tamilnadu assembly
-
TN: తమిళనాడు సర్కారుకు గవర్నర్ షాక్
చెన్నై: తమిళనాడు ప్రభుత్వానికి ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్ రవికి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సోమవారం తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు గవర్నర్ ఆర్.ఎన్ రవి అసెంబ్లీకి వచ్చారు. ప్రారంభించిన కొద్ది నిమిషాలకే గవర్నర్ తన ప్రసంగాన్ని ముగించారు. సీఎం స్టాలిన్, స్పీకర్, ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు చెప్పి అనంతరం తాను ప్రసంగం చదవడం లేదని తెలిపారు. ప్రసంగంలోని అంశాలు సరిగా లేవని, ప్రసంగం ప్రారంభించే ముందు, పూర్తయిన తర్వాత జాతీయ గీతం ఆలపించాలని తాను చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం పట్టించుకోలేదని ఇందుకే తాను ప్రసంగం చదవ లేదని గవర్నర్ తెలిపారు. #WATCH | Tamil Nadu Governor RN Ravi, who refused to read the address given by the government to him at the Legislative Assembly, leaves from the Assembly https://t.co/9IvBmDvMp6 pic.twitter.com/gYv8RjNmq7 — ANI (@ANI) February 12, 2024 ప్రసంగంలోని చాలా అంశాలపై తనకు అభ్యంతరాలున్నాయని గవర్నర్ చెప్పారు. అసలు నిజాలు, క్షేత్రస్థాయి పరిస్థితులకు ప్రసంగంలోని అంశాలు ప్రతిబింబించడం లేదని గవర్నర్ చెప్పారు. ఇటీవలే కేరళలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. అక్కడి గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కూడా ప్రసంగంలోని కేవలం లాస్ట్ పేరా చదవి గవర్నర్ ప్రసంగాన్ని ముగించారు. ఇదీ చదవండి.. నేడు బీహార్‌లో ఏం జరగనుంది.. ఎవరి బలం ఎంత -
పేపర్ చదువుతూ గుండెపోటుతో ఎమ్మెల్యే మృతి
సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే ఎమ్మెల్యే కనగరాజ్ గురువారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. సులూరు శాసన సభ నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఇవాళ ఉదయం మరణించారు. ఎమ్మెల్యే కనగరాజ్ ఈ రోజు ఉదయం న్యూస్ పేపర్ చదువుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో ఆయనను సమీప ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా 2016 మే నుంచి ఇప్పటివరకూ అయిదుగురు ఎమ్మెల్యేలు చనిపోయారు. శ్రీనివేల్, ఏకే బోస్ (తిరుప్పరంగుండ్రం), జయలలిత (ఆర్కే నగర్) కరుణానిధి (తిరువారూర్), కనగరాజ్ (సులూరు) అనారోగ్యంతో కన్నుమూశారు. వీరిలో నలుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కాగా, మరొకరు డీఎంకే చీఫ్. ఎమ్మెల్యే కనగరాజ్ మృతితో తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 22 స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. తమిళనాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు పదిశాతం స్థానాలు ఖాళీగా ఉండటం రాష్ట్ర చరిత్రలోనే ఇది ప్రథమం. 39 లోక్‌సభ స్థానాలతో పాటు, ఎమ్మెల్యేల మరణాలతో ఏర్పడ్డ ఖాళీలతో పాటు అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. -
అసెంబ్లీలో తూత్తుకుడి అలజడి
సాక్షి ప్రతినిధి, చెన్నై: తూత్తుకుడి కాల్పుల ఘటన తమిళనాడు అసెంబ్లీని కుదిపేసింది. మంగళవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యులు తూత్తుకుడి ఘటనపై తీవ్ర వాగ్వాదానికి దిగారు. స్టెరిలైట్ కర్మాగారాన్ని మూసివేయాలంటూ కేబినెట్ తీర్మానం చేసేదాకా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రతిపక్ష డీఎంకే ప్రకటించింది. దీంతో ప్రభుత్వం కాస్తంత దిగివచ్చింది. తూత్తుకుడి ఘటనకు నిరసనగా మంగళవారం డీఎంకే సభ్యులు నలుపు రంగు దుస్తులు ధరించి సభకు హాజరయ్యారు. సభ ప్రారంభం కాగానే తూత్తుకుడిలో పోలీసు కాల్పుల అనంతరం తీసుకున్న నష్ట నివారణ చర్యలు, స్టెరిలైట్ కంపెనీని శాశ్వతంగా మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై అధికార అన్నాడీఎంకే సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. అయితే, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే మాత్రం వాటిని కంటితుడుపు చర్యలుగా పేర్కొంది. కాల్పుల ఘటనకు బాధ్యత వహిస్తూ సీఎం పళనిస్వామి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. వెంటనే కేబినెట్‌ను సమావేశపరిచి స్టెరిలైట్ కర్మాగారాన్ని మూసివేస్తూ తీర్మానం చేయాలని పేర్కొంది. ఆ తీర్మానం చేసేదాకా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోమంటూ డీఎంకే నేత స్టాలిన్ సహా ఆ పార్టీ సభ్యులంతా వాకౌట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం..ప్రజల ప్రయోజనాలను పరిరక్షించేందుకు వేదాంత గ్రూప్ స్టెరిలైట్ ప్లాంట్ విస్తరణ రెండోదశకు ఇచ్చిన 342.22 ఎకరాల భూ కేటాయింపును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దీంతోపాటు 13 మంది మరణానికి కారణమైన పోలీసు కాల్పులపై సీబీ–సీఐడీ విచారణకు ఆదేశించింది. తూత్తుకుడిలోని వేదాంత గ్రూప్‌నకు చెందిన స్టెరిలైట్ కర్మాగారం కాలుష్యాన్ని వెదజల్లుతోందంటూ ప్రజలు ఆందోళన చేయడం తెల్సిందే. -
అక్కడ కూడా స్పీకర్‌పై అవిశ్వాసం
తమిళనాట కూడా ప్రతిపక్ష పార్టీ అయిన డీఎంకే.. అక్కడి అసెంబ్లీ స్పీకర్ ధనపాల్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే అది ఓడిపోయింది. తీర్మానానికి అనుకూలంగా 97 ఓట్లు, వ్యతిరేకంగా 122 ఓట్లు వచ్చాయి. దాంతో పళనిస్వామి ప్రభుత్వం మరోసారి సభలో తన బలాన్ని నిరూపించుకున్నట్లు అయ్యింది. ఫిబ్రవరి 18వ తేదీన నిర్వహించిన విశ్వాస తీర్మానంలో కూడా ప్రభుత్వానికి సరిగ్గా 122 ఓట్లే వచ్చాయి. అయితే అప్పట్లో పళనిస్వామిని తీవ్రంగా వ్యతిరేకించిన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ఆయనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరూ సభలో లేరు. మాజీ డీజీపీ, మైలాపూర్ ఎమ్మెల్యే ఆర్ నటరాజ్ మాత్రం అప్పట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇక తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించేముందు.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత తనను స్పీకర్‌గా చేశారని, తాను సభను నిర్వహిస్తున్న తీరును ఆమె ఎంతగానో ప్రశంసించారని ధనపాల్ చెప్పారు. తాను రెండు సార్లు చాలా బాధపడ్డానని, ఒకటి జయలలిత సంతాప సందేశం చదివేటప్పుడు, రెండోసారి ఫిబ్రవరి 18న సభలో డీఎంకే సభ్యుల ప్రవర్తన చూసి అని తెలిపారు. ధనపాల్ తన చాంబర్లోకి వెళ్లిన తర్వాత డిప్యూటీ స్పీకర్ పొల్లాచి జయరామన్ సభకు అధ్యక్షత వహించి, మూజువాణీ ఓటు, ఆ తర్వాత డివిజన్ నిర్వహించారు. తీర్మానం వీగిపోయిన తర్వాత స్పీకర్ ధనపాల్ మళ్లీ తన స్థానంలోకి వచ్చారు. దాంతో అధికార పార్టీ సభ్యులు బల్లలను చరుస్తూ తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. తమకు బలం లేదని తెలిసి కూడా తీర్మానాన్ని ప్రవేశపెట్టామని ప్రతిపక్ష ఉపనేత ఎస్ దురై మురుగన్ చెప్పారు. జయలలిత అప్పుడు పొగడటం మంచిదేనని, అసెంబ్లీ పదవీకాలం మొత్తం ముగిసిన తర్వాత తమ ప్రశంసలు కూడా పొందేలా సభను నిర్వహించాలని సూచించారు. -
తమిళనాడు ముఖ్యమంత్రికి నోటీసులు
చెన్నై : తమిళనాడు అసెంబ్లీలో జరిగిన బలపరీక్షపై ప్రతిపక్ష డీఎంకే దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సహా, హోంసెక్రటరీ, అసెంబ్లీ స్పీకర్‌తో పాటు అసెంబ్లీ కార్యదర్శికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి మార్చి 10లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయమూర్తులు జస్టిస్ జి.రమేష్, మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. కాగా ఈ నెల 18న అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్ష సందర్భంగా శాసనసభ నియమాలను అనుసరించి జరగలేదని పేర్కొంటూ డీఎంకే న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. బల పరీక్షలో భాగంగా రహస్య ఓటింగ్‌ను కోరినా స్పీకర్ ధన్పాల్ పట్టించుకోకుండా తమను సభ నుంచి బయటకు గెంటేశారని, ప్రతిపక్ష సభ్యులు లేకుండా సభలో జరిగిన విశ్వాస పరీక్ష ఏ రకంగానూ చెల్లదంటూ తన పిటిషన్లో పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ నోటీసులు ఇచ్చింది. మరోవైపు బలపరీక్ష సందర్భంగా చోటుచేసుకున్న తీవ్ర గందరగోళ పరిస్థితులపై ఇప్పటికే తమిళనాడు ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావు నివేదిక కోరారు. బలపరీక్ష సందర్భంగా సభలో చోటుచేసుకున్న ఘటనలపై నివేదిక ఇవ్వాలని ఆయన అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు. -
పళని బలపరీక్ష చెల్లదు!
మద్రాస్ హైకోర్టులో డీఎంకే పిటిషన్ బలపరీక్ష రద్దు చేయాలని విజ్ఞప్తి చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో గత శనివారం నిర్వహించిన బలపరీక్ష చెల్లదంటూ ప్రధాన ప్రతిపక్షం డీఎంకే కోర్టుకెక్కింది. ప్రతిపక్షాలు లేకుండానే అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్ష చెల్లదని ఆదేశాలు ఇవ్వాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీ నుంచి డీఎంకే సభ్యులను బలవంతంగా గెంటేసిన విషయాన్ని పిటిషన్లో ప్రస్తావించింది. బలపరీక్షలో భాగంగా రహస్య ఓటింగ్‌ను చేపట్టాలని కోరినా స్పీకర్ ధన్పాల్ పట్టించుకోలేదని, తమను సభ నుంచి బయటకు గెంటేశారని, మార్షల్స్ తమపై దాడికి పాల్పడ్డారని డీఎంకే పిటిషన్లో ఆరోపించింది. ప్రతిపక్ష సభ్యులు లేకుండా సభలో జరిగిన విశ్వాస పరీక్ష ఏ రకంగానూ చెల్లదని స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యాన్ని అత్యవసరంగా స్వీకరించాలని డీఎంకే తరపు న్యాయవాది కోరగా మంగళవారం విచారణ చేపడతామని న్యాయమూర్తులు జస్టిస్ జి.రమేష్, మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. బలపరీక్ష సందర్భంగా చోటుచేసుకున్న తీవ్ర గందరగోళ పరిస్థితులపై ఇప్పటికే తమిళనాడు ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావు నివేదిక కోరిన సంగతి తెలిసిందే. బలపరీక్ష సందర్భంగా సభలో చోటుచేసుకున్న ఘటనలపై నివేదిక ఇవ్వాలని ఆయన అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు. శాసనసభలో బలపరీక్ష సందర్భంగా తీవ్ర నాటకీయ పరిణామాలు, ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష డీఎంకే సభ్యులు సభలో విధ్వంసానికి దిగడంతో అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత స్టాలిన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలను బలవంతంగా సభ నుంచి గెంటేసి.. విపక్షం లేకుండానే స్పీకర్ విశ్వాస పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ విశ్వాసపరీక్షలో 122 మంది ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం పళనిస్వామి గట్టెక్కారు. అయితే, స్పీకర్ చట్టబద్ధంగా వ్యవహరించలేదని, రహస్య ఓటింగ్ నిర్వహించాలన్న తమ డిమాండ్‌కు ఆయన అంగీకరించలేదని, తమను బలవంతంగా సభ నుంచి తరిమేశారని స్టాలిన్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఈ అంశంపై న్యాయపోరాటం చేయాలని డీఎంకే నిర్ణయించింది. అందులో భాగంగానే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
బ్రేకింగ్: పళని బలపరీక్ష చెల్లదు!
-
బలపరీక్ష గలాటాపై స్పందించిన గవర్నర్!
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో శనివారం బలపరీక్ష సందర్భంగా చోటుచేసుకున్న తీవ్ర గందరగోళ పరిస్థితులపై ఆ రాష్ట్ర ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావు స్పందించారు. బలపరీక్ష సందర్భంగా సభలో చోటుచేసుకున్న ఘటనలపై నివేదిక ఇవ్వాలని ఆయన ఆదివారం ఆదేశించారు. శనివారం శాసనసభలో బలపరీక్ష సందర్భంగా తీవ్ర నాటకీయ పరిణామాలు, ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష డీఎంకే సభ్యులు సభలో విధ్వంసానికి దిగడంతో అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత స్టాలిన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలను బలవంతంగా సభ నుంచి గెంటేసి.. విపక్షం లేకుండానే స్పీకర్ విశ్వాస పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ విశ్వాసపరీక్షలో 122 మంది ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం పళనిస్వామి గట్టెక్కారు. అయితే, స్పీకర్ చట్టబద్ధంగా వ్యవహరించలేదని, రహస్య ఓటింగ్ నిర్వహించాలన్న తమ డిమాండ్‌కు ఆయన అంగీకరించలేదని, తమను బలవంతంగా సభ నుంచి తరిమేశారని స్టాలిన్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తొలిసారి స్పందించిన గవర్నర్ బలపరీక్ష సందర్భంగా సభలో జరిగిన పరిణామాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. -
నాడూ.. నేడూ.. అదే డ్రామా!
-
మెరీనా బీచ్‌లో హై డ్రామా!
-
నాడూ.. నేడూ.. అదే డ్రామా!
తమిళనాట చరిత్ర పునరావృతం - 30 ఏళ్ల కిందట ఎంజీఆర్ చనిపోయినపుడూ ఇదే సంక్షోభం - ఆనాడు జానకి, జయలలితల మధ్య ఆధిపత్య పోరాటం - ఇరు వర్గాలు మద్దతుదారులతో శిబిరాలు నిర్వహించిన వైనం - జానకిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్ ఖురానా - విశ్వాస పరీక్ష సందర్భంగా శాసనసభలో ఇరు వర్గాల ఘర్షణ - ఓటింగ్ చెల్లదంటూ జానకి సర్కారును రద్దు చేసిన గవర్నర్ - అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష డీఎంకే గెలుపు ‘చరిత్ర పునరావృతమవుతుంది.. మొదట విషాదంగా, తర్వాత ప్రహసనంగా!’ అన్నాడు కార్ల్ మార్క్స్. తమిళనాట ఇప్పుడు అదే జరుగుతోంది. సరిగ్గా ముప్పై ఏళ్ల కిందట అన్నా డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎం.జీ.ఆర్ చనిపోయినపుడు.. పార్టీలో, ప్రభుత్వంలో ఆధిపత్యం కోసం ఇద్దరి మధ్య పోరాటం జరిగింది. ఎంజీఆర్ భార్య జానకి, ఆయన రాజకీయ శిష్యురాలు జయలలితల మధ్య ఉత్కంఠ భరిత హైడ్రామా సాగింది. నాడు అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు జానకి, జయలలితల వెనుక రెండుగా చీలిపోయారు. అయితే జానకి వైపే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పటిలాగానే ఇరు వర్గాలూ ఎమ్మెల్యేల శిబిరాలు నిర్వహించాయి. ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతున్న జానకిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్ సభలో బలాన్ని నిరూపించుకోవాలని నిర్దేశించారు. ఆ విశ్వాసపరీక్ష సందర్భంగా సభలో హింస చెలరేగింది. రెండు వర్గాల ఎమ్మెల్యేలు ఘర్షణ పడ్డారు. స్పీకర్ పోలీసులను పిలిపించి మరీ సభలో లాఠీచార్జి చేయించిన పరిస్థితి. చివరికి జయ వర్గం ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసి విశ్వాసపరీక్ష నిర్వహించారు. నాడు కూడా ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఆ విశ్వాస పరీక్షలో జానకి గెలుపొందినట్లు ప్రకటించారు. కానీ.. గవర్నర్ ఆ విశ్వాస పరీక్ష చెల్లదని ప్రకటించారు. కేంద్రం జోక్యంతో జానకి ప్రభుత్వం రద్దయింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష డీఎంకే విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో జానకి రాజకీయాల నుంచి తప్పుకుని అన్నా డీఎంకే రెండు వర్గాలూ ఏకమవడం, కేంద్రం డీఎంకే సర్కారును రద్దు చేయటం, రాజీవ్‌గాంధీ హత్యానంతర ఎన్నికల్లో జయ నేతృత్వంలోని అన్నా డీఎంకే గెలుపొందటం చరిత్ర. సరిగ్గా 30 ఏళ్ల తర్వాత అదే డిసెంబర్ నెలలో జయలలిత చనిపోయారు. ఇప్పుడు కూడా.. అన్నా డీఎంకేలో మళ్లీ అదే చరిత్ర పునరావృతమయింది. జయలలిత నెచ్చెలి శశికళకు, అమ్మ నమ్మినబంటు పన్నీర్‌సెల్వంకు మధ్య అధికారం కోసం పోరాటం సాగుతోంది. నాడు ఎంజీఆర్ తెరచాటున ఉన్న జానకి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. నేడు జయలలిత స్నేహితురాలిగా తెరవెనుక ఉన్న శశికళ తెరపైకి వచ్చే ప్రయత్నం చేశారు. నాడు ఎంజీఆర్ ఆశీస్సులతో పార్టీ ప్రచార కార్యదర్శిగా, ఎంపీగా క్రియాశీలంగా ఉండగా.. నేడు జయ నమ్మినబంటుగా ఆమె పరోక్షంలో ఆమె ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా పనిచేసిన పన్నీర్‌సెల్వం అధికారం తనకే దక్కుతుందని ప్రకటించారు. శశికళ తన వర్గం ఎమ్మెల్యేలందరినీ రిసార్టుకు తరలించి శిబిరం నడిపారు. పన్నీర్‌సెల్వం వైపు కేవలం పది మంది మాత్రమే నిలిచారు. అయితే.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అనూహ్యంగా దోషిగా నిర్ధారితురాలై శశికళ జైలుకు వెళ్లడంతో.. ఆమె తన స్థానంలో పళనిస్వామిని అధికార రేసులోకి పంపారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతున్న పళనిస్వామితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించిన గవర్నర్ విద్యాసాగర్‌రావు.. సభలో 15 రోజుల్లోగా బలనిరూపణ చేసుకోవాలని నిర్దేశించారు. ఆ మేరకు శనివారం సభలో విశ్వాసపరీక్ష నిర్వహించగా.. మళ్లీ ఆనాటి గందరగోళమే చెలరేగింది. అయితే.. ఈసారి పన్నీర్ సెల్వం బలం తక్కువగా ఉండటంతో.. బలంగా ఉన్న ప్రతిపక్షం ‘క్రియాశీల’మవటమే తేడా. రహస్య బ్యాలెట్ ఓటింగ్‌కు పట్టుబడుతూ ఆందోళనకు దిగిన డీఎంకే సభ్యులను బయటకు పంపించిన స్పీకర్.. విశ్వాసపపరీక్షలో పళనిస్వామి నెగ్గినట్లు ప్రకటించారు. ఇక తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయనేది వేచిచూడాలి. ఈ నేపథ్యంలో ఎంజీఆర్ మరణించినపుడు తమిళనాడులో జరిగిన రాజకీయ పరిణామాలను ఒకసారి వీక్షిస్తే... ఎంజీఆర్ మృతదేహం వద్ద..: డీఎంకే నుంచి చీలిపోయి అన్నా డీఎంకే పార్టీని స్థాపించి రాష్ట్రంలో ఎదురులేని నేతగా.. తమిళుల ఆరాధ్యదైవంగా పూజలందుకున్న ఎం.జి.రామచంద్రన్ 1987 డిసెంబర్ 24న కన్నుమూశారు. అప్పటికే ఆయనతో కలిసి అత్యధిక సినిమాల్లో హీరోయిన్గా నటించిన జయలలిత.. ఆయన ఆశీస్సులతోనే పార్టీ ప్రచార కార్యదర్శిగా, ఎంపీగా పనిచేస్తూ ప్రజాదరణ పొందారు. కానీ.. ఎంజీఆర్ భార్య జానకికి ఆమె అంటే పడదు. దీంతో ఎంజీఆర్ చనిపోయినపుడు ఆయన స్వగృహం ‘గార్డెన్స్’లో మృతదేహాన్ని సందర్శించేందుకు వచ్చిన జయలలితను లోనికి కూడా రానివ్వలేదు. అయితే.. ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం రాజాజీ హాల్‌కు తరలించినపుడు మాత్రం జయలలిత ఆయన తల వద్ద కదలకుండా కూర్చుండిపోయారు. ఆ తర్వాత అంతిమయాత్ర సందర్భంగా ఎంజీఆర్ భౌతికకాయం ఉంచిన వాహనం పైకి జయలలిత ఎక్కినప్పుడు కూడా.. ఆమెను ఆ వాహనం నుంచి కిందికి తోసేసిన ఘటనను ప్రజలందరూ వీక్షించారు. రాజకీయ చదరంగం షురూ..: ఎంజీఆర్ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత.. రాజకీయ చదరంగం మొదలైంది. జానకి వయసు 62 ఏళ్లు. జయలలిత వయసు 39 సంవత్సరాలు. ఇద్దరూ శాసనసభ్యలు కారు. అప్పటికే రాజ్యసభ ఎంపీ అయిన జయలలిత కొద్ది రోజుల్లోనే అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా పదవి చేపట్టారు. ప్రభుత్వ పగ్గాలు చేపట్టడానికి జానకి సిద్ధమయ్యారు. జయలలిత ఆమెకు సవాల్ విసిరారు. ఈ క్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు రెండు శిబిరాల్లో చీలిపోయారు. జానకి శిబిరంలో 95 మంది ఎమ్మెల్యేలు చేరితే.. జయ శిబిరంలో 30 మంది జమయ్యారు. కానీ.. తమకు 70 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆమె వర్గం ప్రకటించుకుంది. జానకికి మద్దతుగా ఎంజీఆర్ అనుచరుడు ఆర్.ఎం.వీరప్పన్ నిలిస్తే.. జయలలితకు మద్దతుగా ఎస్.తిరునావుక్కరసర్ పనిచేశారు. వీరప్పన్.. జానకి వర్గం ఎమ్మెల్యేలను నగరంలోని త్రీస్టార్ హోటల్ ‘ప్రెసిడెంట్’కు తరలించారు. తిరునావుక్కరసర్.. జయ వర్గం ఎమ్మెల్యేలను ఫైవ్ స్టార్ హోటల్ ‘అడయార్ పార్క్’లో ఉంచారు. ఆ తర్వాత వారిని అక్కడి నుంచి ‘భారత దర్శన్’ యాత్ర పేరుతో పర్యటనకు కూడా పంపించారు. ఇండోర్, ముంబై తదితర ప్రాంతాల సందర్శన అనంతరం బెంగళూరు సమీపంలోని నంది హిల్స్‌కు వారిని తరలించారు. రణరంగమైన శాసనసభ..: అప్పటి గవర్నర్ ఎస్.ఎల్.ఖురానా.. ఇరు పక్షాలనూ ఆహ్వానించారు. తమ బలాలను చూపించమని కోరారు. జానకి మద్దతుదారులను వీరప్పన్ రాజ్ భవన్‌కు తీసుకెళ్లి గవర్నర్ ముందు నిలిపారు. కానీ.. జయ ఆ పని చేయలేదు. ఎందుకంటే అవసరమైనంత మంది సభ్యులు ఆమెవైపు లేరు. దీంతో 1998లో జానకిని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఖురానా ఆహ్వానించారు. కానీ.. ఆ ప్రభుత్వం కేవలం రెండు వారాలే సాగింది. విశ్వాస పరీక్ష కోసం శాసనసభ సమావేశమైనపుడు.. జయ, జానకి వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. అప్పటి శాసనసభ స్పీకర్ పి.హెచ్.పాండ్యన్.. అనూహ్యంగా పోలీసులను పిలిపించి ఆందోళనకు దిగిన ఎమ్మెల్యేలపై లాఠీచార్జీ కూడా చేయించడం సంచలనం సృష్టించింది. అసమ్మతి ఎమ్మెల్యేలను బలవంతంగా బయటకు గెంటేసిన తర్వాత స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. ప్రతిపక్ష డీఎంకే ఓటింగ్‌లో పాల్గొనలేదు. దీంతో జానకి విశ్వాసపరీక్ష నెగ్గినట్లు స్పీకర్ పాండ్యన్ ప్రకటించారు. అయితే.. ఆ ఓటింగ్ ప్రక్రియ పద్ధతిగా జరగలేదంటూ గవర్నర్ ఖురానా.. జానకి ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఎన్నికల్లో డీఎంకే గెలుపు.. బర్తరఫ్..: ఆ తర్వాతి ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. అన్నా డీఎంకేలో వర్గ పోరు ప్రతిపక్ష డీఎంకేకు లాభించింది. ఆ పార్టీ 13 ఏళ్ల విరామం అనంతరం మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జానకి రాజకీయాల నుంచి వైదొలగగా.. అన్నా డీఎంకే చీలిక వర్గాలు రెండూ జయలలిత నాయకత్వంలో ఏకమయ్యాయి. ఆ తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ మద్దతుతో ఏర్పడిన చంద్రశేఖర్ ప్రభుత్వం.. రాజీవ్ గాంధీ ఒత్తిడితో 1991 జనవరిలో తమిళనాడులో కరుణానిధి సర్కారును బర్తరఫ్ చేసింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌తో అన్నా డీఎంకే పొత్తు పెట్టుకుంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా తమిళనాడులో రాజీవ్ గాంధీ హత్యకు గురవడంతో ఎన్నికల్లో వీచిన సానుభూతి పవనాలతో అన్నా డీఎంకే భారీ విజయం సాధించింది. జయలలిత 1991లో ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. - (సాక్షి నాలెడ్జ్ సెంటర్) మరిన్ని తమిళనాడు విశేషాలు చూడండి జయ కేసుల ఖర్చు కర్ణాటక ఖాతాలోకి చెన్నైకు చిన్నమ్మ? విజేత పళని అన్నీ ఉన్నా.. ‘పరీక్ష’లో ఫెయిల్ చిన్నమ్మ శపథం నెరవేర్చాం: దినకరన్ స్టాలిన్‌కు అవమానం.. డీఎంకే ఆందోళనలు -
గవర్నర్‌కు లేఖను సంధించిన స్టాలిన్
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష, ఆ తదనంతర పరిణామాలపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ గవర్నర్ విద్యాసాగర్‌రావుకు లేఖ రాశారు. డీఎంకే లేకుండా అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించి.. దొడ్డిదారిలో ముఖ్యమంత్రిని గెలిపించడమే స్పీకర్ అజెండా అని ఆయన లేఖలో దుయ్యబట్టారు. తమిళనాడులో ప్రజాస్వామిక విలువలను కాపాడాలని ఆయన తన లేఖలో కోరారు. బలపరీక్షను వాయిదా వేసి రహస్య ఓటింగ్ ద్వారా నిర్వహించాలని కోరారు. శాసనసభ వేదికగా జరిగిన బలపరీక్ష సందర్భంగా రోజంతా జరిగిన నాటకీయ పరిణామాలలో స్టాలిన్ కేంద్రబిందువుగా నిలిచారు. అసెంబ్లీలో గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో స్టాలిన్‌తో సహా డీఎంకే సభ్యులను మార్షల్స్ బలవంతంగా గెటేంసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన చొక్కా చినిగిపోయింది. దీంతో బొత్తాలు లేని చినిగిన చొక్కాతోనే మొదట గవర్నర్‌ను కలిసిన స్టాలిన్ ఆ వెంటనే మెరీనా బీచ్‌కు వెళ్లి దీక్షకు దిగారు. రోజంతా సాగిన ఈ రాజకీయ డ్రామాలో స్టాలిన్ బాగానే హల్చల్ చేశారు. ఇటు మీడియాలోనూ, ప్రజల దృష్టిలోనూ బలపరీక్ష ఘట్టంలో ఆయన కేంద్రబిందువు అయ్యారు. -
బలపరీక్ష: తుదిదాకా నిలబడింది వారే!
చెన్నై: తమిళనాట ఉత్కంఠభరితంగా సాగిన రాజకీయ హైడ్రామా ఎట్టకేలకు అనేక ట్విస్టులతో ముగిసింది. తమిళనాడు అసెంబ్లీ వేదికగా జరిగిన బలపరీక్ష ఘట్టంలోనూ అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. చివరివరకు హైవోల్టేజ్ డ్రామా నడిచింది. శాసనసభలో డీఎంకే సభ్యుల ఆందోళన, రాద్ధాంతం, గలాటా, స్టాలిన్‌తో సహా వారిని బలవంతంగా సభ నుంచి మార్షల్ గెంటివేయడం.. ఈ క్రమంలో స్టాలిన్ చొక్కా చినగడం.. చినిగిన చొక్కాతోనే నిరసనకు స్టాలిన్ పూనుకోవడం.. బలపరీక్ష సందర్భంగా ఇలా రోజంతా తమిళనాడు రాజకీయాలు అట్టుడికిపోయాయి. చివరకు శశికళ వర్గానికి చెందిన పళనిస్వామి విశ్వాసపరీక్షలో నెగ్గి.. తన సీఎం పీఠాన్ని పదిలం చేసుకున్నారు. అయితే, ఈ తుదిఘట్టంలో పన్నీర్ సెల్వం బలమెంతో తేలిపోయింది. శశికళకు ఎదురుతిరిగి.. ఆమె గూటిలో ఉన్న ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొనేందుకు ఓపీఎస్ చివరివరకు ప్రయత్నించినా.. ఆయనకు మద్దతుగా నిలిచింది 11మందేనని బలపరీక్ష ద్వారా తేలింది. తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా 231 మంది సభ్యులు హాజరయ్యారు. ఇందులో డీఎంకేకు చెందిన 89మంది సభ్యులపై స్పీకర్ బహిష్కరణ వేటు వేశారు. దీంతో స్పీకర్ నిర్ణయాన్ని నిరసిస్తూ తొమ్మిది మంది కాంగ్రెస్, ముస్లింలీగ్ సభ్యులు వాకౌట్ చేశారు. దీంతో సభలో మిగిలింది 133మంది సభ్యులు. ఇందులో 122 మంది పళనిస్వామికి మద్దతుగా విశ్వాసపరీక్షకు అనుకూలంగా ఓటేయగా.. 11మంది మాత్రమే వ్యతిరేకంగా ఓటేశారు. అంటే.. దాదాపు రెండువారాలపాటు రాజకీయ హైడ్రామాను నడిపిన పన్నీర్ సెల్వానికి చివరివరకు మద్దతు పలికింది ఈ 11 మందే అని చెప్పవచ్చు. -
ఓపీఎస్‌కు వెల్లువెత్తిన 'సినీ' మద్దతు!
చెన్నై: బలపరీక్షలో ఓడిపోయినప్పటికీ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి సినీ ప్రముఖుల నుంచి మద్దతు వెల్లువెత్తడం గమనార్హం. బలపరీక్షను తీవ్రంగా తప్పుబట్టిన ప్రముఖ సినీ నటి గౌతమి నేరుగా ఓపీఎస్‌కు మద్దతు ప్రకటించారు. బలపరీక్షలో గెలిచిన శశికళ నమ్మినబంటు పళనిస్వామి బృందాన్ని ఖండించారు. 'అంకెల గారడీ' ద్వారా ప్రజాస్వామ్యాన్ని వంచించలేరని, ఇది ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజాస్వామ్యం కొనసాగుతుందని ఆమె ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాడాపాండి.. ముఖ్యమంత్రి ఓపీఎస్సే కావాలంటూ ఆమె యాష్‌ట్యాగ్ జోడించారు. Democracy can't be manipulated by "Number Games" It's the VOICE OF the PEOPLE. BY the PEOPLE. FOR the PEOPLE #SaveDemocracy #OPSForCM — Gautami (@gautamitads) 16 February 2017 ఇక సీనియర్ నటుడు కమల్ హాసన్ కూడా పరోక్షంగా పన్నీర్ సెల్వానికి మద్దతు పలికారు. బలపరీక్ష జరిగిన తీరును వ్యంగ్యంగా ఎండగట్టిన ఆయన.. బలపరీక్షపై గవర్నర్‌కు తమ గళాన్ని వినిపిస్తూ ఈమెయిళ్లు పంపించాలని, ఈ మెయిళ్లలో హుందాగా, అసభ్యత లేకుండా చక్కని భాషతో తమ అభిప్రాయాన్ని తెలియజేయాలంటూ.. గవర్నర్ ఈమెయిల్ ఐడీ (Rajbhavantamilnadu@gmail.com) ట్వీట్ చేశారు. ఇక మరో నటుడు అరవింద స్వామి అయితే.. ఏకంగా మరోసారి ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రీ ఎలక్షన్ ఒక్కటే మార్గమని, బలపరీక్ష ప్రజాతీర్పును ప్రతిఫలించడం లేదని పేర్కొన్నారు. In my opinion, The only solution that is acceptable under the circumstances is a re- election. This is not the people's mandate. — arvind swami (@thearvindswami) 18 February 2017 Rajbhavantamilnadu@gmail.com ங்கற விலாசத்துக்கு நம் மன உளைச்சலை மின் அஞ்சலா அனுப்புங்க. மரியாதையா பேசணும் அது அசம்பளியில்ல Governor வீடு — Kamal Haasan (@ikamalhaasan) 18 February 2017 -
మెరీనా బీచ్‌లో హై టెన్షన్..!
-
మెరీనా బీచ్‌లో హై టెన్షన్..!
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో జరిగిన బలపరీక్ష తీరును వ్యతిరేకిస్తూ డీఎంకే అధినేత స్టాలిన్ నిరాహార దీక్ష దిగడంతో మెరీనా బీచ్‌లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చినిగిన చొక్కాతో గాంధీ విగ్రహం వద్ద దీక్షకు కూర్చున్న ఆయనను, ఆయన మద్దతుదారులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, డీఎంకే శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. బలపరీక్ష సందర్భంగా డీఎంకే అధినేత స్టాలిన్ సహా, ఆ పార్టీ ఎమ్మెల్యేలను బలవంతంగా సభ నుంచి మార్షల్స్ గెంటివేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా స్టాలిన్ చొక్కా చినిగింది. మార్షల్స్, పోలీసులు తనపై, తన ఎమ్మెల్యేలపై దాడి చేశారని, తిట్టారని ఆయన ఆరోపించారు. ఈ పరిణామంతో ఆగ్రహంగా ఉన్న ఆయన నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. ఆయన వెంట డీఎంకే ఎమ్మెల్యేలు, ఎంపీ కనిమొళి కూడా ఉన్నారు. బలపరీక్ష జరిగిన తీరు, స్పీకర్ ధనపాల్ వ్యవహార సరళిపై గవర్నర్‌కు స్టాలిన్ ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే డీఎంకే ఎమ్మెల్యేలతో కలిసి మెరీనా బీచ్‌కు వచ్చారు. చినిగిన చొక్కాతోనే అక్కడ ఉన్న గాంధీ విగ్రహం వద్ద దీక్షకు కూర్చున్న ఆయనకు డీఎంకే నేతలు, శ్రేణులు మెరీనా బీచ్ చేరుకున్నారు. మరోవైపు పోలీసులు కూడా భారీగా మోహరించడంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీఎంకే శ్రేణులు ఎక్కువగా తరలిరాకముందే పోలీసులు స్టాలిన్‌ను, డీఎంకే నేతలను అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. -
బలపరీక్షపై సినీ స్టార్స్ మండిపాటు!
తమిళనాడు అసెంబ్లీలో చోటుచేసుకున్న హైవోల్టెజ్ డ్రామా అనంతరం జరిగిన బలపరీక్షలో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 122 మంది సభ్యుల మద్దతుతో ఆయన మెజారిటీ నిరూపించుకున్నారు. అయితే, అంతకుముందు తమిళనాడు శాసనసభలో తీవ్ర నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన, అల్లరితో సభ గందరగోళంగా మారిపోయింది. రెండుసార్లు వాయిదా పడింది. ప్రతిపక్ష డీఎంకే సభ్యులు మైక్‌లు, బల్లాలు విరిచివేయడమే కాకుండా..స్పీకర్‌ను నెట్టేసి ఆయన స్థానంలో కూర్చున్నారు. తీవ్ర గలాటా సృష్టించారు. ఈ పరిణామాలపై సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కమల్ హాసన్ సహా రాధిక, ఖుష్బూ, అరవింద స్వామి తదితరులు తీవ్రంగా స్పందించారు. 'మరో కొత్త ముఖ్యమంత్రి వచ్చినట్టే కనిపిస్తోంది. జై డె'మాక్'క్రేజీ అంటూ ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంద'ని కమల్ హాసన్ ట్వీట్ చేశారు. గౌరవనీయులైన ఎమ్మెల్యేలకు తమిళనాడు ప్రజలు సరైనరీతిలో స్వాగతం పలుకుతారంటూ హెచ్చరించారు. సినీ నటి ఖుష్బూ స్పందిస్తూ ప్రజాస్వామ్యానికి ప్రతిపక్షమే బలం, ప్రతిపక్ష సభ్యులు లేకుండా బలపరీక్ష నిర్వహించడమంటే ప్రజాస్వమ్యానికి అది విరుద్ధమేనని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిణామాలు అవమానకరంగా ఉన్నాయని, గవర్నర్ రంగంలోకి దిగి చర్య తీసుకోవాలని సినీ రాధికా శరత్‌కుమార్ కోరారు. ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వని ఎమ్మెల్యేలతో నిర్వహించిన ఈ బలపరీక్షను ఎవరూ అంగీకరించబోరని, ఎమ్మెల్యేలు కలువాల్సింది ప్రజలను కానీ, రిసార్టులో పార్టీ నేతలను కాదని సినీ నటుడు అరవింద స్వామి పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు కవర్ చేయకుండా మీడియాను బ్లాక్ చేసి.. ఎంచుకున్న దృశ్యాలను మాత్రమే విడుదల చేయడం సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు. -
విపక్షం లేకుండా.. వ్యూహాత్మకంగా..!
-
విపక్షం లేకుండా.. వ్యూహాత్మకంగా..!
చెన్నై: తీవ్ర గందరగోళ పరిస్థితులు, నాటకీయ పరిణామాల నడుమ జరిగిన బలపరీక్షలో పళనిస్వామి విజయం సాధించారు. ప్రతిపక్ష సభ్యులు లేకుండానే నిర్వహించిన ఓటింగ్‌లో ఆయనకు అనుకూలంగా 122మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఓటేశారు. 11మంది వ్యతిరేకంగా ఓటేశారు. అంతకుముందు తీవ్ర ఉత్కంఠభరిత పరిస్థితుల నడుమ డీఎంకే అధినేత స్టాలిన్ సహా.. ఆ పార్టీ సభ్యులను స్పీకర్ ఆదేశాల మేరకు మార్షల్ బయటకు గెంటేశారు. దీంతో స్టాలిన్ చొక్కా చినిగిపోయింది. స్పీకర్ తీరు, మార్షల్స్ బలవంతంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టాలిన్ తన ఎమ్మెల్యేలను తీసుకొని గవర్నర్ వద్దకు వెళ్లారు. ఇంతలోనే స్పీకర్ ధనపాల్ సభను సమావేశపరిచి.. ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. దీంతో డీఎంకే మిత్రపక్షం కాంగ్రెస్‌తోపాటు, ముస్లింలీగ్ తదితర విపక్ష సభ్యులు కూడా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. విపక్షం లేకుండానే స్పీకర్ బలపరీక్ష చేపట్టి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించడంతో పళనిస్వామి విజయం నల్లేరు మీద నడకే అయింది. ప్రతిపక్ష సభ్యులు సభలో లేకపోవడంతో సునాయసంగా పళనిస్వామి బలపరీక్షలో విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా తన పదవిని సుస్థిరం చేసుకున్నారు. ప్రజల నుంచి ఒత్తిడి తీసుకొచ్చి.. తాను ముఖ్యమంత్రి కావాలనుకున్న పన్నీర్ సెల్వం ఆశలు అడియాసలయ్యాయి. -
విశ్వాసపరీక్షలో గెలిచిన సీఎం పళనిస్వామి
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి బలపరీక్షలో నెగ్గారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గీయులు వ్యతిరేకించినా, తన శిబిరంలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వచ్చినా, ప్రతిపక్ష పార్టీలన్ని వ్యతిరేకంగా నిలబడినా పళనిస్వామి సభలో మెజార్టీ నిరూపించుకున్నారు. శనివారం ప్రత్యేకంగా సమావేశమైన తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో విపక్షం సభ్యులు లేకుండానే నిర్వహించిన బలపరీక్షలో పళనిస్వామికి మద్దతుగా 122 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. 11మంది వ్యతిరేకంగా ఓటేశారు. బలపరీక్ష సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. పన్నీర్ సెల్వం వర్గానికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని, అలాగే రహస్య ఓటింగ్ నిర్వహించాలని పన్నీర్ సెల్వం వర్గంతో పాటు డీఎంకే, కాంగ్రెస్, ముస్లింలీగ్ కూడా డిమాండ్ చేశాయి. అయితే పళనిస్వామి వర్గం మాత్రం బహిరంగ ఓటింగుకే పట్టుబట్టింది. స్పీకర్ ధనపాల్ తొలుత మూజువాణీ ఓటింగు చేపట్టి, తర్వాత డివిజన్ ఓటింగ్ చేపట్టారు. దాన్ని బహిరంగ పద్ధతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ తలుపులు మూసేశారు. -
గవర్నర్ అనూహ్య నిర్ణయం!?
ముంబై పర్యటన వాయిదా బలపరీక్షపై ఏదైనా నిర్ణయం తీసుకుంటారా? చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు తన ముంబై ప్రయాణాన్ని అర్ధంతరంగా వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. శాసనసభ వేదికగా నాటకీయ పరిణామాలు జరగతున్న నేపథ్యంలో ఆయన ముంబై వెళ్లకుండా చెన్నైలోనే ఆగిపోయారు. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ అసెంబ్లీకి వెళ్లి.. స్పీకర్ ధనపాల్‌తో భేటీ అయ్యారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ అనూహ్యంగా తన ముంబై ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం గమనార్హం. శాసనసభ వేదికగా బలపరీక్ష ఆసాంతం స్పీకర్ కనుసన్నలలో జరిగింది. ప్రతిపక్ష సభ్యులు లేకుండానే నిర్వహించిన ఈ విశ్వాస పరీక్షలో శశికళ నమ్మినబంటు పళనిస్వామి విజయం సాధించారు. అయితే, తమను బలవంతంగా సభ నుంచి ఈడ్చేయడంతో ఆగ్రహంగా ఉన్న స్టాలిన్ తన ఎమ్మెల్యేలతో రాజ్‌భవన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆయన గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిసి విశ్వాసరీక్ష జరిగిన తీరుపై ఫిర్యాదు చేశారు. -
సభలో స్టాలిన్ ధర్నా.. వాయిదాకు పట్టు!
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ వేదికగా హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. శాసనసభలో నెలకొన్న తీవ్ర గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో బలపరీక్షను పదిరోజులపాటు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఏకంగా డీఎంకే అధినేత, ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ ఆందోళనకు దిగారు. అసెంబ్లీలో నేలపై కూర్చొని ఆయన ధర్నా చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా డీఎంకే ఎమ్మెల్యేలు కూడా ధర్నాలో కూర్చున్నారు. దీంతో సభలో తీవ్ర ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. 20 మంది డీఎంకే ఎమ్మెల్యేలను సభ నుంచి బలవంతంగా గెంటేయాలన్న స్పీకర్ ధనపాల్ నిర్ణయంపై స్టాలిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ తీరును ఖండిస్తూ స్టాలినే స్వయంగా ఆందోళనకు కూర్చున్నారు. బలపరీక్షను 10రోజులపాటు వాయిదా వేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు వెళ్లి ప్రజాభిప్రాయం తెలుసుకున్న తర్వాతే బలపరీక్ష నిర్వహించేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. -
మళ్లీ గందరగోళం.. సభ మళ్లీ వాయిదా
-
మళ్లీ గందరగోళం.. సభ మళ్లీ వాయిదా
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి పళనిస్వామి విశ్వాస పరీక్ష సందర్భంగా సభ వాయిదా పడి, మళ్లీ మరోసారి సమావేశం అయినప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తింది. దాంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. సభలో గందరగోళం సృష్టించిన డీఎంకే ఎమ్మెల్యేలందరూ సభను ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా స్పీకర్ ధనపాల్ ఆదేశించడంతో వాళ్లంతా ఒక్కసారిగా మళ్లీ పోడియం వద్దకు దూసుకెళ్లారు. స్పీకర్ స్థానం వద్ద ఎదురుగా వెళ్లి ధర్నా చేశారు. వాళ్లను ఖాళీ చేయించాలని, బయటకు తీసుకెళ్లాలని మార్షల్స్‌ను స్పీకర్ ఆదేశించినా.. వాళ్లు కూడా అసలు సభ్యులను బయటకు తీసుకెళ్లలేకపోయారు. దాంతో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా సభ్యులెవరూ తమ తమ సీట్లలో కూర్చోకపోవడం.. సభలో అదే గందరగోళ పరిస్థితులు ఉండటంతో స్పీకర్ ధనపాల్ సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు. -
బలపరీక్ష ఎప్పుడు పెట్టినా ఇంతే!
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి మీద విశ్వాస పరీక్ష ఎప్పుడు నిర్వహించినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తీవ్ర గందరగోళం, సభలో సభ్యుల కేకలు, అరుపులు.. సభను సజావుగా నడవనివ్వకపోవడం లాంటివి ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి. ఇంతకుముందు ఎంజీఆర్ మరణం అనంతరం జానకీ రామచంద్రన్, జయలలిత వర్గాల మధ్య పోటీ తలెత్తినప్పుడు విశ్వాస పరీక్ష నిర్వహించారు. 1988 జనవరి 27వ తేదీన విశ్వాస పరీక్ష నిర్వహించారు. అప్పుడు అసెంబ్లీలో తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడి, అసెంబ్లీలో కొట్టుకుంటున్న సభ్యులను నియంత్రించేందుకు తొలిసారి సభలోకి పోలీసులను కూడా పిలవాల్సి వచ్చింది. జయలలిత వర్గానికి నెడుంజెళియన్ నాయకత్వం వహించారు. సభ్యులు తీవ్రస్థాయిలో కొట్టుకున్నారు కూడా. అప్పుడు స్పీకర్ పీహెచ్ పాండియన్ చాలామంది ప్రతిపక్ష సభ్యులపై ఓటింగ్ ప్రారంభం కావడానికి ముందు అనర్హత వేటు వేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. చివరకు జానకీ రామచంద్రన్ విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు ప్రకటించారు. ఇప్పుడు కూడా విశ్వాస పరీక్ష సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొనడం, స్పీకర్ చొక్కా చించి అవమానించడం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. తనకు జరిగిన అవమానానికి తాను ఎవరికి చెప్పుకోవాలని స్పీకర్ ధనపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ ముందున్న టేబుల్‌ను పడగొట్టేసి, ఆయన కుర్చీలో కూర్చుని, బెంచీల మీదకు ఎక్కి, స్పీకర్‌ను నెట్టేసి.. ఇలా పలు రకాలుగా విధ్వంసం సృష్టించడంతో సభను దాదాపు గంట సేపు వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ సభ సమావేశమైనప్పుడు డీఎంకే సభ్యులందరినీ బయటకు వెళ్లాల్సిందిగా స్పీకర్ ఆదేశించారు. వాళ్లను బయటకు తీసుకెళ్లాల్సిందిగా మార్షల్స్‌కు సూచించారు. అయితే డీఎంకే ఎమ్మెల్యేలు మళ్లీ పోడియం వద్దకు వెళ్లి స్పీకర్‌ను ఘెరావ్ చేసి నినాదాలు చేయడం మొదలుపెట్టారు. -
షాకింగ్: స్పీకర్ కుర్చీలో డీఎంకే ఎమ్మెల్యేలు!
-
షాకింగ్: స్పీకర్ కుర్చీలో డీఎంకే ఎమ్మెల్యేలు!
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి పళనిస్వామి విశ్వాస పరీక్ష సందర్భంగా తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభలో ఎప్పుడూ కనీ వినీ ఎరుగని రీతిలో సంఘటనలు చోటుచేసుకున్నాయి. స్పీకర్ ధనపాల్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడిన తర్వాత డీఎంకే సభ్యులు కొందరు ఆయనను తోసేసే ప్రయత్నం కూడా చేశారు. దాంతో ఆయన మార్షల్స్ సాయంతో జాగ్రత్తగా సభ నుంచి బయటకు వెళ్లారు. ఈ సమయంలో ఇద్దరు డీఎంకే ఎమ్మెల్యేలు స్పీకర్ కుర్చీలో కూడా కూర్చున్నారు. డీఎంకేకు చెందిన కు కా సెల్వం, రంగనాథన్ అనే ఇద్దరు ఎమ్మెల్యేలు ఇలా కూర్చున్నారు. ఈ పరిస్థితి ఇంతవరకు దేశంలో ఎక్కడా చోటుచేసుకున్న దాఖలాలు లేవు. స్పీకర్ కుర్చీలో ప్రతిపక్ష సభ్యులు కూర్చోవడం, అది కూడా అధికారికంగా కాకుండా అనధికారికంగా గొడవ చేసి, స్పీకర్‌ను పంపేసి ఆయన స్థానంలో ఒక నిమిషం కంటే కూడా తక్కువ సేపు కూర్చోవడం ఎప్పుడూ లేదు. తమిళనాడు అసెంబ్లీ మాత్రమే ఈ ఘటనకు అద్దం పట్టింది. -
డీఎంకే ఎమ్మెల్యేకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
స్పీకర్ ధనపాల్‌తో తీవ్ర వాగ్వాదం సందర్భంగా డీఎంకేకు చెందిన అత్యంత సీనియర్ ఎమ్మెల్యే దొరై మురుగన్ అస్వస్థత పాలయ్యారు. ఆయనను వెంటనే అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. దాదాపు 30 ఏళ్లుగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చిన దొరై మురుగన్ వయసులో కూడా చాలా పెద్దవారు. ఆయన స్పీకర్ తీరు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి గట్టిగా మాట్లాడారు. ఆ సమయంలోనే ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. వెంటనే మార్షల్స్ ఆయనను బయటకు తీసుకొచ్చారు. అప్పటికే సిద్ధంగా ఉన్న అంబులెన్సులో వైద్యులు ఆయనకు ప్రాథమిక చికిత్స చేసి, వెంటనే అక్కడినుంచి ఆస్పత్రికి కూడా తరలించారు. అసెంబ్లీలో బల నిరూపణకు గవర్నర్ ఎటూ 15 రోజుల గడువు ఇవ్వడం, తమ సభ్యుడు ఇప్పుడు ఆస్పత్రిలో ఉండటం తదితర కారణాలతో ఓటింగును, సభను కూడా వాయిదా వేయాలని డీఎంకే సభ్యులు పట్టుబడుతున్నారు. అయితే దీనిపై స్పీకర్ ధనపాల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది. -
స్పీకర్ మీదకు కుర్చీల విసిరివేత
-
స్పీకర్ మీదకు కుర్చీల విసిరివేత
తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా తీవ్ర గందరగోళం ఏర్పడింది. అది నిజంగానే ఎవరి 'బలం' ఎంత ఉందో నిరూపించుకునేలా మారింది. రహస్య ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న డీఎంకే ఎమ్మెల్యేలు .. స్పీకర్ ధనపాల్ మీదకు కుర్చీలు విసిరేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఆయన ఎదురుగా ఉన్న కుర్చీని విరగ్గొట్టి, మైక్రోఫోన్లు కూడా విరిచేశారు. ఆయన టేబుల్ కూడా విరగ్గొట్టినట్లు తెలుస్తోంది. ఆయన మీదకు ముందుగా కాగితాలు విసిరేశారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం రహస్య ఓటింగ్ నిర్వహించడానికి వీల్లేదని స్పీకర్ ధనపాల్ చెప్పడంతో... డీఎంకే ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో స్పీకర్ ధనపాల్ సభను మధ్యాహ్నం ఒంటిగంటకు వాయిదా వేసి సభ నుంచి బయటకు వచ్చేశారు. అంతలో స్పీకర్ తీరుకు నిరసనగా.. డీఎంకే ఎమ్మెల్యే కు కా సెల్వం నేరుగా వెళ్లి స్పీకర్ కుర్చీలో కూర్చున్నారు. -
విశ్వాపరీక్షలో ఓడిన సీఎం పళనిస్వామి
తమిళనాడు ముఖ్యమంత్రిగా రెండు రోజుల క్రితమే ప్రమాణస్వీకారం చేసిన ఎడప్పాడి కె. పళనిస్వామి విశ్వాసపరీక్షలో ఓడిపోయారు. శనివారం ఉదయం తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అందులో ముఖ్యమంత్రి పళనిస్వామి విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. శనివారం ప్రత్యేకంగా సమావేశమైన తమిళనాడు అసెంబ్లీకి మొత్తం 230 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. దాంతో ప్రభుత్వం నిలబడాలంటే 116 ఓట్లు కావల్సి వచ్చాయి. బహిరంగ పద్ధతిలో డివిజన్ ఓటింగ్ నిర్వహించారు. ఇందులో పళనిస్వామి ప్రభుత్వానికి అనుకూలంగా ... ఓట్లు, వ్యతిరేకంగా ... ఓట్లు వచ్చాయి. దాంతో రెండురోజుల వయసున్న పళనిస్వామి ప్రభుత్వం పడిపోయింది. బలపరీక్ష సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. పన్నీర్ సెల్వం వర్గానికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని, అలాగే రహస్య ఓటింగ్ నిర్వహించాలని పన్నీర్ సెల్వం వర్గంతో పాటు డీఎంకే, కాంగ్రెస్, ముస్లింలీగ్ కూడా డిమాండ్ చేశాయి. అయితే పళనిస్వామి వర్గం మాత్రం బహిరంగ ఓటింగుకే పట్టుబట్టింది. స్పీకర్ ధనపాల్ తొలుత మూజువాణీ ఓటింగు చేపట్టి, తర్వాత డివిజన్ ఓటింగ్ చేపట్టారు. దాన్ని బహిరంగ పద్ధతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ తలుపులు మూసేశారు. -
తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం
-
తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం
విశ్వాస పరీక్ష నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం మొదలైంది. తాము నియమించిన విప్‌ను ఒప్పుకోవాలని, రహస్య ఓటింగ్ నిర్వహించాలని పన్నీర్ సెల్వం వర్గం డిమాండ్ చేస్తోంది. వాళ్లకు డీఎంకే కూడా అండగా నిలిచింది. ఎమ్మెల్యేలను ఖైదీల్లా తీసుకొచ్చారని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ అన్నారు. అయితే పన్నీర్ సెల్వం వర్గం నియమించిన విప్‌ను ఒప్పుకోడానికి పళనిస్వామి వర్గం ఒప్పుకోలేదు. అలాగే రహస్య ఓటింగుకు కూడా వాళ్లు అంగీకరించలేదు. తమ ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని పన్నీర్ సెల్వం అన్నారు. తాము ఫ్లోర్ లీడర్‌గా ఎన్నుకున్న ఎమ్మెల్యేకు మాట్లాడే అవకాశం కల్పించాలని పన్నీర్ వర్గం డిమాండ్ చేస్తోంది. -
30 ఏళ్ల క్రితం కూడా.. తమిళనాట ఓ బలపరీక్ష
తమిళనాడు అసెంబ్లీలో దాదాపు 30 ఏళ్ల తర్వాత మరోసారి బలపరీక్ష జరుగుతోంది. ఇంతకుముందు ఎంజీ రామచంద్రన్ మరణించిన తర్వాత ఆయన భార్య జానకీ రామచంద్రన్, వీఆర్ నెడుంజెళియన్ నేతృత్వంలోని జయలలిత వర్గాల మధ్య పోటీ ఫలితంగా 1988 జనవరి 27వ తేదీన విశ్వాస పరీక్ష నిర్వహించాల్సి వచ్చింది. అప్పుడు అసెంబ్లీలో తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడి, అసెంబ్లీలో కొట్టుకుంటున్న సభ్యులను నియంత్రించేందుకు తొలిసారి సభలోకి పోలీసులను కూడా పిలవాల్సి వచ్చింది. అప్పట్లో నెడుంజెళియన్ పోషించిన పాత్రను ఇప్పుడు ఓ పన్నీర్ సెల్వం పోషిస్తున్నారు. ఇప్పుడు బలపరీక్ష విషయంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనన్న ఆసక్తి అన్ని వర్గాల్లో నెలకొంది. ఇక 2006 సంవత్సరంలో డీఎంకేకు పూర్తి మెజారిటీ రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 96 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. అయితే 34 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. ఐదేళ్ల పాటు బయటి నుంచి మద్దతిచ్చింది. కేంద్రంలో కాంగ్రెస్ అప్పట్లో అధికారంలో ఉండటంతో తమిళనాడులోనూ పట్టు ఉండాలని అలా చేసింది. కాంగ్రెస్ మద్దతు ఉందన్న విషయం స్పష్టం కావడంతో అప్పట్లో డీఎంకేను బలం నిరూపించుకోవాలని గవర్నర్ అడగలేదు. 1988లో ఏం జరిగింది... అప్పట్లో తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా స్పీకర్ పీహెచ్ పాండియన్ చాలామంది ప్రతిపక్ష సభ్యులపై ఓటింగ్ ప్రారంభం కావడానికి ముందు అనర్హత వేటు వేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. చివరకు జానకీ రామచంద్రన్ విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు ప్రకటించారు. దాంతో రాష్ట్రంలో తీవ్రస్థాయిలో హింసాకాండ చెలరేగింది. చివరకు ఆర్టికల్ 356ను ప్రయోగించి, జానకీ రామచంద్రన్ ప్రభుత్వాన్ని దించేశారు. 1989లో మళ్లీ ఎన్నికలు నిర్వహించగా, డీఎంకే సంపూర్ణ మెజారిటీతో విజయం సాధించింది. 13 ఏళ్ల తర్వాత కరుణానిధి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. -
మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్!
► నిర్ణయంపై అందరిలో ఉత్కంఠ ► బలపరీక్షకు ఎలాంటి పద్ధతి అనుసరిస్తారో ► పన్నీర్ సెల్వం వర్గంలోనే స్పీకర్ ధనపాల్ ► అన్నాడీఎంకే వ్యవస్థాపక సభ్యుడు, ఎంజీఆర్ మనిషి చెన్నై నిన్న మొన్నటి వరకు తమిళనాడు ఇన్చార్జి గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ అన్ని వర్గాల్లోనూ కనిపించింది. చివరకు ఆయన పళనిస్వామికే మొదటి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పుడు అంత సమయం అయితే లేదు గానీ.. స్పీకర్ ధనపాల్ ఏం చేస్తారనే విషయంలో కూడా అంతకు మించిన ఉత్కంఠ కనిపిస్తోంది. మొత్తం 235 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో జయలలిత మృతితో ఒక స్థానం ఖాళీగా ఉంది. ఒకరు నామినేటెడ్ ఎమ్మెల్యే కావడంతో 233 మంది సభ్యులుంటారు. మొత్తం వీళ్లందరి దృష్టి కూడా స్పీకర్ ధనపాల్ మీదే ఉంది. పన్నీర్ సెల్వం కోరినట్లుగా ఆయన రహస్య ఓటింగ్ నిర్వహిస్తారా.. లేక బహిరంగ బలపరీక్ష వైపు మొగ్గుతారా అనేది మరికొన్ని గంటల్లోనే తేలిపోతుంది. ఎవరీ ధనపాల్? డీఎంకే నుంచి చీలిపోయి ఎంజీ రామచంద్రన్ అన్నాడీఎంకేను 1972లో స్థాపించినప్పుడు ఆయన పార్టీలో చేరిన కొద్దిమందిలో ధనపాల్ కూడా ఒకరు. 1977 ఎన్నికలకు సేలం జిల్లాలోని శంకరగరి (రిజర్వుడు) నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఎంజీఆర్ ఆయనకు అవకాశం కల్పించారు. సి. పొన్నయన్, పన్రుట్టి ఎస్ రామచంద్రన్, కేఏ సెంగొట్టయన్లతో కలిసి ఆయన తొలిసారి అన్నాడీఎంకే తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన నెగ్గారు. ఆ తర్వాత 1980, 84లలో జరిగిన ఎన్నికల్లోనూ గెలిచారు. ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయినప్పుడు ఆయన జయలలితకు మద్దతుగా ఉన్నారు. కానీ, తర్వాత జరిగిన ఎన్నికల్లో శంకరగిరి నుంచి తొలిసారి ఓడిపోయారు. 2001లో అక్కడే గెలిచిన తర్వాత శంకరగిరి జనరల్ స్థానంగా మారడంతో 2011లో ఆయన రాశిపురం నియోజకవర్గానికి మారారు. ఒక ఏడాది తర్వాత స్పీకర్ పదవికి జయకుమార్ రాజీనామా చేయడంతో సీనియర్ నాయకుడైన ధనపాల్‌ను జయలలిత స్పీకర్‌గా చేశారు. జయకుమార్ మద్దతుదారులైన ఆరుగురిని కూడా పదవుల నుంచి జయలలిత తప్పించారు. ఆ తర్వాత కూడా రెండోసారి జయలలిత వరుసగా అధికారం చేపట్టినప్పుడు ఆయనకే స్పీకర్‌గా అవకాశం కల్పించారు. ఇలా రెండు వరుస అసెంబ్లీలలో ఒకే స్పీకర్ ఉండటం అరుదుగా జరుగుతుంది. ఒకే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా స్పీకర్లను మార్చిన సందర్భాలున్నాయి. ఇక శనివారం ఉదయం 11 గంటలకు జరిగే బలపరీక్షలో స్పీకర్‌గా ధనపాల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై కూడా ప్రభుత్వం ఉంటుందా పడిపోతుందా అనేది ఆధారపడుతుంది. ఇటీవల ఉత్తరాఖండ్‌లో బహిరంగ బలపరీక్ష నిర్వహించారు. అలాగే చేస్తారా లేక రహస్య ఓటింగ్ పెడతారా అనేది చూడాల్సి ఉంది. మరిన్ని తమిళనాడు విశేషాలు.. భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్ బలపరీక్షకు కరుణానిధి దూరం! ఎవరీ సైనైడ్ మల్లిక! పళనిస్వామిని ఓడించండి: రాహుల్ అమ్మకు ఓటేయండి నన్ను చూసి నవ్వొద్దు ‘మ్యాజిక్’ చేసేదెవరు? -
పళనిస్వామిని ఓడించండి: రాహుల్
తమిళనాడు అసెంబ్లీలో జరిగే బలపరీక్షలో ఎటువైపు ఉండాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల సందిగ్ధతకు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెరదించారు. అక్కడున్న ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలూ కలిసి ఎడప్పాడి పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని, పళనిని ఓడించాలని తెలిపారు. దాంతో ఇప్పటివరకు ఏం చేద్దామంటూ అటూ ఇటూ ఊగిసలాటలో ఉన్న తమిళనాడు కాంగ్రెస్ నాయకులకు ఓ స్పష్టత వచ్చినట్లయింది. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ ఇప్పటికే తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అద్యక్షుడు ఎస్ తిరునావుక్కరసర్‌కు శుక్రవారం రాత్రి దాటిన తర్వాత అధికారికంగా తెలియజేశారు. అంతకుముందు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరితో టీఎన్‌సీసీ చీఫ్ తిరునావుక్కరసర్ సమావేశమయ్యారు. బలపరీక్ష విషయంలో ఏం చేయాలన్న దానిపై అధిష్ఠానం ఓ నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఎమ్మెల్యేలకు తెలిపారు. శనివారం ఉదయం 9 గంటలకు తాము మళ్లీ సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని అప్పుడు చెప్పారు. పళనిస్వామి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయాలంటూ తాను ట్వీట్ చేసినట్లుగా వచ్చిన కథనాలను ఆయన ఖండించారు. చివరకు అధికారికంగా ఢిల్లీ నుంచి కబురు రావడంతో అదే పని చేయాల్సి వస్తోంది. మరిన్ని తమిళనాడు విశేషాలు.. భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్ మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్! బలపరీక్షకు కరుణానిధి దూరం! ఎవరీ సైనైడ్ మల్లిక! అమ్మకు ఓటేయండి నన్ను చూసి నవ్వొద్దు ‘మ్యాజిక్’ చేసేదెవరు? -
మంత్రికి స్టాలిన్ సవాల్
చెన్నై: అధికార, ప్రతిపక్షాల మధ్య హోరాహోరీగా సాగుతున్న శాసనసభా సమావేశాలు శుక్రవారం పరస్పర సవాళ్లకు దారి తీశాయి. అనేక అంశాలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని ఆరోపిస్తూ డీఎంకే సభ్యులు సమావేశాల నుంచి వాకౌట్ చేశారు. హొగెనకల్ సహకార సంఘం తాగునీటి పథకంపై వాడివేడిగా చర్చ సాగింది. నగర పాలన, తాగునీటి వసతులపై చర్చలు సాగగా, మంత్రి వేలుమణి ప్రసంగిస్తూ, అమ్మ పథకాలతో రాష్ట్రంలోని కుగ్రామాలు సైతం అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. ఈ సమయంలో డీఎంకే శాసనసభాపక్ష నేత స్టాలిన్ కలుజేసుకున్నారు. రామనాథపురం, హొగెనకల్లోని సహకార తాగునీటి పథకం పూర్తయి ప్రజలకు తాగునీరు అందుతుంటే సంతోషమేనని అన్నారు. అయితే అక్కడి పథకాలు ఇంకా పూర్తికాలేదని నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నాము, కాదు పూర్తయ్యాయని గౌరవ సభ్యులతో కలిసి వాటిని ప్రత్యక్షంగా చూసి వచ్చేందుకు మంత్రి సిద్ధంగా ఉన్నారా అంటూ స్టాలిన్ సవాల్ విసిరారు. మంత్రి వేలుమణి స్టాలిన్ సవాల్‌కు స్పందిస్తూ, పథకం పనులు సాగుతున్నచోట జాతీయరహదారి పనులు జరుగుతున్నందున తాగునీటి పథకం పూర్తికి జాప్యం జరుగుతోందని అంగీకరించారు. గాంధేయవాది శశిపెరుమాళ్ ఆకస్మిక మరణం, సంపూర్ణ మద్య నిషేధం, మధురై క్వారీల్లో నరబలులు తదితర 33 అంశాలపై చర్చించేందుకు స్పీకర్ నిరాకరించడంతో డీఎంకే సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. -
మరో వేటు
డీఎండీకే ఎమ్మెల్యేలపై పది రోజుల నిషేధం అసెంబ్లీలో హక్కుల తీర్మానం ఆమోదం విపక్షాల వాకౌట్ విపక్షంపై మరోవేటు వేయడం ద్వారా అధికార పక్షం తన కక్ష తీర్చుకుంది. రెండు అసెంబ్లీ సమావేశాల నిషేధాన్ని ఎదుర్కొంటున్న డీఎండీకే ఎమ్మెల్యేలపై మరోసారి నిషేధాన్ని విధించింది. ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు పది రోజులపాటు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కూడా పాల్గొనేందుకు వీలులేదని నిషేధం విధించారు. చెన్నై, సాక్షి ప్రతినిధి:గత నెల 19వ తేదీన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సమయంలో డీఎండీకే సభ్యులు అడ్డు తగిలారు. స్పీకర్ పోడియం వైపునకు దూసుకెళ్లారు. బడ్జెట్ ప్రతులను చించి ఎగురవేశారు. అన్నాడీఎంకే అధినేత్రి, జయలలితపై విమర్శలు చేశారు. డీఎండీకే ఎమ్మెల్యేలు చంద్రకుమార్, మోహన్‌రాజ్, పార్తిబన్, వెంకటేశన్, శేఖర్, దినకరన్ ప్రస్తుత, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సైతం పాల్గొనరాదని స్పీకర్ ధనపాల్ నిషేధం విధించారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు సాగుతుండగా, తమపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని డీఎండీకే ఎమ్మెల్యేలు సచివాలయం ముందు ప్రతిరోజూ ధర్నా నిర్వహిస్తున్నారు. వీరి ఆందోళనకు డీఎంకే, కాంగ్రెస్, తదితర పార్టీలన్నీ మద్దతు పలుకుతున్నాయి. సభలో తీర్మానం ఇదిలా ఉండగా, డీఎండీకే ఎమ్మెల్యేలపై విధించిన నిషేధాన్ని ప్రస్తావించేందుకు డీఎంకే సభ్యులు స్టాలిన్ సిద్ధపడగా అదే సమయంలో సదరు ఆరుగురు సభ్యులపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని మంత్రి నత్తం విశ్వనాథన్ ప్రవేశపెట్టారు. సభ్యుల విపరీత చేష్టలపై సభా హక్కుల బృందమే ఒక నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఇదే బృందంలో సభ్యుడుగా ఉన్న కంభం రామమోహన్ ఈ శిక్ష చాలా ఎక్కువని వ్యాఖ్యానించినట్లు స్టాలిన్ గుర్తు చేశారు. డీఎండీకే సభ్యులపై విధించిన నిషేధం రెండు యావజ్జీవ శిక్షల వలె ఉందని కాంగ్రెస్ రంగరాజన్ విమర్శించారు. ఈ సమయంలో అధికార ఎమ్మెల్యే బోస్ కలుగజేసుకుంటూ గత ప్రభుత్వం తనను నాలుగు నెలల పాటూ జైలు పాలు చేసిందని, ఎమ్మెల్యేగా పనిచేయకుండా అడ్డుకుందని ఎత్తిపొడిచారు. ఏది ఏమైనా హక్కుల బృందం తీసుకున్న నిర్ణయాన్ని సభ్యులు శిరసావహించకతప్పదని మంత్రి నత్తం పేర్కొన్నారు. డీఎండీకేకు చెందిన ఆరుగురు సభ్యులపై వచ్చే అసెంబ్లీ సమావేశాలకు కూడా పదిరోజుల పాటూ నిషేధం విధిస్తున్నట్లు స్పీకర్ స్థానంలో ఉన్న ఉపసభాపతి పొల్లాచ్చి జయరామన్ ప్రకటించారు. నిషేధం సమయంలో సభ్యులు తమ వేతనాన్ని, రాయితీలను సైతం కోల్పోతారని స్పష్టం చేశారు. ఆరుగురు సభ్యులపై నిషేధం విధిస్తూ చేసిన తీర్మానాన్ని సభ ఆమోదించిందని స్పీకర్ ప్రకటించడంతో స్టాలిన్ (డీఎంకే), రంగరాజన్ (కాంగ్రెస్), సౌందరరాజన్ (సీపీఎం), అరుముగం (సీపీఐ), జవహరుల్లా (మనిదనేయ మక్కల్ కట్చి) నిరసన తెలుపుతూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. -
పన్నీరు ‘బడ్జెట్’
సాక్షి, చెన్నై : రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు సీఎం పన్నీరు సెల్వం సిద్ధం అవుతున్నారు. ఇందుకు తగ్గ కసరత్తుల్ని వేగవంతం చేశారు. ఆదివారం మంత్రి వర్గం భేటిలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెలాఖరులో అసెంబ్లీలో బడ్జెట్ దాఖలు చేయబోతున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత జైలు శిక్ష నేపథ్యంతో సీఎంగా పన్నీరు సెల్వం బాధ్యతలు చేపట్టి నాలుగు నెలలు కావస్తున్నది. ఈ కాలంలో ప్రభుత్వ పరంగా చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలు చెప్పుకోదగ్గవి లేవు. ఈ ఏడాది తొలి అసెంబ్లీ సమావేశంలో సీఎం పన్నీరు సెల్వం గవర్నర్ ప్రసంగం ద్వారా వరాలు ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. అయితే, గవర్నర్ కొణిజేటి రోశయ్య ప్రసంగం ప్రజల్ని నిరాశ పరిచింది. ఈ పరిస్థితుల్లో 2015-16కు గాను రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. బడ్జెట్ సమావేశాలను ఈ నెలాఖరులో ఆరంభించే విధంగా అధికార వర్గాలు కార్యాచరణను సిద్ధం చేసి ఉన్నాయి. ఈ సమయంలో అసెంబ్లీలో బడ్జెట్ దాఖలు, ప్రతి పక్షాల విమర్శలు, ఆరోపణల్ని తిప్పికొట్టే విధంగా కసరత్తులకు సీఎం పన్నీరు సెల్వం సిద్ధం అయ్యారు. శాఖల వారీగా ఇప్పటికే ఆయా మంత్రులు సమీక్షించి నివేదికల్ని సిద్ధం చేశారు. ఆయా శాఖల్లో సాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, మున్ముందు అవసరమయ్యే నిధుల వివరాల్ని సీఎం పన్నీరు సెల్వంకు సమర్పించారు. దీంతో సమగ్ర బడ్జెట్ నివేదికను సిద్ధం చేయడం లక్ష్యంగా, ఆయా శాఖలకు జరిగిన కేటాయింపులపై సమీక్షించేందుకు ఆదివారం మధ్యాహ్నం రాష్ర్ట కేబినెట్ భేటీ అయింది. సచివాలయంలో మూడు గంటల నుంచి గంటన్నరకు పైగా సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఇందులో అన్ని శాఖల మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. బడ్జెట్ తుది ప్రతిని సిద్ధం చేసి, అందుకు ఆమోద ముద్ర పడే రీతిలో ఈ సమావేశం సాగింది. అలాగే, ప్రతి పక్షాలు చేస్తున్న విమర్శలు, ఆరోపణల్ని తిప్పికొట్టే విధంగా ప్రతి మంత్రి సిద్ధమయ్యే విధంగా సూచనలు, సలహాలు ఇచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య, పెండింగ్‌లో ఉన్న ఉచిత పథకాల అమలు వేగవంతం లక్ష్యంగా నిధుల కేటాయింపులు పెంచే విధంగా బడ్జెట్ రూపకల్పనకు చర్యలు తీసుకున్నారు. అలాగే, బడ్జెట్ తేదీ, ఎన్ని రోజులు నిర్వహించాలో అన్న అంశంతో పాటుగా పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ఈ భేటీ అనంతరం అసెంబ్లీ బడ్జెట్ ముహూర్తాన్ని ఖరారు చేసి రాజ్ భవన్ ఆమోదానికి పంపించనున్నారు. ఉద్వాసనకు గురైన మంత్రి అగ్రి కృష్ణమూర్తి రూపంలో అసెంబ్లీలో చిక్కులు ఎదురయ్యే పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్న దృష్ట్యా, ముందస్తు చర్యలకు సిద్ధమైనట్టు సమాచారం. ఆత్మహత్య చేసుకున్న వ్యవసాయ శాఖ అధికారి కేసును విచారించేందుకు ప్రత్యేక బృందం రంగంలోకి దిగడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ దాఖలుకు సిద్ధం కావడంతో ప్రతి ఏటా ప్రవేశ పెట్టే విధంగా ఈ ఏడాది కూడా పీఎంకే నేతృత్వంలో మాదిరి బడ్జెట్‌ను ప్రకటించారు. -
నేడు బడ్జెట్
సాక్షి, చెన్నై: 2014-15కు గాను రాష్ట్ర బడ్జెట్‌ను గురువారం అసెంబ్లీలో దాఖలు చేయడానికి ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం సిద్ధం అయ్యారు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజలపై వరాల జల్లు కురిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్‌సభకు ఎన్నికల నగారా నెలాఖరులో మోగే అవకాశాలు కన్పిస్తుండటంతో రాష్ట్ర బడ్జెట్‌ను ముందుగానే ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజాకర్షణే లక్ష్యంగా బడ్జెట్‌ను రూపకల్పన చేశారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేయడంతో పాటుగా ఉచిత పథకాలకు నిధుల వరద, అమ్మ క్యాంటీన్ల విస్తరణ, తదితర అభివృద్ధి, సంక్షేమ పథకాల నిధుల కేటాయింపుతో పాటుగా సరికొత్త పథకాలు ప్రవేశ పెట్టేందుకు బడ్జెట్‌ను వేదిక చేసుకున్నట్టు సమాచారం. అధికార యంత్రాంగం, మంత్రులు రేయింబవళ్లు శ్రమించి ప్రజాకర్షక బడ్జెట్‌ను సిద్ధం చేసినట్టు సచివాలయం వర్గాలు పేర్కొంటున్నాయి.సమీక్ష: బడ్జెట్లో కేటాయింపులపై అధికార యంత్రాంగంతో ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం ఇప్పటికే సమీక్ష పూర్తి చేశారు. ఇక బడ్జెట్ దాఖలుకు మరి కొన్ని గంటలు మాత్రమే ఉండటంతో అందులో పేర్కొన్న అంశాలకు తుది మెరుగులు దిద్దేందుకు బుధవారం మధ్యాహ్నం కేబినెట్ భేటీ అయింది. సీఎం జయలలిత నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి మంత్రులందరూ హాజరయ్యారు. శాఖల వారీగా జరిగిన కేటాయింపులు, పథకాల గురించి చర్చించారు. చిన్న చిన్న మార్పులు చేసినా, చిట్ట చివరగా సరికొత్త పథకాలకు కేబినెట్ ఆమోదం తెలపడంతో వాటిని గురువారం ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం ద్వారా అసెంబ్లీలో ప్రకటించేందుకు ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం సిద్ధం అయ్యారు. సేవా పన్ను: కేబినెట్ సమావేశానికి ముందుగా ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సీఎం జయలలిత లేఖాస్త్రం సంధించారు. బియ్యానికి సేవా పన్ను విధించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ తీసుకున్న నిర్ణయాన్ని తన లేఖ ద్వారా జయలలిత తప్పుబట్టారు. బియ్యం వ్యవసాయ ఉత్పత్తి కాదంటూ ఆర్థిక శాఖ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. తమిళనాడులో ఉచిత బియ్యం పథకం అమల్లో ఉందని గుర్తు చేశారు. బియ్యంపై సేవా పన్ను విధించిన పక్షంలో ధరలు అమాంతంగా పెరగడం ఖాయం అని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలతో చర్చించకుండా ఆర్థిక శాఖ ఇష్టానుసారంగా నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నామని, సేవా పన్ను నిర్ణయాన్ని ఉపసంహరించుకునే విధంగా ఆ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మింట్ వంతెన: సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జయలలిత మింట్ వంతెనను ప్రారంభించారు. ఉత్తర చెన్నైలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే విధంగా మింట్‌లో రూ.23 కోట్ల వ్యయంతో భారీ వంతెన నిర్మించారు. నిర్మాణం పూర్తి చేసుకున్నా, ప్రారంభోత్సవంలో జాప్యం నెలకొంది. ఎట్టకేలకు ఉదయం ఈ వంతెనను ఉత్తర చెన్నైవాసులకు అంకితం చేశారు. ఈ వంతెనతో పాటుగా స్టాన్లీ ఆస్పత్రి వద్ద రూ.10 కోట్లతో నిర్మించిన సబ్ వే, షెనాయ్ నగర్లో రూ.18 కోట్లతో నిర్మించిన ఆడిటోరియంలను కూడా జయలలిత ప్రారంభించారు. సంక్షేమ పథకాల పంపిణీ, ఉద్యోగ నియూమకాలు, మరి కొన్ని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.