి. కొన్ని కారణాల వల్ల కొందరు ఆ బిందువుకు దూరంగా ఉంటారు. పైగా మనకోసం చాలాదూరం వచ్చినట్లు ఫీలవుతారు. ఇలా ఒక్కసారి మోసం చేశారంటే మళ్లీ మళ్లీ మోసగిస్తూనే ఉంటారు. వారికి అదొక అలవాటుగా మారిపోతుంది.లైఫ్ లెస్సన్అప్పుడు నేనెందుకు నీకోసం అంత దూరం రావాలని మనల్నే తిరిగి ప్రశ్నిస్తారు. కావాలంటే నువ్వే వచ్చేయ్ అంటారు. ఇది నేను జీవితంలో నేర్చుకున్న ఓ గుణపాఠం. మనమెప్పుడూ ఆ బిందువును దాటి ముందుకు వెళ్లకూడదు. లవ్, కమిట్మెంట్ అనేది రెండువైపులా సమానంగా ఉండాలి. అప్పుడే ఆ బంధం ఎక్కువకాలం నిలుస్తుంది' అని గౌతమి చెప్పుకొచ్చింది. కాగా ఈమె కమల్‌తో కలిసి అపూర్వసహోదరగళ్, దేవర్ మగన్, పాపనాశం వంటి చిత్రాల్లో నటించింది.చదవండి: స్టార్ హీరో కొడుకు సెకండ్ హ్యాండ్ బట్టలు వాడతాడు! -
అన్నాడీఎంకేలో చేరిన సీనియర్ నటి గౌతమి
-
సరైన పార్టీలోకే వచ్చా: అన్నాడీఎంకేలోకి గౌతమి
సాక్షి, చైన్నె: సినీ నటి గౌతమి బుధవారం అన్నాడీఎంకేలో చేరారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళని స్వామి సమక్షంలో సాయంత్రం అన్నాడీఎంకే కండువా కప్పుకున్నారు. గతంలో గౌతమి బీజేపీలో పని చేసిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ నుంచి తనకు తనకు మద్ధతు కరువైందని చెబుతూ ఆమె రాజీనామా చేశారు. ఆ తర్వాత తన రాజకీయ భవిష్యత్తు గురించి ఆమె ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం చైన్నెగ్రీన్ వేస్ రోడ్డులోని పళని స్వామి నివాసానికి వెళ్లారు. ఆయన సమక్షంలో అన్నాడీఎంకేలో చేరారు. ఈ సందర్భంగా గౌతమి మీడియాతో మాట్లాడుతూ.. సరైన పార్టీలోకి తాను వచ్చానని పేర్కొన్నారు. దివంగత సీఎం అమ్మ జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేను సరైన మార్గంలో పళని స్వామి నడిపిస్తున్నారని ఆమె కితాబిచ్చారు. పాతికేళ్లుగా బీజేపీలో కొనసాగిన గౌతమి తాడిమళ్ల.. కిందటి ఏడాది అక్టోబర్‌లో బీజేపీకి గుడ్‌బై చెప్పారు. ఆ సమయంలో ఆమె సంచలన ఆరోపణలే చేశారు. పార్టీ నుంచి మద్దతు కరువైనందునే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారామె. ఈ మేరకు ఎక్స్ అకౌంట్లో ఆమె ఆ సమయంలో పెద్ద పోస్ట్ ఉంచారు. తన ఆస్తులను స్వాహా చేసిన వ్యక్తికి పార్టీలో సీనియర్లే మద్దతు ఇచ్చారంటూ ఆమె ఆరోపించారు కూడా. ఇదిలా ఉంటే.. గత వారం బీజేపీ నుంచి బయటకు వచ్చిన నటి గాయత్రి రఘురాం కూడా అన్నాడీఎంకేలో చేరిన విషయం తెలిసిందే. -
కృష్ణారామా మా ఇంట్లో పుట్టిన కథే – దర్శకుడు రాజ్ మదిరాజు
‘‘ప్రస్తుతం చాలా మంది తమ తల్లిదండ్రులకు దూరంగా జీవిస్తున్నారు. దీంతో ఒంటరి తనంగా భావించిన తల్లిదండ్రులు తమ మనసులోని భావాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు. మా తల్లి దండ్రులు కూడా ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి ఫేస్ బుక్‌లోకి వచ్చారు. ఒక విధంగా ‘#కృష్ణారామా’ కథ మా ఇంట్లో పుట్టిందే’’ అని దర్శకుడు రాజ్ మదిరాజు అన్నారు. రాజేంద్ర ప్రసాద్, గౌతమి ప్రధాన పాత్రల్లో అనన్య శర్మ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘‘#కృష్ణారామా’. అద్వితీయ మూవీస్‌పై వెంకట కిరణ్, కుమార్ కళ్లకూరి, హేమ మాధురి నిర్మించిన ఈ సినిమా ఆదివారం నుంచి ఓ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ మదిరాజు మాట్లాడుతూ– ‘‘మన తల్లిదండ్రులు రిటైర్ అయిపోతే వాళ్ల జీవితమే అయిపోయిందనే భావనలోకి వెళ్లిపోతున్నాం. కానీ, వారి అనుభవం సమాజానికి ఎంతో అవసరం అని మా సినిమా ద్వారా చెబుతున్నాం. ఒక డైరెక్టర్‌గా నా పనిని నేను ఇష్టపడతాను. నటుడిగా నా పరిధిలోనే ఉంటాను.. డైరెక్టర్స్‌కి సలహాలు, సూచనలు ఇవ్వను. ప్రస్తుతం డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి సినిమాలో ఓ మంచి పాత్ర చేశాను. డైరెక్టర్‌గా రెండు మూడు కథలు సిద్ధంగా ఉన్నాయి’’ అన్నారు. -
నా చిన్నప్పుడే మా అమ్మ వదిలేసి వెళ్లిపోయింది..!
-
ఆస్తి కాజేశారని నటి గౌతమి ఫిర్యాదు
తన ఆస్తిని కాజేశారని నటి గౌతమి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 29వ తేదీ మరిన్ని వివరాలను అందించడానికి తిరువణ్ణామలై ఎస్పీ కార్యాలయానికి వెళ్లనున్నట్లు సమచారం. గౌతమి 2004లో క్యాన్సర్ వ్యాధికి గురైన విషయం తెలిసిందే. దీంతో ఆమె తన ఆస్తులకు పవర్ ఏజెంట్‌గా అళగప్పన్ అనే రియల్ఎస్టేట్ ఏజెంట్‌ను నియమించుకున్నారు. కాగా అళగప్పన్ ఆయన కుటుంబ సభ్యులు శ్రీపెరంబత్తూర్లోని గౌతమికి చెందిన రూ.25 కోట్ల ఆస్తులను పోర్జరీ పత్రాలతో ఆక్రమించినట్లుగా సోమవారం చైన్నె పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గౌతమి ఫిర్యాదు చేశారు. తిరువణ్ణామలైలో 2019లో రూ.48 లక్షలతో 4 ఎకరాల భూమిని కోనుగోలు చేశానని.. ఇప్పుడు కోట్ల విలువ చేస్తుందని.. ఆ భూమిని అళగప్పన్, అతని భార్య నాచ్చాన్ కాజేశారని తన న్యాయవాది ద్వారా తిరువణ్ణామలై జిల్లా క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం అళగప్పన్, అతని భార్యను స్టేషన్‌కు పలిపించారు. డీఎస్పీ అన్నాదురై, ఇన్స్పెక్టర్ కవిత విచారించారు. కాగా ఈ కేసులో మరిన్ని ఆధారాలను సమర్చించడానికి నటి గౌతమి ఈ నెల 29వ తేదీ తిరువణ్ణామలై పోలీస్‌స్టేషన్‌కు వెళ్లనున్నట్లు సమాచారం. -
నటి గౌతమి తో సాక్షి ఎక్సక్లూసివ్ ఇంటర్వ్యూ
-
ప్రేక్షకులకు ఈ సినిమా ఓ మంచి బహుమతి
‘‘సినిమా నా ఫస్ట్ లవ్. అందుకే నటిగా మాత్రమే కాకుండా సినిమాకి సంబంధించిన పలు విభాగాల్లో పని చేశాను. ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ మరింత ఆసక్తికరంగా ఉంది. నేర్చుకోవడానికి చాలా ఉంది. నటిగా షూటింగ్స్ని ఎంజాయ్ చేయగలుగుతున్నాను కాబట్టే ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. ఇందుకు సంతోషంగా ఉంది. ఒక రకంగా గర్వపడుతున్నాను కూడా’’ అన్నారు గౌతమి. సంతోష్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. స్వప్న సినిమాస్, మిత్ర విందా మూవీస్ పతాకాలపై ప్రియాంకా దత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో గౌతమి మాట్లాడుతూ– ‘‘అన్నీ మంచి..’లో ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసే మీనాక్షీ పాత్ర చేశాను. ఓ డ్రీమ్ మదర్, వైఫ్, ఫ్రెండ్ ఎలా ఉండాలని కోరు కుంటారో అలా ఉంటుంది మీనాక్షీ పాత్ర. నా కెరీర్ తొలినాళ్లలో నేను రాజేంద్రప్రసాద్‌గారితో యాక్ట్ చేశాను. ఇప్పుడు ఈ సినిమాలో కలిసి నటించాను. నటన పట్ల ఆయన అంకితభావం సూపర్. వీకే నరేశ్, ‘షావుకారు’ జానకి, ఊర్వశి.. ఇలా అందరూ ఓకే సినిమాలో నటించడం చాలా సంతోషంగా ఉంది. అసలు.. ఇంతమంది మంచి నటీనటులను దర్శకురాలు నందినీ, నిర్మాతలు స్వప్న, ప్రియాంకాగార్లు ఓ చోటకు చేర్చి సినిమా చేయడం అద్భుతం. ప్రేక్షకులకు ఈ సినిమా మర్చిపోలేని బహుమతి. స్వీయనియంత్రణ ఉన్న దర్శకురాలు నందిని. మంచి నిర్మాతలకు ఉండాల్సిన లక్షణాలు ప్రియాంక, స్వప్నగార్లలో ఉన్నాయి. ప్రస్తుతం బోయపాటిగారి సినిమాలో నటిస్తున్నాను. రెండు వెబ్ సిరీస్‌లు చేస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ–‘‘మా అమ్మాయి ఫిల్మ్ మేకింగ్ చదువుతోంది. తనకు కెమెరా వెనక ఉండటం ఇష్టం’’ అని చెప్పారు గౌతమి. -
అమ్మా.. సీఎం గారే స్వయంగా నన్ను పిలిచి మీ గురించి చెప్పారు...
అనంతపురం అర్బన్: ‘అమ్మా.. సీఎం గారే స్వయంగా నన్ను పిలిచి మీ గురించి చెప్పారు. సమస్యలు పరిష్కరిస్తాం. ధైర్యంగా ఉండండి’ అని కలెక్టర్ ఎమ్.గౌతమి దివ్యాంగురాలు ఆదినారాయణమ్మకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 26న నార్పలకు విచ్చేసిన సందర్భంలో ఆయన్ను యల్లనూరు మండలం దంతెలపల్లికి చెందిన ఆదినారాయణమ్మ కలిశారు. ఈ క్రమంలోనే సీఎం ఆమెకు.. కలెక్టర్‌ను కలవాలని చెప్పడంతో పాటు సమస్య పరిష్కరించాలని కలెక్టర్ గౌతమిని ప్రత్యేకంగా ఆదేశించారు. దీంతో ఆదినారాయణమ్మ గురువారం తన భర్త రామశివకర్రెడ్డితో పాటు కలెక్టరేట్‌కు వచ్చింది. కలెక్టర్ స్వయంగా చాంబర్ నుంచి కిందికి వచ్చి ఆమెతో మాట్లాడారు. తనకు ఇద్దరు కుమార్తెలని పెద్దమ్మాయి ఇడుపులపాయ ఐఐఐటీలో పనిచేస్తోందని, రెండో అమ్మాయి రాజంపేటలో బీటెక్ చేస్తోందని ఆదినారాయణమ్మ చెప్పింది. పెద్దమ్మాయికి ఇక్కడే ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని కోరింది. తాము ఉంటున్న ఇల్లు పడిపోయే స్థితిలో ఉందని కొత్తది మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. తనకు మూడు చక్రాల వాహనం ఇప్పించాలని విన్నవించింది. కంటికి ఆపరేషన్ జరిగినా, నీరు కారుతోందని, కుడికాలు పనిచేయడం లేదని వాపోయింది. ఆమె చెప్పిన సమస్యలను ఆర్డీఓ మధుసూదన్ నోట్ చేసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలు పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. మూడు చక్రాల వాహనం తెప్పించి ఇస్తామని చెప్పారు. ఆరోగ్య శ్రీ కో–ఆర్డినేటర్ డాక్టర్ కిరణ్‌కుమార్‌రెడ్డిని పిలిపించి కాలు, కంటికి చికిత్స చేయించాలని ఆదేశించారు. కుమార్తెకు ఏదేని ఉద్యోగం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
ఒక్కరోజులోనే ‘సీఎం’ సాయం
అనంతపురం అర్బన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తారనేదానికి.. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలుస్తూ ఆదుకుంటారనడానికి బుధవారం జరిగిన సంఘటనే ఉదాహరణ. తాజాగా.. ఈనెల 26న అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా నార్పలకు విచ్చేసిన సీఎంను వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న పలువురు నేరుగా ఆయన్ను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. వారి కష్టాలను విన్న ఆయన చలించిపోయారు. ఆదుకునే విషయంపై అప్పటికప్పుడు కలెక్టర్ గౌతమికి ఆదేశాలు జారీచేశారు. సీఎం ఆదేశాల మేరకు బాధితులతో కలెక్టర్ మాట్లాడి అవసరమైన ఆర్థిక సహాయం అందించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఆమె బాధితులకు చెక్‌లు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ గాయత్రిదేవి, పరిపాలనాధికారి విజయలక్ష్మి, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సురేంద్ర ఉన్నారు. ♦ ఇటీవల జరిగిన కెమికల్ బ్లాస్ట్‌లో భర్తను కోల్పోయానని అనంతపురం ఎ.నారాయణపురానికి చెందిన చాకలి నవ్య సీఎంకు తెలిపారు. ఇద్దరు చిన్నపిల్లలతో కుటుంబపోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం ఆమె కుటుంబానికి కలెక్టర్ రూ.7 లక్షలు ఆర్థిక సహాయం అందజేశారు. ♦ నార్పలకు చెందిన యోగీశ్వరి భర్త రంగారెడ్డి ప్రమాదంలో మరణించాడు. ఇద్దరు కుమారులతో తనకు కుటుంబపోషణ భారంగా మారిందని సీఎం దృష్టికి తీసుకెళ్లింది. ఆమె కుటుంబానికి రూ.2 లక్షలు సాయం అందించారు. ♦ నార్పలకు చెందిన రామాంజి విద్యుత్ శాఖలో బిల్ రీడర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో విద్యుత్ షాక్‌కు గురై కుడిచేయి కోల్పోయాడు. ఆయనకు రూ.2 లక్షలతో పాటు, ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారు. ♦ తన భార్య అనారోగ్యంతో బాధపడుతున్నట్లు నార్పలకు చెందిన గంగయ్య సీఎంకు విన్నవించాడు. ఆ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం, వీల్ చైర్ అందజేశారు. ♦ అనంతపురం ఎ.నారాయణపురానికి చెందిన రాజు, అరుణ కుమారుడు ధనుష్ జన్యుపరమైన సమస్యతో బాధపడుతున్నాడు. వీరు తమ బిడ్డ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. అదే విధంగా ధనుష్‌కు అవసరమైన వైద్య చికిత్సలు ఉచితంగా అందించాలని నిర్ణయించారు. ♦ శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన వి. అమర్నాథ్రెడ్డి రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయాడు. తీవ్ర ఇబ్బందిపడుతున్నట్లు సీఎం దృష్టికి తీసుకొచ్చాడు. ఆ కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించారు. ♦ తన మేనల్లుడు చేతన్‌రెడ్డి కండరాల వ్యాధితో బాధపడుతున్నట్లు తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లికి చెందిన కొండారెడ్డి సీఎంకు తెలిపారు. ఆయన కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. ♦ నార్పల మండలం సిద్ధరాచెర్లకు చెందిన రామచంద్ర సోదరి భవాని కుమారుడు బాలచంద్ర (11) అంగ వైకల్యంతో బాధపడుతున్నాడు. ఆమె కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం, వీల్ చైర్ అందజేశారు. ♦ అనంతపురానికి చెందిన నారాయణమ్మ కుమారుడు జశ్వంత్‌రెడ్డి (6) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆమె కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. ♦ దివ్యాంగుడైన తనకు మూడు చక్రాల సైకిల్ ఇవ్వాలని నార్పలకు చెందిన నబిరసూల్ సీఎంకు విన్నవించాడు. ఆయనకు ట్రై సైకిల్‌ను అందజేశారు. -
నటి గౌతమి కూతుర్ని చూశారా? వైరల్ అవుతున్న ఫోటోలు
సీనియర్ నటి గౌతమి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు, తమిళం తదితర దక్షిణాది భాషల్లో నటించి మెప్పించిన ఆమె అగ్రహీరోలతో జతకట్టింది. స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న సమయంలోనే ఓ ప్రముఖ వ్యాపార వేత్త సందీప్ భాటియాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీరి పెళ్లి కథ ఏడాదికే ముగిసిపోయింది. మనస్పర్థల కారణంగా భర్త నుంచి విడిపోయి విడాకులు తీసుకున్నారు. అప్పటికే వీరికి సుబ్బలక్ష్మి అనే కూతురు పుట్టింది. అప్పట్నుంచి ఆమె తల్లి గౌతమి వద్దే ఉంటోంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సుబ్బలక్ష్మీ తనకు సంబంధించిన పలు విషయాలను షేర్ చేస్తుంటుంది. తాజాగా ఆమె లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. హీరోయిన్‌కు ఏమాత్రం తగ్గని అందంతో సుబ్బలక్ష్మీ మెస్మరైజ్ చేస్తుంది. మరి త్వరలోనే ఈమె కూడా తల్లి గౌతమి లాగే సినిమాల్లోకి వస్తుందా అన్నది చూడాల్సి ఉంది. View this post on Instagram A post shared by subbu tadimalla (@maybesubbu) -
వెబ్ సిరీస్‌కు సెన్సార్ అవసరం: నటి గౌతమి ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రస్తుతం వెబ్‌సిరీస్‌ల హవా నడుస్తోంది. సినిమాలకు మాదిరిగా వెబ్‌సిరీస్‌కు సెన్సార్ నిబంధనలు లేకపోవడంతో వాటిలో హింసాత్మక సంఘటనలు, అశ్లీల సన్నివేశాలు హద్దు మీరుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని నటి, కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యురాలు గౌతమి వద్ద ప్రస్తావించగా వెబ్ సిరీస్‌కు సెన్సార్ అవసరమని పేర్కొన్నారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని తెలిపారు. గౌతమి తాజాగా స్టోరీ ఆఫ్ థింగ్స్ అనే వెబ్ సిరీస్‌లో ముఖ్యపాత్రను పోషించారు. ఈమెతో పాటు నటుడు భరత్, శాంతను భాగ్యరాజ్, రాజు, వినోద్ కిషన్, నటి అథితి బాలన్, రితికా సింగ్ నటించారు. చుట్పా ఫిలింస్ పతాకంపై రూపొందిన ఈ వెబ్ సిరీస్‌కు జార్జ్ దర్శకత్వం వహించారు. ఐదు స్టోరీస్‌తో రూపొందించారు. శుక్రవారం నుంచి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ.. ఫాంటసీ నేపథ్యంలో సాగే ఎమోషనల్ సన్నివేశాలతో రూపొందించిన వెబ్ సిరీస్ ఇదన్నారు. వేయింగ్ స్కేల్, మిర్రర్, కార్, కంప్రెషర్, సెల్యులార్ మొదలగు ఐదు కథలతో కూడిన వెబ్ సిరీస్ అన్నారు. దీన్ని తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాలీ భాషల్లో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ వెబ్ సిరీస్‌లో దెయ్యం లేకపోయినా అలాంటి థ్రిల్లింగ్ సన్నివేశాలు ఉంటాయని చెప్పారు. దర్శకుడు చెప్పిన కథ ఆకట్టుకోవడంతో తాను నటించినట్లు గౌతమి తెలిపారు. ఇందులో ఒక్కో స్టోరీ ఒక్కో జానర్లో ఉంటూ వీక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని ఆమె పేర్కొన్నారు. తనకు కనెక్ట్ అయ్యే సన్నివేశాలు చాలా ఉన్నాయని, అందుకే నటించడానికి అంగీకరించినట్లు నటుడు భరత్ చెప్పారు. గౌతమితో కలిసి నటించడం మంచి అనుభవంగా నటి అథితి బాలన్ పేర్కొన్నారు. -
అలనాటి హీరోయిన్ గౌతమి కూతురిని చూశారా? త్వరలో హీరోయిన్గా ఎంట్రీ!
నటి గౌతమి వారసురాలిని చూశారా? నేటి హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని విధంగా తయారైంది. నటి గౌతమి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. పదహారణాల తెలుగు అమ్మాయి అయిన ఈమె 1990 ప్రాంతంలో అగ్ర కథనాయకిగా వెలిగిపోయారు. తమిళం, తెలుగు తదితర దక్షిణాది భాషల్లో కథానాయికిగా నటించిన గౌతమి మంచి ఫామ్‌లో ఉండగానే 1998లో సందీప్ భాటియా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సంసార జీవితంలో స్థిరపడ్డారు. అయితే వీరి పెళ్లి కథ ఏడాదికే ముగిసిపోయింది. మనస్పర్థల కారణంగా భర్త నుంచి విడిపోయి విడాకులు తీసుకున్నారు. అప్పటికే వీరికి కూతురు పుట్టింది. ఆ పాపకు సుబ్బులక్ష్మి అని పేరు పెట్టారు. కొన్నాళ్ల తరువాత గౌతమి నటుడు కమలహాసన్‌తో సహజీవనం చేశారు. అలా పదేళ్లపాటు జరిగిన వారి సహజీవనంలో మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో గౌతమి కమలహాసన్ నుంచి దూరంగా వచ్చేసి కూతురుతో ఒంటరిగా జీవిస్తున్నారు. ఆ తరువాత సామాజిక సేవ, రాజకీయ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న గౌతమి అప్పట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలిశారు. అయితే ప్రస్తుతం వాటికి కూడా దూరంగా ఉంటున్నట్టు సమాచారం. కాగా ఆమె వారసురాలు సుబ్బలక్ష్మి ఇప్పుడు వార్తల్లోకి నిలుస్తోంది. కొద్ది రోజులుగా సుబ్బులక్ష్మి తన అందమైన ఫొటోలను తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తోంది. దీంతో అవి ప్రస్తుతం సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్నాయి. ఇదంతా ‘హీరోయిన్గా అవకాశాల కోసమేనా?’, త్వరలోనే హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతుందా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆమెది సినీ నేపథ్య కుటుంబమే కాబట్టి సుబ్బలక్ష్మికి హీరోయిన్గా అవకాశాలు రావడం పెద్ద కష్టమేమి కాదు. ఇక త్వరలో ఆమెను హీరోయిన్గా చూసే అవకాశం లేకపోలేదు అంటున్నారు నెటిజన్లు. -
ఆదాయ పన్ను కేసులో నటి గౌతమికి ఊరట
సాక్షి, చెన్నై: ఆదాయపు పన్ను చెల్లింపు వ్యవహారంలో సినీ నటి గౌతమికి మద్రాసు హైకోర్టులో గురువారం ఊరట లభించింది. ఈమె గతంలో శ్రీపెరంబదూరు సమీపంలో తన వ్యవసాయ పొలాన్ని విక్రయించారు. ఈ వ్యవహారంలో ఆదాయపు పన్ను చెల్లింపులు గందరగోళానికి దారి తీశాయి. దీంతో ఆమెకు చెందిన బ్యాంక్ ఖాతాలను ఐటీ వర్గాలు సీజ్ చేశాయి. దీనిని వ్యతిరేకిస్తూ గౌతమి హైకోర్టును ఆశ్రయించారు. ఆ స్థలాన్ని తాను రూ. 4 కోట్ల 10 లక్షలకు విక్రయించానని, అయితే, ఐటీ వర్గాలు రూ. 11 కోట్ల 11 లక్షలు విచారించినట్టు పేర్కొంటున్నాయని కోర్టుకు వివరించాయి. ఆరు బ్యాంక్‌ల్లోని తన ఖాతాల్ని సీజ్ చేశారని, వీటిని మళ్లీ ఉపయోగించుకునే అవకాశం కల్పించాలని విన్నవించారు. ఈ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ ఆ స్థలం విక్రయాన్ని ప్రస్తావిస్తూ, మూలధనంలో 25 శాతం చెల్లిస్తే, సీజ్ చేసిన ఖాతాల్ని ఉపయోగించుకునే అవకాశం కల్పించాలని ఐటీ వర్గాల్ని ఆదేశించారు. -
20 సీట్లు.. 30 మంది స్టార్ క్యాంపెయినర్లు!
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమ పార్టీ స్టార్ క్యాంపెయినర్లను బీజేపీ ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, తమిళనాడు ఆడపడుచు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితర ముఖ్య నేతలు ప్రచారం నిర్వహించనున్నారు. ఇక వీరితో పాటు స్థానిక బీజేపీ నేత, నటి గౌతమిని కూడా స్టార్ క్యాంపెయినర్‌గా అధిష్టానం ప్రకటించింది. కాగా అన్నాడీఎంకే- బీజేపీ కూటమిలో సీట్ల కేటాయింపులో భాగంగా కాషాయ పార్టీకి 20 సీట్లు దక్కాయి. ఈ నేపథ్యంలో రాజపాళయం సీటు కమలనాథుల చేజారడంతో, ఆ స్థానం నుంచి పోటీపడదామనుకున్న గౌతమికి నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో స్టార్ క్యాంపెయినర్‌గా ఆమె సేవలు వినియోగించుకోవాలని అధిష్టానం నిర్ణయించడం గమనార్హం. కాగా ఏప్రిల్ 6న తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, మే 2 న ఫలితాలు వెలువడనున్నాయి. కమల్ వర్సెస్ గౌతమి! మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్, తమ పార్టీ 154 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయన ముఖ్య కార్యకర్తలతో సమావేశమవుతూ దూకుడు పెంచారు. కాగా కమల్ హాసన్- గౌతమి పదమూడేళ్ల పాటు సహజీవనం చేసిన సంగతి తెలిసిందే. విభేదాలు తలెత్తిన కారణంగా 2016లో వీరు విడిపోయారు. ఇక గౌతమిని స్టార్ క్యాంపెయినర్‌గా ప్రకటించడంతో, ఎన్నికల ప్రచారంలో భాగంగా వీరి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. కాగా ఐజేకే కూటమి సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కమల్‌కు శరత్ కుమార్, రాధిక వంటి ప్రముఖుల మద్దతు ఉంది. బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు వీరే 1. నరేంద్ర మోదీ 2. జేపీ నడ్డా 3. రాజ్‌నాథ్ సింగ్ 4. అమిత్ షా 5. నితిన్ గడ్కరీ 6.నిర్మలా సీతారామన్ 7. స్మృతి ఇరానీ 8. ఎస్ జైశంకర్ 9. కిషన్‌రెడ్డి 10. జనరల్ వీకే సింగ్(రిటైర్డు) 11. యోగి ఆదిత్యనాథ్ 12. శివరాజ్ సింగ్ చౌహాన్ 13. సీటీ రవి 14. పురందేశ్వరి 15. పి సుధాకర్ రెడ్డి 16. తేజస్వి సూర్య 17. ఎల్ గణేషన్ 18. వీపీ దురైస్వామి 19.కేటీ రాఘవన్ 20. శశికళ పుష్ప 21. గౌతమి తాడిమల్ల 22. రాధారవి 23. కేపీ రామలింగం 24. గాయత్రీ దేవి 25. రాజ్‌కుమార్ గణేషన్ 26. విజయశాంతి 27. సెంథిల్ 28. వెల్లూర్ ఇబ్రహీం 29. ప్రొఫెసర్ రామ శ్రీనివాసన్ 30. ప్రొఫెసర్ కనగ సబాపతి చదవండి: కమల్ సీఎం కావడం ఖాయం.. -
ప్రముఖ నటి ఇంట్లో అపరిచితుడి గలాటా
సాక్షి, చెన్నై: ప్రముఖ నటి గౌతమి ఇంట్లో దుండగుడు చొరబడటం కలకలం రేపింది. చెన్నైలోని కొట్టివక్కమ్‌లో గౌతమి నివసిస్తున్న ఇంట్లోకి అనుమతి లేకుండా పాండియన్ (28) అనే వ్యక్తి ప్రవేశించి గలాటా సృష్టించాడు. ఇంట్లోని ఒక గోడ పక్కన దాక్కొని ఉన్న విషయాన్ని గౌతమి ఇంట్లో పనిచేసే సతీష్ గమనించాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గౌతమి ఇంటికి చేరుకున్న నీలంకరై పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడినికొట్టివాక్కం కుప్పంకు చెందిన పాండియన్‌గా పోలీసులు గుర్తించారు. అతడు మద్యం మత్తులో ఉన్నాడని, అనుమతి లేకుండా ప్రవేశించడంతో పాటు ఆందోళన కలిగించినందుకుగాను అతడిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. అయితే గౌతమి ఇంట్లో పనిచేస్తున్న తన సోదరుడిని కలవడానికే పాండియన్ అక్కడకు వెళ్లినట్లు తెలుస్తోంది. -
తోట బావిలో...
యాంకర్ రవి, గౌతమి జంటగా నటిస్తున్న చిత్రం ‘తోట బావి’. గద్వాల్ కింగ్ సమర్పణలో ఆలూర్ ప్రకాశ్‌గౌడ్ నిర్మించారు. అంజి దేవండ్ల దర్శకుడు. ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు ఎన్.శంకర్ విడుదల చేసి మాట్లాడుతూ– ‘‘రవిని చాలాకాలంగా టీవీలో చూస్తున్నాను. మంచి టైమింగ్ ఉన్న నటుడు’’ అన్నారు. ‘‘రవి ఇచ్చిన సపోర్ట్‌తో సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు అంజి దేవండ్ల. ‘‘యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో మా దర్శకుడు సినిమాను ఇంట్రస్టింగ్‌గా తీశారు. మొదటి సినిమా అయినా అనుభవం ఉన్న దర్శకునిలా తీశారు’’ అన్నారు ప్రకాష్ గౌడ్. ఈ చిత్రానికి దౌలు, చిన్నస్వామి, అభిషేక్ .బి సహనిర్మాతలు. -
స్క్రీన్ టెస్ట్
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ఎలా ఏ స్థాయికి వెళతారో ఎవరూ ఊహించలేరు. అందుకే సినిమా అనేది చాలా మందికి డ్రీమ్. ఆ కలకి నాయకుడు దర్శకుడు. అందుకే దర్శకుణ్ణి ‘కెప్టెన్ ఆఫ్ ది షిప్’ అంటారు. సినిమా ఇండస్ట్రీలోని అనేక శాఖల్లో పని చేసిన అనుభవంతో మెగాఫోన్ పట్టిన దర్శకుల గురించి ఈ వారం క్విజ్ స్పెషల్... 1. ఈయన మొదట దర్శకుడు కాదు. ఎడిటింగ్ శాఖలో ప్రముఖ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు వద్ద శిక్షణ తీసుకున్నారు. తర్వాత చాలా పెద్ద దర్శకుడయ్యారు. ఎవరా డైరెక్టర్? ఎ) శ్రీను వైట్ల బి) వీవీ వినాయక్ సి) వంశీ పైడిపల్లి డి) ఎస్.ఎస్ రాజమౌళి 2. నటిగా ఉన్నత శిఖరాలను అధిరోహించారామె. ‘చిన్నారి పాపలు’ అనే చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించారు. ఎవరా హీరోయిన్? ఎ) ‘షావుకారు’ జానకి బి) జమున సి) సావిత్రి డి) వాణిశ్రీ 3. ఈ ప్రముఖ హీరోల్లో ఓ హీరో మెగాఫోన్ పట్టుకోలేదు. ఆయనెవరో కనుక్కోండి? ఎ) అక్కినేని బి) కృష్ణ సి) యన్టీఆర్ డి) చిత్తూరు వి. నాగయ్య 4. దర్శకత్వం చేయకముందు నంబర్ ప్లేట్లకు స్టిక్కర్ డిజైనింగ్ చేయడంలో అందెవేసిన చెయ్యి ఈ దర్శకునిది. ఎవరా దర్శకుడు? ఎ) సుధీర్‌వర్మ బి) మారుతి సి) చిన్నికృష్ణ డి) విరించివర్మ 5. ప్రభాస్ నటించిన ‘మిర్చి’ చిత్రంతో దర్శకునిగా మారారు. అంతకుముందు ఎన్నో చిత్రాలకు రచయితగా పనిచేశారు. ఇంతకీ ఎవరా దర్శకుడు? ఎ) బోయపాటి శ్రీను బి) వక్కంతం వంశీ సి) కొరటాల శివ డి) దశరథ్ 6 నటి విజయశాంతి మేకప్‌మేన్‌గా ఈయన సుపరిచితుడు. ‘పెద్దరికం’ చిత్రానికి దర్శకత్వం వహించి విజయం సాధించారు. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతగానూ పేరుంది. ఎవరతను? ఎ) బండ్ల గణేష్ బి) ‘దిల్’ రాజు సి) ఏ.యం.రత్నం డి) కాస్ట్యూమ్స్ కృష్ణ 7. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా 400 చిత్రాలకు పైగా పని చేశారీయన. తన దర్శకత్వ ప్రతిభతో కొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎవరా నటుడు? ఎ) చలం బి) పద్మనాభం సి) రాజబాబు డి) రేలంగి 8. పవన్ కల్యాణ్ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘జానీ’. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మించారు. ఆ చిత్రంలో పవన్ సరసన నటించిన కథానాయిక ఎవరో కనుక్కోండి? ఎ) కీర్తి రెడ్డి బి) రేణూ దేశాయ్ సి) సుప్రియ డి) అమీషా పటేల్ 9. 1957లో ‘పాండురంగ మహత్యం’ సినిమాలో బాలకృష్ణుని పాత్రలో నటించారీమె. 1971లో ‘మీనా’ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమయ్యారు. ఎవరా ప్రముఖ నటి? ఎ) బి.సరోజాదేవి బి) కృష్ణకుమారి సి) కాంచన డి) విజయనిర్మల 10. తమిళ నటుడు జీవా, కార్తీక కాంబినేషన్లో తమిళ్, తెలుగులో విడుదలైన చిత్రం ‘రంగం’. ఆ చిత్రానికి దర్శకత్వం వహించింది ప్రముఖ కెమెరామేన్. ఆ కెమెరామేన్ పేరేంటో కనుక్కోండి? ఎ) పీసీ శ్రీరామ్ బి) రాజీవన్ సి) కేవీ ఆనంద్ డి) రసూల్ ఎల్లోర్ 11. నటునిగా 150 చిత్రాలను పూర్తి చేసుకున్నారు యాక్షన్ కింగ్ అర్జున్. ఆయన దర్శకునిగా మారి ఎన్ని చిత్రాలు తెరకెక్కించారో తెలుసా? ఎ) 5 బి) 8 సి) 7 డి) 11 12. 1949లో యన్టీఆర్ నటించిన మొదటి చిత్రం ‘మన దేశం’ రిలీజైంది. 1961లో ఆయన తొలిసారిగా దర్శకత్వం వహించారు. ఆ చిత్రం పేరేంటి? ఎ) తల్లా? పెళ్లామా? బి) వరకట్నం సి) సీతారామ కల్యాణం డి) శ్రీకృష్ణ పాండవీయం 13. దర్శక దిగ్గజం కె.విశ్వనాథ్ మొదట దర్శకత్వ శాఖలో పనిచేయలేదు. సినీ పరి శ్రమలో మొదట ఆయన ఏ శాఖలో పనిచేశారో తెలుసా? ఎ) ఎడిటింగ్ బి) కెమెరా సి) ఆడియోగ్రాఫర్ డి) కొరియోగ్రాఫర్ 14 కమల్‌హాసన్ దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ‘చాచీ 420’. ఆ చిత్రంలో హీరోయిన్ ఎవరో తెలుసా? ఎ) టబు బి) గౌతమి సి) అమలా డి) రమ్యకృష్ణ 15. ‘మణికర్ణిక’ చిత్రానికి మొదట దర్శకునిగా చాలా బాగాన్ని చిత్రీకరించారు క్రిష్. ఆ తర్వాత ఆయన ‘యన్టీఆర్’ బయోపిక్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టడం వల్ల మిగతా చిత్రాన్ని కంప్లీట్ చేసిన నాయిక ఎవరో చెప్పుకోండి? ఎ) ఆలియా భట్ బి) దీపికా పదుకోన్ సి) కంగనా రనౌత్ డి) ప్రియాంకా చోప్రా 16 హీరో కృష్ణ దాదాపు 230 సినిమాల్లో నటించిన తర్వాత ‘సింహాసనం’ చిత్రం ద్వారా దర్శకునిగా మారారు. ఆ సినిమాలో విషకన్య పాత్ర ద్వారా తెలుగులో నటించిన బాలీవుడ్ నటి ఎవరో తెలుసుకుందామా? ఎ) దివ్యభారతి బి) రేఖ సి) హేమమాలిని డి) మందాకిని 17. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన చిత్రం ‘చండీరాణి’. ఆ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమైన ఫేమస్ హీరోయిన్ ఎవరు? ఎ) భానుమతి బి) లక్ష్మీ సి) యస్.వరలక్ష్మీ డి) అంజలీదేవి 18. ఆయనో ప్రముఖ నిర్మాత. అక్కినేని నాగేశ్వరరావు ప్రోత్సాహంతో దర్శకుడయ్యారు. తను దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ‘దసరాబుల్లోడు’తో సంచలన విజయం నమోదు చేశారు. ఆ దర్శక–నిర్మాత ఎవరో తెలుసా? ఎ) వీబీ రాజేంద్రప్రసాద్ బి) కేయస్ ప్రకాశరావు సి) క్రాంతికుమార్ డి) మురారి 19. సంచలన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు తేజ. ఆయన దర్శకుడు కాకముందు ఫేమస్ సినిమాటోగ్రాఫర్. ఆయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ఏంటో గుర్తుందా? ఎ) జయం బి) చిత్రం సి) నిజం డి) ధైర్యం 20. తరుణ్, రాజా, సలోనిలు ముఖ్య పాత్రలుగా నటించిన చిత్రం ‘ఒక ఊరిలో’. ఆ చిత్రంతో దర్శకునిగా మారారు రమేశ్‌వర్మ. దర్శకుడు కాకముందు ఆయన ఏం చేసేవారో తెలుసా? ఎ) స్టిల్ ఫొటోగ్రఫీ బి) ఆర్ట్ డైరెక్టర్ సి) పోస్టర్ డిజైనర్ డి) మ్యూజిక్ డైరెక్టర్ మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు 1) డి 2) సి 3) ఎ 4) బి 5) సి 6) సి 7) బి 8) బి 9) డి 10) సి 11) డి 12) సి 13) సి 14) ఎ 15) సి 16) డి 17) ఎ 18) ఎ 19) బి 20) సి నిర్వహణ: శివ మల్లాల -
గౌతమిది హత్యే
చీరాల రూరల్: భర్త, అత్త మామల వేధింపుల కారణంగానే గౌతమి సముద్రంలో మునిగి ఆత్మహత్యకు పాల్పడిందని, ఆమె మృతికి కారణమైన భర్తను అరెస్టు చేసినట్లు డీఎస్పీ డాక్టర్ ప్రేమ్ కాజల్ తెలిపారు. మంగళవారం ఆమె స్థానిక తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. చీరాల పట్టణం కొట్లబజారు రామ మందిరం వీధికి చెందిన కోట పాండురంగారావు కుమారుడు కోట వెంకట రామకృష్ణ మణికంఠ పవన్‌కుమార్ అలియాస్ మణికంఠతో గుంటూరుకు చెందిన గాదుమల్ల వెంకట రత్నం కుమారై గౌతమికి 2014లో వివాహం జరిగింది. ఆ తర్వాత మణికంఠ సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి చీరాలలో బట్టల వ్యాపారం చేస్తున్నాడు. ఇది గౌతమికి నచ్చలేదు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. గౌతమి పుట్టింటి వారు విక్రయించిన ఆస్తులకు సంబంధించి వాటా తీసుకురాకపోవడంతో భర్త, అత్తమామలు ఆమెను ఇబ్బంది పెట్టారు. వారి బాధలు భరించలేని గౌతమి గత నెల 26వ తేదీ ఉదయం 6.30 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లి వేటపాలెం మండలం రామాపురం బీచ్‌లో ముగిని ఆత్మహత్యకు పాల్పడింది. గౌతమి మృతికి ఆమె భర్త, అత్త మామలే కారణమని మృతురాలి తల్లిదండ్రులు పాండురంగారావు, పుష్ప అమృతవల్లిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడైన ఆమె భర్తను అరెస్టు చేసి మీడియా ఎదుట ప్రవేశ పెట్టారు. ఈ కేసులో మిగిలిన నిందితులైన మణికంఠ తల్లిదండ్రులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ పేర్కొన్నారు. రూరల్ సీఐ భక్తవత్సలరెడ్డి, ఈపురుపాలెం ఎస్ఐ అనూక్ న్నారు. -
జీవిత కథ
‘‘అమ్మా జాగ్రత్త! ఈ వయసులో నిన్ను ఒంటరిగా పంపడం ఇష్టంలేదు. నాకూ రావాలనే వుంది కానీ ఈ నెలాఖరుకు రిటైర్ అవుతుండటంతో సెలవు పెట్టడం కుదరక నేను రాలేకపోతున్నాను. రాజమండ్రి స్టేషన్‌కు మావయ్య కొడుకు రామం వస్తానన్నాడు. జాగ్రత్తగా దిగు. వెళ్ళగానే ఫోనుచేయి.’’ గౌతమీ ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగీలో తల్లిని కూర్చోబెట్టి జాగ్రత్తలు చెప్పాడు శ్రీహర్ష.‘‘గోదావరికీ నాకూ ఉన్న అనుబంధం నీకు తెలిసిందే కదరా. పుష్కరాలలో గోదావరిలో స్నానం చేయందే నాకు తోచదని నీకు తెలుసుకదా. నాకేం ఫరవాలేదు. నువ్వు జాగ్రత్తగా ఇంటికెళ్లు ...’’ తనయునికి ధైర్యం చెప్పింది గౌతమి.అమ్మ చేతిలో చేయివేసి ఆప్యాయంగా తడిమి రైలు దిగాడు శ్రీహర్ష.గౌతమీ ఎక్స్‌ప్రెస్ నెమ్మదిగా బయలుదేరి వేగం పుంజుకుంది.స్టేషన్లో శ్రీహర్ష కొనియిచ్చిన పుష్కరాల స్పెషల్ పత్రిక తీసి పేజీలు తిరగేసింది. గోదావరిలో కేరింతలు కొడుతున్న చిన్నపిల్లల ఫైలు ఫొటోలు చూస్తూంటే తన బాల్యం గుర్తుకువచ్చింది గౌతమికి. ఎనభై నాలుగు సంవత్సరాల క్రితం గోదావరి పుష్కరాల మొదటిరోజున పుట్టిన అమ్మాయికి గౌతమి అని పేరు పెట్టారు తల్లిదండ్రులు.గౌతమి బాల్యమంతా రాజమండ్రిలో గడిచింది.ముగ్గురు అబ్బాయిల తరువాత పుట్టిన అమ్మాయి కావడంతో గౌతమి గారాబంగా పెరిగింది.చిన్నతనంలో ఆడుకున్న ఆటలు... వామనగుంటలు... తొక్కుడుబిళ్ళ... సంక్రాంతికి ముగ్గులు పెట్టడం... గొబ్బెమ్మలు... గుర్తుకు వచ్చాయి గౌతమికి.‘ఈకాలం పిల్లలకు ఈ ఆటలేవీ తెలియవు. ప్రస్తుతం నడుస్తున్నది టెక్నాలజీ యుగం. అప్పటి బాల్యం స్వేచ్ఛావిహారం. బండెడు పుస్తకాల బరువు లేదు. హోంవర్కుల బెడద లేదు. ఆడుతూ పాడుతూ చదువులు. సుమతీ శతకం, వేమన శతకం అమ్మ వంట చేస్తూ వల్లెవేయించేది.’ బాల్య స్మృతులు తలచుకొని మురిసిపోయింది గౌతమి.టీసీ వచ్చి టికెట్ చెక్ చేశాడు.పై బెర్త్ మీద యువతి లైట్ ఆర్పి బెర్త్ ఎక్కి పడుకుంది.తన బెర్త్‌పై దుప్పటి పరుచుకుని నడుం వాల్చింది గౌతమి.కళ్ళు మూసుకుంటే చిన్నప్పుడు మొదటి పుష్కరస్నానం చేసిన ఘటన తలపుకొచ్చింది.అప్పటికి గౌతమి వయసు పన్నెండేళ్ళు.తల్లిదండ్రులు, తాతయ్యలు, అమ్మమ్మ... మామ్మ... పెదనాన్నలు... మావయ్యలు... వాళ్ళ పిల్లలు... అందరూ కలిసి నలభైమంది కలిసికట్టుగా గోదావరి చేరుకున్నారు.పిల్లలు గోదావరిలో ఉత్సాహంగా ఉరకలేశారు. ఒరేయ్ కృష్ణా జాగ్రత్తరా... పెద్దోడా నీకసలే తొందర... నెమ్మదిగా దిగు... చిన్నా... నువ్వు పెద్దాడి చెయ్యి పట్టుకో... గౌతమీ, మగాళ్ళతో సమానంగా ఏమిటీ పరుగులు... అంటూ పెద్దలుహెచ్చరిస్తున్నా వినీ విననట్లు పిల్లలు గోదావరిలో ఈదులాటలు...అరగంటపైగా నదిలో జలకాలాడి బయటకు వస్తే చెప్పలేని ఆనందం...‘‘మంచి మొగుడు రావాలని గోదావరమ్మకు మొక్కుకో’’ తల్లి సలహా.స్నానాలయ్యాక ఇంటికి చేరి అమ్మకు వంటపనిలో సహాయం చేయడం... బంధుమిత్రులతో కలిసి విందుభోజనం. ‘పుష్కరాల పన్నెండు రోజులూ రోజూ ఇంటికి వచ్చిన బంధువులతో కలిసి వెళ్ళి స్నానం చేసి వచ్చిన రోజులు మరచిపోదామన్నా మరపురావు. గోదావరితో అనుబంధం అప్పుడే బలపడింది.’ అనుకుంటూ చలిగా అనిపిస్తే రగ్గు తీసి కప్పుకుంది గౌతమి. పడుకుందామ నుకున్నా నిద్ర రావడంలేదు. మనసు నిండా ఆలోచనలు.రెండోసారి పుష్కరాలు గుర్తుకు తెచ్చుకుంది గౌతమి.పుష్కరానికీ పుష్కరానికీ మధ్య ఆ పన్నెండేళ్ళలో దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. దేశమంతా సంబరాలు జరుగుతున్న రోజున ఇంట్లో స్వీట్లు చేసి అందరికీ పంచింది తల్లి. ఇంటిపైన జెండా ఎగరేశాడు తండ్రి.ఆ పుష్కరాలకి వయసు తెచ్చిన అందాలతో భాసిల్లింది గౌతమి. వివాహమైంది. భర్త రాఘవరావు అమలాపురంలో స్కూల్ టీచర్. గౌతమి ఇంటిపేరు మారింది.మొదటిసారి పుష్కరాలకి తల్లిదండ్రులు తోడుంటే రెండోసారి పుష్కరాలకు అత్తమామలు, భర్తతో కలిసి గోదావరికి వెళ్ళింది గౌతమి.భర్త, అత్తమామలు, ఆడపడుచులు... మరుదులు... పెద్దత్తగారు... పిల్లలు అందరూ కలిసి గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు.అటు తిరిగితే భర్త... ఇటు తిరిగితే అత్తమామలు... మధ్యలో ఒదిగి ఉండవలసిన జీవితం.తన వైవాహిక జీవితాన్ని తలచుకుంటూ బెర్తుపై లేచి కూర్చుంది గౌతమి.అత్తారింటికి వెళ్ళడానికి ముందు ఉమ్మడి కుటుంబంలో సర్దుకుపోయే మనస్తత్వం అలవరచుకోమని తల్లి నూరిపోసింది.భయంభయంగా అమలాపురంలోని అత్తారింట్లో అడుగుపెట్టింది గౌతమి. మొదటిరోజే పెద్దకోడలికి వంటగది అప్పజెప్పింది అత్తగారు.ఆ ఇంట్లో ఆవిడదే పెత్తనమని గ్రహించింది కోడలు. మామగారు నోరులేని మనిషి. ఆ రోజుల్లో అత్తగారి ఆంక్షల వలయంలో పగలంతా వంటగదికే అంకితమయ్యేది గౌతమి.నాలుగువందల గజాల స్థలంలో పది కొబ్బరిచెట్ల మధ్య పెంకుటిల్లు...రోజూ తెల్లవారుజామున లేచి ఇంటిచుట్టూ తుడిచి... నీళ్ళు జల్లి... ముగ్గులేసేది. కాస్త పొద్దెక్కగానే వంటింట్లో చేరి అందరికీ కాఫీలు... ఫలహారాలు... కట్టెలపొయ్యి మీద వంటలు... వంట పూర్తయ్యేసరికి పొగకికళ్ళుఉబ్బిపోయేవి.మధ్యాహ్నం భోజనాల తరువాత... రోట్లో ఇడ్లీ పప్పు... పచ్చళ్ళు రుబ్బడం... తిరగలిలో పప్పులు... బియ్యంనూక విసరడం... ఏదో ఒక పని ఎదురుచూసేది.ఇంటికి వచ్చే పోయే చుట్టాలతో ఇల్లు కళకళలాడుతుండేది.పని పని పని... పగలంతా క్షణం తీరిక లేని పని.పగలంతా ఎంత అలసినా... రాత్రి భర్త చేరువలో సేదతీరేది.రాఘవరావు నెమ్మదస్తుడు. అతని మంచితనం ఆమెకు వరమయింది.‘‘పచ్చని పసిమిఛాయ... కలువ రేకుల్లాంటి కళ్ళు... చంద్రబింబం లాంటి మోము... అన్నిటికీ మించి నీ ఓర్పు, మంచితనం... అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం... నాకోసం దివిపై వెలసిన దేవతవు’’ అని భర్త పొగుడుతుంటే సిగ్గుల మొగ్గయ్యేది భార్య.భర్త అనురాగ బలంతో భార్య అలసట మాయమయ్యేది.భర్త తలపుకు రాగానే కళ్ళు చెమ్మగిల్లాయి గౌతమికి.కళ్ళు తుడుచుకుని మంచినీళ్ళు తాగి బెర్త్‌పై మేనువాల్చింది. ‘నిద్ర రావడంలేదు... ఎందుకో గతం పదే పదే గుర్తుకువస్తోంది.’ అనుకుంటూ అంతలోనే లేచి కూర్చుంది. మూడోసారి పుష్కరాలకు వెళ్ళేసరికి ఇద్దరు పిల్లలు తోడయ్యారు.అబ్బాయి శ్రీహర్ష. అమ్మాయి శ్రీలత.భర్త, అత్తగారు, పిల్లలు... మరుదులు, తోటికోడళ్ళతో కలిసి రాజమండ్రి చేరుకుంది గౌతమి.ఈమధ్య కాలంలో మావగారు గుండెపోటుతో మరణించారు.స్నానం చేస్తూ అత్తగారు కన్నీరు కార్చారు. ఆమె చేయి పట్టుకుని స్నానం చేయించి గట్టు మీదకు తీసుకొచ్చింది. రాఘవరావు తండ్రికి పిండప్రదానం చేశాడు.పిల్లలు గోదావరిలో దిగి జలకాలాడుతుంటే బాల్యం గుర్తుకువచ్చి,‘అప్పటి అమ్మ స్థానంలో ఇప్పుడు నేను... నా స్థానంలో నా పిల్లలు...’ అనుకుంటూ జీవితచక్రంలో జరిగిన మార్పుల్ని తలచుకుని గోదావరి గట్టుపై నిలబడి నవ్వుకున్న ఘటన తలపుకొచ్చి పెదవులపై చిరుదరహాసం మెరిసింది.పుష్కరాల నుండి తిరిగి వచ్చిన రెండేళ్ళకి ఉమ్మడికుటుంబం విచ్ఛిన్నమయింది. పెద్దమరిది ట్రాన్స్ఫర్ చేయించుకుని ఏలూరులో మకాం పెట్టాడు.చిన్నమరిది తునికి మకాం మార్చాడు.బంధుమిత్రుల రాకపోకలు తగ్గిపోయాయి. అత్తగారు అనారోగ్యంతో కుదేలయింది.‘‘పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. కాకినాడ విద్యాలయాలకు పెట్టింది పేరు. అక్కడిపిఠాపురం రాజావారి హైస్కూల్లో చదువు బాగుంటుందంటున్నారు. కాకినాడ మారిపోదాం...’’ ప్రతిపాదించింది గౌతమి.రాఘవరావు సమ్మతించాడు.కాకినాడ ట్రాన్స్‌ఫర్‌కు ప్రయత్నించి, ఆరు నెలల్లో ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు.కాకినాడకు మకాం మారింది.అమలాపురంలో ఇల్లు అమ్మేసి తన వాటా డబ్బుతో కాకినాడలో ఇల్లు కొందామని తల్లితో చెప్పాడు రాఘవరావు.అమలాపురంలో ఇల్లు అమ్మడానికి అత్తగారు మొదట ఒప్పుకోలేదు.నాలుగు నెలలు పోరి తల్లిని ఒప్పించాడు రాఘవరావు. కాకినాడలో చిన్న ఇల్లు కొనుక్కుని స్థిరపడ్డారు రాఘవరావు దంపతులు. ‘ఎప్పటి సంగతులో తలపుకొస్తే నిన్న గాక మొన్న జరిగినట్లనిపిస్తోంది’ అనుకుంది గౌతమి.నిద్ర ఎగిరిపోయింది.నాలుగోసారి పుష్కరాలకు వెళ్ళినప్పుడు... తలచుకుంటూ సర్దుకుకూర్చుంది గౌతమి.అత్తగారు కాలంచేశారు. పన్నెండేళ్ళ కాలంలో ఇంట్లో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆధునిక సౌకర్యాలు సమకూర్చాడు రాఘవరావు.గ్యాస్‌స్టవ్ వచ్చింది. ఫ్రిజ్ వంటింట్లో చేరింది. మిక్సీ కొనుక్కున్నారు.డాబా మీద మూడు గదులు కట్టి అద్దెకిచ్చారు.ట్యూషన్స్ చెపుతూ రాబడి పెంచుకున్నాడు రాఘవరావు. గౌతమికి పనిభారం తగ్గింది. విశ్రాంతి సమయంలో రామాయణ, భారతాలు చదవడం మొదలుపెట్టింది.పెద్దలనుండి సలహాలు తీసుకునే స్థాయినుండి శ్రేయోభిలాషులకు సలహాలిచ్చే స్థాయికి ఎదిగింది గౌతమి.గోదావరి నదిలో స్నానంచేసి గట్టుమీద నిలుచున్న గౌతమి జీవితం సుఖదుఃఖాల మిళితం అనుకుంటూ గోదావరమ్మకు ప్రణమిల్లింది.‘నా చిన్నప్పుడు నలభైమందితో కలిసి ఆనందం ఉత్సాహంతో ఉక్కిరిబిక్కిరవుతూ గోదావరిలో జలకాలాడాను. ఈరోజున కేవలం నలుగురం రాగలిగాం. రోజులెలా మారిపోయాయో...’ నిట్టూర్చింది గౌతమి.‘‘ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అర్థాంగీ’’ అడిగాడు భర్త నవ్వుతూ భుజంమీద చేయివేసి.‘‘పుష్కరానికీ పుష్కరానికీ మధ్య జీవితంలో వచ్చిన మార్పులు తలచుకుంటూంటే ఆశ్చర్యంగా వుంది. మనుషులు ఎలా మారినా గోదావరి మాత్రం అలాగే వయ్యారంగా పరుగులెడుతోంది.’’ అంది గౌతమి తడిబట్టలు పిండుతూ.‘‘మనిషి జీవితంలో మహా అయితే ఆరేడు పుష్కరాలు చూస్తాడు. ఓ పుష్కరం గడిచిందంటే పన్నెండేళ్ళ కాలం కరిగిపోయినట్లే. జరిగిపోయిన పుష్కరకాలంలో చేసిన తప్పులు సమీక్షించుకుని మరో పుష్కరంలో సాధించాల్సిన లక్ష్యాలు నిర్దేశించుకుని చేసిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త పడగలిగితే మనిషి జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగుతుంది. ప్రణాళిక లేకుండా పరుగులు తీస్తే జారిపడడం ఖాయం’’ అన్నాడు రాఘవరావు.‘‘పుష్కరస్నానంతో పాపాలు పోతాయంటే... చేసిన తప్పులు సరిదిద్దుకుని మిగిలిన జీవితమైనా ధర్మబద్ధంగా జీవించమని హెచ్చరించడమే ఈ స్నానాల పరమార్థం కావచ్చు..’’ తన అభిప్రాయం వ్యక్తీకరించింది గౌతమి. పుష్కరఘాట్ వద్ద కొత్తగా ప్రతిష్టించిన గోదావరిమాత విగ్రహాన్ని దర్శించుకున్నారు.భద్రాచలం వెడదామని పిల్లలు సరదాపడితే ‘‘అలాగే’’ అంటూ భద్రాచలం బయలుదేరారు.గతంగతః అనుకుంటూ జ్ఞాపకాలు నెమరువేసుకుంటూంటే చిన్న కుదుపు.రైలు స్టేషన్లో ఆగినట్టుంది.బోగీలో లైట్లు వెలిగాయి.ఎదుటి బెర్తు మీద వ్యక్తి సామాను తీసుకుని దిగిపోతున్నాడు. ‘‘ఏవూరు?’’ అడిగింది గౌతమి. ‘‘విజయవాడ’’ అంటూ అతను గబగబా గుమ్మంవైపు వెళ్లిపోయాడు.సెల్లో టైము చూస్తే మూడయింది. తెల్లారడానికి ఇంకా మూడు గంటలు గడవాలి. ఏమిటో ఈరాత్రి నిద్రరావడం లేదు. మనసులో ఏదో దిగులు. లైటు ఆర్పింది గౌతమి.అరవై ఏళ్ళ వయసులో ఐదోసారి పుష్కరాలకు వెళ్ళినప్పటి సంఘటనలు మదిని తట్టాయి. కిందటి పుష్కరాలకి, ఈ పుష్కరాలకి మధ్యకాలంలో తల్లిదండ్రులు స్వర్గస్తులయ్యారు. పెదనాన్న, పెద్దమ్మలు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. అన్నయ్యలు మరణించారు.పిల్లలు రెక్కలొచ్చి ఎగిరిపోయారు. అబ్బాయి, అమ్మాయిల పెళ్ళిళ్లు జరిగాయి.రాఘవరావు రిటైర్ అయ్యాడు.భార్యాభర్తలు స్వంతగూటిలో మిగిలారు.ఒకప్పుడు చేతినిండా పని... క్షణం తీరికలేని జీవితం...ఇప్పుడు కావలసినంత తీరుబడి... ఇద్దరికి వండుకోవడం... పుస్తకాలు చదవడం...స్నానం చేస్తూ పన్నెండేళ్ళ జీవిత గమనంలో వచ్చిన మార్పుల్ని తలచుకుంటూంటే అయినవాళ్ళు గుర్తుకొచ్చి దుఃఖం పొంగిపొరలి కన్నీటి వరద గోదావరిలో కలిసింది.స్నానం చేసి గట్టుమీద నిలుచున్న గౌతమికి గలగల పారుతున్న గోదావరి మాత్రమే నిత్య సత్యమని తోచింది.‘‘ఒకతరం జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఆదరించిన అత్తమామలు, పెద్దమ్మలు, పెదనాన్నలు... గురువులు... పెద్దలు... ఒక్కొక్కరిగా ఒరిగిపోతూ... కళ్ళముందే కాలగర్భంలో కలుస్తూంటే పదిరోజుల పరితాపంలో జీవితం భ్రమ అనే సత్యం బోధపడుతుంది. అంతలోనే మరోతరం... కూతుళ్ళు, కొడుకులు, మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు, చిన్నారులు అనురాగం కురిపిస్తూ అలరిస్తూంటే జీవితం సత్యమనే భ్రమలో మునిగిపోతాం’’ అంది గౌతమి.భార్య బాధపడుతోందని తెలుసుకుని ఆమెని అనునయించాడు భర్త.‘‘కాలగమనం ఆగదు... పరుగెడుతూనే ఉంటుంది. తరాలు మారుతూనే ఉంటాయి. భావాలు, భావోద్వేగాలు, సుఖాలు, దుఃఖాలు, కోపాలు, రోషాల మధ్య కొట్టుమిట్టాడే మనిషి బంధాలు అనుబంధాలు పెనవేసుకుని జీవితంపై మమకారంతో బతుకుతాడు. జీవితం క్షణభంగురమని తెలిసీ చిరంజీవి కావాలనుకుంటాడు. వయసు పెరుగుతూంటే జీవితమే మనిషికి పాఠాలు నేర్పుతుంది గౌతమీ. మనం మన తల్లిదండ్రుల్ని గౌరవించాం. మన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి, మంచి పౌరులుగా తీర్చిదిద్దాం. మన బాధ్యతలు మనం సక్రమంగా నెరవేర్చామన్న తృప్తితో శేషజీవితాన్ని భగవధ్యానంలో గడిపేద్దాం’’ తత్వబోధ చేశాడు రాఘవరావు. ఆనాటి సన్నివేశం కళ్ళకు కట్టినట్లయింది గౌతమికి. నిడదవోలు వచ్చిందని పై బెర్తు మీద యువతి దిగి వెళ్ళిపోయింది.ఇంకో గంటలో రాజమండ్రిలో ఉంటాననుకుంటూ సర్దుకుకూర్చుంది గౌతమి.క్రితంసారి పుష్కరాలకు కొడుకు, కోడలు, మనుమలతో రాజమండ్రి వచ్చిననాటి సంగతి గుర్తుకు తెచ్చుకుంది.ఇరవైఏళ్ళ మనవరాలు నదిలో స్నానం చేసి వస్తుంటే తనే నడచి వస్తున్నట్లు ఫీలయింది గట్టుమీద నించున్న గౌతమి.మనవరాలు అచ్చు తన పోలికే.‘‘మా అమ్మాయిలో నాకు అమ్మ కనిపిస్తుంది’’ అన్నాడు శ్రీహర్ష.‘‘ఆరోజుల్లో అందరూ నన్ను అమ్మలా వున్నాననే వారు... ఇప్పుడు మనవరాలు నా పోలిక... జీన్స్ ప్రభావం... వారసత్వం వెన్నంటే వుంటుంది’’ గర్వంగా చూసింది గౌతమి.‘‘మనకి వయసయిపోతోంది. మళ్ళీ పుష్కరాలకి ఉంటామో... ఉండమో... పద... తనివితీరా స్నానం చేద్దాం’’ అన్న భర్త మాటలకు ఉలిక్కిపడింది గౌతమి.‘‘ఛ... అవేం మాటలండీ...’’ అంటూనే భర్త చేయిపట్టుకుని నదిలోకి దిగింది.తథాస్తు దేవతలుంటారు కాబోలు...అదే భర్తతో ఆఖరి పుష్కరస్నానం...ఆ పుష్కరాల నుండి వచ్చిన నాలుగేళ్లకి భర్త కాలంచేశాడు.భర్త చనిపోయాక కాకినాడలో ఇల్లు అమ్మేసి హైదరాబాదులో కొడుకు పంచన చేరింది గౌతమి. ఆనాటి సంఘటనలన్నీ ఒకదాని వెంట ఒకటిగా గౌతమికి కనులముందు కదలాడాయి. గోదావరి వంతెనపై రైలు నడుస్తున్న శబ్దం ఆమె కర్ణపుటాలకు తాకింది. ఆలోచనల్లోంచి తేరుకుని, కిటికీ తెర తొలగించి గోదావరమ్మకు నమస్కరించింది.‘నదిలో స్నానం చేస్తూంటే అమ్మ ఒడిలో ఉన్నంత హాయి’ అనుకుంది. నదీమతల్లితో పెనవేసుకున్న అనుబంధం మనసును తడిమింది.ఉదయభానుడు ఉత్సాహంగా తొంగిచూస్తున్నాడు.రాజమండ్రి స్టేషన్లో బండి ఆగుతూంటే... బ్యాగ్ తీసుకుని గుమ్మం దగ్గరకు చేరుకుంది గౌతమి.బోగీ దగ్గరే నించున్నాడు రామం.బ్యాగ్ అందుకుని చేయి అందించి గౌతమికి రైలు దిగడంలో సహాయం చేశాడు.‘‘ప్రయాణం బాగా జరిగిందా అత్తయ్యా... రాత్రి నిద్రపట్టిందా...’’ అడిగాడు రామం ముందుకు అడుగులేస్తూ.‘‘ఓ నిక్షేపంగా...’’ నవ్వుతూ బదులిచ్చింది గౌతమి.‘‘నడవగలవా... వీల్‌చైర్æమాట్లాడనా...’’ అడిగాడు మళ్ళీ.‘‘భగవంతుని దయవలన అనారోగ్యమేమీ లేదురా... నీ స్పీడు అందుకోలేకపోయినా నెమ్మదిగా నడవగల ఓపిక వుంది. అందరూ కులాసాయే కదా’’ అడిగింది గౌతమి. యోగక్షేమాలు మాట్లాడుకుంటూ ఆటోస్టాండ్ చేరారిద్దరూ.గౌతమిని సాదరంగా ఆహ్వానించింది సునీత, రామం భార్య.‘‘ఈరోజు విశ్రాంతి తీసుకో. రేపు తెల్లవారు జామునే గోదావరి స్నానానికి వెడదాం.’’ అన్నాడు రామం.‘‘ఈ గోదావరి పుష్కరాలు మహా పుష్కరాలుట. నూట నలభై నాలుగు సంవత్సరాలకోసారి ఇలాంటి మహత్తర పుష్కరాలొస్తాయట. మన జీవితకాలంలో రావడం మన అదృష్టం. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో పుష్కరస్నానం చేయాలని నా కోరిక’’ సునీత తెచ్చిన కాఫీకప్పు అందుకుంటూ చెప్పింది గౌతమి.‘‘అలాగే అత్తయ్యా... నేను తీసుకువెళ్ళి స్నానం చేయిస్తాగా. నాలుగురోజులు మా ఇంట్లో ఉంచమని చెపితే వినకుండా శ్రీహర్ష రేపు రాత్రికే రిజర్వేషన్ చేయించేశారు. నాలుగు రోజులు మా ఇంట్లో ఉండొచ్చు కదా...’’ అడిగాడు రామం.‘‘శ్రీహర్ష నన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు. అతికష్టం మీద వాడిని ఒప్పించి బయలుదేరాను’’ అంటూ స్నానానికి లేచింది గౌతమి. తెల్లవారుజామునే పుష్కరఘాట్ చేరుకున్నారు రామం, గౌతమి. గౌతమి చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు రామం. గేటు మూసివుంది. ఘాట్‌లోకి ఎవరినీ వెళ్ళనీయడంలేదు. ముఖ్యమంత్రిగారి స్నానం, పూజలు అయ్యాక యాత్రికుల్ని పంపుతారని చెప్పుకుంటున్నారు.అక్కడున్న చిన్నగుంపు మధ్య నిలబడ్డారు రామం, గౌతమి. జనం నెమ్మదిగా చేరుతున్నారు. రెండు గంటల సమయం గడిచింది. జనం పోటెత్తారు. ముందుకీ వెనక్కీ కదలలేని పరిస్థితి. గౌతమికి అంతసేపు నిలబడ్డం వల్ల ప్రయాసగా ఉంది. రామం వెనక్కు వెళ్ళిపోదామన్నాడు. వెనక్కి తిరిగిచూస్తే వెళ్ళడం చాలా కష్టమనిపించి ఆగారు. ఇంతలో గేట్లు తెరుస్తున్నారని అరిచారు. అంతే. ఒక్కసారి తోపులాట మొదలైంది. ఎవరో వెనక్కు నెట్టారు. తోపులాటలో రామం, గౌతమి విడిపోయారు. వెనుకనుండి ముందుకు, ముందునుంచి వెనుకకు నెట్టబడిబ్యాలెన్స్ తప్పి కూలబడింది గౌతమి. ఎనభైనాలుగేళ్ళ వృద్ధురాలికి కళ్ళు తిరిగినట్లయి ఆయాసం మొదలైంది. పక్కవారిని గమనించే స్థితిలో ఎవరూ లేరు. ఉరుకులు... పరుగులు... గౌతమి మీద ఎవరిదో కాలు పడింది.‘అమ్మా’ అన్న ఆర్తనాదం గాలిలో కలిసిపోయింది.గౌతమి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిశాయి. వేదంలా ఘోషిస్తూ గోదావరి గంభీరంగా ప్రవహిస్తోంది. -
గౌతమికి బాకీ లేదు
తమిళసినిమా: కమలహాసన్పై ఆరోపణలకు తన వద్ద ఆధారాలున్నాయని నటి గౌతమి అన్నారు. మూడు రోజుల క్రితం కమలహాసన్ చిత్రాలకు పనిచేసినందుకు గానూ తనకు ఆయన పారితోషికం చెల్లించలేదంటూ పలు ఆరోపణలను గుప్పించిన గౌతమి మంగళవారం మరోసారి ఆయనపై ధ్వజమెత్తారు. గౌతమి తన ట్విట్టర్లో పేర్కొంటూ తాను ఇంతకు ముందు రాసిన పాస్ట్ ఈజ్ పాస్ట్ లేఖలో నటుడు కమలహాసన్ నుంచి తాను ఏ విధంగానూ, ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించలేదన్నానని, తాను ఆయన పార్టీలో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఖండించానన్నారు. తాను కమలహాసన్ చిత్రాలకు పని చేసిన దానికి పారితోషికం అడిగానని, తన ఆరోపణలకు తన వద్ద ఆధారాలున్నాయని అన్నారు. అయితే వాటికి తారుమారుగా ప్రచారం జరగడం తనను తీవ్రంగా బాధించిందన్నారు. తన నిర్ణయాలను మార్చుకోకపోవడానికి ఒక తల్లిగా కొత్త జీవితాన్ని సాగించడానికి, సురక్షితమైన భవిష్యత్ కోసం ఒంటరి పోరాటం చేస్తున్నానని చెప్పారు. జీవితంలో ఎన్నో నిజాయితీతో కూడిన సంతోషాన్ని కలిగించే మార్గాలు ఉన్నాయని, మంచి, మానవత్వం కలిగిన మనుషులు ఈ ప్రపంచంలో ఉన్నారని, వారితో కలిసి సమాజ సేవకు ఉపక్రమించాలని కోరుకుంటున్నానన్నారు. జీవితంలో చెడు సంఘటనలు అనేవి అందరి జీవితంలోనూ జరుగుతుంటాయని, అయితే అది మనం ఎంచుకునే మార్గాన్ని బట్టి ఉంటుందని పేర్కొన్నారు. ప్రకాశవంతమైన జీవితం కోసం కొన్ని సవాళ్లను నిజాయితీగా ఎదుర్కొనాలని అన్నారు. తానిప్పుడు అదే చేస్తున్నానని చెప్పారు. 20 ఏళ్లుగా తన జీవితంలో అన్నీ ఎదుర్కొన్నానని, ఇప్పుడు నిజాయతీతో కూడిన ప్రశాంత జీవితాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నానని గౌతమి పేర్కొన్నారు. గౌతమికి బాకీ లేదు: నటి గౌతమి ఆరోపణలకు స్పందించిన కమలహాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్వాహకులు ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో దశావతారం చిత్రాన్ని నిర్మించిన ఆస్కార్ సంస్థకు, విశ్వరూపం చిత్రాన్ని చేసిన పీవీపీ సంస్థకు సంబంధించిన ఆర్థికపరమైన సమస్య రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ సంస్థ ఎలా బాధ్యత అవుతుందని ప్రశ్నించారు. రాజ్‌కమల్ సంస్థకు సంబంధించి గౌతమికి ఎలాంటి బాకీ లేదని, అందుకు ఆధారాలు చూపితే ఆమె పారితోషికాన్ని చెల్లించడానికి సిద్ధం అని పేర్కొన్నారు. -
రైలు కిందపడి చస్తాను కాని..
సాక్షి, హైదరాబాద్: ‘అవసరమైతే రైలు కిందపడి చస్తాను కాని నీ దగ్గరకు మాత్రం తిరిగి రాను’ .. సీనియర్ నటి ఖుష్బూ నోటి నుంచి ఒకప్పుడు వెలువడిన మాటలివి. నిజజీవితంలో కన్నతండ్రితోనే ఈ మాటలు అన్నట్టు ఆమె స్వయంగా వెల్లడించారు. తాను ఎందుకు ఈ మాటలు అనాల్సివచ్చిందో ఇండియాటుడే సౌత్ కాంక్లేవ్ 2018లో వివరించారు. ‘వుమెన్ పబ్లిక్ లైఫ్: ది పర్సనల్ ఈజ్ పొలిటిక్’ పేరుతో జరిగిన సెషన్లో గౌతమి, కాజల్, తాప్సితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన తండ్రి పెట్టే వేధింపులు భరించలేక చిన్నతనంలోనే ఇంటి నుంచి బయటకు వచ్చేశానని వెల్లడించారు. ‘మా నాన్నకు వ్యతిరేకంగా గొంతు విప్పాలన్న ఉద్దేశంతో చిన్న వయసులోనే ఆయనపై తిరుగుబాటు చేశాను. మా అమ్మ, సోదరులను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. మా నాన్న ఆడవాళ్లను చులకనగా చూసేవాడు. అసభ్యంగా మాట్లాడేవాడు. నేను ఇంటి నుంచి వెళ్లిపోయిన రోజు నాకింకా గుర్తుంది. అది 1986, సెప్టెంబర్ 12. తనను కాదని బయటకు వెళ్లి బతకలేమని, మళ్లీ తన దగ్గరకు వచ్చి ప్రాధేయపడాల్సి వస్తుందని మా నాన్న అన్నాడు. అప్పుడు ఆయనతో ఒకటే చెప్పాను. అలాంటి పరిస్థితే వస్తే నా సోదరులు, అమ్మను చంపేసి రన్నింగ్ ట్రైన్ ముందు దూకి చస్తాను గాని, నీ దగ్గరకు మాత్రం తిరిగిరానని చెప్పినట్టు’ వెల్లడించారు. చిన్నతనంలోనే తెగువ చూపించిన ఖుష్బూ మూడు దశాబ్దాలుగా సినిమా రంగంలో కొనసాగుతున్నారు. ఇన్నేళ్లలో మళ్లీ తండ్రిని ఆమె కలవలేదు. ‘మా నాన్నను మళ్లీ చూడటం నాకు ఇష్టం లేద’ని స్పష్టం చేశారు. -
నేను ప్రాణాలతో ఉన్నానంటే అదే కారణం..
సాక్షి, హైదరాబాద్ : ‘నేను ఈ రోజు ప్రాణాలతో ఇక్కడ ఉన్నానంటే అందుకు కారణం నా ధైర్యమే.. బ్రెస్ట్ క్యాన్సర్‌కు ఇప్పుడు మంచి చికిత్స అందుబాటులోకి వచ్చింది. ధైర్యంగా సరైన చికిత్స తీసుకుంటే నయమవుతుంది. గతంలో మాదిరిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని’ సినీనటి గౌతమి అన్నారు. లైఫ్ అగెయిన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జలవిహార్ నుంచి పీపుల్స్ ప్లాజా వరకు విన్నర్స్ వాక్ సందడిగా సాగింది. బ్రెస్ట్ కేన్సర్‌ను ఎదిరించి విజయం సాధించిన సినీనటి గౌతమి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు సినీనటులతో పాటు కేన్సర్‌ను జయించిన వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. తగిన చికిత్స చేయించుకుంటే నయమవుతుందని సీనియర్ నటి జయసుధ పేర్కొన్నారు. బ్రెస్ట్ కేన్సర్ బాధితులు భయంతో వెనుకడుగు వేయకుండా ధైర్యంతో ముందుకు సాగాలని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సూచించారు. మువీ ఆర్టిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు శివాజి రాజా, జనరల్ సెక్రటరీ నరేష్, ముమైత్‌ఖాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
గౌతమి సందడి
-
బాసూ... మెమరీ లాసు!
గుర్తుండటం లేదు... గౌతమికి ఏమీ గుర్తుండటం లేదు. ఏయే పనులు చేశారో ఆమెకు గుర్తుండటం లేదు. అంతా మర్చిపోతున్నారు. మైండ్‌లో ఏ డేటా సరిగా స్టోర్ కావడం లేదు. గౌతమికి మెమరీ లాస్ జబ్బు వచ్చేసిందట. అల్జీమర్స్ అంటారు కదా... ఆ జబ్బే! అయితే, చుట్టుపక్కల వారికి ఈ సంగతి తెలియదు. ఇదంతా రియల్ లైఫ్‌లో కాదు... రీల్ లైఫ్‌లో. కుక్కు సురేంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మలయాళ సినిమా ‘ఈ’లో అల్జీమర్స్ జబ్బుతో బాధపడుతున్న మ్యూజిక్ టీచర్‌గా గౌతమి నటిస్తున్నారు. -
టాలీవుడ్ వైపు గౌతమి చూపు
దయామయుడు తెలుగు చిత్రంతో నటిగా వెండితెరకు పరిచయమైన అలనాటి అందాల తార గౌతమి. ఆ తర్వాత ఆమె తెలుగు, తమిళం, మలయాళం అంటూ పలు భాషల్లో హీరోయిన్గా నటించింది. అనంతరం సినిమాలకు దూరమైన గౌతమి లోకనాయకుడు కమల్ హాసన్‌తో కలిసి జీవించింది. ఆ సమయంలో ఒకటి రెండు సినిమాల్లో నటించింది. అయితే 13 ఏళ్లు కమల్‌హాసన్‌తో కలిసి జీవించిన గౌతమి ఆయన నుంచి విడిపోయిన తర్వాత సినిమాలపై పూర్తి దృష్టి సారించింది. ప్రస్తుతం ఆమె విశ్వాసపూర్వం, మన్సూర్, ఈ వంటి మలయాళ చిత్రాల్లో నటిస్తోంది. తాజా సమాచారం ఏమిటంటే ఇప్పుడు గౌతమి చూపు టాలీవుడ్‌పై పడింది. ఆమె తెలుగులో అధిక చిత్రాల్లో నటించాలని నిర్ణయించుకుంది. మాతృ భాష తెలుగులో నటించడం కోసం పలువురు దర్శకుల వద్ద కథలు వింటోంది. అదే సమయంలో ఇతర భాషల్లో కూడా మంచి పాత్రల్లో నటించడానికి ఆసక్తి చూపుతోంది. మరి తెలుగు సినీ పరిశ్రమ ఆమెను ఆహ్వానిస్తుందో? లేదో? వేచి చూడాలి. -
యాక్సిడెంటా?హత్యా ?
-
ఓపీఎస్‌కు వెల్లువెత్తిన 'సినీ' మద్దతు!
చెన్నై: బలపరీక్షలో ఓడిపోయినప్పటికీ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి సినీ ప్రముఖుల నుంచి మద్దతు వెల్లువెత్తడం గమనార్హం. బలపరీక్షను తీవ్రంగా తప్పుబట్టిన ప్రముఖ సినీ నటి గౌతమి నేరుగా ఓపీఎస్‌కు మద్దతు ప్రకటించారు. బలపరీక్షలో గెలిచిన శశికళ నమ్మినబంటు పళనిస్వామి బృందాన్ని ఖండించారు. 'అంకెల గారడీ' ద్వారా ప్రజాస్వామ్యాన్ని వంచించలేరని, ఇది ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజాస్వామ్యం కొనసాగుతుందని ఆమె ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాడాపాండి.. ముఖ్యమంత్రి ఓపీఎస్సే కావాలంటూ ఆమె యాష్‌ట్యాగ్ జోడించారు. Democracy can't be manipulated by "Number Games" It's the VOICE OF the PEOPLE. BY the PEOPLE. FOR the PEOPLE #SaveDemocracy #OPSForCM — Gautami (@gautamitads) 16 February 2017 ఇక సీనియర్ నటుడు కమల్ హాసన్ కూడా పరోక్షంగా పన్నీర్ సెల్వానికి మద్దతు పలికారు. బలపరీక్ష జరిగిన తీరును వ్యంగ్యంగా ఎండగట్టిన ఆయన.. బలపరీక్షపై గవర్నర్‌కు తమ గళాన్ని వినిపిస్తూ ఈమెయిళ్లు పంపించాలని, ఈ మెయిళ్లలో హుందాగా, అసభ్యత లేకుండా చక్కని భాషతో తమ అభిప్రాయాన్ని తెలియజేయాలంటూ.. గవర్నర్ ఈమెయిల్ ఐడీ (Rajbhavantamilnadu@gmail.com) ట్వీట్ చేశారు. ఇక మరో నటుడు అరవింద స్వామి అయితే.. ఏకంగా మరోసారి ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రీ ఎలక్షన్ ఒక్కటే మార్గమని, బలపరీక్ష ప్రజాతీర్పును ప్రతిఫలించడం లేదని పేర్కొన్నారు. In my opinion, The only solution that is acceptable under the circumstances is a re- election. This is not the people's mandate. — arvind swami (@thearvindswami) 18 February 2017 Rajbhavantamilnadu@gmail.com ங்கற விலாசத்துக்கு நம் மன உளைச்சலை மின் அஞ்சலா அனுப்புங்க. மரியாதையா பேசணும் அது அசம்பளியில்ல Governor வீடு — Kamal Haasan (@ikamalhaasan) 18 February 2017 -
ఇక శశికళ రూటు అదే: నటి గౌతమి
-
ఇక శశికళ రూటు అదే: నటి గౌతమి
చెన్నై: జయలలిత మృతిపై విచారణ జరగాలని డిమాండ్ చేస్తూ, శశికళపై విమర్శలు చేస్తూ వస్తున్న సినీ నటి గౌతమి.. సుప్రీం కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. శశికళ కువతూర్ నుంచి నేరుగా బెంగళూరులోని పరపణ అగ్రహార జైలుకు వెళ్లకతప్పదని అన్నారు. జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ వేదనిలయానికి వెళ్లే నైతిక అర్హత శశికళకు లేదని ట్వీట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళను సుప్రీం కోర్టు దోషిగా ప్రకటిస్తూ నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పు వెలువడిన సమయంలో శశికళ కువతూర్ సమీపంలోని గోల్డెన్ బే రిసార్ట్‌లో ఎమ్మెల్యేలతో కలసి ఉన్నారు. కోర్టు తీర్పును గౌతమి స్వాగతిస్తూ ట్విట్టర్ ద్వారా స్పందించారు. అవినీతి కేసులో శశికళను దోషీగా నిర్ధారించారని పేర్కొంటూ, అమ్మ మృతిపై ఆమె సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రెండు కేసులను వేరుగా పరిగణించాలని ట్వీట్ చేశారు. జయలలిత చికిత్స, మరణంపై సందేహాలు వ్యక్తం చేసిన గౌతమి ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీకి సైతం రెండు సార్లు లేఖలు రాశారు. అమ్మకు న్యాయం చేయాలని పలు వేదికలపై డిమాండ్ చేశారు. అలాగే శశికళకకు వ్యతిరేకంగా, పన్నీరు సెల్వంకు మద్దతుగా గౌతమి గళం విప్పారు. శశికళ ఇదే కేసులో గతంలో పరపణ అగ్రహార జైల్లో 6 నెలలు ఉన్నారు. #sasikala has direct route from #koovathur to #ParapanaAgrahara She has NO moral right to #VedaNilayam #JusticeForAmma — Gautami (@gautamitads) 14 February 2017 #sasikala has been convicted for corruption. She has to answer for #Amma death also Both cases don't carry equal sentencing #JusticeForAmma — Gautami (@gautamitads) 14 February 2017 శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం అమ్మ చివరి మాట కోసం పోరాటం! గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూపులు! ఫుల్ జోష్‌గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం? -
కమల్ టు ఖుష్బూ! సినీ 'పన్నీర్' జల్లు!!
-
‘శశికళ సీఎం అవుతారని అనుకోను’
చెన్నై: జయలలితకు శశికళ నటరాజన్ నిజమైన వారసురాలు కాదని సినీ నటి గౌతమి అన్నారు. ‘చిన్నమ్మ’ ముఖ్యమంత్రి అవుతుందని తాను అనుకోవడం లేదని ‘సాక్షి’ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. తమిళనాడు రాజకీయాలను చూస్తే బాధ కలుగుతోందని వ్యాఖ్యానించారు. జయలలితకు నిజమైన వారసుడు పన్నీర్ సెల్వం అని పేర్కొన్నారు. తన వారసులు ఆయననే అని ‘అమ్మ’ చాలాసార్లు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒక్కసారి కూడా ఆయనను ‘అమ్మ’ దూరం పెట్టలేదన్నారు. పన్నీర్ సెల్వం ఎంతో విధేయతగా ఉన్నారని, ఆయనను కాదని సీఎం పదవిని వేరొకరికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. శశికళ చాలా విషయాలు బయటకు తెలియనివ్వలేదని ఆరోపించారు. పన్నీర్ సెల్వం మంచి పాలన అందించగలరన్న నమ్మకాన్ని గౌతమి వ్యక్తం చేశారు. -
కమల్ టు ఖుష్బూ! సినీ 'పన్నీర్' జల్లు!!
జయలలిత మృతిపై, తన రాజీనామాపై తొలిసారి పెదవివిప్పిన తమిళనాడు ఆపద్ధర్మ సీఎం ఓ. పన్నీర్ సెల్వంపై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. తొలిసారి ధైర్యంగా మాట్లాడి.. మనస్సులో మాటలో బయటపెట్టినందుకు, వెన్నుముక కలిగిన నేతగా నిరూపించుకున్నందుకు ఆయనను కొనియాడారు. కమల్ హాసన్, అరవింద స్వామి, ఖుష్బూ, గౌతమి తదితరులు పన్నీర్ సెల్వాన్ని ప్రశంసించారు. మంగళవారం మెరీనా బీచ్‌లో అమ్మ సమాధి వద్ద దీక్ష అనంతరం ఆయన శశికళకు వ్యతిరేకంగా మాట్లాడిన తీరును కొనియాడారు. వారు ఏమన్నారంటే.. కమల్ హాసన్: తమిళనాడు ప్రజలారా త్వరగా పడుకోండి. రేపు వాళ్లు మనకంటే ముందే నిద్రలేస్తారు. గుడ్‌నైట్. సిద్ధార్థ: మెరీనాలో ఓపీఎస్. తమిళనాడు రాజకీయాలు గేమ్ ఆఫ్ థోర్న్స్, హౌస్ ఆఫ్ కార్డ్స్ (హాలీవుడ్ మూవీ)ను తలపిస్తున్నాయి. ఆర్య: సరైన సమయంలో ఓపీఎస్ సర్ గొప్పగా, ధైర్యంగా మాట్లాడారు. ఆయనకు నా హాట్సాప్. అరవింద స్వామి: బటానీలు తింటూ న్యూస్ చూస్తున్నా. హుప్స్ (ఓపీఎస్) ఒకటి పగిలింది. ఇక పాప్‌కార్న్ తింటాను గౌతమి: అందుకే అమ్మ ఓపీఎస్‌ను ఎంచుకున్నారు. అంతరాత్మ మేరకు నడుచుకునే ధైర్యం ఆయనకు ఉంది. ఇది తమిళనాడుకు, అమ్మకు న్యాయం చేయడమే. (ప్రధాని నరేంద్రమోదీకి ట్యాగ్ చేశారు) ఖుష్బూ: ఓపీఎస్ మౌనాన్ని వీడారు. ఒక హీరోగా ముందుకొచ్చారు. డ్రామా ఇప్పుడే మొదలైంది. దేశ రాజధానికి చెందిన 56 ఇంచుల ఛాతి ఉన్న నాయకుడి తరఫున ఓపీఎస్ పనిచేయడం లేదని నేను ఆశిస్తున్నా. -
ప్రధానికి నటి గౌతమి మరో లేఖ
తమిళ సినిమా(చెన్నై): జయలలిత మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సినీ నటి గౌతమి ప్రధాని మోదీకి ఆదివారం మరో లేఖ రాశారు. జయలలితకు అందించిన చికిత్సపై సందేహాలను తాను పేర్కొన్న విధంగానే చాలామంది ప్రశ్ని స్తున్నారని లేఖలో ఆమె పేర్కొన్నారు. దీనికి సమాధానం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. (జయలలితకీ, గౌతమికీ కనెక్షన్ ఏంటి?) సమాధానాన్ని మోదీ నుంచి తాను సైతం ఆశిస్తున్నానని పేర్కొన్నారు. గౌతమి ఇటీవల మోదీకి లేఖ రాయడంతో ఆమెపై అన్నాడీఎంకే నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. అయినప్పటికీ తన భావాలను సమర్థించుకుంటూ గౌతమి మరో లేఖను ప్రధానికి రాశారు. (ఇరకాటంలో గౌతమి) -
ఇరకాటంలో గౌతమి
• ఎదురుదాడిలో అన్నాడీఎంకే • కుట్ర సాగుతున్నదని ఆగ్రహం • అమ్ముడుపోయారని ఆరోపణలు సాక్షి, చెన్నై: దివంగత సీఎం జయలలిత మరణంపై అనుమానాలు వ్యక్తం చేసిన సినీ నటి గౌతమిని ఇరకాటంలో పెట్టే రీతిలో ఎదురుదాడిలో అన్నాడీఎంకే వర్గాలు నిమగ్నం అయ్యాయి. అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా కుట్ర సాగుతున్నదని, ఇందులో భాగంగానే కుట్రదారులకు గౌతమి అమ్ముడుపోయారంటూ ఆరోపణల్ని సంధించే పనిలో పడ్డారు. అందరి అమ్మ జయలలిత భౌతికంగా అందర్నీ వీడినా, ఆమెను, ఆమె సేవలు, పథకాలను ప్రజాహృద యం నుంచి ఎవరూ తొలగించలేరు. తమ కుటుంబంలో ఓ పెద్దగా అమ్మ పేరును స్మరించే వాళ్లు కోట్లల్లో ఉన్నా రు. ఆ అమ్మ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఈ కోట్ల గుండెలు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావమ్మా..? అని మొక్కని దే వుళ్లంటూ లేరు. అమ్మ ఆరోగ్యంగా ఉన్నారని, త్వరలో త మ ముందుకు వచ్చేస్తారని ఎదురుచూసి, చివరకు గుండె లు బరువెక్కాయి. అమ్మ మరణ సమాచారం శోక సంద్రం లో ముంచింది. భౌతికంగా అమ్మ అందర్నీ వీడి వారం రోజులు కావస్తున్నది. ఈ సమయంలో శుక్రవారం నటి గౌతమి వ్యాఖ్యలు అన్నాడీఎంకే వర్గాల్ని ఆందోళనలో పడేశాయి. అమ్మ ఆరోగ్యంగా ఉన్నారని, వచ్చేస్తున్నారని, ఆందోళన వద్దని పదే పదే భరోసా ఇచ్చి, చివరకు అమ్మ లేదన్న సమాచారం ప్రజల్లోకి పంపడాన్ని ఎత్తి చూపుతూ, ప్రధాని నరేంద్ర మోదీకి గౌతమి లేఖ రాసిన విషయం తె లిసిందే. అమ్మ మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, గోప్యం ఎందుకో అని, ప్రజాగుండెల్లో మెదులుతున్న అ నుమానాలకు సమాధానం ఇవ్వాలంటూ ఎంతో ధైర్యంగా ఆమె ప్రశ్నించారు. అయితే, ఆ ప్రశ్నలకు సమాధానంగా అన్నాడీఎంకే వర్గాలు ఎదురుదాడికి దిగే పనిలో పడ్డాయి. గౌతమిని ఇరకాటంలో పెట్టే రీతిలో వ్యాఖ్యల తూటాల్ని సంధించే పనిలో పడ్డారు. ఎదురుదాడి: గౌతమి సంధించిన ప్రశ్నలను ఎత్తి చూపుతూ అన్నాడీఎంకే వర్గాలు ఎదురుదాడికి దిగడమే కాకుండా, పార్టీలో ప్రకంపనలకు సాగుతున్న కుట్రకు గౌతమి సహకరిస్తున్నట్టుగా, అమ్ముడుపోయినట్టుగా ఆరోపణలుగుప్పించే పనిలో పడ్డారు. అన్నాడీఎంకే అధికార ప్రతినిధి నాంజిల్ సంపత్ మీడియాతో మాట్లాడుతూ, గౌతమి ప్రశ్నల్ని తీవ్రంగానే ఖండించారు. ప్రపం చ స్థాయి వైద్యాన్ని అమ్మకు వైద్యులు అందించారన్న విషయాన్ని గుర్తెరగాలని సూచించారు. అమ్మ అనుమతి ఇస్తేనే, ఇతరులు లోనికి వెళ్లగలరన్న విషయాన్నీ గౌతమి పరిగణించాలని హితవు పలికారు. హద్దులు మీరి వ్యాఖ్యలు సంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, పార్టీలో చీలిక లక్ష్యంగా సాగుతున్న కుట్రలో భాగంగానే గౌతమి ప్రశ్నలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కుట్రకు ఆమె అమ్ముడు పోయారేమోనని ఆరోపించారు. మరో అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి పేర్కొంటూ, అన్నాడీఎంకే వర్గాలు తప్పుడు సమాచారాలను ప్రజల్లోకి తీసుకెళ్లినట్టుగా గౌతమి అనుమానాలు వ్యక్తం చేస్తుండటం శోచనీయమని విమర్శించారు. తామే కాదు, జాతీయ స్థాయిలోని వివిధ పార్టీల నాయకులు అమ్మను పరామర్శించేందుకు వచ్చి, ఆమె ఆరోగ్యంగా ఉన్నారని మీడియా ముందు వ్యాఖ్యలు చేసి వెళ్లిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలని హితవు పలికారు. అర్థరహిత అనుమానాలను మానుకుంటే మంచిదని హెచ్చరించారు. ఇక, ఆ పార్టీ మరో అధికార ప్రతినిధి దీరన్, మాజీ మంత్రి వలర్మతి, సీనియర్ నేత బన్రూటి రామచంద్రన్ తదితరులు గౌతమి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ, ఎదురు దాడికి దిగడం గమనార్హం. ఇక, అన్నాడీఎంకే వర్గాలు గౌతిమి మీద ఎదురుదాడికి దిగితే, ఆమె వ్యాఖ్యలను నటుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ శేఖర్ సమర్థించడం విశేషం. ప్రజల మదిలో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నాడీఎంకే వర్గాలకు హితబోధ చేసే పనిలో పడ్డారు. అంత మర్యాద ఎందుకో: దివంగత సీఎం జయలలిత మరణంపై గౌతమి అనుమానాలను వ్యక్తం చేస్తే, నెచ్చెలి శశికళకు ఎందుకు అంత ప్రాధాన్యతో అంటూ పీఎంకే నేత రాందాసు పెదవి విప్పే పనిలో పడ్డారు. సీఎం పన్నీరు సెల్వంతో పాటుగా అధికార వర్గాలు శశికళ చుట్టూ ఎందుకు ప్రదక్షిణ చేస్తున్నారో అని ప్రశ్నించారు. ఏ పదవిలోనూ లేని ఆమెకు ఎందుకు ఇంత ప్రాధాన్యతను ఇస్తున్నారో అర్థం కావడం లేదని మండిపడ్డారు. సీఎం పన్నీరు సెల్వం ఇకనైనా ప్రజల పక్షాన నిలబడి తన బాధ్యతల్ని నిర్వర్తించే విధంగా ముందుకు సాగాలని కోరారు. అంతే గానీ, భేటీలు అంటూ తమరితో పాటుగా అధికార వర్గాలు పోయెస్ గార్డెన్వైపుగా ఉరకలు తీయడానికి ఇకనైనా స్వస్తి పలకాలని హితవు పలికారు. కాగా, చిన్నమ్మకు జిందాబాద్ అన్నట్టుగా ముందుకు సాగుతున్న అన్నాడీ ఎంకే వర్గాలు, ఇక, రాందాసు వ్యాఖ్యలపై ఏ మేరకు ఘాటుగా స్పందించబోతున్నారో వేచి చూడాల్సిందే. -
అమ్మ త్వరగా కోలుకోవాలి: గౌతమీ
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం తీవ్రవిషమంగా ఉండటంతో ఆమె త్వరగా కోలుకోవాలంటూ బాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. 68 ఏళ్ల జయలలిత కోలుకొని.. మళ్లీ తమిళనాడు ప్రజలకు తమ సేవలు అందించే చూడాలని ఆ దేవుడిని ప్రార్థించారు. ‘అమ్మ త్వరగా కోలుకోవాలని నా దైవికమైన తల్లిని ప్రార్థిస్తున్నాను. శక్తికి, దయకు మారురూపం జయలలిత’ అంటూ ప్రముఖ నటి గౌతమీ ట్వీట్ చేసింది. జయలలిత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ బాలీవుడ్ నటులు పరేశ్ రావల్, హేమామాలినీ కూడా ట్వీట్ చేశారు. అమ్మ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తూ ట్వీట్ చేసిన రిషీ కపూర్ 1974లో ఏవీఎం స్టూడియోలో ఎంజీఆర్, జయలలితను కలిసినప్పటి తన జ్ఞాపకాన్ని నెమరువేసుకున్నారు. -
కూతురి కోసం రంగంలోకి..
సీనియర్ నటి గౌతమి తన కూతురు సుబ్బలక్ష్మిని కథానాయకిగా పరిచయం చేయడానికి సిద్ధం అయ్యారా? అవుననే అంటున్నారు కోలీవుడ్ వర్గాలు. అంతే కాదు అప్పుడే అవకాశాల వేట కూడా మొదలెట్టారని సమాచారం. నటుడు కమలహాసన్‌తో 13 ఏళ్లు సహజీవనం చేసిన గౌతమి ఇటీవల అనూహ్యంగా ఆయనకు దూరమవుతున్నానంటూ చెప్పి పెద్ద సంచలనానికే దారి తీశారు. ఈ విషయం చెప్పడానికి బాధగా ఉన్నా తన కూతురు భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని వివరించారు కూడా. కాగా ఆ మధ్య ఒక భేటీలో మీ అమ్మారుుని హీరోరుున్ చేస్తారా? అన్న ప్రశ్నకు తన కూతురు ఏ రంగంలోకి రావాలనుకుంటుందో నిర్ణయాన్ని తనకే వదిలేస్తున్నానని గౌతమి బదులిచ్చారు. ఇప్పుడు గౌతమి కూతురు సుబ్బలక్ష్మికి హీరోరుున్ అవ్వాలన్న కోరిక కలిగిందట. తన ఆశను తన తల్లి గౌతమికి చెప్పగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. అంతే కాదు వెంటనే తన కూతుర్ని హీరోరుున్ చేసే పనిలో పడ్డారు. ప్రముఖ దర్శకులు, టాప్ హీరోల సరసన సుబ్బలక్ష్మిని నాయకిగా పరిచయం చేయాలని గౌతమి భావిస్తున్నారట. సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్ద కూతుర్ని పెళ్లి చేసుకున్న నటుడు ధనుష్ ఆమెను తాను హీరోగా నటించిన 3 చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయం చేశారు. అందులో కమలహసన్ పెద్ద కూతురు శ్రుతిహాసన్‌ను హీరోరుున్‌గా ఎంపిక చేసుకున్నారు. తాజాగా తన మరదలు, రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య దర్శకత్వంలో హీరోగా నటించడానికి రెడీ అవుతున్నారు. అదే విధంగా హిందీలో తాను నటించిన షమితాబ్ చిత్రంలో కమలహాసన్ రెండవ కూతురు అక్షరాహాసన్ నటిగా పరిచయం అరుున విషయం తెలిసిందే. ఈ గణాంకాలన్నీ పరిగణనలోకి తీసుకున్న గౌతమి తన కూతురికి తనతో నటించే అవకాశం కల్పించమని నటుడు ధనుష్‌ను కోరినట్లు సమాచారం. అదే విధంగా నటుడు శివకార్తికేయన్ సరసన నటింపజేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇక తనకు తెలిసిన దర్శక నిర్మాతలను కూడా అవకాశాల కోసం అడుగుతున్నట్లు సమాచారం. నిజానికి సుబ్బలక్ష్మికి ఇంతకు ముందే నటిగా అవకాశాలు వచ్చినట్టు, అరుుతే మంచి అవకాశం కోసం వేచి ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. -
మేము విడిపోవడానికి వారు కారణం కాదు
సీనియర్ నటి గౌతమి కమలహాసన్ నుంచి విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.దీంతో సుమారు 14 ఏళ్లుగా సహజీవనం చేసిన వారు ఒకరికొకరు దూరం అవడానికి కారణం ఏమిటన్న విషయం గురించి పలువురు పలు రకాలుగా చెవులు కొరుక్కుంటున్నారు.మొత్తం మీద ఈ విషయం చాలా కలకలానికే దారి తీసింది.కొందరైతే కమలహాసన్,గౌతమిలు విడిపోవడానికి నటి శ్రుతీహాసన్,అక్షరహాసన్లే కారణం అనీ,గౌతమి వారి తండ్రితో సహజీవనం చేయడం వారికి ఇష్టం లేదనే ప్రచారం హల్చల్ చేస్తోంది. ఇలాంటి ప్రచారం గౌతమి చెవిని తాకిందేమో ఇటీవల ఒక బేటీలో తాము విడిపోవడానికి కమలహాసన్ కూతుళ్లు శ్రుతీహసన్,అక్షరహాసన్‌లు కారణం కాదనీ నటి గౌతమి పేర్కొన్నారు.తాను సమాజంలో ఒక సెలబ్రిటిగా జీవిస్తున్నాననీ.అందువల్ల తన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని బహిరంగ పరచాల్సిన బాధ్యత తనపై ఉంటుందనీ అన్నారు.ఇంకా చెప్పాలంటే తన 16 ఏట నుంచే నటిగా రంగప్రవేశం చేశాననీ,సొంత ఆలోచనలు,స్వయం కృషితోనే తానీ స్థాయికి చేరుకున్నాననీ పేర్కొన్నారు. జీవితంలో మార్పు అవసరం అనీ,అయితే అలాంటప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుందనీ అన్నారు.తన కూతురు భవిష్యత్ తనకు చాలా ముఖ్యం అని అన్నారు.ఇది కూడా తాను కమలహాసన్‌కు దూరం అవడానికి కారణం అని పేర్కొన్నారు.కాగా నటి శ్రుతీహాసన్ కూడా ఇటీవల తన తండ్రి కమలహాసన్,గౌతమిలు విడిపోవడానికి తాను కారణం కాదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
అది అనాగరిక ప్రకటన: కమల్ మండిపాటు
13 ఏళ్ల అనుబంధానికి తెరదించుతూ నటి గౌతమీ కమల్ హాసన్ నుంచి వీడిపోయిన సంగతి తెలిసిందే. కమల్ నుంచి తాను వీడిపోతున్నట్టు గౌతమీ ప్రకటించగానే.. కమల్ హాసన్ పేరిట ఒక ప్రకటన వెలువడింది. దీనిని కొన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి కూడా. అయితే... ఈ ప్రకటనపై కమల్ హాసన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో తన పేరిట ప్రకటన విడుదల చేశారని, ఇది తీవ్ర అనాగరిక చర్య అని కమల్ బుధవారం ట్వీట్ చేశారు. గౌతమీతో వీడిపోతున్న విషయంలో తాను ఎలాంటి ప్రకటన చేయలేదని, ప్రస్తుతం ప్రకటన చేసే ఉద్దేశం తనకు లేదని కమల్ స్పష్టం చేశాడు. 'తనకు ఉపశమనం, ఊరట కలిగించే నిర్ణయం గౌతమి తీసుకోవడాన్ని నేను కూడా మంచిగానే భావిస్తాను. ఈ సమయంలో నా భావోద్వేగాలకు ప్రాధాన్యం లేదు. గౌతమి, సుబ్బుల సుఖసంతోషాలే నాకు ముఖ్యం. వారికి నా శుభాశీస్సులు ఉంటాయి. ఇకముందు కూడా వారికి ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటాను. ముగ్గురు కూతుళ్లు-శ్రుతి, అక్షర, సుబ్బలక్ష్మిలకు తండ్రిగా నేను ఎంతో సంతోషంగా ఉన్నా' అంటూ కమల్ హాసన్ ఒక ప్రకటన చేసినట్టు కథనాలు వచ్చాయి. కమల్ నుంచి విడిపోయానని గౌతమి ప్రకటించిన తర్వాత వచ్చిన ఈ ప్రకటన రావడంతో ఇది నిజంగా ఆయన చేసినట్టు భావించారు. అయితే, ఇది తన ప్రకటన కాదని, ఎవరో కావాలనే తన పేరిట ఈ అనాగరిక చర్యకు పాల్పడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
కమల్, గౌతమి బ్రేకప్ పై స్పందించిన శృతి హాసన్
హైదరాబాద్: కమలహాసన్, గౌతమి వీడిపోవడంపై హీరోయిన్ శృతిహాసన్ స్పందించింది. ఇది కమల్, గౌతమి వ్యక్తిగత నిర్ణయమని వ్యాఖ్యానించింది. మరొకరి వ్యక్తిగత జీవితం, నిర్ణయాలపై తానెప్పుడు మాట్లాడనని స్పష్టం చేసింది. తనకు తన తల్లిదండ్రులు, చెల్లెలే ముఖ్యమని తెలిపింది. వివాదాలను తానెప్పుడు పట్టించుకోనని కుండబద్దలు కొట్టింది. శృతిహాసన్ తల్లి సారిక నుంచి విడిపోయిన తర్వాత గౌతమితో కమల్ అనుబంధం మొదలైంది. తాను, కమల్ హాసన్ విడిపోతున్నామని నటి గౌతమి మంగళవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కమల్‌హాసన్ నటిస్తున్న సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా కొనసాగడానికి తనకు అభ్యంతరం లేదని గౌతమి చెప్పారు. కమల్ నటన అంటే తనకెంతో ఇష్టమని, ఆయన ప్రతిభ మీద తనకు అపారమైన గౌరవం ఉందని పేర్కొన్నారు. -
ఇక మా ఇద్దరి దారి వేరు
కమల్‌హాసన్ నుంచి విడిపోయిన గౌతమి కమల్‌హాసన్ వైవాహిక జీవితం విషయానికి వస్తే... 1978లో నృత్య కళాకారిణి వాణీ గణపతిని వివాహం చేసుకున్నారు. దశాబ్ద కాలం పాటు వారి వైవాహిక జీవితం సజావుగా సాగింది. ఆ తరువాత మనస్పర్ధల కారణంగా విడిపోయారు. మొదటి భార్య నుంచి విడిపోయిన కొన్నాళ్లకు బాలీవుడ్ నటి సారికను ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు కమల్. నిజానికి వీరి పెళ్లి కన్నా ముందే అంటే 1986లో శ్రుతీహాసన్ పుట్టారన్నది గమనార్హం. 1991లో ఈ దంపతులకు అక్షరా హాసన్ పుట్టారు. కాగా 2002లో విడాకులు తీసుకోవాలను కున్నారు. ఆ తర్వాత రెండేళ్లకు చట్టపరంగా విడాకులు తీసుకున్నారు. అటుపైన కొన్నాళ్లకు గౌతమితో కమల్ అనుబంధం మొదలైంది. ముఖ్యంగా ఆమెకు కేన్సర్ సోకినప్పుడు బాగా దగ్గరయ్యారు. ఆ సమయంలో కమల్ ఇచ్చిన సపోర్ట్ మరచిపోలేనిదని గతంలో ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గౌతమి పేర్కొన్నారు. గతంలో భర్త నుంచి విడాకులు... విశాఖకు చెందిన తెలుగమ్మాయి అయిన గౌతమి హీరోయిన్గా బిజీగా ఉన్నప్పుడే 1998లో వ్యాపారవేత్త సందీప్ భాటియాను వివాహం చేసుకున్నారు గౌతమి. 1999లో వారికి పాప పుట్టింది. తర్వాత మనస్పర్థల కారణంగా గౌతమి, సందీప్ భాటియా విడాకులు తీసుకున్నారు. ‘‘ఈ మాట చెప్పడానికి నా మనసు ముక్కలైనట్లుగా అనిపిస్తోంది. కానీ, చెబుతున్నా. నేనూ, మిస్టర్ హాసన్ (కమల్‌హాసన్) విడిపోయాం. ఇప్పుడు మేం కలసి ఉండటం లేదు’’ అని మంగళవారం సోషల్ మీడియా ద్వారా తన నిర్ణయం గురించి ఓపెన్‌గా ప్రకటించారు. భర్త నుంచి విడిపోయాక కొన్నేళ్లు ఒంటరిగానే ఉన్న గౌతమికి కమల్‌తో మంచి అనుబంధం ఏర్పడడం, అది సహజీవనంగా మారడం అందరికీ తెలిసిందే. దాదాపు పదమూడేళ్లుగా ఈ ఇద్దరూ కలసి ఉంటున్నారు. ఇన్నేళ్ల బంధానికి ఇప్పుడు ఫుల్స్టాప్ పెట్టేశారు. ఆ విషయం గురించి గౌతమి మాటల్లో... ‘‘నా జీవితంలో తీసుకోవాల్సి వచ్చిన అతి కఠినమైన నిర్ణయాల్లో ఇదొకటి. పదమూడేళ్ల బంధాన్ని కాదనుకోవడం అంత సులువు కాదు. ఒక బంధానికి చాలా సిన్సియర్‌గా కట్టుబడి ఉన్న నేపథ్యంలో ఇద్దరి దారులు వేరని తెలిసినప్పుడు రెండు దార్లు ఉంటాయి. ఒకటి తమ కలలలను భగ్నం చేసుకుని రాజీపడి పోయి ఉండటం, రెండోది విడిపోయి ఎవరి దారిన వాళ్లు జీవించడం. మనసు ముక్కలయ్యే ఈ నిజాన్ని జీర్ణించుకోవడానికి కొంత సమయం పట్టింది. ఇది అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం కాదు. చివరికి ఒక నిర్ణయం తీసుకునేలా చేసింది. మార్పులు అనివార్యం అందరి దగ్గర సానుభూతి సంపాదించుకోవాలన్నది నా అభిమతం కాదు. ఈ జీవిత ప్రయాణంలో మార్పు అనేది అనివార్యం అని అర్థమైంది. జీవితం ఎప్పుడూ ఒకేలా సాగదు. పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి మార్పుకీ ఓ కారణం ఉంటుంది. ఈ మార్పులు ముందుగా గ్రహించలేనివి. అయితే వీటి ప్రభావం అనుబంధాల మీద చాలానే ఉంటుంది. పదమూడేళ్ల బంధానికి ముగింపు పలకడం అనే నిర్ణయం తీసుకోవడం ఏ మహిళకైనా కష్టమే. పైగా ఇప్పుడు నేనున్న స్థితిలో చాలా కష్టం. కానీ, తప్పదు. ఎందుకంటే ముందు నేను తల్లిని. నా బిడ్డకు ‘బెస్ట్ మదర్’గా ఉండటం నా బాధ్యత. అలాగే, నేనూ ప్రశాంతంగా ఉండడం నాకు ముఖ్యం. హాసన్ అభిమానిని మిస్టర్ హాసన్‌కి నేను అభిమానిని అనే విషయం సీక్రెట్ కాదు. నేను ఇండస్ట్రీ రాక ముందు నుంచే ఆయనంటే ఇష్టం. ఆయన ప్రతిభ మీద నాకు అపారమైన గౌరవం. ఆయన ఎదుర్కొన్న ప్రతి సవాళ్లకు నేను వెన్నంటే ఉన్నాను. అవి నాకు అమూల్యమైన క్షణాలు. నేను ఆయన సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేసినప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాను. నా క్రియేషన్ ద్వారా ఆయన సినిమాలకు న్యాయం చేసినందుకు గర్వంగా ఉంది. ఆయన ఎన్నో చేశారు. కానీ, ఆడియన్స్ కోసం ఇంకా ఆయన నుంచి చాలా రావాల్సి ఉంది. ఆయన రానున్న విజయాలను చూసి, ఆనందించాలనుకుంటున్నా. అందరికీ ధన్యవాదాలు ఇప్పుడు నా జీవితంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీ (ప్రేక్షకులు) అందరితో పంచుకోవడానికి కారణం ఉంది. నేనెప్పుడూ హుందాగానే ఉన్నాను. నా స్థాయికి తగ్గట్టుగా బెస్ట్ అనేటట్లే జీవించాను. మీరందరూ నా జీవితంలో ఓ భాగం. గడచిన 29 ఏళ్లల్లో మీ ప్రేమాభిమానాలు, అండదండలు నాకు మెండుగా దక్కాయి. నా ‘పెయిన్ఫుల్ టైమ్స్’ నుంచి నేను బయటపడటానికి అవి కారణమయ్యాయి. అందుకే ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.’’ కమల్‌తో కలసి పని చేస్తా! ఇది ఇలా ఉండగా, కమల్‌హాసన్ నటిస్తున్న అన్ని చిత్రాలకూ గౌతమి కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేస్తున్నారు. ప్రస్తుతం రూపొందుతున్న ‘శభాష్ నాయుడు’కి కూడా ఆమే డిజైనర్. విడిపోతున్నప్పటికీ, ఇకపై కూడా కమల్ చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేయడం తనకు అభ్యంతరం లేదనీ, అది తన వృత్తి అనీ ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ గౌతమి స్పష్టం చేశారు. -
కమల్ హాసన్, నేను విడిపోయాం
-
ఆ వార్తలో నిజం లేదు!
‘‘మా నాన్నతో కలసి నటించే అవకాశం వస్తే అంతకన్నా సంతోషపడే విషయం మరొకటి ఉండదు’’ అని శ్రుతీహాసన్ పలు సందర్భాల్లో చెప్పారు. ‘శభాష్‌నాయుడు’ చిత్రంతో అది నెరవేరింది. కమల్ కూతురిగా ఈ చిత్రంలో శ్రుతి నటిస్తున్న విషయం తెలిసిందే. మామూలుగా కమల్‌హాసన్ నటించే అన్ని చిత్రాలకూ నటి, కమల్‌కి అత్యంత సన్నిహితురాలూ అయిన గౌతమి కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తుంటారు. ఈ చిత్రానికి కూడా ఆమె ఆ బాధ్యత నిర్వరిస్తున్నారు. కాగా, కాస్ట్యూమ్స్ విషయంలో గౌతమి-శ్రుతి మాటా మాటా అనుకున్నారనే వార్త ప్రచారంలోకొచ్చింది. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ లాస్ ఏంజిల్స్‌లో పెరిగే అమ్మాయిగా నటిస్తున్నారు. షూటింగ్ ఆరంభించక ముందు జరిగిన లుక్ టెస్ట్ కోసం గౌతమి తెచ్చిన డ్రెస్సుల్లో కొన్ని శ్రుతీకి అంత బాగా లేవనిపించాయట. మామూలుగా ఏ ఆర్టిస్ట్ అయినా తమ కాస్ట్యూమ్స్ గురించి దర్శక-నిర్మాతలు, కాస్ట్యూమ్ డిజైనర్‌తో డిస్కస్ చేస్తుంటారు. అలా ఈ చిత్రం కోసం గౌతమి కాస్ట్యూమ్స్ తెచ్చినప్పుడు బెటర్మెంట్ కోసం శ్రుతి తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారట. గౌతమి కూడా శ్రుతి అభిప్రాయాన్ని ఆమోదించి, మరికొన్ని డ్రెస్సులు తయారు చేయించారట. ఇదంతా స్నేహపూరిత వాతావరణంలో జరిగినప్పటికీ గౌతమి, శ్రుతి మాటా మాటా అనుకున్నారని ఎవరో ప్రచారం మొదలు పెట్టారు. శ్రుతీహాసన్ తన పీఆర్ (పబ్లిక్ రిలేషన్) ద్వారా ‘అదేం లేదు’ అని స్పష్టం చేశారు. గౌతమి, శ్రుతి మధ్య మంచి అనుబంధం ఉందనీ, గౌతమిని తమ కుటుంబ సభ్యులలో ఒకరిలా శ్రుతి భావిస్తారని పీఆర్ టీమ్ పేర్కొంది. వాస్తవానికి కమల్‌హాసన్-గౌతమి ఒకే ఇంట్లో కలసి ఉంటున్నప్పటికీ శ్రుతి, అక్షర ఆ విషయంలో ఫీలైన దాఖలాలు కనిపించవ్. శ్రుతి అయితే ‘మా నాన్న అభిప్రాయాలను గౌరవిస్తా’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. గౌతమితో కూడా శ్రుతి, అక్షరలకు మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో గౌతమీతో తనకు మనస్పర్థలు వచ్చాయనే వార్త శ్రుతికీ బాధ కలిగించి ఉంటుంది. అందుకే ఇది కేవలం వదంతి మాత్రమే అని ఆమె స్పష్టం చేసి ఉంటారు. -
శృతి హాసన్, గౌతమిల ఫైట్
కమల్ ముద్దులకూతురు శృతిహాసన్‌కు, కమల్ పార్ట్నర్ గౌతమికి మధ్య సినిమా సెట్స్‌లో ఫైట్ జరిగిందట. కమల్, శృతి ఓ సినిమాలో తండ్రీకూతుళ్లుగా నటిస్తున్నారు. ఆ సినిమాకు గౌతమి కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఉన్నారు. శృతి పాత్రకు గౌతమి రూపొందించిన దుస్తులు నచ్చకపోవడంతో వీరిద్దరి మధ్య వాదులాట మొదలైందట. తనకు అస్సలు నప్పని దుస్తులను డిజైన్ చేసినందుకు గౌతమిపై శృతి ఫైర్ అయినట్లు సమాచారం. చెన్నైలో షూటింగ్ సెట్స్‌లో ఉండగా వీరిద్దరూ ఒకరి మీద ఒకరు అసహనాన్ని ప్రదర్శించుకున్నారు. వీరిద్దరి మధ్యకు వెళ్లేందుకు కమల్‌తో సహా ఎవరూ సాహసించలేదట. కేవలం ఈ సినిమా విషయంలోనే కాదు, ఇప్పటికే పలుమార్లు గౌతమి తన కోసం డిజైన్ చేసిన దుస్తులను ధరించేందుకు శృతి వ్యతిరేకించింది. ఆమె డిజైన్స్ నచ్చకపోవడమే అందుకు కారణమట. ఏదేమైనా ఈ ఇద్దరి గొడవ ఆ రోజు షూటింగ్‌కు సెలవు చెప్పడానికి కారణమైంది. -
పక్కింటి మహిళ!
లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్లు మనకు ఇష్టమైనా... సహజంగా ఉండే పాత్రలే ఎక్కువగా ఆకట్టుకుంటాయి. నడకలో, నడతలో, కట్టూ బొట్టులో అలాంటి పాత్రలతోనే మన చుట్టూ ఉన్న మనషులను పోల్చుకుంటాం. ఇలాంటి వాళ్లను ఎక్కడో చూశాం.. మన ఇంట్లోనో, పొరుగింట్లోనో, బంధువుల్లోనో... అని ఆలోచిస్తాం. సహజంగా చిత్రీకరించే మధ్యతరగతి పాత్రలు అంతగా దగ్గరవుతాయి. నిన్నటి తరం నాయిక గౌతమి ‘మనమంతా’ సినిమాలో ఇలాంటి పాత్రలోనే కనిపించనున్నారు. ఈ సినిమాలో గౌతమి చేసిన గాయత్రి అనే పాత్ర మధ్య తరగతి మహిళల జీవితాలను ప్రతిబింబించేలా ఉండబోతోంది. ఒక ప్రపంచంలో నాలుగు కథలు అనే కాన్సెప్ట్‌తో సాయి శివాని సమర్పణలో వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. చంద్ర శేఖర్ ఏలేటి దర్శకుడు. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. -
మోహన్‌లాల్‌కు జంటగా గౌతమి
ఒకప్పటి ప్రముఖ బహుభాషా కథానాయకి గౌతమి. కొంత కాలం నటనకు దూరంగా ఉన్న ఈమె ఇటీవల కమలహాసన్‌కు జంటగా పాపనాశం చిత్రంతో రీఎంట్రీ అయిన విషయం తెలిసిందే. ఆ చిత్రం విజయం సాధించడంతో మళ్లీ గౌతమికి అవకాశాలు రావడం మొదలెట్టాయి. అయితే తనకు తగిన పాత్ర అయితేనే నటించాలని నిర్ణయించుకున్న తను తాజాగా ఒక త్రిభాషా చిత్రంలో నటించడం విశేషం. అదీ మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌కు జంటగా నటిస్తుండడం మరో విశేషం. గౌతమి ఇంతకు ముందు మలయాళంలో మోహన్‌లాల్ సరసన హీజ్ ఐనస్ అబ్దుల్లా అనే చిత్రంలో నటించారు. ఆ చిత్రం ఘన విజయం సాధించింది. దీంతో మోహన్‌లాల్ గౌతమిలది హిట్ జంటగా పేరొందింది. తాజాగా తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో రూపొందుతున్న ఒక చిత్రంలో మోహన్‌లాల్, గౌతమి జంటగా నటిస్తున్నారు. దీనికి తెలుగులో మనమంతా అనే పేరును, మలయాళంలో నమదు అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇందులో విశ్వనాథ్, హనీషా అమ్రేష్ యువ జంటగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో నాజర్, ఊర్వశి, చంద్రమోహన్, గొల్లపూడి మారుతీరావు నటిస్తున్నారు. ఈ త్రిభాషా చిత్రాన్ని సాయిశివాని సమర్పణలో వారాహి చలనచిత్రం, సాయి కొర్రపాటి ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇంతకు ముందు గోపీచంద్ తదితర ప్రముఖ కథానాయకులతో చిత్రాలను తెరకెక్కించిన ఏలేటి చంద్రశేఖర్ కథ, కథనం,దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోందని యూనిట్ వర్గాలు వెల్లడించారు. -
ఎంట్రీ ఇవ్వబోతున్న గౌతమికూతురు
-
జూలై2 పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: గౌతమి (నటి) మైల్స్వామి అన్నాదొరై (ఇస్రో సైంటిస్ట్) ఈ రోజు పుట్టిన వారి సంవత్సరం సంఖ్య 8. పుట్టిన తేదీ 2 కావడంతో వీరికి కల్పన శక్తితో పాటు మేనేజ్మెంట్ స్కిల్స్ అధికంగా ఉంటాయి. ఈ ఏడాది శని ప్రభావంతో వృత్తిలో ఉన్నతిని పొందుతారు. సహజంగా బర్త్ డేట్లో 7 ఉండటం వల్ల ఉదారత, ఆధ్యాత్మికత, పరోపకార పుణ్యం వీరిలో అధికం. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. కొత్త ప్రాజెక్ట్స్ చేయాలన్నా, కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్నా, ఉన్నవాటిని అభివృద్ధి చేయాలన్నా ఇది అనువైన సంవత్సరం. ఇది మెటీరియలిస్టిక్, ల్యాండ్ మార్క్ ఇయర్‌గా చెప్పవచ్చు. గురు-శుక్రుల కలయిక వలన గురు-శనిల సంబంధం వలన వివాహం, ఉద్యోగంలో ఉన్నతి, నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం రావటం, సంతానప్రాప్తి.. కలుగుతాయి. శని కేతువుల దృష్టి ఉండటం వలన చేసే వృత్తిలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. దీంతో కొంత మానసిక అశాంతి ఏర్పడే అవకాశం ఉంది. స్థానచలనం లేదా విదేశాలకు, దూర ప్రాంతాలకు ప్రమోషన్స్‌తో ట్రాన్స్ఫర్స్ అవడం జరుగుతుంది. అదృష్ట సంఖ్య: 2, 6, 3; అదృష్ట రంగులు: నలుపు, తెలుపు, బంగారు, నీలం, సిల్వర్; అదృష్ట వారాలు: గురు, సోమ, శుక్ర, బుధ సూచన: యోగా, ధ్యానం చేయటం, శనికి తైలాభిషేకం, బీద విద్యార్థులకు పుస్తకాలు, బట్టలు దానం చేయడం, మూగజీవాలకు ఆహారం పెట్టడం మంచిది. - డా. మహమ్మద్ దావూద్, జ్యోతిష, సంఖ్యాశాస్త్ర నిపుణులు -
ఏం తినాలన్నా భయమేస్తోంది..!
‘‘నన్ను నేను ఓ ‘కామన్ మ్యాన్’లా అనుకుంటా. అందుకే ఓ కామన్ మ్యాన్ తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఎంత తాపత్రయపడ్డాడు? అనే కథాంశంతో రూపొందిన ‘దృశ్యం’లో నటించా’’ అని కమల్‌హాసన్ పేర్కొన్నారు. అప్పట్లో ‘మహానది’లో కూతుర్ని కాపాడుకోవడానికి తాపత్రయపడే తండ్రిగా నటించారు. ఆ చిత్రానికీ ఈ ‘దృశ్యం’కీ దగ్గర పోలికలున్నాయి కదా? అనే ప్రశ్న కమల్ ముందుంచితే -‘‘మలయాళ ‘దృశ్యం’ దర్శకుడు జీతు ‘మహానది’ చూశారో లేదు నాకు తెలియదు. కానీ, ‘దృశ్యం’ ఆ జానర్ సినిమానే. కాకపోతే, ఈ చిత్రం తీసిన విధానం, కథ సాగే తీరు వేరేగా ఉంటుంది’’ అన్నారు. చాలా విరామం తర్వాత గౌతమి ఈ చిత్రంలో నటించారు. ఆమె నటన గురించి కమల్ చెబుతూ -‘‘ఇన్నేళ్ల విరామం గౌతమికి సినిమా గురించి ఇంకొంత అవగాహన ఏర్పడేలా చేసింది. అయితే, బాధపడదగ్గ విషయం ఏంటంటే.. ఫిమేల్ ఆర్టిస్టులు ఈ కళను బాగా అవగాహన చేసుకునే సమయానికి రిటైర్ అయ్యే పరిస్థితి వస్తుంది. కానీ, గౌతమి ఆ ఫీలింగ్‌ని అధిగమించి, ‘పాపనాశం’లో నటించగలిగింది’’ అన్నారు. ప్రస్తుత సమాజం గురించి కమల్ మాట్లాడుతూ -‘‘ఇవాళ అన్నీ కలుషితమైపోయాయి. విద్య కలుషితమైంది. బోధనా విధానం చూస్తుంటే భయం వేస్తోంది. అది మాత్రమే కాదు.. విద్య చాలా ఖరీదైపోయింది. ఇక, ఆహారం విషయానికొస్తే, అది కూడా కలుషితమైపోయింది. ఏం తిన్నా భయపడుతూ తింటున్నాం. రాజకీయ వ్యవస్థ అయితే ఘోరంగా తయారయ్యింది’’ అన్నారు. -
ఫోన్ చేతిలో ఉందని... ఫొటో తీసేయడమేనా?
ఒకప్పుడు ఫోన్ నాలుగు గోడలకు పరిమితం. ఇప్పుడు ఎక్కడికెళితే, అక్కడకు తీసుకెళ్లొచ్చు. ముచ్చటగా ఏదైనా దృశ్యం కనిపిస్తే, ఆ ఫోన్లో ఉన్న కెమెరాతో బంధించొచ్చు. కానీ, తీయకూడనవి తీస్తే? కొన్ని జీవితాలు ఇబ్బందులపాలవుతాయ్. మలయాళ ‘దృశ్యం’ చిత్రంలో చెప్పిన పాయింట్ ఇదే. ఈ చిత్రం తమిళ రీమేక్ ‘పాపనాశం’లో కమల్‌హాసన్, గౌతమి నటించారు. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్ గురించి కమల్ ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ఏది పడితే అది తీసే హక్కు ఉందని కొంతమంది అనుకుంటున్నారు. ఎదుటి వ్యక్తి మనోభావాలతో సంబంధం లేకుండా ఫొటోలు తీస్తున్నారు’’ అని కమల్ అన్నారు. ఓ సెలబ్రిటీగా ఇలాంటి సంఘటనలు నాకు చాలా ఎదురయ్యాయని కమల్ చెబుతూ -‘‘సెలబ్రిటీలతో ఫొటోలు దిగాలని అందరికీ ఉంటుంది. కానీ, వాళ్ల అనుమతి తీసుకోవాలి. కొంతమంది నా దగ్గరకు వచ్చి, ఫొటో తీసేస్తారు. ఆ తర్వాత ‘ఫొటో తీసుకోవచ్చా?’ అంటారు. వింతగా ఉంటుంది’’ అన్నారు. -
శ్రీమతి కమల్ హాసన్ కాదు
మేరేజెస్ ఆర్ మేడిన్ హెవెన్. లవ్ ఈజ్ మేడ్ ఆన్ ఎర్త్. మూడుముళ్లు వేస్తేనేనా ప్రేమించినట్టు? ప్రేమిస్తేనేనా మూడుముళ్లు వేసేది? జీవిత భాగస్వామి కావడానికి ప్రేమ, పెళ్లి కాదు... బాధ్యత అవసరం. గౌతమి కూతురు కమల్ హాసన్‌ని ‘పప్పా’ అని పిలుస్తుంది. అంటే డాడీ అని. కమల్ హాసన్ కన్నతండ్రి కాకపోయినా.. అంతకంటే ఎక్కువే. గౌతమి శ్రీమతి కమల్ హాసన్ కాకపోయినా అంతకు మించే. మీ పేరు చెప్పగానే ఎవరికైనా శ్రీనివాస కల్యాణం, గాంధీ నగర్ రెండవ వీధి సినిమాలు గుర్తుకొస్తాయి. తక్కువ సినిమాలు చేసినా అంత దగ్గరయ్యారు. అసలు సిసలు తెలుగమ్మాయైన మీరు మళ్లీ తెలుగు సినిమాలు చేయాలి. గౌతమి: (నవ్వుతూ) చెయ్యాలనే ఉంది. ఇన్నేళ్ల తర్వాత ‘పాపనాశం’ (మలయాళ ‘దృశ్యం’కి తమిళ రీమేక్) సినిమా చేయడానికైనా మా అమ్మాయి సుబ్బలక్ష్మి కారణం. ‘నా ఆలనా పాలనా చూసుకోవడం కోసం ఇన్నాళ్లూ సినిమాలకు దూరంగా ఉన్నావ్. ఇప్పుడు నేను మేనేజ్ చేసుకోగలుగుతాను. నువ్వు మళ్లీ సినిమాలు చేయాలి’ అని చెప్పింది. పిల్లల వైపు నుంచి ఇలాంటి ప్రోత్సాహం లభిస్తే, ఇక చెప్పడానికేముంటుంది? మా అమ్మ విషయంలో నేనిలానే ఆలోచించేదాన్ని. మీ అమ్మానాన్నల గురించి చెప్పండి. నాన్నగారు శేషగిరిరావు వైజాగ్‌లో పెద్ద పేరున్న డాక్టర్. అమ్మ వసుంధరాదేవి కూడా డాక్టరే. నాన్నగారు ఆర్మీలో పని చేశారు. మంచి ఆర్కిటెక్ట్. టోర్నమెంట్ లెవల్లో బ్రిడ్జ్ ప్లేయర్. బ్రహ్మాండమైన ఫొటోగ్రాఫర్. నేను పుట్టాక నాకు నచ్చలేదని హంటింగ్ వదిలేశారు. అమ్మ సూపర్ ఉమన్. ఆవిడ వర్క్ చేయని టైమ్ అంటూ ఉండేది కాదు. మా నాన్నగారికి, అన్నయ్యకి అమ్మ వంట చేస్తేనే నచ్చుతుంది. ఇంటి పనులన్నీ చక్కబెట్టి, తర్వాత కికక్కి వెళ్లేది. నేను సినిమాల్లోకొచ్చాక ఆవిడ లేకుండా కాలు బయటపెట్టేదాన్ని కాదు. సడన్‌గా అమ్మకి బైపాస్ సర్జరీ చేయాల్సి వచ్చింది. ‘ఇక చాలు.. ఆమెకి విశ్రాంతి కావాలి’ అని అప్పుడు అనిపించింది. అమ్మకి ఏం కావాలో ఆలోచించే మెచ్యూర్టీ అప్పుడు నాకొచ్చింది. ఇప్పుడు నాకేది తృప్తిగా ఉంటుందో ఆలోచించే మెచ్యూర్టీ మా సుబ్బలక్షి్ష్మకి వచ్చింది. ఇప్పుడు మీ అమ్మ, నాన్న ఉన్నారా? సుబ్బలక్ష్మి పుట్టిన ఏడాదికి అమ్మ చనిపోయింది. ఆమె చనిపోయిన ఏడాది లోపు నాన్న కూడా చనిపోయారు. నా కుడి, ఎడమ భుజం లాంటి ఇద్దరూ పోవడం షాకింగ్‌గా అనిపించింది. అప్పటివరకూ రక్షణగా ఓ గూడులో ఉండేదాన్ని. ‘ఇక ఒంటరి ప్రయాణం మొదలుపెట్టాలి’ అనే ఫీలింగ్ నన్ను మానసికంగా స్ట్రాంగ్ చేసింది. సినిమాలకు ఎందుకు దూరమయ్యారు? అప్పటికే 120 సినిమాలకు పైగా చేశాను. ఎంతోమంది అభిమానం పొందగలిగాను. తర్వాత ఏంటి? అనుకున్నాను. జీవితంలో ఆయా సందర్భాలను బట్టి మన ప్రాధాన్యాలు మారతాయి. నాకు మొదట్నుంచీ రైట్ టైమ్‌లో మొదటి బిడ్డను కనాలని ఉండేది. అది కూడా పాపే కావాలని అనుకున్నాను. పాప పుట్టింది. తన ఆలనా పాలనా నేనే చూసుకోవాలనుకున్నా. అందుకే, సినిమాలను పక్కనపెట్టా. రైట్ ఏజ్‌లో పెళ్లి చేసుకోవాలనే చేసుకున్నారా... మీది లవ్ మ్యారేజే కదా? అవును. మాది లవ్ మ్యారేజే. కానీ, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. వాస్తవానికి పెళ్లి కోసం నేను సినిమాలు మానేయలేదు. పెళ్లి చేసుకునే ఏడాదిన్నర ముందే సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాను. కానీ, పెళ్లయ్యాక కనీసం రెండేళ్లు కాకుండానే విడిపోయారేం? ఎవరూ ఎప్పుడూ ఒకే రకంగా ఉండరు. మనషుల మనసులు మారుతూ ఉంటాయి. ఆ మార్పు అన్నది ఒకే డెరైక్షన్‌లో జరిగితే బాగుంటుంది. వేరు వేరు డెరైక్షన్‌లో మార్పు వస్తే, కలిసి ఉండటం కష్టంగా ఉంటుంది. అందుకే, మేం విడిపోయాం. వృత్తిపరంగా సక్సెస్ అయ్యి... వ్యక్తిగతంగా ఓడిపోయానని అనుకున్నారా? లేదు. ఎందుకంటే, ఎవరి జీవితంలో జరగనిది ఏమీ నా జీవితంలో జరగలేదు. సిగ్గుపడిపోయి, దాక్కునేంత పని చేయలేదు నేను. రెండు మనసులు కలవనప్పుడు, కలిసి బాధపడుతూ బతికేకన్నా, విడిపోయి ఆనందంగా ఉండాలనుకున్నాం. ఇది నా ఓటమి అనుకోవడంలేదు. ఎందుకంటే, మా పాప రూపంలో నా జీవితానికో గమ్యం ఉంది. అమ్మ, నాన్న ఉన్నంతవరకూ నేను ‘వెరీ షెల్టర్డ్’. ఆ ఇద్దరూ పోవడంతో ఆ షెల్టర్ చెదిరిపోయింది. చివరికి చంటిపిల్లతో ఒంటరిగా మిగిలా. అప్పుడే ప్రపంచాన్ని చూడటం మొదలుపెట్టా (చెమర్చిన కళ్లతో). మీ పాప తన తండ్రి గురించి అడగలేదా? పాపకు ఊహ తెలిసినప్పట్నుంచీ నా జీవితంలో జరిగిన అన్ని విషయాలనూ చెప్పడం మొదలుపెట్టా. అయితే, ఏ వయసులో ఏది చెబితే అర్థమవుతుందో, అందుకు తగ్గట్టుగా అన్నీ చెప్పుకుంటూ వచ్చాను. మా పాప పరిస్థితులను అర్థం చేసుకుంది. నా కూతురు అని చెప్పడంలేదు కానీ, తను చాలా తెలివి గలది. ఒకవైపు విఫలమైన వైవాహిక బంధం, అమ్మా, నాన్న తిరిగి రాని లోకాలకు వెళ్లడం. పైగా, చంటిపిల్ల పెంపకం.. ఇవన్నీ ఒక ఎత్తయితే క్యాన్సర్ మరో ఎత్తు. ఒకేసారి ఇన్ని ఎదురు దెబ్బలను ఎలా డీల్ చేశారు? ఇవన్నీ నేను ఎదురు దెబ్బలుగా అనుకోవడం లేదు. జీవితాన్ని అర్థం చేసుకోవడానికి ఉపకరించాయి. వాస్తవానికి ప్రెగ్నెన్సీ టైమ్‌లో నాకు టాక్సెమియా వచ్చింది. దాంతో బాగా బరువు పెరిగాను. కాంప్లికేషన్స్ వచ్చాయి. ఎలాగో వాటిని అధిగమించి, సేఫ్‌గా బిడ్డను కనగలిగాను. కానీ, పెంపకం పూర్తిగా నా మీద ఉంటుందనుకోలేదు. మదర్, ఫాదర్, గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్... నా కూతురికి అన్నీ నేనే. పాపకి ఏం పెట్టాలి? ఎలా పెంచాలి? అని నాకు నేనుగా తెలుసుకుని పెంచాను. ఈ క్రమంలో ఓ మూడు, నాలుగేళ్లు బయటి ప్రపంచాన్ని చూడటం మర్చిపోయాను. మరోవైపు క్యాన్సర్. అది కూడా నాకు తగిలిన దెబ్బగా అనుకోవడం లేదు. నా ప్రాధాన్యాలు తెలిసేలా చేసింది. ‘నా బిడ్డ, అన్నయ్య కుటుంబం, కమల్..’ ప్రపంచంలో వీళ్లే నా ప్రాధాన్యాలు అని నాకు స్పష్టంగా తెలియజేసింది. నా మానసిక ధైర్యం, వాళ్లిచ్చిన ధైర్యం నా అనారోగ్యాన్ని జయించేలా చేశాయి. సినిమాలు చేస్తున్నప్పుడే మీరు కమల్ హాసన్‌కి దగ్గరయ్యారా? ఆయనతో సినిమాలు చేసినప్పుడు ‘కమల్ సార్..’ అంటూ దూరం దూరంగా ఉండేదాన్ని. కమల్‌తో ఎక్కువ సినిమాలు చేసేకొద్దీ గౌరవ భావం పెరిగిపోయింది. ఇద్దరం కలిసి చేసిన చివరి సినిమా ‘ద్రోహి’. ఆ తర్వాత మేం దాదాపు నాలుగైదేళ్లు కలవలేదు. పెళ్లి చేసుకుని, అమెరికా వెళ్లిపోయాను. మరి.. కమల్‌తో మీ బంధం ఎలా బలపడింది? ఇండియా వచ్చిన తర్వాత పలు సందర్భాల్లో నేనూ, ఆయన కలిశాం. అప్పటికి మేమిద్దరం ఒంటరివాళ్లం. మొదట్లో సినిమాల గురించి మాట్లాడుకునేవాళ్లం. ఆ తర్వాత ఫిలాసఫీ, సైకాలజీ.. వాట్ నాట్... బోల్డన్ని టాపిక్స్ వచ్చేవి. జీవితం పట్ల అవగాహన, ప్రతిభ, అందమైన గుణం, ఆశావహ దృక్పథం... ఇలాంటి మంచి లక్షణాలు కమల్లో చాలా ఉన్నాయి. ఆయనతో మాట్లాడుతుంటే మంచి మంచి విషయాలు తెలుస్తాయి. స్టేజ్ బై స్టేజ్ మా మధ్య అనుబంధం పెరిగింది. ఆ అనుబంధం దీర్ఘకాలంగా (దాదాపు పదేళ్లు) కొనసాగడానికి కారణం? నా జీవితాన్ని ఒక రకంగా ముందు నుంచీ ఊహించుకున్నాను. అమ్మ, నాన్న, అన్నయ్య... వీళ్లతోనే నా లైఫ్ అనుకున్నాను. అనుకోకుండా సినిమాల్లో అవకాశం వచ్చింది. సక్సెస్ అయ్యాను. పెళ్లయ్యింది. అది సక్సెస్ కాలేదు. చేతిలో చంటిబిడ్డతో మిగిలాను. ఒక రకంగా అది పరీక్షాకాలం. ఆ సమయంలో నాకు కమల్ సెక్యూర్టీని ఇవ్వగలిగారు. ఏ బంధం అయినా దీర్ఘకాలం నిలవాలంటే ఒకరిపట్ల మరొకరికి గౌరవం ఉండాలి. ఒకరి అభిప్రాయాలకు మరొకరు విలువ ఇవ్వాలి. ఇద్దరికీ తాము అనుకున్నది ఎదుటి వ్యక్తికి చెప్పుకోగల స్వేచ్ఛ ఉండాలి. అంత ఓపెన్‌గా ఉన్న ఏ బంధం అయినా బలంగా ఉంటుంది. దానికి ‘లాంగ్ స్టాండింగ్’ ఉంటుంది. మీ సహజీవనం గురించి మీకెలాంటి విమర్శలూ వినిపించలేదా? అస్సలు లేదండి. నేను సినిమాల్లోకొచ్చే ముందు ‘ఇండస్ట్రీ మంచిది కాదు.. చాలా జాగ్రత్తగా ఉండాలి’ అనేవాళ్లు. కానీ, ఇక్కడ నాకెలాంటి చేదు అనుభవాలు ఎదురు కాలేదు. దాన్నిబట్టి నేను చెప్పేదేంటంటే, ‘మనం ఎలా ఉంటామో.. మనతో ఎదుటి వ్యక్తులు అలానే ఉంటారు’ అని. ‘రిలేషన్షిప్స్’కి కూడా ఇది వర్తిస్తుంది. ఒక వ్యక్తి నుంచి ఏదైనా ఆశించి, అందుకు తగ్గట్టుగా లెక్కలేసుకుని ఆ వ్యక్తికి దగ్గరైతే, అది బయటివాళ్లు కనిపెట్టగలుగుతారు. అప్పుడు విమర్శలు వస్తాయి. నిజాయతీగా ఏర్పడిన బంధాల మీద గౌరవ భావం ఉంటుంది. కానీ, సహజీవనాన్ని సమాజం ఒప్పుకుంటుందా? సమాజం అంటే ఏంటండి? నేను, మీరు, ఇంకొకరు, మరొకరు... అంతేగా? ఎవరి జీవితాలు వాళ్లవి. అందరూ ఒకే విధంగా జీవించరు కదా. అయితే, జీవించే విధానంలో హుందాతనం ఉండాలి. అప్పుడు సమాజం కూడా ఆ హుందాతనాన్ని గౌరవిస్తుంది. సహజీవనం చేయాలనుకున్న తర్వాత, మీ పిల్లలు ఏమైనా అనుకుంటారేమోనని మీరు, కమల్ అనుకోలేదా? ‘టు ఇండిపెండెంట్ పీపుల్ ఆన్ ది సేమ్ రోడ్’ అనుకున్నాం. కలిసి ప్రయణం చేస్తాం. మా ఇద్దర్నీ ఆమోదించాల్సిందేనని ముగ్గురు పిల్లల్నీ ఒత్తిడి చేయలేదు. వాళ్లే అర్థం చేసుకున్నారు. మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనుకోలేదు? పెళ్లి మీద గౌరవం ఉంది కాబట్టే, చేసుకున్నా. కానీ, విఫలమైంది. ఇద్దరు వ్యక్తులు కలిసి బతకాలనుకుంటే, మాట రూపంలో చెప్పినా, వేడుకగా జరిపి నలుగురికీ తెలియజేసినా... ఏ రూపంలో వ్యక్తపరిచినా ఒకటే. వీటిలో ఏం చేసినా ఇద్దరి మధ్య అవగాహన ఉండటం ముఖ్యం. మా లైఫ్‌లో ఆ అవగాహన ఉంది. ఘనంగా పెళ్లి చేసుకున్నవాళ్లల్లో ఎంతమంది ఆనందంగా ఉంటున్నారో చెప్పండి? పెళ్లయ్యింది కదా... ఇక కలిసి బతికేద్దాం అని బలవంతంగా బతుకుతున్నవాళ్లు లేరా?. మరి... మీ సుబ్బలక్ష్మి పెళ్లి చేసుకోనంటే అంగీకరిస్తారా? తన ఇష్టం. పెళ్లయినా, రిలేషన్షిప్ అయినా... ఏం చేసినా సిన్సియర్‌గా చేయమని చెబుతా. ఓకే... చాలా విరామం తర్వాత ‘పాపనాశం’లో నటించారు. కమల్ సినిమా కాబట్టే ఒప్పుకున్నారనుకోవచ్చా? చాలామంది కమల్ సినిమాల్లోనే నటిస్తానని ఊహించుకుంటున్నారు. కానీ, అందరితోనూ సినిమాలు చేయాలనుకుంటున్నా. ‘పాపనాశం’లోని పాత్ర నేను చేస్తే బాగుంటుందని దర్శక, నిర్మాతలు కమల్ని అడిగారు. నన్నడగమని కమల్ అన్నారట. ఆ తర్వాత నన్నడగడం, యాక్టింగ్ నా ఫస్ట్ లవ్ కావడంతో ఆనందంగా అంగీకరించడం జరిగాయి. ఇక పైనా సినిమాల్లో కొనసాగుతారా? సినిమాల్లో నటించడం మానేశాను తప్ప కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేస్తున్నాను. ‘దశావతారం’ అప్పుడు ఎందుకన్నారో కానీ, ‘ఈ సినిమాకు నువ్వు కాస్ట్యూమ్ డిజైన్ చేస్తున్నావ్’ అని కమల్ అన్నారు. అదొక మంచి సవాల్ అనిపించి, ఒప్పుకున్నాను. అప్పట్నుంచీ ఇప్పటివరకూ కమల్ చేసిన సినిమాలకు డిజైనింగ్ చేస్తున్నాను. నటన అంటే ఇష్టం కాబట్టి, ఇక నటిగా కొనసాగాలనుకుంటున్నా. ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు? రొటీన్ అనిపించే పాత్రలకు దూరంగా ఉండాలనుకుంటున్నా. నేను చేసే పాత్ర ఆ సినిమాకి కీలకంగా ఉండాలి. అది ఏ భాష సినిమా అయినా ఓకే. నేను చేయడానికి రెడీ. మళ్లీ వ్యక్తిగత విషయాలకొద్దాం.. కమల్‌తో మీ కూతురి అనుబంధం గురించి.. ఆయన్ను తను ఏమని పిలుస్తుంది? ‘షీ ఈజ్ హిజ్ డాటర్’. పప్పా అని పిలుస్తుంది. ఆ రిలేషన్షిప్ వాళ్లు బిల్డప్ చేసుకున్నదే తప్ప నేను కావాలని బిల్డప్ చేసినది కాదు. సుబ్బలక్ష్మికి కమల్ అంటే ఎంతో ప్రేమ. ఆయనక్కూడా అంతే. {శుతీహాసన్, అక్షరాహాసన్లు మిమ్మల్ని అంగీకరించారా? అంగీకరించడం అంటే ఏంటి? వాళ్లిద్దరూ కమల్ కూతుళ్లు. కమల్ జీవితంలో ఉన్న ఆ ఇద్దర్నీ ఎవరూ రీప్లేస్ చేయలేరు. నా జీవితంలో ఉన్న సుబ్బలక్ష్మిని ఎవరూ రీప్లేస్ చేయలేరు. ఆ క్లారిటీ మాకు ఉంది. నటిగా శ్రుతీహాసన్ దూసుకెళుతున్నారు.. తన గురించి నాలుగు మాటలు? {శుతీహాసన్ చాలా హార్డ్ వర్కింగ్. లాస్ ఏంజిల్స్‌లో తను మ్యూజిషియన్ ఇన్స్టిట్యూట్లో చేరాలనుకున్నప్పుడు నా క్యాన్సర్ ట్రీట్మెంట్ చివరి చికిత్స పూర్తయ్యింది. అప్పుడు కమల్ బిజీగా ఉన్నారు. సుబ్బలక్ష్మిని తీసుకుని శ్రుతీతో లాస్ ఏంజిల్స్ వెళ్లి, అన్ని ఏర్పాట్లూ చేసొచ్చాను. ఆ తర్వాత తను ఒంటరిగా అక్కడ ఉండి, చదువుకుని ఇక్కడికొచ్చింది. వచ్చాక తన కెరీర్‌ని తానే బిల్డప్ చేసుకోవాలనే పట్టుదల మీద ఉండేది. ఆ పట్టుదల ఫలితమే తన ఈ సక్సెస్. శ్రుతి ఎదుగుదల చూస్తే, గర్వంగా ఉంటుంది. సుబ్బలక్ష్మిని కూడా కథానాయిక చేస్తారట? నటన అనే కాదు.. ఫిలిం మేకింగ్ అంటే తనకిష్టం. ఆర్టిస్ట్, టెక్నీషియన్.. ఏది కావాలన్నా ఇంకా చాలా టైముంది. తనకిప్పుడు పదిహేనేళ్లే కదా. మీరు వంట చేస్తారా? ఎప్పుడైనా కమల్ కూడా గరిట తిప్పుతారా? కుక్ ఉన్నారు. ఎందుకంటే, పని మీద నేను బయటికెళ్లినప్పుడు ఇంట్లోవాళ్లు ఇబ్బందిపడకూదు కదా. వీలు చిక్కినప్పుడల్లా నేను వంట చేస్తాను. ఒకసారి ‘అవియల్’ (కలగలుపు కూర) చేస్తున్నా. వంట గదిలోకి తొంగి చూసి, ‘ఏం చేస్తున్నావ్’ అని కమల్ అడిగారు. అవియల్ చేస్తున్నానంటే, ‘నేనూ హెల్ప్ చేస్తా’ అంటూ, కూరగాయలు కోసి ఇచ్చారు. కూరకు కావాల్సిన దినుసులను మిక్సీ పట్టి ఇచ్చారు. ఆ పనులన్నీ ఇష్టంగా చేశారు. మర్నాడు కూడా వంటలో సహాయం చేశారు. ఆయన ఏం చేసినా సరే చాలా ఆసక్తిగా చేస్తారు. మామూలుగా వైవాహిక బంధంలోనే ‘సెవెన్ ఇయర్స్ ఇచ్’ అంటుంటారు. (మధ్యలో అందుకుంటూ...) ఎలాంటి ఇచ్చింగ్స్ లేవు. ప్రతిరోజూ కొత్తగా, ఆసక్తిగా ఉంటుంది. మేం బోల్డన్ని విషయాలు మాట్లాడుకుంటాం. పుస్తకాలు చదువుతాం. మా డైనింగ్ రూమ్‌లో టీవీ ఉండదు. సెల్‌ఫోన్స్, ఐప్యాడ్లకు స్థానం లేదు. హాయిగా మాట్లాడుకుంటూ, భోజనం చేస్తాం. ‘విశ్వరూపం’ సమయంలో కమల్ ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. అలాంటి క్లిష్టమైన పరిస్థితులను, బాధలను మీతో పంచుకుంటారా? నాకేదైనా సమస్య వచ్చినప్పుడు నేను ఆయన దగ్గరే చెప్పుకుంటాను. ఆయన కూడా అంతే. మంచి, చెడూ పంచుకోలేని బంధం ఎందుకు? అందుకే.. మా బాధలనూ, సంతోషాలనూ పంచుకుంటాం. కమల్ని ఎవరైనా కలవాలంటే, ముందు మీ అనుమతి తీసుకోవాలన్నది చాలామంది ఊహ? ఆ ఊహ నిజం కాదు. నా సలహాల మీద ఆధారపడేంత చిన్నపిల్లాడు కాదాయన. ‘కమల్ ఈజ్ అడల్ట్’. లైఫ్‌ని మ్యానేజ్ చేయడం ఆయనకు బాగా తెలుసు. నేను చెప్పిందే చేస్తారని చాలామంది అనుకుంటారు. ఆయన మా ఇంటి పెద్ద. నా నిర్ణయాల కోసం నేనే ఆయన సలహా తీసుకుంటాను. ఇక, నేను చెబితే ఆయన చేస్తారని అనుకోవడం నాకు జోక్‌గా అనిపిస్తుంది. అందుకే, కమల్ని కలవాలనుకుని నా అనుమతి కోసం ఎదురుచూసేవాళ్ల దగ్గర, ఆయన మేనేజర్ నంబరో, పీఆర్ఓ నంబరో ఇచ్చేస్తాను. ఫైనల్లీ మీ జీవితం గురించి? చాలా ప్రశాంతంగా ఉంది. - డి.జి. భవాని -
ఈ బాలుడు రాముడేనా..?
రణధీర్, గౌతమి జంటగా త్రిపుర సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘రాముడు మంచి బాలుడు’. సంపత్‌రాజ్ దర్శకుడు. ఈ చిత్రం పాటలను ప్రముఖ సింగర్ బాబా సెహగల్ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. అతిథుల్లో ఒకరైన వరుణ్ సందేశ్ మాట్లాడుతూ- ‘‘ఈ సినిమాలో రణ ధీర్ మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు. అతనికి మంచి పేరు తీసుకువస్తుంది’’ అన్నారు . ఈ వేడుకలో కృష్ణుడు, తుమ్మలపల్లి రామసత్యనారాయణ , ఆదర్శ్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు. -
బరితెగింపు!
విద్యార్థినిపై హాస్టల్లో కాల్పులు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి గాయపడిన మరో విద్యార్థిని ఆస్పత్రిలో పోలీసుల అదుపులో నిందితుడు కృష్ణరాజపురం/బనశంకరి/పావగడ : ఉద్యాననగరిలో ఉన్మాది బరితెగించాడు. హాస్టల్లో నిద్రిస్తున్న ఓ విద్యార్థినిపై కాల్పులు జరిపాడు. మరో విద్యార్థిని కొనవూపిరితో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకున్న వివరాలు ఇలా ఉన్నాయి... తుమకూరు జిల్లా పావగడ తాలూకా పతంజలి నగర్‌కు చెందిన రమేష్, లక్ష్మి దంపతుల కుమార్తె గౌతమి(17), డాక్టర్ జయంతి, శ్రీనాథ్‌ల కుమార్తె శిరీష బెంగళూరులోని కాడుగోడి ఉన్న ప్రగతి కళాశాల హాస్టల్లో ఉంటూ రెండో ఏడాది పీయూసీ చదువుకుంటున్నారు. మంగళవారం రాత్రి స్టడీ అవర్స ముగిసిన తర్వాత గౌతమి, శిరీషా మూడవ అంతస్తులోని తమ గదికి చేరుకున్నారు. రాత్రి 10.05 గంటలకు గౌతమి గది తలుపు తట్టిన చప్పుడు కావడంతో శిరీషా తలుపు తీసింది. ఆ సమయంలో అదే కళాశాలలో అటెండర్‌గా పనిచేస్తున్న మహేష్(28) లోపలకు దూసుకువచ్చి శిరీషాను పక్కకు నెట్టి తన వద్ద ఉన్న తపంచా(నాటు తుపాకీ)తో నిద్రిస్తున్న గౌతమిపై కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో అతన్ని పట్టుకునేందుకు శిరీషా ప్రయత్నించడంతో ఆమెపై కూడా అతను కాల్పులు జరిపి పారిపోయాడు. మిన్నంటిన హాహాకారాలు అర్ధరాత్రి హాస్టల్లో తుపాకీ కాల్పుల శబ్ధంతో విద్యార్థులు హడలిపోయారు. అదే సమయంలో చుట్టుపక్కల ఉన్న వారు అప్రమత్తమై హాస్టల్ వద్దకు చేరుకున్నారు. అప్పటికే కళాశాల సిబ్బంది క్షతగాత్రులను తీసుకుని కిందకు చేరుకుంది. వెంటనే వారిని స్థానిక వైదేహి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గౌతమి మరణించింది. ప్రాథమిక చికిత్స అనంతరం శిరీషాను మణిపాల్ ఆస్పత్రిలో చేర్పించారు. సమాచారం అందుకున్న బాధిత కుటుంబసభ్యులు తెల్లవారుజాము మూడు గంటలకు బెంగళూరుకు చేరుకున్నారు. ఆస్పత్రి వద్దకు చేరుకోగానే కుమార్తె మరణించిందన్న విషయం తెలుసుకుని గౌతమి తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. బంధువులు, సహ విద్యార్థుల రోదనలతో ఆస్పత్రి నిండిపోయింది. ఇదిలా ఉండగా హోంశాఖ మంత్రి కే.జే జార్జ్, నగరపోలీస్‌కమిషనర్ ఎం.ఎన్.రెడ్డితో పాటు పలువురు సీనియర్ పోలీస్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సమాచారం సేకరించారు. పోలీసుల అదుపులో నిందితుడు కాల్పులు జరిపిన అనంతరం మహేశ్ బెంగళూరులోని ఏ.నారాయణపురలో ఉంటున్న తన అక్క ఇంటికి వెళ్లిపోయాడు. ఇంతలో మహేశ్ ఫొటో టీవీల్లో రావడం గమనించిన ఆ ఇంటి ఓనర్ పోలీసులకు బుధవారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఫోన్ చేసి మహేశ్ ఆచూకీ తెలిపారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు మహేశ్‌ను అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి పోలీసులకు అన్ని రకాలుగా సహకారం అందిస్తామని కళాశాల ప్రతినిధి ప్రశాంత్ మీడియాతో పేర్కొన్నారు. మరోవైపు విద్యార్థునులకు రక్షణ కల్పించలేక పోయిన కళాశాల లెసైన్సును రద్దు చేయాలని పలు సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా శిరీష తల్లి జయంతి వాదన మరోలా ఉంది. గౌతమి, శిరీష వేర్వేరు గదుల్లో ఉండగా మొదట గౌతమిపై కాల్పులు జరిగాయని, అటుపై పక్క గదిలో ఉన్న శిరీష పై కాల్పులు జరపడంతో శిరీష గాయపడినట్లు మీడియాతో పేర్కొన్నారు. తపంచా ఎలా వచ్చింది... నిందితుడి చేతికి తపంచా ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా రాత్రి సమయంలో విద్యార్థునులు ఉంటున్న హాస్టల్లోకి ఎలా చేరారనే విషయంపై కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. ఇదిలా ఉండగా నిందుతుడు మహేశ్...కళాశాల విద్యార్థునులు బయటి వారితో ఎవరితోనూ మాట్లాడకూడదని తరుచుగా బెదిరించేవాడని తెలుస్తోంది. దీంతో విద్యార్థునులు ఇతన్ని వివిధ నిక్‌నేమ్‌లతో గేలిచేసేవారని ఈ విషయంలో మనస్థాపం చెందిన మహేశ్ ఈ ఘాతుకానికి తెగబడినట్లు తెలుస్తోంది. -
గౌతమి అందరికీ ఆదర్శం:కమల్ హాసన్
యశోద అంతర్జాతీయ కేన్సర్ సదస్సులో సినీ నటి గౌతమి మనో నిబ్బరమే ఆయుధమని, ధైర్యంగా పోరాడాలని పిలుపు రోగులకు కౌన్సిలింగ్ అవసరమన్న కమల్‌హాసన్ సాక్షి, హైదరాబాద్: కేన్సర్‌ను పారదోలేందుకు ప్రతి ఒక్కరూ చేతులు కలపాలని సినీ నటి గౌతమి పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాధి విస్తృతమవుతోందని, ప్రతి ఒక్కరి జీవితంలోనూ వారికి తెలిసిన ఎవరో ఒకరికి కేన్సర్ వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. యశో ద ఆసుపత్రి ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో అంతర్జాతీయ కేన్సర్ సదస్సు ప్రారంభమైంది. గౌతమితో పాటు సుప్రసిద్ధ నటుడు కమల్‌హాసన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌతమి మాట్లాడారు. ‘నాకు కేన్సర్ వచ్చింది. కీమోథెరపీ చేయించుకున్నా. మళ్లీ వచ్చింది. చికిత్స చేయించుకుంటే మళ్లీ తగ్గింది. ఇలా వివిధ వేదికలపై కేన్సర్‌పై ప్రచారం చేయడాన్ని బాధ్యతగా భావిస్తున్నా. అందరికీ ఆ బాధ్యత ఉంది. ఇది కూడా ఇతర వ్యాధుల వంటిదే. దీన్ని మనం పారదోలగలం’ అని అన్నారు. కేన్సర్ వచ్చిన వారికి మనోధైర్యం చాలా ముఖ్యమని, శరీరంలో ఊపిరి ఉన్నంత వరకు పోరాడాల్సిందేనని ఆమె పేర్కొన్నారు. ఇందుకోసం ప్రభుత్వ మద్దతు కూడా చాలా ముఖ్యమన్నారు. మూలకణ మార్పిడి కేంద్రం ప్రారంభం కార్యక్రమంలో భాగంగా అంతర్జాతీయ కేన్సర్ సదస్సును కమల్ ప్రారంభించారు. బోన్‌మారో(ఎముక మజ్జ), స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంట్ సెంటర్(మూలకణ మార్పిడి కేంద్రం)ను ఆ ప్రక్రియలో సిద్ధహస్తులైన డాక్టర్ మమ్మెన్ చాందీ ప్రారంభించారు. ఈ సదస్సులో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి రాజయ్య మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం హెల్త్ హబ్‌గా మారుతోందన్నారు. మంత్రి కె. తారక రామారావు మాట్లాడుతూ.. వైద్యరంగంలో నగరానికి ఎంతో భవిష్యత్తు ఉందన్నారు. కాగా, గతంలో కార్డియాలజీపై దృష్టిపెట్టిన తాము ఇప్పుడు కేన్సర్‌పై కేంద్రీకరించామని యశోద ఆసుపత్రి ఎండీ జీఎస్ రావు తెలిపారు. గౌతమి అందరికీ ఆదర్శం.. కేన్సర్‌ను జయించేందుకు గౌతమి ఎం తో ధైర్యం ప్రదర్శించిందని కమలహాసన్ అన్నారు. అనేక సినిమాల్లో నటిం చిన తాను సైడ్ క్యారక్టర్‌నేనని.. ఆమె నిజమైన హీరో అని కితాబిచ్చారు. కేన్సర్ వస్తే ఎదురొడ్డి పోరాడాలని పేర్కొన్నారు. కేన్సర్ రోగులకు మానసిక నిబ్బరానికి కౌన్సిలింగ్ అవసరమన్నారు. చాలామంది కేన్సర్‌తో చనిపోతున్నారనేది నిజం కాదన్నారు. హోటల్‌పైనో, క్రికెట్‌పైనో కాకుండా వైద్యరంగంపైనే యశోద ఆసుపత్రి యాజమాన్యం ఖర్చు పెట్టడం అభినందనీయమన్నా రు. వివిధ దేశాలకు చెందినవారు ఇక్కడ కేన్సర్‌కు చికిత్స చేయించుకుంటున్నారని, మేక్ఇన్ ఇండియా లో యశోద యాజమాన్యం తనవంతు బాధ్యత నెరవేర్చుతోందన్నారు. ధనికులు సమాజానికి సేవలందిం చాలన్నారు. గౌతమి, తాను మళ్లీ సినిమాలో కలిసి నటిస్తున్నామనివెల్లడించారు. ప్రతి ఒక్కరూ పన్నులు చెల్లిస్తే పేదల కోసం ఖర్చు చేసేందుకు ప్రభుత్వానికి తగిన నిధులు సమకూరుతాయని చెప్పారు. -
కేన్సర్‌ను పారదోలుదాం
-
నాటి బ్యూటీస్ నేటి ఆంటీస్‌గా...
పాత్రల ప్రాముఖ్యత, పరిధిల్లో ట్రేడ్ ఉండవచ్చునేమో గానీ సినిమాల్లో నాయికానాయకులు లేని చిత్రాలు అరుదే. కమర్షియల్ అంశాలకు హీరో ఎంత అవసరమో కనువిందు చేయడానికి హీరోయిన్ అంతే అవసరం. కొన్ని చిత్రాల్లో హీరోయిన్లు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటారు. అలా అందం, అభినయంతోను తమ సత్తా చాటి ప్రముఖ కథానాయికలుగా రాణించిన పలువురు తరువాత వివాహ బంధాలతో సంసార జీవితంలోకి వెళ్లిపోయూరు. కొంతకాలం పాటు మాతృత్వ మాధుర్యాన్ని చవిచూశారు. పిల్లా పాపలతో సుఖ సంతోషాలను అనుభవించి, మళ్లీ నటనపై దృష్టి సారిస్తున్న వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది. ఏదేమైనా నాడు బ్యూటీస్‌గా వెలుగొందిన భామలు నేడు ఆంటీస్‌గా రాణిస్తున్నారు. మరి కొందరు ఆ ప్రయత్నంలో ఉన్నారు. వీరిని ఒక్కసారి పరిశీలిస్తే అతిలోక సుందరి బిరుదు సొంతం చేసుకున్న శ్రీదేవితోపాటు నదియ, మనీషా కొయిరాలా, గౌతమి, మధుబాల, అమల, తులసి, జ్యోతిక, అభిరామి, కిరణ్రాథోడ్, ప్రియా ఆనంద్, లైలా తదితరులు సెకండ్ ఇన్నింగ్స్‌లో మంచి పాత్రల్లో అలరించడానికి రెడీ అయ్యారు. గౌతమి పునరాగమనం పదహారణాల తెలుగమ్మాయి గౌతమి తమిళంలో వర్ధమాన నటుల నుంచి సూపర్‌స్టార్ రజనీకాంత్ కమలహాసన్ వరకు జోడి కట్టి ప్రముఖ హీరోయిన్గా రాణించారు. ఆ తరువాత కొంతకాలం నటనకు దూరంగా వున్న గౌతమి తాజాగా తాను సహజీవనం చేస్తున్న నటుడు కమలహాసన్‌తోనే. పాపనాశం చిత్రం ద్వారా రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో ఈమె ముగ్గురు పిల్లల తల్లిగా నటిస్తున్నారు. ఇంకా తెలుగు బుల్లితెరపై కొన్ని నృత్య సంగీత కార్యక్రమాలకు ఈమె న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరిస్తున్నారు. అతిలోక సుందరి సీనియర్ నటి శ్రీదేవి విషయానికొస్తే ఇద్దరు పిల్లల తల్లి. ఆమె పెద్ద కుమార్తెను హీరోయిన్గా పరిచయం చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. సుదీర్ఘ విరామం తరువాత ఆమె ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో రీ ఎంట్రీ అయ్యారు. ఆ చిత్రానికి ఆమె ప్రధానం అయినా ఆంటీ పాత్రనే పోషించి మెప్పించారు. ఆ తరువాత చిన్న గ్యాప్ తీసుకుని, తాజాగా తమిళంలో విజయ్ హీరోగా నటిస్తున్న గరుడ చిత్రంలో ముఖ్యపాత్ర చేస్తున్నారు. అదే విధంగా తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్గా పలు చిత్రాలు చేసిన నటి నదియ ఎం.కుమరన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి చిత్రం ద్వారా ఆ చిత్ర హీరో జయం రవికి తల్లిగా నటించారు. ఆ చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టడంతో ఆ తరువాత వరుసగా అమ్మగా, అత్తగా, అక్కగా పలు చిత్రాల్లో నటి స్తున్నారు. బుల్లి తెరపై మెరుపులు అమలా నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళంతోపాటు తెలుగులోను క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్. నాగార్జునను వివాహమాడిన తరువాత నటనకు దూరంగా ఉన్నారు. ఈమె కొడుకు అఖిల్ ఒక పక్క హీరోగా పరిచయం అవుతుంటే అమల మళ్లీ నటిగా పునఃప్రవేశం చేయడం విశేషం. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో ముగ్గురు పిల్లలకు తల్లిగా నటించిన ఈమె తాజాగా తమిళంలో ఒక మెగా సీరియల్లో నటిస్తున్నారు. అదే విధంగా అజిత్ సరసన కాదల్‌మన్నన్ చిత్రంలో నటించిన మాను కొంతకాలం చిత్రాలకు దూరంగా సింగపూరులో నివసించారు. మళ్లీ ఇటీవల ఎన్న సత్తం ఇంద నేరం చిత్రం ద్వారా రీ ఎంట్రీ అయ్యారు. మాళవిక, లైలా, ప్రియారామన్ తదితరులు బుల్లితెరపై ప్రత్యక్షమవుతున్నారు. వీరంతా సినిమానే లోకంగా జీవిస్తున్న తారలు. వీరి పునః ప్రవేశానికి సంపాదన ఒక్కటే కారణం కాదు. దానిని మించి నటనపై మమకారం అని చెప్పవచ్చు. ఏడేళ్ల తరువాత... కోలీవుడ్‌లో నంబర్ వన్ హీరోయిన్గా వెలిగిన జ్యోతిక నటుడు సూర్యతో కలిసి ఏడు చిత్రాలు చేసి ఏడేళ్లు ఆయనతో ప్రేమబంధాన్ని పెంచుకుని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఏడేళ్ల విరామం తరువాత జ్యోతిక నటిగా రీ ఎంట్రీ అయ్యారు. మలయాళంలో ఘనవిజయం సాధించిన హౌ ఓల్డ్ ఆర్ యు చిత్ర తమిళ రీమేక్‌లో జ్యోతిక నటిస్తున్నారు. ఇది వివాహానంతరం స్త్రీలు ఎదుర్కొనే సమస్యల ఇతివృత్తంతో తెరకెక్కుతున్న చిత్రం. ఇంతకుముందు కథనాయికిగా విజయ విహారం చేసిన రమ్యకృష్ణ ప్రస్తుతం ఆంటీ పాత్రలతో అలరిస్తున్నారు. పక్కింటి అమ్మాయి ఇమేజ్ సంపాదించుకున్న దేవయాని ఆ తరువాత బుల్లితెరపై ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం నగరంలోనే ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఈమె తాజాగా సహాబ్దం చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. ఇంతకుముందు కమలహాసన్ సరసన విరుమాండి చిత్రంతోపాటు ప్రభు తదితర ప్రముఖ హీరోలతో డ్యూయెట్లు పాడిన అభిరామి హౌ ఓల్డ్ ఆర్ యు చిత్రం ద్వారా మళ్లీ నటనపై దృష్టి సారిస్తున్నారు. -
ఇప్పుడు కమల్ వంతు..
కమల్‌హాసన్ పోషించిన పాత్రను ఇతర భాషల్లో చేయడానికి దాదాపు ఏ హీరో ధైర్యం చేయరు. ఎందుకంటే... కమల్ ఓ పాత్ర చేస్తే... ఆ పాత్రను అంతకు మించి చేయడానికి ఏమీ ఉండదు. అందుకే.. నిర్మాతలు కూడా ఆయన సినిమాలను రీమేక్ చేయడానికి సాహసించరు. సాధ్యమైనంతవరకూ అనువదించేస్తారంతే. అడపాదడపా కొన్ని కమల్ సినిమాలు వేరే హీరోలతో రీమేక్ అయినా... అవి విజయాలను అందుకున్న దాఖలాలు తక్కువ. కమల్ మాత్రం అప్పుడప్పుడు ఇతర హీరోల చిత్రాలను రీమేక్ చేయడానికి ఉత్సాహం చూపుతుంటారు. పదకొండేళ్ల క్రితం బాలీవుడ్లో విజయం సాధించిన ‘మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్’ చిత్రాన్ని కమల్ ‘వసూల్‌రాజా ఎం.బి.బి.ఎస్’గా తమిళంలో చేశారు. నసీరుద్దీన్‌షా నటించిన ‘వెన్స్డే’ చిత్రాన్ని తెలుగులో ‘ఈనాడు’గా, తమిళంలో ‘ఉన్నయ్పోల్ వరువన్’గా చేశారు కమల్. వాటి ఫలితాలు ఎలా ఉన్నా... నటునిగా కమల్ మాత్రం ఆ సినిమాల్లో విశ్వరూపాన్ని చూపించారనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన నటిస్తున్న మరో రీమేక్ ‘పాపనాశమ్’. మలయాళంలో మోహన్‌లాల్ నటించిన ‘దృశ్యం’ ఈ చిత్రానికి మాతృక. ఇప్పటికే ఈ కథ తెలుగులో వెంకటేశ్ హీరోగా, కన్నడంలో రవిచంద్రన్ హీరోగా రీమేక్ అయ్యింది. ఇక మిగిలింది తమిళమే. ప్రమాదంలో చిక్కుకున్న తన కుటుంబాన్ని ఆ ఇంటిపెద్ద ఎలా ఒడ్డుకు చేర్చాడన్నదే ఈ సినిమా కథ. ఇందులో కమల్‌కి జోడీగా గౌతమి నటిస్తుండటం విశేషం. కమల్-గౌతమిది ఒకప్పుడు సూపర్‌హిట్ కాంబినేషన్. విచిత్రసోదరులు, క్షత్రియపుత్రుడు చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఈ జంట ఆకట్టుకుంది. గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న ఈ జంట మళ్లీ ఇన్నాళ్లకు తెరను పంచుకోవడం విశేషం. మాతృక దర్శకుడైన జీతూ జోసఫ్ ఈ తమిళ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్‌లాల్, వెంకటేశ్, రవిచంద్రన్ తమ పరిథి మేరకు ఈ పాత్రను అద్భుతంగా రక్తికట్టించారు. ఇప్పుడు కమల్ వంతు వచ్చింది. ఇటీవలే ‘పాపనాశమ్’ స్టిల్స్‌ని మీడియాకు విడుదల చేశారు. వాటిలో కమల్ ఆహార్యం, హావభావాలు సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. సంక్రాంతికి ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. -
‘పాపనాశం’లో కమల్ నిమగ్నం
నటుడు కమలహాసన్ పాపనాశం చిత్ర షూటింగ్లో పూర్తిగా లీనమైపోయాడు. ఆయన నటిస్తున్న విశ్వరూపం-2, ఉత్తమవిలన్ చిత్రాల షూటింగ్ పూర్తి కావడంతో తాజా చిత్రం పాపనాశం షూటింగ్లో పాల్గొంటున్నారు. మలయా ళం, తెలుగు భాషల్లో మంచి విజయాన్ని సాధించిన దృశ్యం చిత్రానికి రీమేక్ పాపనాశం. ఈ చిత్రంతో కమల్ సరసన నటించే నటి ఎవరన్న విషయంపై శ్రీదేవి, సిమ్రాన్ మొదలగు సీనియర్ నటీమణుల పేర్లు ప్రచారమయ్యాయి. చివరికి కమల్‌తో నటించే అవకాశం నటి గౌతమికి దక్కింది. ఈ చిత్ర షూటింగ్ తిరునల్వేలి సమీపంలోని నంగునెరి, పాపనాశం ప్రాంతాలలో ముమ్మరంగ సాగుతోంది. కాగా చిత్ర షూటింగ్ విరామ సమయాల్లో కమల్ ఆ ప్రాంతాల్లోని ఆధ్యాత్మిక పండితుల్ని, సామాజిక సేవకులను కలుసుకోవడం విశేషం. నంగునేరిలో షూటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడి తోడాద్రి నాదర్ వైష్ణవ మఠాన్ని సందర్శించి మఠంలోని జీయర్ను కలుసుకున్నారు. అక్కడాయన చొక్కా తీసి ఒంటికి విబూది పూసుకోవడంతో విమర్శలు ఎదరయ్యాయి. అనంతరం కమల్ ప్రముఖ పరిశోధకుడు టీ.పరమశివంను కలిశారు. తెన్‌కాశిలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఆ ప్రాంతానికి చెందిన సామాజిక సేవకుడు కృష్ణను కలిసి సంభాషించారు. కమల్‌లోని ఈ మార్పునకు పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
మరోసారి కమల్‌తో గౌతమి
విశ్వ నటుడు కమల్ హాసన్‌తో నటి గౌతమి మరోసారి జతకట్టడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ జంట ఇంతకు ముందు కురుదిపుణళ్, దేవర్ మగన్ చిత్రాల్లో అలరించిన విషయం తెలిసిందే. అప్పుడు తెరపై జీవించిన ఈ సంచలన జోడీ ఇప్పుడు ఒకరి కోసం ఒకరన్నట్లుగా సహజీవనం చేస్తున్నారు. కాగా కమల్ ప్రస్తుతం ఉత్తమ విలన్ చిత్రంలో నటిస్తున్నారు. ఆయన నటన పరాకాష్టకు మరో ఉదాహరణగా ఈ చిత్రం తెరపై ఆవిష్కృతం కానుంది. తదుపరి కమల్ మల యాళ చిత్రం దృశ్యం రీమేక్‌లో నటించనున్నారు. ఈ చిత్రంలో ఆయన సరసన నటించే హీరోయిన్ ఎవరన్న విషయంలో నటి మీనా, రేవతి, సిమ్రాన్ తదితర పేర్లు వార్తలకెక్కాయి. ఈ ప్రచారాలను నటి మీనాతో సహా అందరూ ఖండించారు. ఆ పాత్రకు నటి గౌతమి పోషించనున్నారనేది తాజా సమాచారం.