తమిళనాడు అసెంబ్లీలో జరిగిన బలపరీక్ష తీరును వ్యతిరేకిస్తూ డీఎంకే అధినేత స్టాలిన్ నిరాహార దీక్ష దిగడంతో మెరీనా బీచ్‌లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చినిగిన చొక్కాతో గాంధీ విగ్రహం వద్ద దీక్షకు కూర్చున్న ఆయనను, ఆయన మద్దతుదారులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, డీఎంకే శ్రేణుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.