గవర్నర్‌తో అమీతుమీకి శశికళ సై!
చెన్నై: తమిళనాడు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, సీఎం సీటుకోసం పట్టుబడుతున్న శశికళ మరో అనూహ్య నిర్ణయం తీసుకోనున్నారు. ఆమె ఏకంగా గవర్నర్ విద్యాసాగర్‌రావుపై పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని శశికళ కోరిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు అనుకూలమైన వాతావరణం కోసం కాస్తంత వేచి చూసే ధోరణిలో గవర్నర్ ఉన్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో గవర్నర్ అనుసరిస్తున్న తీరుపట్ల విసిగివేసారిన శశికళ ఇక ఏకంగా ఆయనతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. సాయంత్రంలోగా గవర్నర్ నిర్ణయం తీసుకోకుంటే గవర్నర్ అధికారిక బంగళా రాజ్‌భవన్ ముందు ఎమ్మెల్యేలతో కలిసి పరేడ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఆమె తన పక్కనే ఉన్న ఎమ్మెల్యేలతో ఇదే విషయాన్ని చర్చించడంతోపాటు ఆయా రిసార్టుల్లో ఉన్న ఎమ్మెల్యేలను కలిసేందుకు కూడా గోల్డెన్ బే రిసార్ట్ వద్దకు బయలుదేరారు. తనకు మద్దతు కోరడంతోపాటు భవిష్యత్ కార్యాచరణ, రాజ్‌భవన్‌ముందు పరేడ్‌కు వెళదామనే అంశాన్ని వారికి చెప్పి అభిప్రాయాలు తెలుసుకోనున్నట్లు సమాచారం. మరికొన్ని గంటల్లో ఈ విషయంపై స్పష్టత రానున్నట్లు శశి వర్గం చెబుతోంది.
తమిళనాట సంక్షోభం.. ప్రధాన కథనాలు
డీఎంకే భవిష్యత్ కార్యాచరణ.. సర్వత్రా ఉత్కంఠ!
శశి నుంచి మా మంత్రిని కాపాడండి!
అక్రమాస్తుల కేసు.. శశికి మరో ట్విస్టు!