governer vidyasagar rao
-
తమిళనాట టెన్షన్.. గవర్నర్ రాక!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆర్కేనగర్ ఉప ఎన్నికలు అధికార అన్నాడీఎంకేను పూర్తిగా అప్రతిష్టపాలు చేశాయి. ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు పంచినట్లుగా సాక్షాత్తు వైద్యశాఖా మంత్రి విజయభాస్కరే సాక్ష్యాధారాలతో ఐటీ అధికారులకు పట్టుబడడం ప్రభుత్వాన్ని సైతం ఇరుకున పెట్టింది. ఐటీ అధికారులను బెదిరించినట్లుగా ముగ్గురు మంత్రులపై పోలీసులు కేసు నమోదు, మంత్రి విజయభాస్కర్‌కు ఐటీ సమన్లు, ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులు సీఎం ఎడపాడికి వ్యతిరేకంగా, అనుకూలంగా చీలిపోవడం తదితర పరిణామాలతో రాష్ట్రంలో అల్లకల్లోల వాతావరణం నెలకొని ఉంది. గవర్నర్ రాక రాష్ట్రంలో పాలన కుంటువడి గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్న సమయంలో ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావు సోమవారం ఉదయం ముంబయి నుంచి ప్రత్యేక విమానంలో అకస్మాత్తుగా చెన్నైకి చేరుకున్నారు. ఐటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో ముగ్గురు మంత్రులు పోలీసు కేసులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని అధికార పార్టీ, ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది. విజయభాస్కర్‌కు ఉద్వాసన తప్పదని కొందరు, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారని మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే గవర్నర్ అత్యవసర రాక ఏదో ఒక సంచలనానికి దారితీయడం ఖాయమని అంటున్నారు. శశికళ వద్దకు దినకరన్ పరుగు రాష్ట్రంలో సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో శశికళను కలుసుకునేందుకు దినకరన్ బెంగళూరుకు పరుగులు పెట్టారు. రెండాకుల చిహ్నం కోసం రూ.60 కోట్ల ఎర ఆరోపణలు, రూ.1.30 కోట్లతో బ్రోకర్ పట్టుబడడం, ఢిల్లీ పోలీసుల సమన్లు తదితర అంశాలను ఆమెతో చర్చించేందుకు వెళ్లారు. పన్నీర్ గూటికి మంత్రులు అనేక ఆరోపణలు, అప్రతిష్టల సుడిగుండంలో అన్నాడీఎంకే చిక్కుకుని ఉండగా ఇదే అదనుగా పన్నీర్‌సెల్వం పాచిక విసిరారు. రెండు వర్గాలను విలీనం చేసేందుకు సీనియర్ మంత్రులు వస్తే చర్చలకు సిద్ధమని ఆహ్వానించారు. మధురైకి వెళుతున్న సందర్భంగా సోమవారం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ రెండాకులు గుర్తు తమకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. రెండాకుల చిహ్నం కోసం దినకరన్ లంచం ఇవ్వజూపే ప్రయత్నాలపై ఢిల్లీ పోలీసులు కేసు పెట్టిన విషయంపై తన వద్ద పూర్తి వివరాలు లేవని అన్నారు. ఇరువర్గాలు ఒకటి కావాలని తాను కోరుకుంటున్నానని, ఈ దిశగా సీనియర్ మంత్రులు వస్తే చర్చించేందుకు తాను సిద్ధమని చెప్పారు. అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నాన్ని కాపాడుకునేందుకు పన్నీర్ వర్గంలో చేరిపోయేందుకు మంత్రులు, సీనియర్ నేతలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమ్మ మరణం తరువాత కోల్పోయిన ప్రతిష్టను పొందాలంటే రాజీనామా చేయాలని శశికళ, దినకరన్‌లను మంత్రులు కోరినట్లు, వారు నిరాకరించినట్లు సమాచారం. దీంతో శశికళ వర్గం నుంచి తప్పుకుని పన్నీర్ వర్గంలో విలీనం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకునే పన్నీర్‌సెల్వం వారికి ఆహ్వానం పలికారని అంటున్నారు. మంత్రులు, సీనియర్ నేతలు పన్నీర్ పక్షం చేరితే ప్రభుత్వాన్ని కూల్చేస్తామని దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు సోమవారం హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిణామాలతో కంగారు పడిన లోక్‌సభ ఉప సభాపతి, శశికళ విశ్వాసపాత్రుడు తంబిదురై హడావిడిగా సీఎం ఎడపాడితో సమావేశమయ్యారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ అన్నాడీఎంకే చీలిపోలేదు, వర్గాలు లేవు, ప్రజాస్వామ్యంలో చిన్నపాటి అసంతృప్తులు సహజమని తంబిదురై వ్యాఖ్యానించారు. -
పళని బలపరీక్ష చెల్లదు!
మద్రాస్ హైకోర్టులో డీఎంకే పిటిషన్ బలపరీక్ష రద్దు చేయాలని విజ్ఞప్తి చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో గత శనివారం నిర్వహించిన బలపరీక్ష చెల్లదంటూ ప్రధాన ప్రతిపక్షం డీఎంకే కోర్టుకెక్కింది. ప్రతిపక్షాలు లేకుండానే అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్ష చెల్లదని ఆదేశాలు ఇవ్వాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీ నుంచి డీఎంకే సభ్యులను బలవంతంగా గెంటేసిన విషయాన్ని పిటిషన్లో ప్రస్తావించింది. బలపరీక్షలో భాగంగా రహస్య ఓటింగ్‌ను చేపట్టాలని కోరినా స్పీకర్ ధన్పాల్ పట్టించుకోలేదని, తమను సభ నుంచి బయటకు గెంటేశారని, మార్షల్స్ తమపై దాడికి పాల్పడ్డారని డీఎంకే పిటిషన్లో ఆరోపించింది. ప్రతిపక్ష సభ్యులు లేకుండా సభలో జరిగిన విశ్వాస పరీక్ష ఏ రకంగానూ చెల్లదని స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యాన్ని అత్యవసరంగా స్వీకరించాలని డీఎంకే తరపు న్యాయవాది కోరగా మంగళవారం విచారణ చేపడతామని న్యాయమూర్తులు జస్టిస్ జి.రమేష్, మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. బలపరీక్ష సందర్భంగా చోటుచేసుకున్న తీవ్ర గందరగోళ పరిస్థితులపై ఇప్పటికే తమిళనాడు ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావు నివేదిక కోరిన సంగతి తెలిసిందే. బలపరీక్ష సందర్భంగా సభలో చోటుచేసుకున్న ఘటనలపై నివేదిక ఇవ్వాలని ఆయన అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు. శాసనసభలో బలపరీక్ష సందర్భంగా తీవ్ర నాటకీయ పరిణామాలు, ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష డీఎంకే సభ్యులు సభలో విధ్వంసానికి దిగడంతో అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత స్టాలిన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలను బలవంతంగా సభ నుంచి గెంటేసి.. విపక్షం లేకుండానే స్పీకర్ విశ్వాస పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ విశ్వాసపరీక్షలో 122 మంది ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం పళనిస్వామి గట్టెక్కారు. అయితే, స్పీకర్ చట్టబద్ధంగా వ్యవహరించలేదని, రహస్య ఓటింగ్ నిర్వహించాలన్న తమ డిమాండ్‌కు ఆయన అంగీకరించలేదని, తమను బలవంతంగా సభ నుంచి తరిమేశారని స్టాలిన్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఈ అంశంపై న్యాయపోరాటం చేయాలని డీఎంకే నిర్ణయించింది. అందులో భాగంగానే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
బ్రేకింగ్: పళని బలపరీక్ష చెల్లదు!
-
బలపరీక్ష గలాటాపై స్పందించిన గవర్నర్!
