తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం
విశ్వాస పరీక్ష నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం మొదలైంది.
విశ్వాస పరీక్ష నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం మొదలైంది. తాము నియమించిన విప్‌ను ఒప్పుకోవాలని, రహస్య ఓటింగ్ నిర్వహించాలని పన్నీర్ సెల్వం వర్గం డిమాండ్ చేస్తోంది. వాళ్లకు డీఎంకే కూడా అండగా నిలిచింది.
ఎమ్మెల్యేలను ఖైదీల్లా తీసుకొచ్చారని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ అన్నారు. అయితే పన్నీర్ సెల్వం వర్గం నియమించిన విప్‌ను ఒప్పుకోడానికి పళనిస్వామి వర్గం ఒప్పుకోలేదు. అలాగే రహస్య ఓటింగుకు కూడా వాళ్లు అంగీకరించలేదు. తమ ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని పన్నీర్ సెల్వం అన్నారు. తాము ఫ్లోర్ లీడర్‌గా ఎన్నుకున్న ఎమ్మెల్యేకు మాట్లాడే అవకాశం కల్పించాలని పన్నీర్ వర్గం డిమాండ్ చేస్తోంది.