![Karnataka BJP MLAs Sleep in Assembly - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/19/BS_Yeddyurappa.jpg.webp?itok=ZMnsG3BX)
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. కుమారస్వామి సర్కారు ఈరోజు బలపరీక్ష ఎదుర్కొనుంది. శానససభలో గురవారమే బలనిరూపణ ఉంటుందని భావించినా శుక్రవారానికి వాయిదా పడింది. తక్షణమే బలపరీక్ష నిర్వహించాలంటూ బీజేపీ నాయకులు రాత్రంతా నిరసన కొనసాగించారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత కూడా బీఎస్ యడ్యూరప్ప, బీజేపీ ఎమ్మెల్యేలు విధానసౌధలోనే భోజనాలు చేసి, అక్కడే నిద్రపోయాయి. కొంత మంది శాసనసభ్యులు ఉదయమే లేచి అసెంబ్లీ ప్రాంగణంలోనే మార్నింగ్ వాక్ చేశారు.
వెంటనే బలపరీక్ష నిర్వహించేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం. కాగా, ముంబైలోని ఆసుపత్రిలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ స్టేట్‌మెంట్‌ను నమోదు చేసేందుకు బెంగళూరు పోలీసులు ముంబైకు వెళ్లారు. (చదవండి: కర్నాటకం క్లైమాక్స్ నేడే)
Comments
Please login to add a commentAdd a comment