క్షణక్షణం.. జయకు శశి నివాళి.. | sasikala leaves poes garden | Sakshi

Feb 9 2017 7:05 PM | Updated on Mar 21 2024 8:11 PM

ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు పావులు కదుపుతున్న అన్నాడీఎంకే అధినేత్రి వీకే శశికళ గురువారం రాత్రి గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌ను కలిసేందుకు బయలుదేరారు. పోయెస్‌ గార్డెన్‌ నుంచి నేరుగా మేరినా బీచ్‌ చేరుకున్న ఆమె.. అక్కడ దివంగత జయలలిత సమాధి వద్ద నివాళులర్పించారు. తన చేతిలో ఉన్న పత్రాలను సమాధి వద్ద ఉంచారు. ఈ సందర్భంగా ఒకింత భావోద్వేగంతో కనిపించారు. అనంతరం నేరుగా రాజ్‌భవన్‌కు బయలుదేరారు. రాత్రి 7.30 గంటలకు గవర్నర్‌ విద్యాసాగర్‌రావుతో ఆమె భేటీకానున్నారు. జయలలిత తరహాలో ఆకుపచ్చని చీర కట్టుకున్న శశికళ ఒకింత కన్నీటి పర్యంతమవుతూ అమ్మ సమాధి వద్దనుంచి కదిలారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement