ఓపీఎస్కు వెల్లువెత్తిన 'సినీ' మద్దతు!
చెన్నై: బలపరీక్షలో ఓడిపోయినప్పటికీ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి సినీ ప్రముఖుల నుంచి మద్దతు వెల్లువెత్తడం గమనార్హం. బలపరీక్షను తీవ్రంగా తప్పుబట్టిన ప్రముఖ సినీ నటి గౌతమి నేరుగా ఓపీఎస్కు మద్దతు ప్రకటించారు. బలపరీక్షలో గెలిచిన శశికళ నమ్మినబంటు పళనిస్వామి బృందాన్ని ఖండించారు. 'అంకెల గారడీ' ద్వారా ప్రజాస్వామ్యాన్ని వంచించలేరని, ఇది ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజాస్వామ్యం కొనసాగుతుందని ఆమె ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాడాపాండి.. ముఖ్యమంత్రి ఓపీఎస్సే కావాలంటూ ఆమె యాష్ట్యాగ్ జోడించారు.
Democracy can't be manipulated by "Number Games" It's the VOICE OF the PEOPLE. BY the PEOPLE. FOR the PEOPLE #SaveDemocracy #OPSForCM
— Gautami (@gautamitads) 16 February 2017
ఇక సీనియర్ నటుడు కమల్ హాసన్ కూడా పరోక్షంగా పన్నీర్ సెల్వానికి మద్దతు పలికారు. బలపరీక్ష జరిగిన తీరును వ్యంగ్యంగా ఎండగట్టిన ఆయన.. బలపరీక్షపై గవర్నర్కు తమ గళాన్ని వినిపిస్తూ ఈమెయిళ్లు పంపించాలని, ఈ మెయిళ్లలో హుందాగా, అసభ్యత లేకుండా చక్కని భాషతో తమ అభిప్రాయాన్ని తెలియజేయాలంటూ.. గవర్నర్ ఈమెయిల్ ఐడీ (Rajbhavantamilnadu@gmail.com) ట్వీట్ చేశారు. ఇక మరో నటుడు అరవింద స్వామి అయితే.. ఏకంగా మరోసారి ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రీ ఎలక్షన్ ఒక్కటే మార్గమని, బలపరీక్ష ప్రజాతీర్పును ప్రతిఫలించడం లేదని పేర్కొన్నారు.
In my opinion, The only solution that is acceptable under the circumstances is a re- election. This is not the people's mandate.
— arvind swami (@thearvindswami) 18 February 2017
Rajbhavantamilnadu@gmail.com
— Kamal Haasan (@ikamalhaasan) 18 February 2017
ங்கற விலாசத்துக்கு நம் மன உளைச்சலை மின் அஞ்சலா
அனுப்புங்க. மரியாதையா பேசணும் அது அசம்பளியில்ல Governor வீடு