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో శనివారం బలపరీక్ష సందర్భంగా చోటుచేసుకున్న తీవ్ర గందరగోళ పరిస్థితులపై ఆ రాష్ట్ర ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావు స్పందించారు. బలపరీక్ష సందర్భంగా సభలో చోటుచేసుకున్న ఘటనలపై నివేదిక ఇవ్వాలని ఆయన ఆదివారం ఆదేశించారు. శనివారం శాసనసభలో బలపరీక్ష సందర్భంగా తీవ్ర నాటకీయ పరిణామాలు, ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష డీఎంకే సభ్యులు సభలో విధ్వంసానికి దిగడంతో అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత స్టాలిన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలను బలవంతంగా సభ నుంచి గెంటేసి.. విపక్షం లేకుండానే స్పీకర్ విశ్వాస పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ విశ్వాసపరీక్షలో 122 మంది ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం పళనిస్వామి గట్టెక్కారు. అయితే, స్పీకర్ చట్టబద్ధంగా వ్యవహరించలేదని, రహస్య ఓటింగ్ నిర్వహించాలన్న తమ డిమాండ్‌కు ఆయన అంగీకరించలేదని, తమను బలవంతంగా సభ నుంచి తరిమేశారని స్టాలిన్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తొలిసారి స్పందించిన గవర్నర్ బలపరీక్ష సందర్భంగా సభలో జరిగిన పరిణామాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. -
గవర్నర్‌తో అమీతుమీకి శశికళ సై!
-
గవర్నర్‌తో అమీతుమీకి శశికళ సై!
చెన్నై: తమిళనాడు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, సీఎం సీటుకోసం పట్టుబడుతున్న శశికళ మరో అనూహ్య నిర్ణయం తీసుకోనున్నారు. ఆమె ఏకంగా గవర్నర్ విద్యాసాగర్‌రావుపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని శశికళ కోరిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు అనుకూలమైన వాతావరణం కోసం కాస్తంత వేచి చూసే ధోరణిలో గవర్నర్ ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గవర్నర్ అనుసరిస్తున్న తీరుపట్ల విసిగివేసారిన శశికళ ఇక ఏకంగా ఆయనతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. సాయంత్రంలోగా గవర్నర్ నిర్ణయం తీసుకోకుంటే గవర్నర్ అధికారిక బంగళా రాజ్‌భవన్ ముందు ఎమ్మెల్యేలతో కలిసి పరేడ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమె తన పక్కనే ఉన్న ఎమ్మెల్యేలతో ఇదే విషయాన్ని చర్చించడంతోపాటు ఆయా రిసార్టుల్లో ఉన్న ఎమ్మెల్యేలను కలిసేందుకు కూడా గోల్డెన్ బే రిసార్ట్ వద్దకు బయలుదేరారు. తనకు మద్దతు కోరడంతోపాటు భవిష్యత్ కార్యాచరణ, రాజ్‌భవన్‌ముందు పరేడ్‌కు వెళదామనే అంశాన్ని వారికి చెప్పి అభిప్రాయాలు తెలుసుకోనున్నట్లు సమాచారం. మరికొన్ని గంటల్లో ఈ విషయంపై స్పష్టత రానున్నట్లు శశి వర్గం చెబుతోంది. తమిళనాట సంక్షోభం.. ప్రధాన కథనాలు డీఎంకే భవిష్యత్ కార్యాచరణ.. సర్వత్రా ఉత్కంఠ! శశి నుంచి మా మంత్రిని కాపాడండి! అక్రమాస్తుల కేసు.. శశికి మరో ట్విస్టు! నేడు శశికళ భారీ స్కెచ్? శశి భేటీ .. ఐదుగురు మంత్రులు జంప్! చెన్నైలో హై టెన్షన్ పన్నీర్ మైండ్ గేమ్ షురూ.. దీపం చుట్టూ కమ్ముకుంటున్న చీకటి -
క్షణక్షణం.. జయకు శశి నివాళి..
-
శుభవార్త చెప్తా.. కళకళలాడిన పన్నీర్!
-
గవర్నర్ రాక ఖాయం.. ఏం చేస్తారో ఉత్కంఠ!
-
గవర్నర్ రాక ఖాయం.. ఏం చేస్తారో ఉత్కంఠ!
చెన్నై: తమిళనాట అత్యంత నాటకీయ రాజకీయ పరిణామాలు నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఇన్చార్జి గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుపైనే ఉంది. తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభంపై ఇన్నాళ్లు వేచిచూసే ధోరణి అవలంబించిన గవర్నర్ ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగబోతున్నారు. ఆయన గురువారం చెన్నై రాబోతున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ పావులు కదుపుతుండగా.. మరోవైపు ఆమెపై తిరుగుబాటు ఎగురవేసిన పన్నీర్ సెల్వం కోరితే రాజీనామా వెనుకకు తీసుకుంటానని అంటున్నారు. మరోవైపు 130మందిపైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు ఉన్న శశికళ క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. ఈ నేపథ్యంలో చిన్నమ్మ-ఓపీఎస్ పోరు తమిళనాట ఉత్కంఠ రేపుతోంది. ఈ నాటకీయ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఆయన శశికళను అసెంబ్లీలో బలనిరూపణ చేయాలని ఆదేశిస్తారా? లేక రాష్ట్రపతి పాలన విధిస్తారా? లేక ఓపీఎస్‌నే సీఎంగా కొంతకాలం కొనసాగమంటారా? అసలు గవర్నర్ ఏం చేస్తారనే దానిపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత సంక్షోభంలో గవర్నర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడంలేదనే విమర్శలూ లేకపోలేదు. తమిళతీరం రాజకీయ వేడితో అట్టుడుకుతుండగా.. ఆయన ఊటీ, ముంబై వెళ్లి తిరిగి వస్తున్న సంగతి తెలిసిందే. అసలు గవర్నర్ ఏం చేస్తారు? ఏదైనా రాజకీయ ఎత్తుగడ వేస్తారా? శశికళకు అవకాశం ఇస్తారా? అన్నది ఉత్కంఠ రేపుతున్నది. -
'లోక్మత్ మీడియా' గ్రీన్ ఎనర్జీ పార్కు
నాగ్‌పూర్: మహా రాష్ర్టలోని నాగ్‌పూర్ సమీపంలోని బుతిబోరీలో లోక్మత్ మీడియా సంస్థ ఏర్పాటుచేసిన 324కిలోవాట్ల సామర్థ్యమున్న సౌర విద్యుత్ ప్లాంట్.. 'లోక్మత్ గ్రీన్ ఎనర్జీ పార్కు'ను ఆ రాష్ట్ర గవర్నర్ సి.విద్యాసాగర్ రావు మంగళవారం ప్రారంభించారు. ఒక మీడియా సంస్థ తన ప్రింటింగ్ యూ నిట్‌లో సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటుచేయడం దేశంలోనే ఇది తొలిసారి. 720కిలోమీటర్ల తీరప్రాంతమున్న మహారాష్ట్ర ప్రభుత్వం సైతం సంప్రదాయేతర ఇంథనం ఉత్పత్తిపై మరింతగా దృష్టిసారించాలని విద్యుత్ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా గవర్నర్ విద్యాసాగర్ సూచించారు. మహారాష్ట్ర ఇంధన శాఖ మంత్రి చంద్రశేఖర్ బవాంకులే, లోక్మత్ మీడియా ఎడిటోరియల్ బోర్డు ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు విజయ్ దార్దా, రామ్‌టెక్ ఎంపీ కృపాల్ తుమానె, లోక్మత్ మీడియా మేనేజింగ్ డెరైక్టర్ దేవేంద్ర దార్దా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఔరంగాబాద్‌లోని ప్రింటిం గ్ యూనిట్‌లోనూ సోలార్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించారు.