trust vote
-
జార్ఖండ్ అసెంబ్లీలో నేడు బలపరీక్ష..ఏ పార్టీ బలం ఎంత..?
-
రసవత్తరంగా జార్ఖండ్ రాజకీయం.. సోరెన్ సర్కార్‌కు బలపరీక్ష
రాంచీ: జార్ఖండ్‌లో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. నేడు చంపయ్ సోరెన్ నేతృత్వంలో ఏర్పాటైన కొత్త ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనుంది. దీంతో, జార్ఖండ్‌లో ఏం జరగనుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక, హైదరాబాద్‌లో ఉన్న 40 మంది జార్ఖండ్ ఎమ్మెల్యేలు ఇప్పటికే స్వరాష్ట్రం చేరుకున్నారు. కాగా, జార్ఖండ్‌లో 81 అసెంబ్లీ స్థానాలకు ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో జార్ఖండ్ ముక్తి మోర్చా(28), కాంగ్రెస్(16), ఆర్జేడీ(1) కూటమికి 45 సీట్లు ఉన్నాయి. సీపీఐ(ఎంఎల్) ఏకైక ఎమ్మెల్యే ఆ కూటమికి బయటి నుంచి మద్దతిస్తుండగా.. బీజేపీతో కూడిన విపక్ష కూటమికి 29 మంది ఎమ్మెల్యేలున్నారు. బలపరీక్షలో గెలవాలంటే జేఎంఎం కూటమికి 41 ఓట్లు వస్తే సరిపోతుంది. అయితే, ప్రస్తుత కూటమికి బలపరీక్షను గెలిచే ఛాన్స్ ఉంది. మరోవైపు.. జేఎంఎం ఎమ్మెల్యే లాబిన్ హెమ్‌బ్రోమ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. త్వరలోనే ఆ పార్టీతో అన్ని సంబంధాలు తెంచుకుంటానని, గిరిజనుల హక్కుల కోసం అసెంబ్లీ వేదికగా గళమెత్తుతానని లాబిన్ హెమ్‌బ్రోమ్ అన్నారు. తన సలహాను పట్టించుకోనందుకే మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. చోటా నాగ్‌పుర్ అద్దె చట్టం, సంథాల్ పరగణాల అద్దె చట్టం తీసుకొస్తామని 2019 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో జేఎంఎం పేర్కొంది. కానీ, అవి కార్యరూపం దాల్చలేదు. కేంద్రం ప్రభుత్వం తెచ్చిన పంచాయతీ చట్టం-1996ని కూడా ఇక్కడ అమలు చేయలేదు. తొలి రెండు చట్టాలు గిరిజనులకు భూ హక్కులు కల్పించేవి కాగా, పీఈఎస్ఏ చట్టం గ్రామసభలకు బలాన్నిస్తుంది. గిరిజనుల హక్కులను కాపాడుతుంది. కానీ, ఈ మూడింటినీ హేమంత్ ప్రభుత్వం అమలు చేయలేదు. అందుకే జార్ఖండ్ బచావో మోర్చా ఫోరాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక విష్ణుపూర్ ఎమ్మెల్యే చమ్రాలిండా ఇటీవల జేఎంఎం నిర్వహించిన పార్టీ సమావేశానికి రాలేదు. ఆయన అనారోగ్యం బారిన పడినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఆయన అసలు ఎవరికీ అందుబాటులో లేనట్టు తెలుస్తోంది. సోమవారం విశ్వాసపరీక్షకు ఆయన గైర్హాజరయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. జేఎంఎం వర్గాలు మాత్రం.. తమకు 43 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని చెప్తున్నాయి. కాగా.. సోమవారం నాటి పరీక్షలో హేమంత్ సోరెన్ ఓటు వేసేందుకు రాంచీలోని ప్రత్యేక కోర్టు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. -
Jhalda: విశ్వాస పరీక్షలో ఓడిన టీఎంసీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అధికార పక్షానికి ఎదురు దెబ్బ తగిలింది. విశ్వాస పరీక్షలో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి పాలైంది. అయితే అది బెంగాల్ శాసన సభలో కాదు!.. బెంగాల్ రాజకీయాలకు 2023 పంచాయితీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. అంతకంటే ముందే అధికార టీఎంసీకి ఝలక్ తగిలింది. పురూలియా జిల్లా ఝల్దా మున్సిపాలిటీలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో తృణమూల్ పార్టీ ఓడింది. అంతకు ముందు.. ఇక్కడ విశ్వాస పరీక్ష నిర్వహించాల్సిందేనంటూ అధికార పక్షానికి మొట్టికాయలు వేసింది కోల్‌కతా హైకోర్టు. దీంతో 12 వార్డులు ఉన్న ఝల్దా మున్సిపాలిటీలో సోమవారం విశ్వాస పరీక్ష నిర్వహించారు. మొత్తం 12 వార్డుల్లో ఐదు తృణమూల్, మరో ఐదు కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయి. ఇంకో రెండు చోట్ల ఇండిపెండెంట్ కౌన్సిలర్లు కైవసం చేసుకున్నారు. సోమవారం జరిగిన ఓటింగ్‌లో స్వతంత్రులు, కాంగ్రెస్ సభ్యులు పాల్గొనడంతో.. సంఖ్యా బలం ఆధారంగా టీఎంసీ ఓటమి పాలైంది. ఇండిపెండెంట్ అభ్యర్థులిద్దరూ కాంగ్రెస్‌కే మద్ధతు ఇచ్చారు. ఇదిలాఉంటే.. ఝల్దా మున్సిపాలిటీ చైర్మన్ సురేష్ అగర్వాల్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు ప్రతిపక్ష కౌన్సిలర్లు. ఇందుకు సంబంధించి కేసు నమోదు కావడంతో.. హైకోర్టు సైతం విశ్వాస పరీక్ష నిర్వహించాలని ఝల్దా బోర్డును ఆదేశించింది కూడా. మద్ధతు వెనక్కి.. ఝల్దా మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్ తపన్ కండు మరణంతో ఉప ఎన్నిక జరిగింది. మార్చి 13వ తేదీన తపన్ హత్యకు గురికాగా.. ఆ ప్లేసులో ఆయన మేనల్లుడు మిథున్ విజయం సాధించారు. ఈలోపే స్వతంత్ర అభ్యర్థి షీలా ఛటోపాధ్యాయ మద్దతుతో మున్సిపల్ బోర్డును ఏర్పాటు చేసింది టీఎంసీ. దీనిపై ప్రతిపక్ష కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే.. దుర్గా పూజ తర్వాత షీలా తన మద్ధతు ఉపసంహరించుకోవడంతో ఝుల్దా మున్సిపాలిటీ అధికారం ఊగిసలాటకు చేరుకుంది. అభివృద్ధి కొరవడిందని కారణంతో షీలా తన మద్దతును వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాతే బోర్డుకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం తెర మీదకు వచ్చింది. ఇదిలా ఉంటే.. 2022 ఫిబ్రవరిలో 108 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగ్గా.. 102 స్థానాలకు సొంతం చేసుకుంది టీఎంసీ. సీపీఐ(ఎం) ఒక్కస్థానంలో ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. ఇక బీజేపీ ఒక్క స్థానంలో కూడా గెలుపొందలేదు. నాలుగు స్థానాల్లో హంగ్ ఫలితం వచ్చింది. ఇక ఇప్పుడు 101లో ఝల్దా విశ్వాస పరీక్షలో ఓటమి ద్వారా ఒక స్థానం కోల్పోయింది టీఎంసీ. ఓడింది ఒక్క స్థానమే అయినా.. అదీ మున్సిపాలిటీ అయినా.. దాని వెనుక జరిగిన రాజకీయం గురించి రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. ప్రముఖ నేతలంతా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. అయితే హైకోర్టు నుంచి అక్షింతలు వేయించుకోవడంతో పాటు ఆపై విశ్వాస పరీక్షలో ఓడి ఝల్దాను చేజార్చుకుంది టీఎంసీ. -
బలపరీక్షలో నెగ్గిన జార్ఖండ్ సీఎం
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీలో సోమవారం బలపరీక్ష జరిగింది. సీఎం హేమంత్ సోరెన్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకుంది. అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైన వెంటనే సభలో విశ్వాసపరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు సోరెన్. అనంతరం దీనిపై కాసేపు చర్చ జరిగింది. ఆ తర్వాత నిర్వహించిన ఓటింగ్‌లో సోరెన్ ప్రభుత్వానికి అనుకూలంగా 48 ఓట్లు వచ్చాయి. ఓటింగ్‌కు ముందే బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో మెజారిటీకి 42 సీట్లు అవసరం. విశ్వాస పరీక్ష సందర్భంగా బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సోరెన్. కమలం పార్టీ ప్రతిరోజు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే ఆ పార్టీ పని చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు గొడవలు సృష్టించి దేశంలో పౌర యుద్ధం తరహా పరిస్థితులు తీసుకురావాలని చూస్తోందని ధ్వజమెత్తారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా జార్ఖండ్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించారని సోరెన్ ఆరోపించారు. జార్ఖండ్‌లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు బీజేపీ ప్రయత్నాలేవీ ఫలించవని స్పష్టం చేశారు. ఆ పార్టీకి రాజకీయంగా తగిన రీతిలో బదులిస్తామన్నారు. ముందు రోజు రాంచీకి వచ్చిన ఎమ్మెల్యేలు.. బలపరీక్ష నేపథ్యంలో అధికార యూపీఏకి చెందిన 30 మంది ఎమ్మెల్యేలు ఆదివారం ఛత్తీస్‌గఢ్ నుంచి తిరిగి రాంచీకి చేరుకున్నారు. ఆగస్ట్ 30 నుంచీ వీరు రాయ్‌పూర్‌లోని ఓ విలాసవంతమైన రిసార్టులో మకాం వేసిన విషయం తెలిసిందే. తమ సంకీర్ణాన్ని ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రతిపక్ష బీజేపీ ప్రయత్నిస్తుందన్న అనుమానాల మధ్య సీఎం హేమంత్ సోరెన్ ఎమ్మెల్యేలను ఛత్తీస్‌గఢ్‌కు తరలించారు. అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం సోరెన్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం జార్ఖండ్ గవర్నర్‌కు లేఖ రాయడంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి దారి తీసిన విషయం తెలిసిందే. చదవండి: ‘2024లో బీజేపీకి రెండే సీట్లు.. ఎక్కడ మొదలయ్యారో అక్కడికే’ -
ఆపరేషన్ లోటస్ విఫలమైంది: కేజ్రీవాల్
-
ఢిల్లీ: విశ్వాస పరీక్షలో నెగ్గిన కేజ్రీవాల్ సర్కార్
న్యూఢిల్లీ: ‘‘మిగతా రాష్ట్రాల్లో సఫలమైన బీజేపీ ఆపరేషన్ కమలం ఢిల్లీలో పూర్తిగా విఫలమైంది. ఒక్క ఆప్ ఎమ్మెల్యేను కూడా లాగలేకపోయింది’’ అని ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. గురువారం ఆప్ సర్కార్ విశ్వాస పరీక్షలో నెగ్గింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో జరిగిన చర్చలో కేజ్రీవాల్ మాట్లాడారు. తమ ఎమ్మెల్యేలు పార్టీకి విశ్వాసపాత్రులని చాటి చెప్పేందుకే విశ్వాస పరీక్ష పెట్టామన్నారు. గుజరాత్లో ఆప్ ఓటు శాతం పెరిగింది గుజరాత్లో ఆప్‌కు ఆదరణ పెరుగుతోందని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై సీబీఐ అక్రమ దాడుల తర్వాత అక్కడ ఆప్ ఓటు షేరు నాలుగు శాతం పెరిగిందన్నారు. ఆయనను అన్యాయంగా అరెస్ట్‌చేస్తే మరో రెండు శాతం ఓటు శాతం ఎగబాకుతుందన్నారు. ‘‘సిసోడియా సొంతూర్లోనూ సోదాలు చేశారు. బ్యాంక్ లాకర్ తెరిపించారు. అయినా ఏమీ దొరకలేదు. ఈ దాడుల ద్వారా ఆప్‌కు, సిసోడియా నిజాయతీకి ప్రధాని మోదీనే స్వయంగా నిజాయతీ సర్టిఫికెట్ ఇచ్చేశారు’’ అన్నారు. మరోవైపు ఢిల్లీలో మళ్లీ పాత మద్యం విధానం అమల్లోకి వచ్చింది. ఖాదీ, కుటీర పరిశ్రమల కమిషన్ చైర్మన్‌గా తాను పాల్పడిన అవినీతిపై సీబీఐ విచారణ చేయించాలన్న ఆప్ ఆరోపణలపై లెఫ్టినెంట్ గవర్నర్ మండిపడ్డారు. చదవండి: శాఖ మార్చిన కాసేపటికే.. బిహార్ మంత్రి రాజీనామా -
2 వారాల తర్వాతే ‘నితీశ్’ బల నిరూపణ.. కారణమేంటి?
పాట్నా: బిహార్‌లో బీజేపీతో సంబంధాలు తెంచుకుని ఆర్జేడీతో కలిసి మరోమారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు నితీశ్ కుమార్. ఆయన సీఎంగా కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వత తొలిసారి నిర్వహించే అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సెషన్స్‌లోనే జేడీయూ-ఆర్జేడీ ప్లస్ ప్రభుత్వం బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం స్పీకర్ పదవీలో బీజేపీ నేత ఉండటంతో ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ముందుగా స్పీకర్‌ను మార్చాలని అధికార కూటమి భావిస్తోంది. అవసరమైన బలం ఉన్నప్పటికీ అనవసర రిస్క్ తీసుకోకూడదని నేతలు భావిస్తున్నారు. సాంకేతికంగా గవర్నర్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఆదేశించాలి. కానీ, ప్రభుత్వ ప్రతిపాదనల మేరకు నడుచుకుంటారు. ఇప్పటికే.. స్పీకర్ విజయ్ కుమార్ సిన్హాపై అవిశ్వాస తీర్మానాన్ని 55 మంది మహాకూటమి ఎమ్మెల్యేలు ఇచ్చారు. అయితే.. నిబంధనల ప్రకారం ఈ తీర్మానం ఇచ్చిన రెండు వారాల తర్వాతే అసెంబ్లీ ముందుకు వస్తుంది. అందుకే ఆగస్టు 24 వరకు వేచి చూడాల్సిన అవసరం ఏర్పడింది. మహాగడ్బంధన్ కూటమికి ప్రస్తుతం 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. 243 సభ్యుల అసెంబ్లీలో 122 మంది మద్దతు ఉంటే సరిపోతుంది. అయితే, ఎలాంటి రిస్క్ తీసుకోకూడదనే ధోరణి కనిపిస్తోంది. ఆగస్టు 25న విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్నారు నితీశ్. ఆగస్టు 24న అసెంబ్లీ సమావేశాల తొలిరోజున అవిశ్వాస తీర్మానంతో స్పీకర్ విజయ్ కుమార్ సిన్హాను తొలగించి కొత్తవారిని ఎన్నుకోనున్నారు. మరోవైపు.. ఆలోపే స్పీకర్ సిన్హా రాజీనామా చేసే అవకాశాలు సైతం కనిపిస్తున్నాయి. అయితే, ఆయన బీజేపీ నాయకత్వం చెప్పినట్లు నడుచుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్త స్పీకర్ ఆర్జేడీ నుంచి ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ చదవండి: ఉచితాలు, సంక్షేమ పథకాలు రెండు వేరు వేరు: సుప్రీం కోర్టు -
ఉద్ధవ్ థాక్రేకే ఎందుకిలా.. ఎమ్మెల్యే ఇంత పనిచేస్తాడని ఊహించలేదు
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో భలే ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. నేడు(సోమవారం) ఏక్నాథ్ షిండే ప్రభుత్వం.. విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. సీఎం షిండేకు మద్దతుగా.. 164 మంది శాసనసభ్యులు ఓటు వేశారు. షిండే-బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 99 ఓట్లు పోలయ్యాయి. ఇదిలా ఉండగా.. బలపరీక్షలో శివసేన ఎమ్మెల్యేలు షిండే సర్కార్‌కు సపోర్టుగా నిలిచారు. మద్దతుగా ఓట్లు వేశారు. ఈ నేపథ్యంలో శివసేన ఎమ్మెల్యే సంతోష్ బంగర్ ట్విటర్లో జూన్ 24న పోస్ట్ చేసిన ఓ వీడియో చర్చనీయాంశంగా మారింది. కాగా, శివసేనకు చెందిన రెబల్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారం క్రితం సంతోష్ బంగర్.. తాను ఉద్ధవ థాక్రేకు మద్దుతు ఇస్తున్నట్టు చెప్పాడు. ఈ సందర్భంగా తన నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి సంతోష్ బంగర్ ఓ సభలో మాట్లాడుతూ.. ఉద్ధవ్‌కి మద్దతుగా కన్నీరు కూడా పెట్టుకున్నారు. కానీ, ఉద్ధవ్ థాక్రేకు షాకిస్తూ.. సోమవారం జరిగిన బల పరీక్షలో సంతోష్ బంగర్.. సీఎం ఏక్నాథ్ షిండేకు మద్దతు ఇచ్చారు. దీంతో ఉద్ధవ్ వర్గం ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. అయితే, సంతోష్ బంగర్ ఆదివారం రాత్రే ముంబైలోని ఓ హోటల్లో సీఎం షిండేని కలిసినట్టు సమాచారం. आज मतदारसंघांमध्ये परत आल्यानंतर उपस्थित शिवसैनिकांना संबोधित करताना अश्रू अनावर झाले....शेवटच्या श्वासापर्यंत आदरणीय शिवसेना पक्षप्रमुख #उद्धव_ठाकरे साहेबा सोबत. @ShivSena @AUThackeray pic.twitter.com/loMHpUI4cL — आमदार संतोष बांगर (@santoshbangar_) June 24, 2022 ఇది కూడా చదవండి: శివసేన, ఎన్సీపీకి కాంగ్రెస్ షాక్! -
అవిశ్వాసానికి ముందే ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేయాలి!
Nawaz Sharif Allegedly Attacked in UK: పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పై ప్రతిపక్ష పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే అవిశ్వాస తీర్మానానికి ముందు తన ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం ఇమ్రాన్‌ఖాన్ శనివారం దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు. అంతేకాదు ఇమ్రాన్ ఖాన్ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఈ కుట్రకు వ్యతిరేకంగా శని, ఆదివారాల్లో ఆందోళన చేయాలని పాకిస్తాన్ యువతని కోరారు. మరోవైపు యూకెలో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై దాడి జరిగింది. షరీఫ్ పై ఇమ్రాన్ ఖాన్ పార్టీ కార్యకర్త దాడికి పాల్పడినట్లు పాకిస్తాన్ మీడియా శనివారం వెల్లడించింది. దీంతో నవాజ్ షరీఫ్ కూతురు, పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ పార్టీ నాయకురాలు మర్యమ్ నవాజ్ షరీఫ్ ఇమ్రాన్ ఖాన్ పై నిప్పులు చెరిగారు. ఇమ్రాన్ ఖాన్ని అవిశ్వాస తీర్మానానికి ముందే అరెస్టు చేయాలని ట్విట్టర్లో పిలుపునిచ్చారు. హింసను ప్రేరేపించి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఆయన పై దేశద్రోహం కేసు నమోదు చేయాలి అని అన్నారు. ఆదివారం ఇమ్రాన్‌ఖాన్ ప్రభత్వం పై జరగనున్న అవిశ్వాస తీర్మానానికి ఒక రోజు ముందే నవాజ్ షరీఫ్ పై దాడి జరగడం గమనార్హం. ఇమ్రాన్‌ఖాన్ విదేశాల నుంచి వచ్చిన బెదిరింపు లేఖ గురించి ప్రస్తావించడమే కాకుండా దానికి ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానానికి ముడిపెట్టాడని విమర్శించారు. తమ పార్లమెంట్ కమిటీ కూడా ఆ పత్రాన్ని పరిశీలిస్తోందని తెలిపారు. ప్రముఖ పాకిస్తానీ జర్నలిస్ట్ అహ్మద్ నూరానీ ట్విట్టర్లో.. ఇమ్రాన్‌ఖాన్ పార్టీ అన్ని హద్దులు అతిక్రమంచింది. శారీరక దాడిని సహించం. నవాజ్ షరీఫ్ పై జరిగిన దాడిలో ఆయన బాడీగార్డు గాయపడ్డాడు. నిందితులను సత్వరమే పట్టుకునేలా తగిన చర్యలు తీసుకోవాలి. (చదవండి: అవిశ్వాస’ పరీక్షలో ఇమ్రాన్ నెగ్గేనా?) -
నాకు ప్రాణహాని ఉంది: పాక్ ప్రధాని
ఇస్లామాబాద్: తనకు ప్రాణహాని ఉందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి తన వద్ద విశ్వసనీయమైన సమాచారం ఉందని చెప్పారు. తాను భయపడనని, దేశ స్వాతంత్య్రం, ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మాటలన్నారు. అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్, రాజీనామా, ముందుగానే ఎన్నికలు జరపడం అనే మూడు ఆప్షన్లను దేశ మిలటరీ తన ముందుంచిందని ఆయన చెప్పారు. వీటిలో ముందుగానే ఎన్నికలకు వెళ్లడమనే ఆప్షన్నే తాను ఎంచుకున్నానన్నారు. (చదవండి: రెండున్నర కోట్ల మంది దిగ్భందం.. ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్న దృశ్యాలు) -
బీజేపీకి ఊరట: వీగిపోయిన అవిశ్వాస తీర్మానం
చండీగఢ్: హర్యానాలో బీజేపీకి ఊరట లభించింది. రాష్ట్రంలో మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని ప్రభుత్వంపై అసెంబ్లీలో విపక్షాలు చేపట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. బీజేపీ-జేజేపీ కూటమికి 55 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌కు కేవలం 32 ఓట్లు మాత్రమే లభించాయి. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనను పాలక ప్రభుత్వం అణిచివేస్తోందని ఆరోపిస్తూ విపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. రైతు నిరసనల్లో వందలాది అన్నదాతలు నేలకొరుగుతున్నా ఖట్టర్ సర్కార్ చోద్యం చూస్తోందని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ మాజీ సీఎం, విపక్ష నేత భూపీందర్ సింగ్ హుడా అరోపించారు. రాష్ట్ర సరిహద్దుల్లో 250 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారని వారి పేర్లను తాను అందించినా అవి వార్తా పత్రికల్లో కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక తన ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడాన్ని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తప్పుపట్టారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకూ ఒకసారి తన సర్కార్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని ఆరోపించారు. భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్‌పైనా కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం ప్రతిపాదించిన వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్ దుష్ప్రచారం సాగిస్తోందని హర్యానా ఉపముఖ్యమంత్రి దుష్యంత్ సింగ్ చౌతాలా ఆరోపించారు. చదవండి: బుర్ర పనిచేసింది.. లేదంటే.. వైరల్ -
విశ్వాస పరీక్షలో గహ్లోత్ సర్కార్ విజయం
జైపూర్ : రాజస్తాన్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం జరిగిన విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. పాలక కాంగ్రెస్ ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో మూజువాణి ఓటుతో గహ్లోత్ సర్కార్ నెగ్గింది. విశ్వాస పరీక్షపై ఓటింగ్ అనంతరం సభను ఈనెల 21 వరకూ వాయిదా వేస్తున్నట్టు అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషీ ప్రకటించారు. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ పార్టీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకలతో భేటీ అనంతరం తిరిగి పార్టీ గూటికి చేరడంతో కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వాస తీర్మానాన్ని సులభంగా నెగ్గింది. తాను కాంగ్రెస్ తరపున పోరాడే శక్తివంతమైన యోధుడనని పేర్కొన్న సచిన్ పైలట్ ఎలాంటి విపత్కర పరిస్ధితుల్లోనూ పార్టీని కాపాడుకుంటానని చెప్పారు. విశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శాంతి ధరివాల్ మాట్లాడుతూ మధ్యప్రదేశ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ధనం, అధికార బలం ప్రయోగించి ప్రభుత్వాలను బీజేపీ కూల్చివేసిందని ఆరోపించారు. రాజస్తాన్‌లోనూ అదే ప్రయత్నం చేసిన కాషాయపార్టీ భంగపడిందని అన్నారు. ఇక 200 మంది సభ్యులు కలిగిన రాజస్తాన్ అసెంబ్లీలో గహ్లోత్ సర్కార్‌కు 107 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండగా, బీజేపీ సంఖ్యాబలం 72గా ఉంది. ఇక అసెంబ్లీ సమావేశాలకు ముందు అశోక్ గహ్లోత్ మాట్లాడుతూ ఈరోజు అసెంబ్లీ భేటీ వాస్తవాలకు అద్దం పడుతుందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఐక్యతకు సంకేతంగా నిలుస్తుందని..సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు. చదవండి : రాజస్తాన్ అసెంబ్లీలో పైలట్ కీలక వ్యాఖ్యలు -
మధ్యప్రదేశ్‌లో హైడ్రామా..
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. అసెంబ్లీలో సోమవారం బలనిరూపణ చేసుకోవాలని పాలక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గవర్నర్ లాల్జీ టాండన్ ఆదేశించిన క్రమంలో బలపరీక్ష జరిగే దాఖలాలు కనిపించడం లేదు. అసెంబ్లీ స్పీకర్ జారీ చేసిన సభా కార్యక్రమాల (లిస్ట్ ఆఫ్ బిజినెస్) జాబితాలో విశ్వాసతీర్మానం ప్రస్తావన లేకపోవడం ఈ సందేహాలకు తావిస్తోంది. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగం, ఆయన ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం గురించే హౌస్ బిజినెస్ జాబితాలో పొందుపరిచారు. స్పీకర్ ఎన్పీ ప్రజాపతి సైతం విశ్వాస పరీక్షపై నోరు మెదపకుండా రేపు (సోమవారం) ఏం జరుగుతుందో మీరే చూస్తారని వ్యాఖ్యానించడం గమనార్హం. 22 మంది కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో బీజేపీ గూటికి చేరడంతో విశ్వాస పరీక్షపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. మరోవైపు ఎలక్ర్టానిక్ ఓటింగ్ వ్యవస్థ పనిచేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తెలపడంతో అసెంబ్లీలో చేతులు ఎత్తడం ద్వారా బలపరీక్ష చేపట్టాలని రాష్ట్ర గవర్నర్ ఎల్జీ టాండన్ ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు రాజీనామా చేసిన 22 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటివరకూ ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాను స్పీకర్ ఆమోదించడంతో సభలో సభ్యుల సంఖ్య 222కు పడిపోగా ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ మార్క్ 112. ఇక తమ ప్రభుత్వానికి ఢోకా లేదని బలపరీక్షకు తాను సిద్ధమని మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ పేర్కొనగా, ప్రభుత్వం పడిపోతుందనే భయంతోనే బలపరీక్షకు కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకాడుతోందని మాజీ సీఎం, బీజేపీ నేత శివరాజ్‌సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. చదవండి : ఉత్కంఠగా బలపరీక్ష.. క్యాంపులకు ఎమ్మెల్యేలు -
సుప్రీం తీర్పు చరిత్రాత్మకం : సోనియా గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ : మహారాష్ట్ర అసెంబ్లీలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఐదు గంటల్లోగా బలనిరూపణ చేసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమని అభివర్ణించారు. బలపరీక్షలో విపక్షాలదే విజయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇక సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని శివసేన పేర్కొంది. ఇది ప్రజాస్వామ్య విజయమని తెలిపింది. సుప్రీం ఉత్తర్వులతో శివసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సుప్రీం తీర్పు అనంతరం ఖేల్ ఖతం అంటూ ఆ పార్టీ నేత నవాబ్ మాలిక్ ట్వీట్ చేశారు. -
మహా తీర్పు : అసెంబ్లీలో బుధవారమే బలపరీక్ష
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీకి సర్వోన్నత న్యాయస్ధానంలో చుక్కెదురైంది. మహారాష్ట్ర వ్యవహారాలపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఐదు గంటల లోగా బలనిరూపణ చేసుకోవాలని స్పష్టం చేసింది. బలపరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోరింది. బుధవారం సాయంత్రం ఐదు గంటలలోపు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాలని వెంటనే ప్రొటెం స్పీకర్‌ను నియమించాలని ఆదేశించింది. రహస్య ఓటింగ్ నిర్వహించరాదని, బుధవారం బలపరీక్ష ఎదుర్కోవాలని ఫడ్నవీస్‌కు స్పష్టం చేసింది. జస్టిస్ ఎన్వీ రమణ తీర్పును చదివి వినిపించారు. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన పేర్కొన్నారు. జస్టీస్ ఎన్వీ రమణ నేతృత్వంలో జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన సుప్రీం బెంచ్ ఈ ఉత్తర్వులను జారీ చేసింది. మరోవైపు సుప్రీం నిర్ణయంతో ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ శిబిరంలో ఉత్తేజం నెలకొంది. బలపరీక్ష జరిగే వరకూ తమ ఎమ్మెల్యేలు చేజారకుండా మూడు పార్టీలు చర్యలు చేపట్టగా, ఎన్సీపీ చీలిక వర్గ ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతుతో బలపరీక్షలో బయటపడాలని బీజేపీ యోచిస్తోంది. మహా తీర్పును కాంగ్రెస్ సహా విపక్షాలు స్వాగతించాయి. ఇది చరిత్రాత్మక తీర్పని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అభివర్ణించగా, ప్రజాస్వామ్య విజయమని శివసేన హర్షం వ్యక్తం చేసింది. -
సుప్రీం కోర్టులో రెబెల్స్‌కు నిరాశ
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టులో కర్ణాటక జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్‌కు చెందిన రెబెల్ ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ తగిలింది. సభలో చర్చ జరుగుతుండగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సర్వోన్నత న్యాయస్ధానం మంగళవారం స్పష్టం చేసింది. ఒకట్రెండు రోజుల్లో బలపరీక్షపై ఓటింగ్ చేపడతారని ఆశిస్తున్నామని, బలపరీక్ష జరపకపోతే రేపు పిటిషన్‌ను విచారిస్తామని పేర్కొంది. వెంటనే ఓటింగ్ జరపాలని ఆదేశించలేమని తేల్చిచెప్పింది. కాగా స్పీకర్ ఉద్దేశపూర్వకంగానే బలపరీక్షపై ఓటింగ్‌ను వాయిదా వేస్తున్నారని రెబెల్ ఎమ్మెల్యేల తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. మరోవైపు కన్నడ రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలపై మంగళవారం తనకు వివరణ ఇవ్వాలని స్పీకర్ రమేష్ కుమార్ ఆదేశించగా, అందుకు తమకు నాలుగు వారాల సమయం కావాలని కోరారు. ఇక సిద్ధరామయ్య తమపై సభలో పిటిషన్ ఇచ్చిన కాపీలు తమకు ఇంకా అందలేదని స్పీకర్‌కు రాసిన లేఖలో వారు పేర్కొన్నారు. కాగా మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగానే రెబెల్ ఎమ్మెల్యేల వ్యవహరం తేలేవరకూ బలపరీక్ష వాయిదా వేయాలని కాంగ్రెస్-జేడీఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం బలపరీక్ష చేపడతామని స్పీకర్ స్పష్టం చేశారు. మరోవైపు రెబెల్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు తీర్పు వెలువడనున్న దృష్ట్యా విశ్వాస పరీక్షపై ఓటింగ్ నిర్ణయాన్ని తీర్పు ప్రభావితం చేయనుందని భావిస్తున్నారు. -
కర్నాటకం: అదే ఉత్కంఠ..
బెంగళూర్ : కన్నడ రాజకీయాల్లో హైడ్రామా కొనసాగుతోంది. 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలపై మంగళవారం తనకు వివరణ ఇవ్వాలని కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ ఆదేశించగా, అందుకు తమకు నాలుగు వారాల సమయం కావాలని కోరారు. సిద్ధరామయ్య తమపై సభలో పిటిషన్ ఇచ్చిన కాపీలు తమకు ఇంకా అందలేదని స్పీకర్‌కు రాసిన లేఖలో వారు పేర్కొన్నారు. కాగా మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగానే రెబెల్ ఎమ్మెల్యేల వ్యవహరం తేలేవరకూ బలపరీక్ష వాయిదా వేయాలని కాంగ్రెస్-జేడీఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం బలపరీక్ష చేపడతామని స్పీకర్ స్పష్టం చేశారు. మరోవైపు రెబెల్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు తీర్పు వెలువడనున్న దృష్ట్యా విశ్వాస పరీక్షపై ఓటింగ్ నిర్ణయాన్ని తీర్పు ప్రభావితం చేయనుందని భావిస్తున్నారు. -
కర్ణాటకం : విశ్వాస పరీక్షకు మరో డెడ్‌లైన్
బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీలో కుమారస్వామి బలపరీక్ష నాటకీయ పరిణామాల మధ్య పలు మలుపులు తిరుగుతోంది. విస్తృత చర్చ అనంతరమే విశ్వాస పరీక్ష చేపట్టాలని కాంగ్రెస్-జేడీఎస్ నేతలు పట్టుబడితే..తక్షణమే సీఎం కుమారస్వామి బలపరీక్ష నిర్వహించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలలోగా బలపరీక్ష నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్ విధించిన డెడ్‌లైన్ దాటిపోవడంతో సాయంత్రం ఆరు గంటల్లోగా బలపరీక్ష చేపట్టాలని గవర్నర్ తాజా డెడ్‌లైన్ విధించారు. ఈ మేరకు రాజ్‌భవన్ నుంచి కర్ణాటక అసెంబ్లీకి సమాచారం అందింది. మరోవైపు విప్ విషయంలో స్పష్టత ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీకి 15 మంది అసమ్మతి ఎమ్మెల్యేల హాజరుపై బలవంతం చేయలేమన్న సుప్రీం ఉత్తర్వులపైనా ఈ పిటిషన్లో స్పష్టత కోరారు. కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ దినేష్ గుండూరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. విప్ జారీ చేయడం రాజకీయ పార్టీకి ఉన్న హక్కని ఆయన పేర్కొన్నారు. రాజకీయ అనిశ్చితి , అసెంబ్లీ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకోవద్దని కాంగ్రెస్-జెడీఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.శాసనసభలో ఎన్నిరోజులైనా సరే చర్చ కొనసాగించాలని, సభ్యులందరికీ మాట్లాడే అవకాశం కల్పించాలని సీఎల్పీ నేత సిద్ధరామయ్య అన్నారు. అందరి అభిప్రాయాలు వెలిబుచ్చిన తర్వాతే విశ్వాస పరీక్ష జరపాలని సూచించారు. రాష్ట్రపతి పాలన దిశగా.. కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని గవర్నర్ వజుభాయ్ వాలా జారీచేసిన ఆదేశాలను స్పీకర్ రమేష్ కుమార్ బేఖాతారు చేయడంతో బీజేపీ గవర్నర్‌కు ఫిర్యాదు చేసేందుకు సంసిద్ధమైంది. విశ్వాస పరీక్షపై ఓటింగ్ జరగకపోవడం, అసెంబ్లీలో నెలకొన్న గందరగోళం కర్ణాటకలో రాష్ట్రపతి పాలన దిశగా పరిణామాలు సాగుతున్నాయని భావిస్తున్నారు.మైనార్టీ ప్రభుత్యం కొనసాగుతున్నా స్పీకర్ సభను సాగదీస్తున్నారని, బలపరీక్షను ఎదుర్కొంటానని ప్రకటించింది ప్రభుత్వమే అయినా పరీక్షకు అవకాశం మాత్రం ఇవ్వడంలేదని గవర్నర్‌కు బీజేపీ మరోసారి ఫిర్యాదు చేయనుంది. -
‘కర్నాటకం’లో కొత్త మలుపు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కుమారస్వామి ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటల్లోగా మెజారిటీ నిరూపించుకోవాలన్న గవర్నర్ ఆదేశాలను శాసనసభ పట్టించుకోలేదు. గవర్నర్ ఆదేశాల ప్రకారం బలపరీక్ష నిర్వహించేందుకు స్పీకర్ కేఈఆర్ రమేశ్‌కుమార్ తిరస్కరించారు. తనను సుప్రీంకోర్టు, గవర్నర్ శాసించలేరని అన్నారు. బలపరీక్షలకు ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ సభ్యులు పదేపదే డిమాండ్ చేసినా ఆయన తలొగ్గలేదు. తనను ఒత్తిడికి గురిచేసే వాడు ఇంకా పుట్టలేదని వ్యాఖ్యానించారు. బలపరీక్షపై స్పీకర్ ఆదేశాలకు కట్టుబడతానని సీఎం కుమారస్వామి తెలిపారు. ‘మధ్యాహ్నం 1.30 గంటల్లోగా బలం నిరూపించుకోవాలని నన్ను స్పీకర్ ఆదేశించారు. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయాధికారాన్ని స్పీకర్‌కే సుప్రీంకోర్టు వదిలిపెట్టింది. ఇప్పటికే నేను అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాను. బలనిరూపణపై నాకు గవర్నర్ ఇచ్చిన ఆదేశాలపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. ఈ అంశాన్ని ఆయనకే వదిలిపెడుతున్నాన’ని కుమారస్వామి అన్నారు. (చదవండి: యడ్యూరప్ప చేతులు జోడించి వేడుకున్నారు కానీ..) తాను నిప్పుల కుంపటిపై కూర్చున్నట్టుగా ఉందని అంతకుముందు స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ అన్నారు. గౌరవంతో బతికే తనను కించపరిచే విధంగా కొంత మంది మాట్లాడుతున్నారని వాపోయారు. అసెంబ్లీలో సభ్యులు మాట్లాడే ప్రతి మాట రికార్డవుతుందని హెచ్చరించారు. హడావుడిగా నిర్ణయాలు తీసుకోబోనని, చర్చ తర్వాతే బలపరీక్ష జరుగుతుందని స్పష్టం చేశారు. భోజన విరామం కోసం సభను స్పీకర్ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేయడంతో హైడ్రామా కొనసాగుతోంది. గవర్నర్ ఏమంటారో..? డెడ్‌లైన్ విధించే అధికారం గవర్నర్‌కు ఉంటుందని బీజేపీ నాయకులు వాదిస్తున్నారు. అసెంబ్లీ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకోవడం తగదని కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. ఎన్నిరోజులైనా సరే చర్చ కొనసాగించాలి, సభ్యులందరికీ మాట్లాడే అవకాశం కల్పించాలని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. అందరి అభిప్రాయాల తర్వాతే విశ్వాస పరీక్ష జరపాలని సూచించారు. తన నిర్ణయాన్ని స్పీకర్ ధిక్కరించిన నేపథ్యంలో గవర్నర్ వజూభాయ్‌వాలా ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. (చదవండి: కర్నాటకం క్లైమాక్స్ నేడే) -
యడ్యూరప్ప చేతులు జోడించి వేడుకున్నారు కానీ..
సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రిగా తాను ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచే తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కర్ణాటక సీఎం హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే సంకీర్ణ సర్కారును అస్థిరపరిచేందుకు కుట్రలు చేసిందన్నారు. బలపరీక్ష ఎదుర్కొనున్న నేపథ్యంలో ఈ ఉదయం 11 గంటలకు కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ.. ‘కొంత మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు మీ (స్పీకర్) ముందు ఉన్నాయి. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి రాజ్యాంగ నిబంధనలు ఉన్నాయి. ప్రస్తుత పరిణామాలు రాజ్యాంగ విలువలను ధ్వంసం చేసేలా కనబడుతున్నాయి. ఎటువంటి సందర్భంలో ఈ రాజీనామాలు చేశారో గమనించాలి. ఇంత ముఖ్యమైన అంశంపై చర్చించేందుకు బీజేపీ ఇష్టపడటం లేదు. చర్చ జరిగిన తర్వాతే నా సీటు హస్తగతం చేసుకోండి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తొందరపడకండి. ఇవాళ కాకపోతే, సోమవారం అయినా అధికారాన్ని అందుకోవచ్చు. గతంలో ముఖ్యమంత్రి పదవి నుంచి యడ్యూరప్పను బీజేపీ అధినాయత్వం తొలగించినప్పుడు తనను తప్పించొద్దని రెండు చేతులు జోడించి ఆయన ప్రాధేయపడ్డారు. కానీ నేను అలా చేయను. పదవి కోసం ఎవరినీ వేడుకోను. కాంగ్రెస్ నాయకులే వచ్చి నన్ను ముఖ్యమంత్రిని చేశారు. నాకు సీఎం సీటు ముఖ్యం కాదు. నా ఆలోచన అంతా భవిష్యత్ తరాల గురించే. ప్రభుత్వాలను ఇలా కూల్చడానికే స్వాతంత్ర్య సమరయోధులు మనకు ప్రజాస్వామ్యాన్ని అందించారా’ అంటూ ప్రశ్నించారు. తాను నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నానని స్పీకర్ కేఆర్ రమేశ్‌కుమార్ పునరుద్ఘాటించారు. తనపై అపనిందలు వేసినవారు ముందుగా తమ బతుకెంటో తెలుసోవాలని ఘాటుగా సమాధానమిచ్చారు. తన దగ్గర డబ్బు లేకపోయినా, విలువలకు కట్టుబడే నైజం ఉందన్నారు. రెబల్ ఎమ్మెల్యేల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు బలపరీక్ష వెంటనే నిర్వహించాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: అసెంబ్లీలోనే భోజనం, నిద్ర) -
కర్నాటకం; అసెంబ్లీలోనే భోజనం, నిద్ర
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. కుమారస్వామి సర్కారు ఈరోజు బలపరీక్ష ఎదుర్కొనుంది. శానససభలో గురవారమే బలనిరూపణ ఉంటుందని భావించినా శుక్రవారానికి వాయిదా పడింది. తక్షణమే బలపరీక్ష నిర్వహించాలంటూ బీజేపీ నాయకులు రాత్రంతా నిరసన కొనసాగించారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత కూడా బీఎస్ యడ్యూరప్ప, బీజేపీ ఎమ్మెల్యేలు విధానసౌధలోనే భోజనాలు చేసి, అక్కడే నిద్రపోయాయి. కొంత మంది శాసనసభ్యులు ఉదయమే లేచి అసెంబ్లీ ప్రాంగణంలోనే మార్నింగ్ వాక్ చేశారు. వెంటనే బలపరీక్ష నిర్వహించేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం. కాగా, ముంబైలోని ఆసుపత్రిలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ స్టేట్మెంట్ను నమోదు చేసేందుకు బెంగళూరు పోలీసులు ముంబైకు వెళ్లారు. (చదవండి: కర్నాటకం క్లైమాక్స్ నేడే) -
కుమారస్వామికి గవర్నర్ డెడ్‌లైన్
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయం క్షణానికో మలుపు తిరుగుతూ రసవత్తరంగా మారుతోంది. తాజాగా గవర్నర్ వాజూభాయ్ వాలా సీఎం కుమారస్వామికి కీలక సూచన చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల్లోపు శాసనసభలో బలం నిరూపించుకోవాలని కుమారస్వామికి గవర్నర్ సూచించారు. ఈ మేరకు గవర్నర్ వాజూభాయ్ వాలా సీఎంకు ఓ లేఖ రాశారు. అంతకుముందు విశ్వాస పరీక్షను ఈ రోజే పూర్తి చేయాలంటూ గవర్నర్ స్పీకర్‌కు ఓ సందేశం పంపారు. అయితే, సభలో ఆందోళన నేపథ్యంలో స్పీకర్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. మరోవైపు కుమార ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, బలపరీక్షకు సిద్ధం కావాలని భాజపా నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప డిమాండ్ చేశారు. ఈ కూటమికి 98 ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని, తమకు 105 మంది ఉన్నారని చెప్పారు. -
కర్ణాటకం : విశ్వాస పరీక్ష రేపటికి వాయిదా
బెంగళూర్ : కర్ణాటకలో రాజకీయ హైడ్రామా కొనసాగుతూనే ఉంది. విశ్వాస పరీక్షను స్పీకర్ ఆర్ రమేష్ కుమార్ శుక్రవారానికి వాయిదా వేశారు. అసెంబ్లీని రేపటికి వాయిదా వేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బలపరీక్షను తక్షణమే చేపట్టాలని ఆ పార్టీ నేత యడ్యూరప్ప సభలోనే బైఠాయించడంతో బీజేపీ సభ్యులు ఆందోళనకు దిగారు. బలపరీక్షను ఈరోజే నిర్వహించాలని గవర్నర్ సందేశాన్ని స్పీకర్ పాటించకపోవడం పట్ల బీజేపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కాగా, అంతకుముందు బలపరీక్షను ఈరోజే పూర్తిచేయాలని కర్ణాటక స్పీకర్‌కు రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా సూచించారు. గవర్నర్ సందేశం స్పీకర్ రమేష్ కుమార్ సభలో చదివి వినిపించారు. విశ్వాస పరీక్షను వాయిదా వేయాలని కాంగ్రెస్, జేడీఎస్‌లు కాలయాపన చేస్తున్నాయని బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై బీజేపీ నేతలు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసినా, సభకు హాజరు కాకపోయినా ఫిరాయింపు నిరోధక చట్టం కింద చర్యలు తప్పవని సీఎం కుమారస్వామి చివరి ప్రయత్నంగా తమ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేస్తూ హెచ్చరించారు. మరోవైపు విప్ విషయంపై సుప్రీం కోర్టు స్పష్టత ఇచ్చేంత వరకూ విశ్వాస పరీక్ష చేపట్టవద్దని సీఎల్పీ నేత సిద్ధరామయ్య లేవనెత్తిన పాయింట్ ఆఫ్ ఆర్డర్‌పై సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. విశ్వాస పరీక్షను తక్షణమే చేపట్టాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. -
కర్ణాటకం : గవర్నర్ సూచనతో మారిన సీన్
బెంగళూర్ : కన్నడ రాజకీయాలు క్షణానికో మలుపుతిరుగుతున్నాయి. కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష వాయిదా వేయాలని కాంగ్రెస్, జేడీఎస్ నేతలు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తడంతో నెలకొన్న సందిగ్ధం గవర్నర్ సూచనలతో మరో ఉత్కంఠకు తెరలేపింది. బలపరీక్షను ఈరోజే పూర్తిచేయాలని కర్ణాటక స్పీకర్ ఆర్ రమేష్ కుమార్‌కు రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా సూచించారు. గవర్నర్ సందేశం స్పీకర్ సభలో చదివి వినిపించారు. కాగా అంతకుముందు విశ్వాస పరీక్షను వాయిదా వేయాలని కాంగ్రెస్, జేడీఎస్‌లు కాలయాపన చేస్తున్నాయని బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై బీజేపీ నేతలు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసినా, సభకు హాజరు కాకపోయినా ఫిరాయింపు నిరోధక చట్టం కింద చర్యలు తప్పవని సీఎం కుమారస్వామి చివరి ప్రయత్నంగా తమ పార్టీ రెబెల్ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేస్తూ హెచ్చరించారు. మరోవైపు విప్ విషయంపై సుప్రీం కోర్టు స్పష్టత ఇచ్చేంత వరకూ విశ్వాస పరీక్ష చేపట్టవద్దని సీఎల్పీ నేత సిద్ధరామయ్య లేవనెత్తిన పాయింట్ ఆఫ్ ఆర్డర్‌పై సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. విశ్వాస పరీక్షను తక్షణమే చేపట్టాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. -
కర్ణాటక అసెంబ్లీ మ.3గంటల వరకూ వాయిదా
సాక్షి, బెంగళూరు : కర్ణాటక శాసనసభ మధ్యాహ్నం మూడు గంటల వరకూ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం గురువారం ఉదయం 11 గంటలకు విధానసభలో ముఖ్యమంత్రి కుమారస్వామి సర్కారుపై బలపరీక్ష చర్చ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి బలపరీక్ష కోసం ప్రవేశపెట్టిన తీర్మానంపై మధ్యాహ్నం వరకూ చర్చ కొనసాగగా....స్పీకర్ సభను భోజన విరామం కోసం మూడింటి వరకూ వాయిదా వేశారు. మరోవైపు 15మంది రెబల్ ఎమ్మెల్యేలు సహా మొత్తం 21మంది సభకు గైర్హాజరు అయ్యారు. విశ్వాస తీర్మానంపై ఓటింగ్ కోసం బీజేపీ పట్టుపట్టగా, సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది. కుమరస్వామి సర్కార్ మైనార్టీలో పడిందన్న బీజేపీ ఎమ్మెల్యేలు...బల నిరూపణ చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పక్షనేత, మాజీ సీఎం సిద్ధరామయ్య ఘాటుగా స్పందించారు. సుప్రీంకోర్టు వాదనల్లో న్యాయమూర్తులు, న్యాయవాదులెవరూ విప్‌పై మాట్లాడలేదన్న ఆయన సభకు హాజరు కాకుంటే రెబల్ ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించినట్లేనని అన్నారు, పార్టీ నాయకుడిగా విప్ జారీ చేసే హక్కు తనకు ఉందని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అసమ్మతి ఎమ్మెల్యేల భవితవ్యం తేలేవరకూ విశ్వాస పరీక్ష జరపటం సరికాదని అన్నారు. మరోవైపు తమ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలన్నింటికీ సమాధానం చెబుతామని ముఖ్యమంత్రి కుమారస్వామి పేర్కొన్నారు.