అది అనాగరిక ప్రకటన: కమల్ మండిపాటు
అది అనాగరిక ప్రకటన: కమల్ మండిపాటు
Published Wed, Nov 2 2016 5:56 PM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM
13 ఏళ్ల అనుబంధానికి తెరదించుతూ నటి గౌతమీ కమల్ హాసన్ నుంచి వీడిపోయిన సంగతి తెలిసిందే. కమల్ నుంచి తాను వీడిపోతున్నట్టు గౌతమీ ప్రకటించగానే.. కమల్ హాసన్ పేరిట ఒక ప్రకటన వెలువడింది. దీనిని కొన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి కూడా. అయితే... ఈ ప్రకటనపై కమల్ హాసన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరో తన పేరిట ప్రకటన విడుదల చేశారని, ఇది తీవ్ర అనాగరిక చర్య అని కమల్ బుధవారం ట్వీట్ చేశారు. గౌతమీతో వీడిపోతున్న విషయంలో తాను ఎలాంటి ప్రకటన చేయలేదని, ప్రస్తుతం ప్రకటన చేసే ఉద్దేశం తనకు లేదని కమల్ స్పష్టం చేశాడు.
'తనకు ఉపశమనం, ఊరట కలిగించే నిర్ణయం గౌతమి తీసుకోవడాన్ని నేను కూడా మంచిగానే భావిస్తాను. ఈ సమయంలో నా భావోద్వేగాలకు ప్రాధాన్యం లేదు. గౌతమి, సుబ్బుల సుఖసంతోషాలే నాకు ముఖ్యం. వారికి నా శుభాశీస్సులు ఉంటాయి. ఇకముందు కూడా వారికి ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటాను. ముగ్గురు కూతుళ్లు-శ్రుతి, అక్షర, సుబ్బలక్ష్మిలకు తండ్రిగా నేను ఎంతో సంతోషంగా ఉన్నా' అంటూ కమల్ హాసన్ ఒక ప్రకటన చేసినట్టు కథనాలు వచ్చాయి. కమల్ నుంచి విడిపోయానని గౌతమి ప్రకటించిన తర్వాత వచ్చిన ఈ ప్రకటన రావడంతో ఇది నిజంగా ఆయన చేసినట్టు భావించారు. అయితే, ఇది తన ప్రకటన కాదని, ఎవరో కావాలనే తన పేరిట ఈ అనాగరిక చర్యకు పాల్పడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement