బలపరీక్ష గలాటాపై స్పందించిన గవర్నర్‌! | tamilnadu governer seeks report | Sakshi
Sakshi News home page

బలపరీక్ష గలాటాపై స్పందించిన గవర్నర్‌!

Published Sun, Feb 19 2017 9:07 PM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM

బలపరీక్ష గలాటాపై స్పందించిన గవర్నర్‌!

బలపరీక్ష గలాటాపై స్పందించిన గవర్నర్‌!

చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో శనివారం బలపరీక్ష సందర్భంగా చోటుచేసుకున్న తీవ్ర గందరగోళ పరిస్థితులపై ఆ రాష్ట్ర ఇన్‌చార్జి గవర్నర్‌ విద్యాసాగర్‌రావు స్పందించారు. బలపరీక్ష సందర్భంగా సభలో చోటుచేసుకున్న ఘటనలపై నివేదిక ఇవ్వాలని ఆయన ఆదివారం ఆదేశించారు.

శనివారం శాసనసభలో బలపరీక్ష సందర్భంగా తీవ్ర నాటకీయ పరిణామాలు, ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష డీఎంకే సభ్యులు సభలో విధ్వంసానికి దిగడంతో అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత స్టాలిన్‌ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలను బలవంతంగా సభ నుంచి గెంటేసి.. విపక్షం లేకుండానే స్పీకర్‌ విశ్వాస పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ విశ్వాసపరీక్షలో 122 మంది ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం పళనిస్వామి గట్టెక్కారు. అయితే, స్పీకర్‌ చట్టబద్ధంగా వ్యవహరించలేదని, రహస్య ఓటింగ్‌ నిర్వహించాలన్న తమ డిమాండ్‌కు ఆయన అంగీకరించలేదని, తమను బలవంతంగా సభ నుంచి తరిమేశారని స్టాలిన్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తొలిసారి స్పందించిన గవర్నర్‌ బలపరీక్ష సందర్భంగా సభలో జరిగిన పరిణామాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement