'లోక్‌మత్ మీడియా' గ్రీన్ ఎనర్జీ పార్కు
నాగ్‌పూర్: మహా రాష్ర్టలోని నాగ్‌పూర్ సమీపంలోని బుతిబోరీలో లోక్‌మత్ మీడియా సంస్థ ఏర్పాటుచేసిన 324కిలోవాట్ల సామర్థ్యమున్న సౌర విద్యుత్ ప్లాంట్.. 'లోక్‌మత్ గ్రీన్ ఎనర్జీ పార్కు'ను ఆ రాష్ట్ర గవర్నర్ సి.విద్యాసాగర్ రావు మంగళవారం ప్రారంభించారు. ఒక మీడియా సంస్థ తన ప్రింటింగ్ యూ నిట్‌లో సౌర విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటుచేయడం దేశంలోనే ఇది తొలిసారి. 720కిలోమీటర్ల తీరప్రాంతమున్న మహారాష్ట్ర ప్రభుత్వం సైతం సంప్రదాయేతర ఇంథనం ఉత్పత్తిపై మరింతగా దృష్టిసారించాలని విద్యుత్ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా గవర్నర్ విద్యాసాగర్ సూచించారు. మహారాష్ట్ర ఇంధన శాఖ మంత్రి చంద్రశేఖర్ బవాంకులే, లోక్‌మత్ మీడియా ఎడిటోరియల్ బోర్డు ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు విజయ్ దార్దా, రామ్‌టెక్ ఎంపీ కృపాల్ తుమానె, లోక్‌మత్ మీడియా మేనేజింగ్ డెరైక్టర్ దేవేంద్ర దార్దా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఔరంగాబాద్‌లోని ప్రింటిం గ్ యూనిట్‌లోనూ సోలార్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించారు.