BS yeddyurappa
-
కర్ణాటక బీజేపీలో పొలిటికల్ ట్విస్ట్.. టార్గెట్ యడియూరప్ప!
బెంగళూరు: కర్ణాటక బీజేపీలో కోల్డ్ వార్ నడుస్తోంది. కాషాయ పార్టీలో అంతర్గత సమస్యల నేపథ్యంలో బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.కర్ణాటక బీజేపీలో పొలిటికల్ వార్ నడుస్తోంది. కాషాయ పార్టీ నేతలు బహిరంగంగానే ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ రెండు వర్గాలుగా చీలిపోయిందనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఒకటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర కాగా.. మరొకటి బసంగౌడ పాటిల్ యత్నాల్ గ్రూప్ అని సమాచారం. ఇక, తాజాగా ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమికి బీఎస్ యడియూరప్ప, విజయేంద్రనే కారణమని పాటిల్ తీవ్ర విమర్శలు చేశారు. వీరిద్దరూ పార్టీ నేతలను పట్టించుకోవడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. పాటిల్ వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనపై పార్టీ హైకమాండ్ చర్యలు తీసుకోవాలని స్థానిక నేతలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీలో ఇంటి పోరు కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.ఇదిలా ఉండగా.. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అందుకుంది. మూడు స్థానాల్లో శిగ్గావ్, సండూరు, చెన్నపట్నలలో హస్తం పార్టీ నేతలు గెలుపొందారు. మూడు చోట్లా బీజేపీ ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలోనే బీజేపీలో కొత్త వార్ నడుస్తోంది. -
Karnataka: మరో కుంభకోణం వెలుగులోకి.. కోవిడ్ వేళ వెయ్యి కోట్ల లూటీ
బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ముడా కుంభకోణం తీవ్ర దుమారం రేపుతున్న వేళ.. తాజాగా మరో భారీ స్కాం వెలుగుచూసింది. కరోనా సమయంలో భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు తేలింది. అప్పటి ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ పాలనలో కోవిడ్‌పై పోరాటానికి కేటాయించిన కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు లేవనెత్తుతున్నాయి.దీనిపై హైకోర్టు మాజీ న్యాయమూర్తి జాన్ మైఖేల్ కున్హా నేతృత్వంలోని కమిషన్ ప్రాథమిక నివేదికను రూపొందించింది. ఆగస్టు 31వ తేదీన సుమారు 1722 పేజీలతో కూడిన నివేదికను సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వానికి అందజేసింది. ఈ నేపథ్యంలో ఆ రిపోర్టును విశ్లేషించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించేందుకు కమిషన్‌కు ఆరు నెలల అదనపు గడువు ఇచ్చారు.తాజాగా ఈ నివేదికపై చర్చించేందుకు నేడు మంత్రివర్గం సమావేశం నిర్వహించింది. సమావేశంలో ఈ నివేదికపై చర్చించిన సిద్ధరామయ్య.. కొన్ని కీలక విషయాలను గుర్తించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వందల కోట్లు దుర్వినియోగం, కొన్ని కీలక పత్రాలు మిస్ అయ్యాయని కమిటీ గుర్తించిందని సీఎం ఆ సమావేశంలో ప్రస్తావించినట్లు సమాచారం.కొవిడ్ సమయంలో రాష్ట్రం వెచ్చించిన సొమ్ము మొత్తం విలువ రూ.13 వేల కోట్లు. కానీ దానిని అధికారికంగా ఎక్కడా వెల్లడించలేదు. అందులో రూ.1,000 కోట్లు స్వాహా అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇచ్చిన ప్రాథమిక నివేదికకు రానున్న ఆరు నెలల్లో తుదిరూపు ఇవ్వనున్నారు. ఈ క్రమంలో బీజేపీ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలపై చర్యలకు సిద్ధమవుతోంది.పార్లమెంట్ శీతాకాల సమావేశంలో దీనిని సమర్పించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ముడా స్కామ్ వచ్చిన తరుణంలోనే ‘కొవిడ్’ కుంభకోణం నివేదిక తేవడంపై మీడియా అడిగిన ప్రశ్నపై రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ముడా వ్యవహారంపై విమర్శలు రాబట్టి రెండు నెలలు కూడా కావడం లేదు. జస్టిస్ జాన్ మైఖెల్ కమిటీని ఏడాదిక్రితం ఏర్పాటుచేశారు. అసలు రెండింటిని ఎలా పోలుస్తారు. ఇది దురదృష్టకరం’’ అని వ్యాఖ్యానించారు. -
యడ్యూరప్పకు హైకోర్టులో ఊరట
బెంగళూరు: మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్పకు శుక్రవారం హైకోర్టులో ఊరట లభించింది. యడ్యూరప్పను అరెస్టు చేయవద్దని కర్నాటక హైకోర్టు సీఐడీ పోలీసులను ఆదేశించింది. పోస్కో చట్టం కింద నమోదైన కేసును విచారిస్తున్న సీఐడీ ఎదుట ఈనెల 17న హాజరుకావాలని బీజేపీ సీనియర్ నేత, 81 ఏళ్ల యడ్యూరప్పను హైకోర్టు ఆదేశించింది. -
యడ్యూరప్పపై అరెస్టు వారెంట్
బెంగళూరు: లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ చట్టం(పోక్సో) కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్ప(81)పై బెంగళూరు కోర్టు గురువారం నాన్–బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో సీఐడీ ఇప్పటికే ఆయనకు సమన్లు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. కానీ, యడ్యూరప్ప హాజరు కాకపోవడంతో సీఐడీ బెంగళూరు కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్టు నాన్–బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీ చేసింది. యడ్యూరప్ప ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారని, తిరిగివచి్చన తర్వాత సీఐడీ ఎదుట హాజరవుతారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 17 ఏళ్ల తన కుమార్తెపై యడ్యూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న ఓ సమావేశంలో ఆయన తన కుమార్తెను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి అకృత్యానికి పాల్పడ్డారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో యడ్యూరప్పపై పోక్సో చట్టంతోపాటు ఐసీసీ సెక్షన్ 354 కింద ఈ ఏడాది మార్చి నెలలో బెంగళూరు సదాశివనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం గంటల వ్యవధిలోనే కర్ణాటక డీజీపీ ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు. తనపై వచి్చన ఆరోపణలను యడ్యూరప్ప ఖండించారు. ఈ కేసును చట్టపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. యడ్యూరప్పపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ గత నెలలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు అంతకుముందే రికార్డు చేశారు. పోక్సో కేసులో యడ్యూరప్పను సీఐడీ అరెస్టు చేసే అవకాశం ఉందని కర్ణాటక హోంశాఖ మంత్రి పరమేశ్వర చెప్పారు. దీనిపై సీఐడీ తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. -
యడియూరప్పపై పోక్సో కేసు
సాక్షి, బెంగళూరు: బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప(81)పై పోక్సో కేసు నమోదైంది. బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు అందిన ఫిర్యాదు మేరకు యడియూరప్పపై పోక్సో చట్టంతోపాటు ఐపీసీ 354ఏ కింద కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 2వ తేదీన 17 ఏళ్ల తన కుమార్తెపై యడ్యూరప్ప అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఆమె తల్లి గురువారం రాత్రి ఫిర్యాదు చేసిందని బెంగళూరు పోలీసులు తెలిపారు. ఈ ఆరోపణలను యడియూరప్ప తీవ్రంగా ఖండించారు. చట్టపరంగా ముందుకు వెళతానన్నారు. పోలీసులు డాలర్స్ కాలనీలోని యడియూరప్ప నివాసానికి వెళ్లి ఆయన నుంచి లిఖిత పూర్వక వివరణ తీసుకున్నారని డీజీపీ అలోక్ మోహన్ శుక్రవారం చెప్పారు. తదుపరి దర్యాప్తు కోసం వెంటనే కేసును సీఐడీకి అప్పగించామన్నారు.ఈ పరిణామంపై హోం మంత్రి జి.పరమేశ్వర మాట్లాడారు. బాధితురాలి తల్లి మానసిక పరిస్థితి సరిగా లేదని కొందరు చెప్పారన్నారు. ఫిబ్రవరి 2వ తేదీన తల్లితో కలిసి యడియూరప్పను ఆయన నివాసంలో కలవడానికి వెళ్లినప్పుడు బాలిక చిత్రీకరించిన రెండు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. ఆమె ఏడుస్తూ సాయం అర్థించింది కేసు నమోదు కావడంపై యడియూరప్ప స్పందించారు. ఈ కేసుకు సంబంధించి చట్ట పరంగా ముందుకెళతానన్నారు. ‘ఆ మహిళ ఏడుస్తూ నా దగ్గరికి వచ్చింది. ఆమెను లోపలికి రమ్మని చెప్పి, సమస్య తెలుసుకున్నా. ఆ వెంటనే పోలీస్ కమిషనర్ దయానందతో ఫోన్లో మాట్లాడి, ఆమెకు న్యాయం చేయాలని కోరా. ఆ వెంటనే ఆమె నన్ను విమర్శించడం మొదలుపెట్టింది. దీంతో, ఏదో తేడాగా ఉందని అనుమానం వచ్చింది’అని చెప్పారు. ఆమె పోలీస్ కమిషనర్‌ను కలిశాక, వ్యవహారం మలుపు తిరిగిందని పేర్కొన్నారు. -
మళ్లీ యెడ్డీ వైపే బీజేపీ మొగ్గు
బెంగళూరు: కర్ణాటకలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్పపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఎన్నికల ప్రచార బాధ్యతలను ప్రధాని మోదీతోపాటు యడియూరప్ప సారథ్యం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ ఇప్పటికే ప్రకటించిన యెడియూరప్పను మళ్లీ క్రియాశీలకంగా మార్చేందుకు కమలనాథులు ప్రయత్నాలు ప్రారంభించారు. అట్టడుగు స్థాయి నుంచి పార్టీని విస్తరించి, నాలుగు పర్యాయాలు సీఎం పీఠం అధిరోహించిన నేతగా ఆయనపై ఇప్పటికీ ప్రజాభిమానం చెక్కుచెదరలేదు. మరీ ముఖ్యంగా లింగాయత్ కులస్తుల్లో80 ఏళ్ల ఈ వృద్ధ నేతకున్న పలుకుబడి మరే ఇతర రాజకీయ పార్టీ నేతకూ లేదు. ఈ విషయాన్ని గ్రహించే ఆయన కేంద్ర నాయకత్వం రానున్న ఎన్నికల్లో ఆయన్ను ‘పోస్టర్ బాయ్’గా ఉంచి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రణాళికలు వేస్తోంది. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో జరిగిన పలు బహిరంగ సభలు, సమావేశాల్లో ప్రధాని మోదీతోపాటు హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ యెడియూరప్పపై ప్రశంసలు కురిపించడం వెనుక కారణం ఇదే. ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవడం, లింగాయత్ ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడంతోపాటు ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష కాంగ్రెస్‌ను కట్టడి చేసేందుకు సైతం యెడియూరప్ప అవసరం ఎంతో ఉందని రాజకీయ పరిశీలకులతోపాటు కాషాయ వర్గాలు సైతం అంటున్నాయి. రాష్ట్ర బీజేపీకి మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఇష్టం లేకున్నా యెడియూరప్పనే ప్రచారంలో ముందుంచేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధమవుతోందని అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీకి చెందిన రాజకీయ విశ్లేషకుడు ఎ.నారాయణ చెప్పారు. -
మోదీ కార్యక్రమానికి యడ్డి డుమ్మా
సాక్షి బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్లి (హుబ్లీ) నగరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న అధికారిక కార్యక్రమానికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప గైర్హాజరయ్యారు. ఆయన గైర్హాజరు ప్రస్తుతం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గురువారం హుబ్లీ రైల్వే మైదానంలో జాతీయ యువ జనోత్సవానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. పలువురు బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నప్పటికీ బీఎస్ యడియూరప్ప మాత్రం కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన కొన్ని నెలలుగా పార్టీ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నారని ప్రచారం సాగుతోంది. బీజేపీ తనను నిర్లక్ష్యం చేస్తోందని, ప్రజల్లో వ్యక్తిగతంగా బలమున్న తనను రాజకీయంగా ఎవరూ అంతం చేయలేరని పలు సందర్భాల్లో అనుచరుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. తన రాజకీయ జీవితానికి ఎవరూ ఫుల్స్టాప్ పెట్టలేరని యడియూరప్ప ఒకసారి బహిరంగంగా వ్యాఖ్యానించారు. మరోవైపు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, యూడియూరప్ప మధ్య విభేదాలు ముదురుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తనను ముఖ్యమంత్రి పదవి నుంచి అర్ధాంతరంగా తప్పించారని యడియూరప్ప రగిలిపోతున్నారు. తన అనుచరుడైన బొమ్మైని సీఎం కుర్చీలో కూర్బోబెట్టడం జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వంలో పదవి లేకపోవడం వల్లే.. యడియూరప్ప అసంతృప్తిని గుర్తించిన బీజేపీ అధిష్టానం గత ఏడాది పార్టీ పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడిగా నియమించింది. అయితే, రాష్ట్ర బీజేపీలో ఆశించిన గౌరవం దక్కకపోవడంతో జనసంకల్ప యాత్రలో ఆయన పాల్గొనలేదు. పార్టీ పెద్దలు దిగివచ్చి బుజ్జగించాల్సి వచ్చింది. ఇటీవలే మాండ్య జిల్లాలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటనకు యడియూరప్ప డుమ్మా కొట్టారు. తాజాగా ప్రధాని మోదీ హుబ్లీ పర్యటనకు సైతం దూరంగా ఉండిపోయారు. రాష్ట్ర బీజేపీ వాదన మరోలా ఉంది. జాతీయ యువజనోత్సవానికి మాజీ సీఎంకు ఆహ్వానం అందించలేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కావడంతో ఆహ్వానించలేదని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వంలో యడియూరప్పకు ప్రస్తుతం ఎలాంటి పదవి లేదని, అందుకే ఆహ్వానం పంపలేదని కర్ణాటక బీజేపీ వెల్లడించింది. -
సీఎం కావడానికి అర్హతలున్నాయి: కర్ణాటక మంత్రి ఉమేష్
కర్ణాటక ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పెరుగుతోంది. యడియూరప్ప స్థానంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు తనకు అన్ని అర్హతలు ఉన్నాయని ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉమేష్ కత్తి వ్యాఖ్యానించారు. తాను తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, తన వయసు ప్రస్తుతం 60 ఏళ్లేనని అన్నారు. పరిణామాలన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. అవకాశం వస్తే సీఎంగా రాష్ట్రానికి సేవ చేస్తానని, చక్కటి పరిపాలన అందిస్తానని చెప్పారు. పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న సీఎం యడియూరప్ప ప్రకటనను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కె.ఎస్.ఈశ్వరప్ప స్వాగతించారు. ముఖ్యమంత్రి మార్పు విషయంలో బీజేపీ పెద్దల నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి ఆర్.అశోక్, హోంమంత్రి బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు. కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న విషయంలో బీజేపీ అధిష్టానానికి తాను ఎలాంటి సూచనలు ఇవ్వలేదని యడియూరప్ప చెప్పారు. ఎవరి పేరునూ తాను సూచించలేదన్నారు. ఒకవేళ పార్టీ నాయకత్వం తనను కోరినా తదుపరి సీఎం పేరును ప్రతిపాదించలేనని స్పష్టం చేశారు. తాను పదవి నుంచి తప్పుకోవడం తథ్యమని యడియూరప్ప సంకేతాలిచ్చిన నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది. -
కర్ఫ్యూ ఫెయిల్: మే 24వరకు సంపూర్ణ లాక్డౌన్
సాక్షి బెంగళూరు: కరోనా విషయంలో ప్రస్తుతం మహారాష్ట్రతో పోటీ పడుతూ కర్నాటక దూసుకెళ్తోంది. పెద్ద ఎత్తున కేసులు, మరణాలు నమోదవుతుండడంతో ఆ రాష్ట్రంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. వైరస్ కట్టడి కోసం ఇన్నాళ్లు విధించిన పాక్షిక లాక్డౌన్ ఫెయిలైందని ఇకపై సంపూర్ణ లాక్డౌన్ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రకటించారు. నిత్యం 50 వేలకు పైగా కేసులు, 400 వరకు మరణాలు సంభవిస్తుండడంతో చివరి అస్త్రంగా సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు సీఎంం యడియూరప్ప తెలిపారు. కోవిడ్ కట్టడి కోసం ఏప్రిల్ 27 నుంచి మే 12 వరకు విధించిన కరోనా కర్ఫ్యూ వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో మే 10 నుంచి 24వ తేదీ వరకు సంపూర్ణ లాక్డౌన్ ప్రకటించారు. లాక్‌డౌన్‌పై మంత్రులు, అధికారులతో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. 14 రోజుల లాక్డౌన్లో అత్యవసర సేవలు మినహాయించి అన్నింటిని బంద్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి యడియూరప్ప స్పష్టం చేశారు. నిత్యవసర సరుకుల కొనుగోలు కోసం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఒక్కరూ బయట కనిపించినా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అంతర్రాష్ట్ర, అంతర్జిల్లా ప్రయాణాలు, బార్లు, పాఠశాలలు, ప్రజా రవాణా, కర్మాగారాలు, అన్ని కార్యాలయాలు, మెట్రో రైల్వే మూతపడ్డాయి. అయితే భవన నిర్మాణ కార్మికులకు మినహాయింపు ఇచ్చారు. విమాన, రైల్వే రాకపోకలపై ఎలాంటి నిషేధం లేదు. వివాహాలకు కేవలం 50 మందికి మాత్రమే అవకాశం కల్పించారు. చదవండి: కలకలం: కరోనా నుంచి కోలుకోగానే కళ్లు పోయాయి చదవండి: ‘వ్యవస్థ కాదు.. ప్రధాని మోదీ ఓడిపోయాడు’ -
ఆ సిఫారసులు అమలు చేస్తే రూ.4 వేల కోట్ల అదనపు భారం
సాక్షి, బెంగళూరు/బనశంకరి: ప్రజల సంచారానికి జీవనాడిగా పేరుపొందిన ఆర్టీసీ బస్సుల సమ్మెతో ప్రజలకు రవాణా వసతి బంద్ అయ్యింది. అదే మాదిరి ప్రభుత్వ ఆదాయం కూడా. ఇటీవల కోవిడ్ లాక్డౌన్, డిసెంబరులో ఆర్టీసీ సమ్మె వల్ల రూ. 16 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. కేఎస్ ఆర్టీసీ ఇప్పటికే నష్టాల్లో ఉండగా, ప్రస్తుతం బుధవారం నుంచి ఉద్యోగులు చేస్తున్న సమ్మెతో మరింత సంక్షోభంలోకి కూరుకుపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఆర్టీసీ సిబ్బంది వేతనాలకు నెలకు రూ.400 కోట్లు చెల్లిస్తున్నారు. ఇక బస్సుల డీజిల్, నిర్వహణ కోసం రూ.300 నుంచి 400 కోట్లు ఖర్చుఅవుతుందని ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి రవికుమార్ తెలిపారు. కానీ నెలవారీ ఆదాయం అంతమొత్తంలో లేదని ప్రభుత్వ వర్గాల కథనం. ఉద్యోగులు కోరుతున్నట్లు 6 వేతన కమిషన్ సిఫార్సుల్ని అమలు చేస్తే ఏడాదికి రూ.4 వేల కోట్ల అదనపు భారం పడుతుంది. కోవిడ్ వల్ల రద్దీ తగ్గడం, సమ్మె మూలంగా రోజుకు సుమారు రూ. 20 కోట్లకు పైగా నష్టం వస్తోందని అంచనా. కొనసాగుతున్న సమ్మె వేతన కమిషన్ సిఫార్సుల ప్రకారం వేతనాలను పెంచాలనే డిమాండ్‌తో ఆర్టీసీ ఉద్యోగుల చేపట్టిన సమ్మె రెండవ రోజుకు చేరుకోగా ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. ప్రభుత్వం పట్టుదలతో శిక్షణలో ఉన్న డ్రైవర్లతో బస్సులు నడపడానికి గురువారం ప్రయత్నం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ప్రయాణ వసతి కరువై విలవిలలాడారు. బెంగళూరు సహా అనేక నగరాలు, పట్టణాల్లో ప్రైవేటు వాహనాలే రవాణా అవసరాలను తీర్చాయి. లగేజ్, చిన్నపిల్లలను ఎత్తుకుని ప్రజలు బస్సులకోసం పడిగాపులు పడుతున్న దృశ్యాలు కనిపించాయి. కేఎస్ ఆర్టీసీ, బీఎంటీసీ ఉద్యోగులు ఇళ్లకే పరిమితం అయ్యారు. బెంగళూరు మెజస్టిక్, శాటిలైట్, యశవంతపురతో పాటు ప్రముఖ బస్టాండ్లు ప్రయాణికులు లేక బోసిపోయాయి. చాలాచోట్ల ప్రైవేటు బస్సులు కూడా తక్కువగా సంచరించాయి. ప్రైవేటు బస్సుల దొరుకుతాయనే ఆశతో వచ్చిన ప్రయాణికులు, ప్రజలు బస్సులు సకాలంలో దొరక్కపోవడంతో నిరాశచెందారు. ఉత్తర కర్ణాటక నగరాల్లో ప్రైవేటు బస్సులు సైతం అరకొరగా సంచరిస్తున్నాయి. ట్రైనీలతో నడిపించే యత్నం.. సమ్మె నేపథ్యంలో శిక్షణలో ఉన్న డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు గురువారం తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని బీఎంటీసీ ఆదేశించింది. విధులకు హాజరయ్యే సిబ్బందికి అన్ని విధాలా భద్రత కల్పిస్తామని కేఎస్ఆర్టీసీ డైరెక్టర్ శివయోగి కళసద్ తెలిపారు. నేడు కూడా సమ్మె డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే శుక్రవారం కూడా సమ్మె కొనసాగిస్తామని రవాణాశాఖ ఉద్యోగుల ఒక్కూట గౌరవాధ్యక్షుడు కోడిహళ్లి చంద్రశేఖర్ గురువారం తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆర్టీసీ సిబ్బందికి అత్యంత తక్కువ వేతనం వస్తోందని అన్నారు. ఈ తారతమ్య ధోరణి సరికాదన్నారు. విధులకు హాజరుకాకపోతే కఠినచర్యలు తీసుకుంటామని రవాణాశాఖ సిబ్బంది ఇళ్లకు నోటీసులు అంటించడం సరైన పద్ధతి కాదన్నారు. 10 శాతం జీతం పెంచుతాం.. 6వ వేతన కమిషన్ సిఫార్సుల ప్రకారం వేతనాలను పెంచలేం, 8 శాతానికి బదులు 10 శాతం జీతం పెంచుతామని రవాణా శాఖ ప్రధాన కార్యదర్శి అంజుంపర్వేజ్ తెలిపారు. సమ్మె విరమించకపోతే ఎస్మా ప్రయోగిస్తామని చెప్పారు. సమ్మె వీడకపోతే రెండేళ్ల లోపు పదవీవిరమణ చేసిన ఆర్టీసీ సిబ్బందిని పిలిపించి బస్సులు నడిపిస్తామని పేర్కొన్నారు. విధులకు రాకుంటే చర్యలు: సీఎం రవాణాశాఖ ఉద్యోగులు డిమాండ్లను ప్రభుత్వం ఇప్పటికే నెరవేర్చింది. అయినా సమ్మె చేయడం సరికాదు. తక్షణం విధులకు హాజరుకావాలి, లేని పక్షంలో కఠినచర్యలు తీసుకుంటామని సీఎం యడియూరప్ప గురువారం హెచ్చరించారు. ఆయన బెళగావిలో మాట్లాడుతూ కోవిడ్ క్లిష్ట సమయంలోనూ 8 శాతం వేతనం పెంచాలని తీర్మానించామన్నారు. ఉద్యోగులు వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని విధుల్లో చేరాలన్నారు. చదవండి: ఆర్టీసీ సమ్మె: టికెట్ ధరకు రెట్టింపు వసూళ్లు! -
చర్చలకు రండి.. లేదంటే తీవ్ర పరిణామాలు: సీఎం
సాక్షి, బెంగళూరు: ఆరవ వేతన కమిషన్ సిఫార్సుల్ని అమలు చేయడంతో పాటు పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ ఉద్యోగులు బుధవారం నుంచి సమ్మె ప్రారంభించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి బస్సులు అక్కడే డిపోల్లో నిలిచిపోయాయి. 24 వేల బస్సుల సంచారం బందై బస్టాండ్లు నిర్మానుష్యమయ్యాయి. ప్రజలు గమ్యస్థానం చేరడం ఎలా అని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రోగులు, వృద్ధులు, చంటిపిల్లల తల్లుల బాధలు వర్ణనాతీతం. విద్యార్థులు, ఉద్యోగులు, కూలీలు గమ్యం చేరలేక నానా ఇబ్బందులు పడ్డారు. బుధవారం జరగాల్సిన బెంగళూరు, తుమకూరు, మంగళూరు, రాణిచెన్నమ్మ విశ్వవిద్యాలయ పరీక్షలను వాయిదా వేశారు. ఆర్టీసీ సమ్మెతో రాష్ట్రంలోని 31 జిల్లాల్లో రవాణా బస్సులు సంచారం పూర్తిగా స్తంభించిపోయింది. కాగా, ప్రయాణ అవసరాల కోసం ప్రభుత్వం ప్రైవేటు బస్సులు, టెంపోలకు అనుమతి ఇచ్చింది. బెంగళూరుతో పాటు వివిధ జిల్లాల్లో ప్రైవేటు వాహనాలే ప్రజలకు దిక్కయ్యాయి. బెంగళూరులోని మెజెస్టిక్ బస్టాండు, కెంపేగౌడ బస్టాండు, శాటిలైట్, యశవంతపుర బస్టాండ్లులో ప్రైవేటు మినీబస్సుల సంచారం అధికమైంది. ఆటో, ట్యాక్సీ, ప్రైవేటు బస్సుల్లో కిక్కిరిసిన ప్రయాణాలు తప్పలేదు. దీనివల్ల కరోనా రెండో దాడి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన ఏర్పడింది. ప్రైవేటు వాహనాల్లో అధిక టికెట్ ధరలను వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. బస్టాండ్లలోకి ప్రైవేటు బస్సులు.. బెంగళూరు నగరంలో ప్రైవేటు బస్సులు, మినీ బస్సులు బీఎంటీసీ రూట్లలో తిరిగాయి. అయితే టికెట్ ధరకు రెట్టింపు వసూళ్లు చేసినట్లు ప్రయాణికులు వాపోయారు. గత్యంతరం లేక ప్రైవేటు వాహనాలనే ఆశ్రయించారు. ఇక ట్యాక్సీ, ఆటోడ్రైవర్లు ఇదే అదనుగా విపరీతంగా చార్జీలు వసూలు చేశారు. మొత్తం మీద బెంగళూరుతో పాటు అనేక ప్రాంతాల్లో ప్రైవేటు బస్సులు సంచారం తీవ్రతరమైంది. సాధారణంగా మెజెస్టిక్, కెంపేగౌడబస్టాండులోకి ప్రైవేటు బస్సులకు అనుమతిలేదు. కానీ బుధవారం అన్ని బస్టాండ్లలోకి స్వేచ్ఛగా ప్రైవేటు బస్సులు ప్రవేశించాయి. బెంగళూరు నుంచి రాష్ట్రంలో ప్రధాన నగరాలకు బస్సులు కరువయ్యాయి. సమ్మె వల్ల ఐటీ సిటీలో మెట్రోరైలు సర్వీసులను పెంచారు. మెట్రో స్టేషన్లలో రద్దీ ఏర్పడింది. మెట్రో టోకెన్లు దొరక్క ప్రజలు ఇబ్బందిపడ్డారు. సమ్మె ముగిసే వరకు టోకెన్ వ్యవస్థను కల్పించాలని ప్రజలు డిమాండ్ చేశారు. ప్రయాణికులకు కటకట.. ప్రభుత్వం, రవాణా శాఖ ఉద్యోగులు పట్టువీడకపోవడంతో ప్రజలు నలిగిపోవాల్సి వచ్చింది. ఎంతో వెచ్చించి నెల పాస్ తీసుకుంటే ప్రైవేటు బస్సులు టెంపోలు, ఆటోల్లో డబ్బు పెట్టి ప్రయాణించాలా? అని పలువురు మండిపడ్డారు. మంగళవారం తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో పోలింగ్‌కు వెళ్లి తిరిగివచ్చే కర్ణాటక ఉద్యోగులకు బస్సులు దొరకలేదు. మైసూరునగర, గ్రామీణ బస్టాండ్లు వెలవెలబోయాయి. కరోనా వైరస్ ఉండటంతో ధర్నా చేపట్టరాదని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సర్కారు హెచ్చరించింది. దీంతో ఉద్యోగులు ధర్నాలకు దిగలేదు. చర్చిద్దాం రండి: సీఎం సాక్షి, బళ్లారి: కేఎస్ఆర్టీసీ సిబ్బంది సమ్మె మానుకుని ప్రభుత్వంతో చర్చలకు రావాలని సీఎం యడియూరప్ప కోరారు. బుధవారం బెళగావిలో ఉప ఎన్నికల ప్రచారంలో విలేకరులతో మాట్లాడుతూ చర్చల్లో ఎవరితోనైనా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే సహించేది లేదన్నారు. ప్రభుత్వంతో చర్చలకు రాకుండా, సమ్మె మానకపోతే ఎస్మా ప్రయోగించేందుకు కూడా వెనుకాడేది లేదన్నారు. కరోనా కష్ట సమయంలోను, విద్యార్థులకు పరీక్షలు ఉన్నందున బంద్ పాటించడం తగదన్నారు. జీతాలకు కష్టమవుతుంది: డీసీఎం బనశంకరి: ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తే జీతాలివ్వడం కష్టమని డిప్యూటీ సీఎం లక్ష్మణసవది హెచ్చరించారు. బీదర్‌లో విలేకరులతో మాట్లాడుతూ రవాణాశాఖ నష్టాల్లో ఉందని ప్రతిరోజు రూ.4 కోట్లు నష్టం వస్తోందన్నారు. సమ్మె చేయడం వల్ల నష్టం మీకేనన్నారు. ప్రయాణికులను ఇబ్బందులు పెడుతూ సమ్మెకు దిగడం న్యాయమా అని ప్రశ్నించారు. రవాణాశాఖ ఉద్యోగులు పెట్టిన 9 డిమాండ్లలో 8 డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. సమ్మె వల్ల రోజూ 30 లక్షల మంది ప్రయాణికులు కష్టాల పాలవుతారన్నారు. చదవండి: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె.. ప్రభుత్వం కీలక నిర్ణయం -
సీఎంపై సొంత పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
సాక్షి,బళ్లారి: రాష్ట్ర రాజకీయాల్లో ఈనెల 17 తర్వాత పెనుమార్పులు చోటు చేసుకుంటాయని, పలువురు ఎమ్మెల్యేలు సీఎంపై తిరుగుబాటు చేసే అవకాశం ఉందని సీనియర్ బీజేపీ నేత, ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ యత్నాళ్ పేర్కొన్నారు. ఆయన బెళగావి జిల్లాలో విలేకరులతో మాట్లాడుతూ ఎవరెవరి బలం ఏమిటో, బలహీనత ఎంత ఉందో కాలమే నిర్ణయిస్తుందన్నారు. సూర్యచంద్రులు ఉండే వరకు ఏమైనా యడియూరప్ప మాత్రమే సీఎంగా కొనసాగుతారా? అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఆయనను సీఎంగా హైకమాండ్ కొనసాగించడమే అదృష్టంగా భావించాలన్నారు. మే 2 తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి మార్పు ఉండవచ్చన్నారు. ఉత్తర కర్ణాటకకు చెందిన వ్యక్తిని సీఎంని చేయడానికి పార్టీ నేతలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యే కుమారునిపై దాడి తుమకూరు: తురువేకెరె ఎమ్మెల్యే జయరాం కుమారుడు తేజు జయరాంపై మంగళవారం రాత్రి దుండగులు దాడి చేశారు. ఈ ఘటన గుబ్బి తాలూకా నెట్టికెరె క్రాస్ వద్ద చోటు చేసుకుంది. వివరాలు... తేజు జయరాం బెంగళూరు నుంచి స్వగ్రామం అంకల కొప్పకు కారులో వస్తుండగా దుండగులు అడ్డగించి గొడవకు దిగి దాడి చేశారు. ఇంతలోనే స్థానికులు రావడంతో దుండగులు ఉడాయించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తేజును ఆస్పత్రికి తరలించారు. కాగా దుండగులు వదలి వెళ్లిన కారును పరిశీలించగా బ్యాట్, కారంపొడి, పెద్ద కత్తి లభ్యమయ్యాయి. సీజ్ చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. చదవండి: ముఖ్యమంత్రికి హెలికాప్టర్ కష్టాలు ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె.. ప్రభుత్వం కీలక నిర్ణయం -
ముఖ్యమంత్రికి హెలికాప్టర్ కష్టాలు
యశవంతపుర/కర్ణాటక: పలు రాష్ట్రాలలో శాసనసభలకు జరుగుతున్న ఎన్నికల కారణంగా హెలికాప్టర్లకు డిమాండ్ పెరిగింది. బెంగళూరులోని ప్రైవేటు హెలికాప్టర్లు ఆయా రాష్ట్రాల బడా నేతలు బాడుగకు తెప్పించుకున్నారు. సీఎం యడియూరప్ప రాష్ట్రంలో దూరప్రాంతాలకు హెలికాప్టర్లో వెళ్తుంటారు. కానీ గిరాకీ వల్ల హెలికాప్టర్ దొరక్కపోవడంతో కారులోనే వెళ్లారు. గత ఆదివారం 9:30 గంటలకు దావణగెరె జిల్లా హరిహరకు వెళ్లారు. అక్కడ వివిధ మఠాల కార్యక్రమాలలో పాల్గొన్నారు. తిరిగి మధ్యాహ్నం 1:30 గంటలకు బెంగళూరుకు రోడ్డుమార్గంలో సాయంత్రం 4 గంటలకు చేరుకున్నారు. ఎండలో ఆరు వందల కిలోమీటర్లు కారులో తిరిగిన సీఎం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎంపీ హెగ్డేకి బెదిరింపు కాల్ యశవంతపుర: ఎంపీ అనంతకుమార్ హెగ్డేకి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌కాల్ చేసి బెదిరించాడు. ఘటనపై శిరసి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల ఐదోతేదీ రాత్రి రెండు గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు. ‘గతంలో ఫోన్ చేసినప్పుడు ఆ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశావు.ఈ సారి ఎలాగైనా ప్రాణం తీస్తా’ అంటూ ఆవ్యక్తి ఉర్దూ భాషలో మాట్లాడుతూ బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. చదవండి: కోర్టు వద్దని చెప్పినా సభకు హాజరైన మాజీ సీఎం -
టీవీ, ఫ్రిజ్ ఉంటే రేషన్‌కార్డు కట్!
సాక్షి, బెంగళూరు : రేషన్ కార్డుల పంపిణిపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సొంతగా టీవీ, ఫ్రిజ్, ద్విచక్ర వాహనం ఉంటే రేషన్ కార్డును నిరాకరించాలని నిర్ణయించింది. బీపీఎల్ కార్డుల మంజూరు విషయంలో ఇకపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించదని ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖమంత్రి ఉమేష్ కత్తి స్పష్టం చేశారు. సోమవారం బెళగావిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఉన్నత వర్గాలకు చెందిన వారు కూడా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే రేషన్ సరుకులను ఉపయోగించుకున్నారని, దీని ద్వారా వెనుకబడిన వారికి సరుకులు చేరడంలేదని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకునే ఉద్ధేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ సరఫరా చేస్తోందని, ఇకపై సరైన అర్హుల జాబితాను రూపొందిస్తామని స్పష్టం చేశారు. 1.20 లక్షల వార్షిక ఆదాయం కంటే ఎక్కువ ఉన్నవారు ఉచిత రేషన్‌కు అనర్హులన్నారు. అలాగే టీవీ, ఫ్రిజ్, ద్విచక్ర వాహనం ఉంటే రేషన్ కార్డును వెంటనే వదులుకోవాలన్నారు. మార్చి 31 వరకు కార్డును వెనక్కి ఇచ్చేయాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉమేష్ కత్తి హెచ్చరించారు. ప్రభుత్వ ప్రతిపాదనపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టీవీ, ఫ్రిజ్ అనేవి నేడు నిత్యవసర వస్తుల జాబితాలో చేరిపోయాయని, వాటి కారణం చేత కార్డులను తొలగించడం సరైనది కాదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. చదవండి: మాంగల్య బలం గట్టిదే.. హుండీలోకి చేరబోయేది! అందుకే అర్ధగంట ట్రాఫిక్ ఆపేశారు! -
నేను సూపర్ సీఎంను కాదు:సీఎం కుమారుడు
బెంగళూరు : నేను సూపర్ సీఎంను కాదు, సీఎం యడియూరప్ప పనుల్లో నేను జోక్యం చేసుకోవడం లేదు అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర అన్నారు. శనివారం గవిగంగాధరేశ్వర దేవాలయంలో ఆయన పూజలు చేశారు. విలేకరులతో మాట్లాడుతూ నా పరిమితి ఏమిటనేది తెలుసు, నేను సీఎం కుమారుడిని అయినా తండ్రి పనుల్లో వేలు పెట్టడం లేదు అన్నారు. కాగా, ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు బడ్జెట్ ద్వారా సమాధానం చెబుతానని సీఎం యడియూరప్ప తెలిపారు. శనివారం సాయంత్రం మైసూరులోని మండకళ్లి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్‌ను రూపొందిస్తున్నా, రెండు శాఖలతో మాత్రమే సమావేశం జరపాల్సి ఉంది అన్నారు. ప్రభుత్వం టేకాఫ్ కాలేదని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు బడ్జెట్ ద్వారానే బదులిస్తానన్నారు. రిజర్వేషన్ల కోసం ఆయా సామాజికవర్గాలు చేస్తున్న పోరాటాన్ని అర్థం చేసుకోగలనని, వారందరికి తప్పక న్యాయం చేస్తానని చెప్పారు. -
షాకిచ్చిన ఎమ్మెల్యేలు.. యడ్డీ కుర్చీకి ఎసరు!
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప విందు భోజనానికి సొంత బీజేపీ ఎమ్మెల్యేలు ముఖం చాటేశారు. బుధవారం బెంగళూరులో తన అధికారిక నివాసం కావేరిలో ఆయన మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు విందు ఏర్పాటు చేశారు. అందరూ తప్పక రావాలని కొన్నిరోజుల నుంచి ఆహ్వానాలు వెళ్లాయి. ఇటీవల మంత్రివర్గ విస్తరణ, శాఖల కేటాయింపు తరువాత పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల్లో అసంతృప్తి గూడుకట్టుకుంది. ఏళ్ల తరబడి పార్టీలో ఉన్నవారిని కాదని వలసవాదులకు పదవులు కట్టబెట్టారని బాహాటంగా విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో అసంతృప్తిని చల్లార్చేందుకు విందు ఏర్పాటైంది. (యడియూరప్ప స్థానంలో యువ సీఎం!) గతకొంత కాలంగా యడియూరప్పకు వ్యతిరేకంగా పలువురు ఎమ్మెల్యేలు రహస్యమంతనాలు చేస్తున్న విషయం తెలిసిందే. మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపుల విషయంలో పలువురు తీవ్ర సంతృప్తంగా ఉన్నారు. అంతేకాకుండా యడ్డీని సీఎం కుర్చి నుంచి దించేసి మరో నేతకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలని పట్టుబడుతున్నారు. తాజాగా సీఎం విందు భోజనానికి సొంత ఎమ్మెల్యేలు రాకపోవడం కన్నడ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో కర్మ, కర్త, క్రియ అన్నీ తానై వ్యవహరించిన యడియూరప్పకు ప్రభుత్వ ఏర్పాటు అనంతరం కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలో చాలామందికి మంత్రిపదవులు కట్టాబెట్టారు. అయితే సీఎం నిర్ణయం సొంత పార్టీ నేతలకు ఏమాత్రం మింగుడుపడటంలేదు. ఎంతో కాలంగా పార్టీలో కొనసాగుతున్న తమను కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి మంత్రి పదవులు ఇవ్వడం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎవరెవరు రాలేదంటే.. రెబెల్ సీనియర్ ఎమ్మెల్యేలు బసవనగౌడ పాటిల్ యత్నాళ్, సునీల్ కుమార్‌తో పాటు 25 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరైనట్లు తెలిసింది. వీరిలో అరవింద బెల్లద్, పూర్ణిమా శ్రీనివాస్, మహంతేశ్ దొడ్డనగౌడ పాటిల తదితరులు ఉన్నారు. -
సీఎం మార్పు.. చెక్ పెట్టిన రాజాహులి
సాక్షి, బెంగళూరు : అపార రాజకీయ అనుభవం, చాకచక్యంతో మళ్లీ రాజాహులి (రాజా పులి) బీఎస్ యెడియూరప్ప పైచేయి సాధించారు. బీజేపీ అధిష్టానం వద్ద తన మాటకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నారు. పదేపదే నాయకత్వ మార్పు వదంతులు, కేబినెట్ విస్తరణ వాయిదా పడుతూ ఉండడంతో యెడ్డీ పని అయిపోయిందని, రాష్ట్ర బీజేపీకి కొత్త నాయకత్వం రాబోతుందని అంతా ఊహించారు. కానీ అక్కడుండేదీ రాజాహులి యెడియూరప్ప.. అంతటితో ఆగిపోతారా!! తన రాజకీయ అనుభవాన్ని రంగరించి తన ప్రత్యర్థులు, శత్రువులకు నోట్లో మాట లేకుండా చేశారు. ఆదివారం ఒక్క ఢిల్లీ పర్యటనతో అన్ని ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఒకేదెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా తన పర్యటన ద్వారా నాయకత్వ మార్పుతో పాటు కేబినెట్ విస్తరణ సమస్యకు చెక్ పెట్టారు. సంక్రాంతికి మంత్రివర్గ విస్తరణ కొన్ని నెలలుగా మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న ఆశావహులకు ఢిల్లీ నుంచి కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప తీపి కబురు మోసుకొచ్చారు. దీర్ఘకాలంగా కొలిక్కి రాకుండా సీఎంతోపాటు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మంత్రివర్గ విస్తరణ సమస్య పరిష్కారం అయింది. ఈ నెల 13 లేదా 14న మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. యెడియూరప్ప తన ఢిల్లీ పర్యట నతో అధిష్టానం తన వైపే ఉం దని మరోసారి నిరూపించారు. రాష్ట్రంలో పెండిం గ్లో ఉన్న మంత్రివర్గ విస్తరణకు బీజేపీ అధి ష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సంక్రాంతి ముందు రోజు లేదా పండుగ రోజు ఉదయాన్నే ఏడుగురిని మంత్రివర్గంలో చేర్చుకోబోతున్నారు. పదేపదే నాయకత్వ మార్పుపై పుకార్లు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎంకి వ్యతిరేకంగా కొందరు అసమ్మతి రాగం వినిపించారు. మంత్రివర్గంలో స్థానం దక్కని వారంతా యెడియూరప్పకు వ్యతిరేకంగా నాయకత్వ మార్పు ఉండబోతోంది అంటూ వదంతులు ప్రచారం చేశారు. దీనికితోడు ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లినా అధిష్టానం పెద్దల నుంచి మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో యెడియూరప్ప తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. అలాగే మరోవైపు ప్రతిపక్షాల ఎదురుదాడికి సరిగ్గా బదులివ్వలేక చెతికిల పడ్డారు. రోజుల తరబడి నిరీక్షణ 2019 జూలై 26న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత యెడియూరప్ప తన కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకునేందుకు నెల రోజుల సమయం పట్టింది. అప్పటి వరకు వన్ మ్యాన్ ఆర్మీగా పాలన సాగించారు. ఆగస్టు 20న 17 మంది ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే తనను నమ్మి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఉప ఎన్నికల్లో అన్నీ తానై దగ్గరుండి గెలిపించుకున్నారు. డిసెంబర్లో ఉప ఎన్నికలు జరిగినా ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవులు ఇచ్చేందుకు రెండు నెలలు పట్టింది. రెండు, మూడు దఫాలు అధిష్టానం పెద్దలను కలిసి చర్చించి వారిని ఒప్పించేందుకు ఎంతో శ్రమించారు. చివరికి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో పాటు బీజేపీని నమ్ముకున్న సొంత ఎమ్మెల్యేలకు అన్యాయం చేయొద్దని సూచిస్తూ అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఫిబ్రవరి 6న 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేశారు. ఇలా అడుగడుగునా నిరీక్షణలు, అనుమతుల కోసం వేచి చూడడం వంటి కారణాలతో అధిష్టానం వద్ద యెడియూరప్ప పని అయిపోయిందని ఊహాగానాలు వినిపించాయి. పట్టునిలుపుకున్న యెడ్డి 2020, ఫిబ్రవరి తర్వాత మరోసారి మంత్రివర్గ విస్తరణ చేసేందుకు ఏకంగా ఏడాది సమయం పట్టింది. ఉప ఎన్నికల్లో ఓడిపోయిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎంటీబీ నాగరాజు, ఆర్.శంకర్, విశ్వనాథ్‌లకు మంత్రి పదవులు ఇప్పించుకునేందుకు అనేక సార్లు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసినా.. ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లి రిక్తహస్తాలతో వచ్చేవారు. ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితి కనిపించింది. అయితే హఠాత్తుగా యెడియూరప్ప ఈ సారి చక్రం తిప్పి స్వయంగా హైకమాండే తనను ఢిల్లీకి పిలిచేలా చేసుకున్నారు. ఢిల్లీ వెళ్లినా ప్రతిసారి ఒక్కో నాయకుడిని వేర్వేరుగా కలుసుకున్న సీఎం ఈ దఫా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి అరుణ్‌సింగ్‌తో ఒకేసారి కలిసి చర్చించి పట్టునిలుపుకున్నారు. -
యడియూరప్ప స్థానంలో యువ సీఎం!
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం మార్పు గతకొంత కాలంగా రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. సీఎం బీఎస్ యడియూరప్ప(77) వయసు పెరిగిపోయిందని, పనిలో చురుకుదనం లోపించిందని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలోనూ కొందరు అమాత్యులు యడ్డీపై గుర్రుగా ఉన్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేయడంలో కర్మ, కర్త, క్రియ అన్నీ తానై వ్యవహరించిన యడియూరప్పకు ప్రభుత్వ ఏర్పాటు అనంతరం కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలో చాలామందికి మంత్రిపదవులు కట్టాబెట్టారు. అయితే సీఎం నిర్ణయం సొంత పార్టీ నేతలకు ఏమాత్రం మింగుడుపడటంలేదు. ఎంతో కాలంగా పార్టీలో కొనసాగుతున్న తమను కాదని, ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి మంత్రి పదవులు ఇవ్వడం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. (సీనియర్ల అసంతృప్తి.. సీఎంను తప్పించండి) ఈ విషయం కాస్తా ముఖ్యమంత్రి చెవినపడటంతో కొద్దికాలంలో మంత్రివర్గాన్ని విస్తరిస్తానని అసంతృప్తులకు నచ్చజెప్పారు. ఇలా ఏడాది గడుస్తున్నా కేబినెట్ విస్తరణ చేపట్టకపోవడంతో అసంతృప్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యడ్డీని వెంటనే సీఎం కుర్చి నుంచి దించివేయాలని ఓ సమావేశాన్ని సైతం ఏర్పాటు చేసుకుని రహస్య తీర్మానం చేశారు. ఈ క్రమంలోనే కరోనా వైరస్ తెచ్చిన విపత్తుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సంభవించిన భారీ వరదలు ఆయనకు మరింత తలనొప్పిని తెచ్చిపెట్టాయి. దీంతో సీఎం పీఠం మార్పు అనే వార్తలు మరోసారి ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పెద్దల నుంచి పిలుపందుకున్న యడియూరప్ప.. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను వివరించారు. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను సీఎం వెల్లడించకపోవడంతో యడ్డీ స్థానంలో కొత్త సీఎంను నియమించేందుకు కేంద్ర పెద్దలు సిద్ధమయ్యారనే టాక్ వినిపించింది. (కరోనా తెచ్చిన కష్టం: యడ్డీ కుర్చీకి ఎసరు!) ఆయన స్థానంలో ఓ యువనేతకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని కన్నడ వర్గాల ద్వారా తెలుస్తోంది. గతంలో మహారాష్ట్ర, త్రిపుర, గోవాలో అనుసరించిన వ్యూహాన్ని ఇక్కడా అమలు చేయాలని బీజేపీ పెద్దలు యోచిస్తున్నట్లు సమాచారం. పార్టీ సిద్ధాంతాల ప్రకారం 75 ఏళ్లు పైబడిన వారు ఎవరూ కూడా పార్టీ పదవుల్లో ఉండకూడదు. ఈ నియమాన్ని అనుసరించే 77 ఏళ్ల యడ్డీని సీఎం పదవీ బాధ్యతల నుంచి తప్పిస్తారని చర్చ సాగుతోంది. మరోవైపు సీఎం మార్పు వార్తలను బీజేపీ కర్ణాటక చీఫ్ నలిన్ కుమార్ కాటిల్ కొట్టిపారేశారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు (డిసెంబర్) ముగిసే వరకు సీఎం మార్పుపై ఎలాంటి నిర్ణయం తీసుకునేదిలేదని తేల్చిచెప్పారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని స్పష్టం చేశారు. -
కర్ణాటకలో ‘మరాఠ’ బోర్డు చిచ్చు
బెంగళూరు: మరాఠ అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాడి ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పతో సోమవారం సమావేశమయ్యారు. లింగాయత్‌లు సైతం తమకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నందున ‘వీరశైవ లింగాయత్ బోర్డు’ ఏర్పాటు చేయాలని ఆయన సీఎంను కోరారు. ఇదే అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎం పాటిల్, జేడీఎస్ ఎమ్మెల్సీ బసవరాజ్ హొరాట్టి సైతం ముఖ్యమంత్రికి ఇంతకు ముందే లేఖ రాశారు. (చదవండి: నితీష్‌పై ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర ట్వీట్) మరాఠ అభివృద్ధి బోర్డు ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి లింగాయత్‌లకు సైతం ప్రత్యేక అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పలు కన్నడ అనుబంధ సంస్థలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. మరాఠి మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్న ఉత్తర కర్ణాటకలో త్వరలో ఉప ఎన్నికలు జరగొచ్చనే ఊహాగానాల నేపథ్యంలో యడ్యూరప్ప సర్కార్ మరాఠ బోర్డు ఏర్పాటుకు రూ.50 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. బసవకళ్యాణ్, మస్కీ అసెంబ్లీ స్థానాలతో పాటు బెల్గావి లోక్‌సభ ఉప ఎన్నికలకు త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గతంలోనూ సీరా, ఆర్ఆర్ నగర్ ఉప ఎన్నికల సందర్భంగా ‘కడుగొల్ల అభివృద్ధి సంస్థ’ ఏర్పాటు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రతో సరిహద్దు వివాదాలున్న కారణంగా కన్నడ ఉద్యమ నాయకుడు వి నాగరాజ్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. (చదవండి: 35 ఏళ్లుగా పోటీకి దూరం.. ఏడోసారి సీఎం) -
మంత్రి పదవికి బీజేపీ నేత రాజీనామా
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప మంత్రివర్గంలోని కీలక సభ్యుడు సీటీ రవి తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను శనివారం రాత్రి సీఎంకు పంపించారు. ప్రస్తుతం ఆయన రాష్ట్ర పర్యటన మంత్రిత్వశాఖ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. కాగా ఇటీవల బీజేపీ అధిష్టానం ప్రకటించిన ఆ పార్టీ జాతీయ కమిటీలో సీటీ రవికి కీలక బాధ్యతలను అప్పగించిన విషయం తెలిసిందే. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయనకు పోస్టింగ్ లభించింది. ఈ క్రమంలోనే మంత్రిపదవికి రాజీనామా సమర్పించిన రవి.. సోమవారం ఢిల్లీలో పార్టీ పెద్దలను కలువనున్నారు. జాతీయ రాజకీయాల్లో రావాలన్న పార్టీ పిలుపుమేరకు కేబినెట్ నుంచి వైదొలినట్లు తెలుస్తోంది. కాగా రవి ఇటీవల కరోనా వైరస్ బారినపడి కోలుకున్న విషయ తెలిసిందే. (అసెంబ్లీలో అవిశ్వాస రణం) మరోవైపు తాజా రాజీనామా నేపథ్యంలో యడియూరప్ప మంత్రివర్గ విస్తరణ మరోసారి తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన బీజేపీలో చాలామంది ఎమ్మెల్యేలు మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకున్నారు. పార్టీలోని సీనియర్లు సైతం పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రవి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న కొద్ది రోజుల్లోనే మంత్రివర్గాన్ని విస్తరిస్తారనే వార్తలు కన్నడనాట బలంగా వినిపిస్తున్నాయి. -
సీఎం జగన్ పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
సాక్షి, చిత్తూరు : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మార్కండేయులు ఆదేశించారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో సోమవారం ఏఎస్ఎల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి పట్టు వ్రస్తాలను సమర్పించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 23, 24 తేదీల్లో తిరుమల పర్యటనకు రానునున్నట్లు తెలిపారు. 23న మధ్యాహ్నం 3.05 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయ లుదేరి 3.50 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారన్నారు. అక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గంలో తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారన్నారు. అక్కడ నుంచి బేడి ఆంజనేయస్వా మి ఆలయానికి చేరుకుని, శ్రీవారికి పట్టువ్రస్తాలను సమర్పిస్తారన్నారు. ఉత్సవాల్లో పాల్గొని, తర్వాత అతిథి గృహంలో బస చేస్తారని, 24న ఉదయం 6.25 గంటలకు మరోమారు వెంకన్నను దర్శించుకుని, తిరుమల నుంచి తిరుగు ప్రయాణమవుతారని తెలిపారు. అలాగే బెంగళూరు నుంచి కర్ణాటక సీఎం యడ్యూరప్ప ఈనెల 23న సాయంత్రం తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ నుంచి తిరుమలకు రోడ్డు మార్గంలో వెళతారన్నారు. వారి పర్యటనకు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు ఐజీ శశిధర్‌రెడ్డి జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. (డైనమిక్ సీఎం వైఎస్ జగన్) అలాగే రోడ్డు మార్గంలో శానిటేషన్ చర్యలు, ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం కోసం వచ్చే ప్రతినిధుల కోసం ప్రత్యేక బారికేడ్ల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలను తీసుకోవాలని సూచించారు. తరువాత ముఖ్యమంత్రి ప్రయాణించనున్న రోడ్డు మార్గంలో ట్రయల్‌రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎయిర్పోర్ట్ డైరెక్టర్ సురేష్, తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్‌రెడ్డి, తిరుపతి మున్సిపల్ కమిషనర్ గిరీష, డీఎస్పీ చంద్రశేఖర్, ఎయిర్పోర్ట్ సీఎస్ఓ రాజశేఖర్‌రెడ్డి, తహసీల్దార్ శివప్రసాద్, కిరణ్‌కుమార్, రుయా సూపరిండెంటెండ్ భారతి తదితరులు పాల్గొన్నారు. -
సీనియర్ల అసంతృప్తి.. సీఎంను తప్పించండి
సాక్షి, బెంగళూరు : ముఖ్యమంత్రి కుర్చీపై బీఎస్ యడియూరప్ప ఎన్ని రోజులు ఉంటారనే దానిపై రోజుకో రకమైన విశ్లేషణలు ఊపందుకున్నాయి. 75 ఏళ్లు నిండిన యడియూరప్ప పార్టీ సిద్ధాంతాల ప్రకారం ముఖ్య పదవుల్లో కొనసాగరాదని బీజేపీలోని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఎంత త్వరగా యడియూరప్పను సాగనంపితే తాము ఆ పీఠాన్ని అధిరోహించాలని బీజేపీలో అంతర్గత పోరాటం మొదలైనట్లు రాజకీయ వర్గాల కథనం. ఇందులో కొందరు మాజీ సీఎంలు, సీనియర్ మంత్రులు కూడా ఉన్నారు. యడియూరప్పను సీఎం పదవి నుంచి తప్పించాలని వారు అధిష్టానానికి వినతులు పంపుతున్నారు. ఇటీవల మాజీ సీఎం, ప్రస్తుత మంత్రి జగదీశ్ శెట్టర్ ఢిల్లీ పర్యటన ఉదాహరణగా చెప్పవచ్చు. హస్తినలో సీఎం ఏం మాట్లాడతారు? ఇలాంటి తరుణంలో 17వ తేదీన సీఎం యడియూరప్ప ఢిల్లీకి వెళ్తున్నారు. మూడు రోజుల పాటు అక్కడే ఉంటారని తెలిసింది. వరద సహాయం, కేబినెట్ విస్తరణపై చర్చిస్తారని బయటకు చెబుతున్నా, తన పదవీ భద్రత గురించి కూడా ఆయన అధిష్టానం నుంచి హామీ తీసుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. -
‘ప్రజల దృష్టి మళ్లించేందుకే డ్రగ్స్ కేసును వాడుకుంటోంది’
సాక్షి, బెంగళూరు: కోవిడ్-19, వరదల నుంచి ప్రజలను దృష్టిని మళ్లించేందుకు కర్ణాటక ప్రభుత్వం డ్రగ్స్‌ను కేసును వాడుకుంటోందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ సీఎం సిద్దరామయ్య విమర్శించారు. అంతేగాక ఈ కేసులో అధికార బీజేపీ ప్రభుత్వం తమ పార్టీ మంత్రులను, నాయకులను రక్షించుకునే ప్రయత్నం చేస్తుందని ఈ క్రమంలో ప్రతిపక్ష నాయకులను కించపరిచారంటూ తన వరుస ట్వీట్లలో ఆరోపించారు. ఈ కేసులో దర్యాప్తు జరిపేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని, ప్రతిపక్ష పార్టీ నాయకులపై తప్పుడు ఆరోపణలు చేయవద్దని ఆయన సీఎం బీఎస్ యడియూరప్పను కోరారు. కరోనా విజృంభన, వరదల ఉధృతిపై ప్రభుత్వం దృష్టి పెట్టకుండా... డ్రగ్స్ కేసును ప్రధానంగా తీసుకోవడం దారణమంటూ #DrugsMuktaKarnataka హ్యాష్ ట్యాగ్‌ను తన ట్వీట్‌కు జోడించారు. అంతేగాక కాంగ్రెస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ కూడా స్పందిస్తూ.. ముస్లీం కావడం వల్లే తనను టార్గేట్ చేశారని మండిపడ్డారు. ఈ కేసులో జమీర్ అహ్మద్‌కు కూడా సంబంధం ఉన్నట్లు ప్రముఖ పారశ్రామిక వేత్త ప్రశాంత్ సంబరాగి ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన ప్రశాంత్ సంబరాగిపై పరువు నష్టం దావా వేస్తానని ఖాన్ హెచ్చిరించారు. అంతేగాక ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహాతో సహా కొందరూ బీజేపీ నాయకులను ఇప్పటికీ ఎందుకు విచారించ లేదని ఆయన ప్రశ్నించారు. కేవలం ఒక ఫొటోతో రాజకియ నాయకులపై ఆరోపణలు చేయడం సరైనది కాదని ఆయన పేర్కొన్నారు. ఇటీవల కన్నడ చిత్ర నిర్మాత లంకేష్ బెంగుళూరు సెంట్రల్ క్రైం బ్రాంచ్ అధికారులు(సీసీబీ)కి పరిశ్రమలో మాదక ద్రవ్యాల వాడకంపై సమాచారం ఇవ్వడంతో శాండల్‌వుడ్‌లో డ్రగ్ కేసులో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో కొంతమంది సినీ ప్రముఖులతో పాటు నటి సంజన గల్రానీ ఆమె తల్లిని కూడా సీసీబీ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరిని చమరాజ్ పేట ప్రాంతంలోని సీసీబీ కార్యాలయంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. -
బెంగుళూరు అల్లర్లపై సీఎం సీరియస్
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగుళూరులో చెలరేగిన హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి యడియూరప్ప సీరియస్ అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. శాంతియుత వాతావరణం కల్పించడానికి అక్కడికి చేరుకున్న పోలీసులపై కూడా దాడులు చేయడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని సీఎం తెలిపారు. ప్రజలందరూ సంయనం పాటించాలని ఆయన కోరారు. ఇక ఫేస్బుక్లో షేర్ చేసిన ఓ పోస్టు బెంగళూరులో కల్లోలానికి దారి తీసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి బంధువు కావడంతో ఆయన అండతోనే ఇలా చేస్తున్నాడని భావించి మంగళవారం రాత్రి నిరసనకారులు ఎమ్మెల్యే నివాసంపై దాడి చేశారు. (బస్సులో మంటలు : ఐదుగురు సజీవ దహనం) అంతేగాక ఎమ్మెల్యే ఇంటి వద్ద పహారా కాస్తున్న భద్రతా సిబ్బంది పట్ల కూడా నిరసనకారులు అనుచితంగా ప్రవర్తించారు. మంటలు ఆర్పేందుకు వచ్చిన ఫైరింజన్లను సైతం లోపలికి వెళ్లకుండా అడ్డుపడ్డారు. ఈ క్రమంలో తీవ్ర స్థాయిలో అల్లర్లు చెలరేగగా రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితులను అదుపులోకి తెచ్చే క్రమంలో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.. మరొకరు తీవ్రగాయాలపాలయ్యారు. సాధారణ పౌరులతో పాటు 60 మంది పోలీసులకు కూడా గాయాలు అయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సిటీలో 144 సెక్షన్ విధించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న 110 మందిని అరెస్టు చేశామని బెంగళూరు జాయింట్ కమిషనర్(క్రైం) సందీప్ పాటిల్ తెలిపారు. (ఎమ్మెల్యే ఇంటిపై దాడి.. చెలరేగిన హింస) -
ఎమ్మెల్యేల రహస్య భేటీ.. సీఎం కుర్చీపై కన్ను!
సాక్షి, బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప పదవీ బాధ్యతలు స్వీకరించిన్పటి నుంచి బీజేపీలో అంతర్గత ముసలం కొనసాగుతోంది. ఆశించిన పదవులు దక్కకపోవడంతో పలువురు నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య బీజేపీలోని కొందరు ప్రముఖ నేతలు కాఫీనాడు రిసార్టులో రహస్యంగా భేటీ కావడం సంచలనంగా మారింది. వీరి రహస్య సమావేశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. చిక్కమగళూరు తాలూకా ముళ్లయ్యనగిరిలో ఉన్న రిసార్టులో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బెంగళూరు కోవిడ్ ఇన్చార్జి ఆర్.అశోక్, ఇతర మంత్రులు సీటీ రవి, జగదీశ్ శెట్టర్, ఈశ్వరప్పలు పాల్గొన్నారు. అంతేకాకుండా సతీశ్ రెడ్డి, మునిరాజు, కృష్ణప్ప తదితర ప్రముఖ నాయకులు సమావేశమై రాత్రికిరాత్రి తిరిగి బెంగళూరుకు చేరుకోవడం విశేషం. (మేమే కర్ణాటక వస్తాం..అన్నీ తేలుస్తాం) ఈ సమావేశంలో ముఖ్యమంత్రి యడియూరప్ప, ఆయన కుమారుడు విజయేంద్ర కార్యవైఖరిపై చర్చించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా యడియూరప్పకు వ్యతిరేకంగా పార్టీ సీనియర్ నేత బసన్నగౌడ పాటిల్ చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. ఆయన వర్గంగా భావిస్తున్న కొంతమంది ఎమ్మెల్యేలతో రహస్య మంతనాలు చేస్తున్నారనే వార్తలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. అయితే తాము ఎలాంటి రహస్య సమావేశం ఏర్పాటు చేయలేదని మంత్రి ఆర్.అశోక్ వెల్లడించడం గమనార్హం. కాంగ్రెస్-జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి కేంద్ర అండదండలతో యడియూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసింది. కుమారస్వామికి వ్యతిరేకంగా నిరసన స్వరాలు వినిపించి.. ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలకంగా మారిన 15 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా ఇప్పడు బీజేపీ సర్కార్‌లో కీలక పదవుల్లో ఉన్నారు. వీరిలో కొంతమందికి మంత్రి పదవులు కూడా దక్కాయి. ఈ పరిణామం సొంత పార్టీలోని నేతలకు అస్సలు మింగుడు పడటంలేదు. పార్టీని నమ్ముకుని ఎప్పటి నుంచో ఉంటున్న తమను కాదని.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం ఏంటని తమ అసంతృప్తికి వెల్లగక్కుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు సీనియర్లు యడియూరప్పను వెంటనే ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి ఆ బాధ్యతలను కొత్తవారికి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. -
వివాదాస్పదంగా కర్ణాటక నిర్ణయం
బెంగళూరు: రాష్ట్రంలో కరోనా వైరస్ కోరలు చాస్తున్న నేపథ్యంలో ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అంతేగాక విధి నిర్వాహణలో రాష్ట్ర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సైతం ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దీంతో వారికి ప్రత్యేకంగా బెంగళూరులోని కుమార కృపా 100 పడకల లగ్జరీ ప్రభుత్వ గెస్ట్ హౌస్‌ను కోవిడ్-19 సంరక్షణ కేంద్రం కోసం కేటాయిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే రిజ్వాన్ అర్షద్ స్పందిస్తూ.. ‘రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో అర్థం కావడం లేదు. చివరికి ప్రభుత్వ గెస్ట్‌హౌజ్‌ను విఐపీల కోసం చికిత్స కేంద్రంగా మార్చే పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకువచ్చింది’ అని మండిపడ్డారు. (‘జాగ్రత్తగా ఉంటారా.. మరోసారి లాక్డౌన్ విధించాలా’) బీజేపీ నేత ఉమెస్ జాదవ్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ.. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో క్వారంటైన్ చాలా అవసరం. కరోనా బాధితుల కోసం రాష్ట్రంలో వసతి గృహాలు లేనందున ప్రభుత్వం ఏవీ అందుబాటులో ఉంటే వాటిని ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాలి’’ అని పిలుపునిచ్చారు. కాగా కరోనా వ్యాప్తిని అరికట్టే చర్యల్లో భాగంగా నిర్వహిస్తున్న సమీక్షలు, సమావేశాలకు హాజరవుతున్న సీనియర్ అధికారులు, మంత్రులు, ప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారని, అందువల్ల వారి కోసం ప్రత్యేకమైన కోవిడ్ సెంటర్లు అవసరమని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా ఏడు అంతస్తుల కుమార కృపా గెస్ట్‌హౌజ్‌లో ప్రత్యేకంగా 3 అంతస్తులను సుప్రీంకోర్టు న్యామూర్తులు, మంత్రులు, వీవీఐపీల కోసం కేటాయించారు. (‘20 రోజులు లాక్డౌన్ విధించాలి’) కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటి వరకు 10,000లకు పైగా కేసులు నమోదు కాగా 164 మరణాలు చోటుచేసుకున్నాయి. వీటిలో అధిక కేసులు బెంగళూరులో నమోదు కాగా నగరంలోని రెండు అతిపెద్ద మార్కెట్లను ప్రభుత్వం మూసివేసింది. కేసులు అధికమవుతుండటంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా కోవిడ్-19 చికిత్స కోసం 50 శాతం గదులను కెటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి బుధవారం చేసిన వరుస ట్వీట్లలో.. ‘‘కోవిడ్-19 రోగులకు చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో గదులు, వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది. కరోనా బారిన పడిన వారికి తగిన చికిత్స అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని. నాలుగు వేలకుపైగా రోగులకు చికిత్స చేయడానికి పడకలు లేవని, వెంటిలేటర్లు లేవు. కావునా మరోసారి రాష్ట్రంలో 24 రోజుల పాటు లాక్డౌన్ విధించాల’’ని ఆయన డిమాండ్ చేశారు. -
కోవిడ్ కట్టడికి కర్ణాటక కీలక నిర్ణయం
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. మొన్నటి వరకు ప్రశాంతంగా ఉందనుకున్న రాజధాని నగరం బెంగళూరులో వైరస్ పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. సోమవారం ఉదయం అత్యున్నత స్థాయి అధికారులతో ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కీలక సమావేశం నిర్వహించారు. ఒక్క ఆదివారం రోజునే రాష్ట్ర వ్యాప్తంగా 1200కు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 64 మంది వైరస్ బాధితులు మృతి చెందిన నేపథ్యంలో అధికారులు, వైద్యులతో సమీక్ష జరిపారు. పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదైన కోవిడ్ కేంద్రాలను గుర్తించి వాటి సరిహద్దులను మూసివేయాలని అధికారులను ఆదేశించారు. (మూడురెట్లు పెరిగిన టెస్టింగ్ సామర్థ్యం) అలాగే లక్షణాలు కనిపించిన ప్రతీ ఒక్కరికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేశారు. కరోనా పరీక్షల సామర్థ్యం కూడా పెంచాలని అధికారులకు సీఎం సూచించారు. మరోవైపు ఒక్క బెంగళూరు నగరంలోనే 298 కంటైన్మెంట్ జోన్లను తాజాగా గుర్తించామని స్థానిక అధికారులు మీడియాకు వెల్లడించారు. ఒకవేళ కరోనా బాధితులు పెరిగితే ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా 518 ప్రైవేటు ఆస్పత్రులను గుర్తించామని తెలిపారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 9,150 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇప్పటి వరకు 137 మంది మృతి చెందారు. -
కరోనా తెచ్చిన కష్టం: యడ్డీ కుర్చీకి ఎసరు!
బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. సొంత పార్టీలోనే ఆయనకు వ్యతిరేకంగా నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి. తక్షణమే సీఎంను మార్చి ఆయన స్థానంలో కొత్త వ్యక్తికి పాలనా పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ వినిపిస్తోంది. తాజాగా యడియూరప్పకు వ్యతిరేకంగా పార్టీ సీనియర్ నేత బసన్నగౌడ పాటిల్ చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. ఆయన వర్గంగా భావిస్తున్న కొంతమంది ఎమ్మెల్యేలతో రహస్య మంతనాలు చేస్తున్నారనే వార్తలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా యడియూరప్ప తీవ్రంగా విఫలమయ్యారని, వయసు మీదపడటంతో ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారని ఆయన వ్యతిరేక వర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. (ప్రధాని మోదీపై అమిత్ షా ప్రశంసలు) కాంగ్రెస్-జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి కేంద్ర అండదండలతో యడియూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసింది. కుమారస్వామికి వ్యతిరేకంగా నిరసన స్వరాలు వినిపించి.. ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలకంగా మారిన 15 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా ఇప్పడు బీజేపీ సర్కార్‌లో కీలక పదవుల్లో ఉన్నారు. వీరిలో కొంతమందికి మంత్రి పదవులు కూడా దక్కాయి. ఈ పరిణామం సొంత పార్టీలోని నేతలకు అస్సలు మింగుడు పడటంలేదు. పార్టీని నమ్ముకుని ఎప్పటి నుంచో ఉంటున్న తమను కాదని.. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం ఏంటని తమ అసంతృప్తికి వెల్లగక్కుతున్నారు. ఇక ఈ క్రమంలోనే యడియూరప్పను ముఖ్యమంత్రి పదవిలో నుంచి తొలగించి ఆ స్థానంలో కొత్త నాయకత్వానికి బాధ్యతలు అప్పగించాలని ఓ వర్గం డిమాండ్ చేస్తోంది. దీనిపై ఇప్పటికే ఎవరికి వారే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ జాబితాలో సీనియర్ నేతైన బసన్నగౌడ పాటిల్ ముందుండగా.. ఆయనకు పోటీగా మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ దూసుకొచ్చారు. తన వర్గం ఎమ్మెల్యేలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక తానేమీ తక్కువ కాదంటూ సీనియర్ నేత ఉమేష్ కట్టి కూడా రేసులోకి వచ్చారు. గురువారం రాత్రి 16 మంది తన అనుచర ఎమ్మెల్యేలు, నాయకులతో సమావేశమయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ పరిణామాలన్నీ కన్నడలో హాట్ టాపిక్‌గా మారాయి. (ఎన్నో ముడులు విప్పిన మోదీ) తాజా పరిస్థితుల నేపథ్యంలో సీఎం యడియూరప్ప కూడా అప్రమత్తం అయ్యారు. మంత్రి రాములుతో తాజా పరిణామాలతో చర్చించారు. ఈ వ్యవహారమంతా చూస్తుంటే త్వరలోనే కర్ణాటక ముఖ్యమంత్రి స్థానంలో కొత్త నేతను చూడొచ్చని సంకేతాలు వస్తున్నాయి. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో యడియూరప్పను కాదని మరొకరికి అవకాశం ఇస్తే మరోసారి సర్కార్ కూలిపోక తప్పదనే భయం బీజేపీ నేతలను వెంటాడుతోంది. మరికొన్నాళ్ల పాటు యడ్డీనే సీఎంగా కొనసాగిస్తే మేలనే అభిప్రాయం కాషాయ నాయకత్వంలో వినిపిస్తోంది. దీనిపై పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. -
అలా చేస్తే స్వాతంత్ర్య యోధులను కించపరిచినట్లే
బెంగుళూరు: ప్రపంచం అంతా కరోనాతో సతమతమవుతుంటే కర్ణాటకలో మాత్రం ఫ్లైఓవర్ పేరు మీద వివాదం రాజుకుంటోంది. గురువారం బెంగుళూరులోని యెలహంక వద్ద 400 మీటర్ల పొడవైన ఫ్లైఓవర్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ప్రారంభించనున్నారు. దీనికి స్వాతంత్ర్య సమరయోధుడు, హిందుత్వ సిద్ధాంతకర్త వీర్ సావర్కర్ పేరును నామకరణం చేయనున్నారు. అదే రోజు వీర్ వీర్ సావర్కర్ జయంతి కావడం విశేషం. అయితే మహాత్మాగాంధీ హత్యతో అతడికి సంబంధం ఉన్న కారణాల చేత కాంగ్రెస్, తదితర రాజకీయ పార్టీలు అతడిని దేశ భక్తుడిగా పరిగణించడానికి ఇష్టపడలేవు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏకంగా ఫ్లై ఓవర్‌కు అతని పేరును ఖరారు చేయడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఆయన మన రాష్ట్రానికి ఏం చేశాడని అతడి పేరును పెట్టారంటూ గగ్గోలు పెడుతున్నాయి. (యడ్డీ, సిద్దూల మధ్య ఏం జరుగుతుంది!) మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందిస్తూ.. సీఎం యడియూరప్పది తొందరపాటు చర్యగా అభివర్ణించారు. రూ.34 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్‌కు సావర్కర్ పేరును పెట్టడం ద్వారా స్వాతంత్ర్య సమరయోధులను కించపరిచినట్లవుతుందని పేర్కొన్నారు. జేడీఎస్ నేత హెడీ కుమారస్వామి సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. సీఎం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర్యానికి ముందు, తర్వాత కూడా రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడిన ఎందరో ప్రముఖులు ఉన్నారని, ఫ్లైఓవర్‌కు వారి పేరు పెడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. కాగా ప్రతిపక్షాల వ్యాఖ్యలను అధికార పార్టీ ఎమ్మెల్యే ఎస్ఆర్ విశ్వనాథ్ కొట్టిపారేశారు. ప్రభుత్వ నిర్ణయం సరైనదేనని సమాధానమిచ్చారు. విపక్షాలు కావాలనే రాజకీయం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. కాగా ఫిబ్రవరి 29న జరిగిన బృహత్ బెంగళూరు మహానగర పాలిక కౌన్సిల్ సమావేశంలో ఫ్లైఓవర్‌కు వీర్ సావర్కర్ పేరు పెట్టాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం పేర్కొంటుండగా అసలు దీనిపై చర్చే జరపలేదని కౌన్సిల్ మెంబర్ అబ్దుల్ వాజీద్ తెలిపారు. () -
యడ్యూరప్పకు లేఖ రాసిన డీకే శివకుమార్
బెంగుళూరు: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై పెట్టిన ఎఫ్ఐఆర్ను వెనక్కు తీసుకోవాలని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకి లేఖ రాశారు. దాంతో పాటు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన పోలీసు అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలని, అతడు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారని తెలిపారు. పీఎం కేర్ ఫండ్స్‌ని ప్రధాని దుర్వినియోగం చేశారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. (సోనియా గాంధీ పై ఎఫ్ఐఆర్ నమోదు) ఈ విషయంపై బీజేపీ కార్యకర్త, అడ్వకేట్ కేవీ ప్రవీణ్ కుమార్ సోనియాపై శివమొగ్గలో ఫిర్యాదు చేశారు. దీంతో సోనియా మీద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఎఫ్ఐఆర్ రద్దు చేయాలంటూ కేపీసీసీ అధ్యక్షుడు కర్ణాటక ముఖ్యమంత్రికి, హోం శాఖా మంత్రికి, డీజీపీకి, శివమొగ్గ సూపరింటెండెంట్‌కి లేఖలు రాశారు.సోనియా గాంధీ ఒక ఎంపీగా నిధులు సక్రమంగా వినియోగించాలని సూచిస్తూ ఆ ట్వీట్ చేశారని, కానీ బీజేపీ నేతలు దానిని తప్పుగా అర్ధం చేసుకొని కేసు నమోదు చేశారని శివ కుమార్ పేర్కొన్నారు. (నేపాల్ దూకుడుకు భారత్ గట్టి కౌంటర్) -
తల్లి మందుల కోసం టిక్‌టాక్; స్పందించిన సీఎం
సాక్షి, బొమ్మనహళ్లి: బెళగావి జిల్లాలోని రాయదుర్గ తాలూకాలోని నరసాపుర గ్రామానికి చెందిన శేఖవ్వ అనే మహిళకు రెండి కిడ్నీలు దెబ్బతినడంతో భర్త ఒక కిడ్నీ దానం చేయగా ఆమెకు అమర్చారు. జనవరిలో ఆపరేషన్ జరగ్గా, ఇంట్లో ఔషధాలు వాడుతూ విశ్రాంతి తీసుకుంటోంది. 20 రోజుల నుంచి లాక్డౌన్ వల్ల ఆమెకు కావాలసిన మందులు దొరకడం లేదు. ఫలితంగా రోజురోజుకూ నీరసించి ఆరోగ్యం విషమిస్తోంది. దీంతో కూతురు పవిత్ర తన తల్లి బాధను వివరిస్తూ టిక్‌టాక్ వీడియో చేసింది. దీంతో సీఎం యడియూరప్ప సూచన మేరకు జిల్లా అధికారులు శనివారం ఆమె ఇంటికి వెళ్లి నెల రోజులకు సరిపడా మందులను అందజేశారు. ఏదైనా సమస్య ఉంటే తెలియజేయాలని సూచించారు. చదవండి: లాక్డౌన్: అయ్యా..బాబూ.. ఆదుకోండయ్యా! -
పాపం గంగమ్మ.. బాధాకరం
సాక్షి, బెంగళూరు: గంగమ్మ మృతి పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబానికి అండగా నిలబడాలని అధికారులను ఆయన ఆదేశించారు. లాక్డౌన్ నేపథ్యంలో బెంగళూరు నుంచి సొంతూరికి కాలినడకన బయల్దేరి మార్గమధ్యలో గంగమ్మ (29) తనువు చాలించింది. 200 కిలోమీటర్లు పైగా నడిచి ఆకలిబాధతో కన్నుమూసింది. దేశవ్యాప్తంగా వలస కార్మికులు పడుతున్న కష్టాలకు ఈ విషాద ఘటన అద్దం పడుతోంది. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్డౌన్ ప్రకటించడంతో వలస కార్మికులు, రోజువారీ కూలీల బతుకులు దుర్భరంగా మారాయి. గంగమ్మ మరణం దురదృష్టకరమని ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప వ్యాఖ్యానించారు. ‘ఇది చాలా దురదృష్టకర, బాధాకరం. సింధనూరు గ్రామానికి చెందిన గంగమ్మ లాక్డౌన్ సందర్భంగా తన సొంతూరికి నడిచి వెళుతుండగా మార్గమధ్యలో చనిపోయింది. ఆమె అన్ని కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకోవాలని అధికారులను ఆదేశిస్తున్నాను’ అని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో వలస కార్మికులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టామని.. ఆహారం, సరుకులు అవసరమైన వారి కోసం హెల్ప్‌లైన్ నంబరు పెట్టామని యెడియూరప్ప తెలిపారు. వలస కార్మికుల కోసం తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు అందరూ ప్రభుత్వం సూచనలు పాటించాలని, ఎటువంటి అవసరం వచ్చినా హెల్స్‌డెస్క్‌లను సంప్రదించాలని సూచించారు. (విషాదం; కబళించిన ఆకలి) -
యడ్డీ, సిద్దూల మధ్య ఏం జరుగుతుంది!
సాక్షి, బెంగళూరు : రాజకీయ ప్రత్యర్థులు ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప, ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్యలు ఇప్పుడు పాలు–నీళ్లలా కలిసిపోయారు! దీంతో అంతంతమాత్రం బలమున్న యడియూరప్ప ప్రభుత్వం సాఫీగా నడుస్తోందని తెలుస్తోంది. యడియూరప్ప పరిపాలనపై సిద్ధరామయ్య మెతక ధోరణితో స్పందిస్తుండడం, సిద్ధరామయ్య ఏదైనా డిమాండ్ చేయగానే యడియూరప్ప సానుకూలంగా వ్యవహరించడం గమనార్హం. ఇంత స్నేహానికి కారణాలేమిటని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుత సీఎం యడియూరప్ప, మాజీ సీఎం సిద్ధరామయ్యలు 1983లో ఏకకాలంలో ఎమ్మెల్యేలుగా గెలిచి అడుగు పెట్టారు. ఇద్దరి మధ్య సిద్ధాంత వైరుధ్యం ఉన్నప్పటికీ ఎవరికి వారు ఆయా రాజకీయ పార్టీల్లో కొనసాగుతూ ప్రత్యర్థులుగా ముందుకు సాగుతున్నారు. ఒకరు అధికారంలో ఉంటే మరొకరు ప్రతిపక్షంలో ఉంటూ పరస్పరం రాజకీయ పోరాటం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో సఖ్యతగా ఉండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి గొలుపుతోంది. మరో మూడేళ్లు అధికారంలో కొనసాగాలంటే సిద్ధరామయ్య అండ ముఖ్యమని యడియూరప్ప కూడా భావిస్తున్నారు. సంకీర్ణం కూల్చివేత నుంచి ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్–జేడీఎస్ సర్కారు ఏర్పడి కుమారస్వామి సీఎం అయ్యారు. ఇది సిద్ధరామయ్యకు ఎంతమాత్రం నచ్చలేదు. తన సన్నిహితులకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని, సీఎం కుమారస్వామి ఏకపక్షంగా నడుచుకుంటున్నారని సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. చివరకు సిద్ధరామయ్య శిష్యులే ఎక్కువమంది అసమ్మతి ఎమ్మెల్యేల శిబిరంలో చేరడం, సర్కారు కూలిపోవడం తెలిసిందే. అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాల వెనుక సిద్ధరామయ్యే ఉన్నారన్న ఆరోణలు వినిపించాయి. దేవెగౌడ, కుమారస్వామిల కంటే యడియూరప్ప మేలు అని సిద్ధరామయ్య భావించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థిని నిలపకుండా బీజేపీకి సాయం చేశారనే విమర్శలున్నాయి. (‘అమూల్యకు నక్సలైట్లతో సంబంధాలున్నాయి’) బాదామికి రూ. 600 కోట్లు సిద్ధరామయ్య నియోజకవర్గం బాదామికి సీఎం యడియూరప్ప ఏకంగా రూ. 600 కోట్లను విడుదల చేశారు. సిద్ధరామయ్య ఏమి అడిగినా యడియూరప్ప లేదనే మాట చెప్పడం లేదు. అసెంబ్లీ సమావేశాల్లోనూ సిద్ధరామయ్య మాట్లాడుతున్న సందర్భంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు పదే పదే అడ్డుపడుతున్న సందర్భంలో యడియూరప్ప మధ్యలో కలుగజేసుకుని ఎవరూ మాట్లాడొద్దని సముదాయించి వారిని సీట్లలో కూర్చొబెట్టడం కూడా కనిపించింది. (అధిష్టానానికి తలనొప్పిగా ఆ రాష్ట్ర వ్యవహారం) సీఎం బర్త్‌డేకి హాజరు 27న జరిగే యడియూరప్ప పుట్టినరోజు వేడుకలకు యడ్డి కుమారుడు విజయేంద్ర వెళ్లి సిద్ధరామయ్యను ఆహ్వానించారు. నివాసానికి వెళ్లి పుట్టిన రోజు వేడుకలకు రావాలని ఆహ్వానించడం కూడా వీరి మధ్య నెలకొన్న అన్యోన్య స్నేహానికి ప్రతీకగా ఉందని చర్చించుకుంటున్నారు. అనుకున్నట్లుగానే గురువారం రాత్రి జరిగిన యడియూరప్ప పుట్టినరోజు వేడుకలకు సిద్ధరామయ్య హాజరై పొగడ్తలతో ముంచెత్తారు. వీరిద్దరి స్నేహం మూడు ప్రధాన పార్టీల్లోనూ చర్చనీయాంశమైంది. -
‘అమూల్యకు నక్సలైట్లతో సంబంధాలున్నాయి’
బెంగుళూరు : పౌరసత్వ నిరసన కార్యక్రమంలో ’పాకిస్తాన్ జిందాబాద్’ నినాదాలు చేసిన అమూల్యకు నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఆరోపించారు. విచారణ అనంతరం యువతికి శిక్ష తప్పదని హెచ్చరించారు. అమూల్య వంటి యువతను తప్పుదోవ పట్టిస్తున్న వారికి కూడా కఠిన శిక్ష తప్పదని అన్నారు. ఆమె వెనుక ఎవరెవరున్నారో వెల్లడవుతుందని, తీవ్రవాదాన్ని పెంచి పోషించే సంస్థలకు తగిన బుద్ధి చెబుతామని అన్నారు. ఆయన బెంగుళూరులో మీడియాతో మాట్లాడుతూ.. ‘యువతి ప్రవర్తనపై ఆమె తండ్రే ఆగ్రహంగా ఉన్నాడు. ఆమెకు తగిన శిక్ష పడాలని, బెయిల్ కూడా రాకుండా చేయండని అన్నాడు. తనను రక్షించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయనని చెప్తున్నాడు. ఆ యువతికి నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయనేందుకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇక బెంగుళూరు ఫ్రీడంపార్క్‌లో గురువారం జరిగిన పౌరసత్వ సవరణ చట్టం నిరసన కార్యక్రమంలో అమూల్య లియోన్ అనే యువతి ‘‘పాకిస్తాన్ జిందాబాద్’’ అంటూ నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెపై దేశద్రోహం కేసు నమోదైంది. అమూల్యను 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి తీసుకోవాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సహా పలువురు ఈ ర్యాలీకి హాజరయ్యారు. -
బెంగళూరు నుంచి బీదర్‌కు ట్రూజెట్ సర్వీసులు
బెంగళూరు: ఉడాన్ నెట్వర్క్ సేవల విస్తరణలో భాగంగా హైదరాబాద్ టర్బో మేఘా ఎయిర్వేస్కు చెందిన ట్రూజెట్ కొత్తగా ఈశాన్య కర్ణాటకలోని బీదర్ నుంచి విమాన సేవలు ప్రారంభించింది. బీదర్ నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరు మధ్య శుక్రవారం నుంచి ప్రతీ రోజు విమాన సేవలు అందుబాటులోకి వచ్చాయి. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప ఇవాళ బెంగళూరు విమానాశ్రయంలో ఈ సర్వీసు ప్రారంభించారు. బెంగళూరులో ట్రూజెట్ సర్వీసు ప్రారంభించిన అనంతరం అదే విమానంలో ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు బీదర్ వరకు ప్రయాణించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ బెంగళూరు విమానాశ్రయం నుంచి బీదర్‌కు కేవలం గంటా 40 నిమిషాల్లోనే చేరుకున్నామని, సాధారణంగా బెంగళూరు నుంచి బస్సులో బీదర్‌కు చేరుకోవాలంటే 12 గంటల ప్రయాణం అవుతుందన్నారు. ట్రూజెట్ విమాన సర్వీసుల వల్ల ప్రయాణ దూరం భారం తగ్గిందని విమాన సర్వీసుల పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు ఇక ట్రూజెట్ నెట్‌వర్క్‌లో బీదర్ 24వ స్టేషన్ కాబోతోంది. ప్రాంతీయ అనుసంధాన పథకం (ఆర్సీఎస్)- ఉడే దేశ్కా ఆమ్ నాగరిక్ (ఉడాన్), సామాన్య మానవులు కూడా విమానాల్లో ప్రయాణించాలన్న ప్రధానమంతి ప్రయత్నాల్లో భాగంగా ట్రూజెట్ విమానాల్లో 65 శాతానికి పైగా ప్రాంతీయ విమానాశ్రయాలకు అనుసంధానమై ఉన్నాయి. ఆర్సీఎస్ I, II, III కింద తనకు అప్పగించిన మార్గాల్లో పూర్తిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏకైక సంస్థ ట్రూజెట్. ఈ సందర్భంగా టర్బో మేఘా ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ప్రదీప్ మాట్లాడుతూ ‘మా మొదటి ప్రయాణాన్ని జూలై 12, 2015న మొదలపెట్టిన నాటి నుంచి మేము చాలా దూరం ప్రయాణించాం. భారత్‌లోని ప్రథమశ్రేణి నగరాల నుంచి సామాజిక-ఆర్థిక అభివృద్ధిని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించాలన్న జాతి ఆకాంక్షలను మేము నెరవేర్చుతున్నామని గొప్పగా చెప్పుకుంటున్నాం. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమాన సేవలు అందించడం ద్వారా ఆ ప్రాంతాల్లో వ్యాపారానికి, పర్యటక అభివృద్ధికి మేము దోహదపడుతున్నాం. విమాన అనుసంధానం అన్నది ఆర్థిక వ్యవస్థకు అండగా నిలవడమే కాకుండా ఉపాధి కల్పనకు సహకరిస్తుంది’ అని అన్నారు. సీఈఓ కల్నల్ ఎల్ఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ, ప్రాంతీయ విమాన అనుసంధానంలో బలమైన శక్తిగా ట్రూజెట్ నిలుస్తుంది. నాలుగేళ్ల స్వల్ప వ్యవధిలో మా నెట్‌వర్క్‌ను 24స్టేషన్లకు విస్తరించగలిగాం. దేశంలో ఆర్థికశక్తులుగా ఎదుగుతున్న ప్రాంతాల్లో బలమైన ప్రాంతీయ విమానయాన సంస్థగా ఎదిగేందుకు సుస్థిర అభివృద్ధి వ్యూహాన్ని రూపొందించామన్నారు. కాగా బెంగళూరు-బీదర్ బెంగళూరు మధ్య కొత్త సర్వీసు ప్రారంభించిన సందర్భంగా ట్రూజెట్ నాలుగు రోజుల పాటు టికెట్ బేస్ ధరను రూ.699 గా అందిస్తోంది. -
ఆయనను అరెస్టు చేశారా? ఎక్కడా?
సాక్షి, బెంగళూరు/ న్యూఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మరోసారి ఆందోళనలు మిన్నంటాయి. ముఖ్యంగా న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద పోలీసుల నిషేధాజ్ఞలను ఉల్లంఘించి పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు గుమిగూడారు. సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు విధించిన 144 సెక్షన్‌ను ధిక్కరించి మరీ ఎర్రకోట వద్ద ఆందోళనకారులు గుమిగూడారు. ఇక్కడ ఆందోళనలకు పలు రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. ఇక్కడ పెద్దసంఖ్యలో ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఎర్రకోట వద్ద స్వరాజ్ అభియాన్ పార్టీ చీఫ్ యోగేంద్ర యాదవ్‌తోసహా పలువుర్ని గురువారం ఉదయమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని యోగేంద్ర ట్విటర్లో తెలిపారు. వామపక్ష నేతలు డీ రాజా, సీతారాం ఏచూరి, నిలోత్పల్ బసు, బృందా కరత్‌లను కూడా పోలీసులను అరెస్టు చేశారు. ఇటు బెంగళూరులో సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహాను పోలీసులు అరెస్టు చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తనను పోలీసులు అరెస్టు చేయడంపై గుహా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల తీరు అప్రజాస్వామికంగా ఉందన్నారు. అయితే, నిషేధాజ్ఞలను ఉల్లంఘించడంతోనే గుహాతోపాటు నిరసనకారుల్ని అరెస్టు చేశామని బెంగుళూరు సిటీ పోలీసులు తెలిపారు. మరోవైపు గుహా అరెస్టుపై కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడ్డియూరప్ప ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గుహా అరెస్టు గురించి విలేకరులు ప్రస్తావించగా.. ‘ఎక్కడా? కారణం లేకుండా పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదు. నేను పోలీసులకు వెంటనే ఆదేశాలు ఇస్తాను?’ అని యెడ్డియూరప్ప పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిపై, గూండాలపై చర్యలు తీసుకోవాలి కానీ, సామాన్య ప్రజలపై చర్యలు తీసుకోకూడదని, అలాంటిది ఏదైనా జరిగితే అధికారులపై చర్యలు తీసుకుంటామని సీఎం అన్నారు. -
ఉప ఎన్నికల ఫలితాలు: బీజేపీ హవా
సాక్షి,బెంగళూరు: కర్ణాటకలో ఇటీవల జరిగిన 15 అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ హవా కొనసాగింది. ఊహించినట్లుగానే బీజేపీ దూసుకుపోయింది. 15 స్థానాల్లో ఉప ఎన్నికలు జరగగా, 12 సీట్లను కాషాయ పార్టీ కైవసం చేసుకుంది. ఇక కాంగ్రెస్ కేవలం 2 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో కర్ణాటక రాజకీయాల్లో ఏర్పడిన సంక్షోభం ఇక శాశ్వతంగా సమసిపోయినట్లే. అసెంబ్లీలో ప్రస్తుతం మైనార్టీ ప్రభుత్వాన్ని నెట్టుకొస్తున్న ముఖ్యమంత్రి యడియూరప్ప సర్కార్‌కు ఉప ఎన్నికల ఫలితాలు మంచి జోష్‌ను నింపింది. యడ్డీ సర్కార్ మ్యాజిక్ ఫిగర్ కంటే ఆరు స్థానాల్లో విజయం సాధించింది. ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీకి 105 మంది సభ్యుల మద్దతు ఉండగా.. ఉప ఎన్నికల్లో 12 స్థానాల్లో గెలుపొందటంతో ఆ సంఖ్య 117కి చేరింది. దీంతో ఉత్కంఠ భరిత స్థితిలో ముఖ్యమంత్రి పీఠం చేజిక్కించుకున్న బీఎస్ యడియూరప్ప సేఫ్ జోన్లో ఉన్నారు. ప్రస్తుతం వెలువడుతున్న ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి మరింత ఊరటను కలిగించాయి. కన్నడలో ఇక తమకు తిరుగులేదని బీజేపీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. కన్నడ ప్రజలు సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఇక కాలం చెల్లినట్టే అని ఫలితాలపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులు సంభరాలు కూడా ప్రారంభించారు. ఇక యడియూరప్ప సర్కార్‌ను మరోసారి కూల్చాలని కలలుకన్న జేడీఎస్, కాంగ్రెస్‌లకు ఉప ఎన్నికల్లో చేదు పలితాలే ఎదురయ్యాయి. ఇప్పటికే వరుస ఓటములతో ఢీలా పడ్డ కాంగ్రెస్‌కు ఉప ఎన్నికల ఫలితాలు మరింత నిరాశను మిగిల్చాయి. 15 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 5వ తేదీన పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. 15 మంది కాంగ్రెస్, జేడీఎస్ సభ్యులపై స్పీకర్ అనర్హత వేటు వేయడంతో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. -
యడియూరప్ప ప్రభుత్వానికి విషమ పరీక్ష
నాలుగు నెలల యడియూరప్ప ప్రభుత్వానికి మరో అగ్నిపరీక్ష. మైనారిటీలో ఉన్న ప్రభుత్వం మనుగడ సాగించాలా, వద్దా? అన్నదానిపై ఓటరు దేవుళ్లు నేడు తీర్పు ఇవ్వబోతున్నారు. బెంగళూరు, బెళగావి ప్రాంతాలతో సహా రాష్ట్రవ్యాప్తంగా ఉప ఎన్నికల జ్వరం ఆవహించింది. గెలుపోటములపై బెట్టింగ్‌లు తారస్థాయికి చేరాయి. సుమారు రెండువారాల నుంచి ప్రచారంలో నిమగ్నమైన అగ్రనేతలు 9వ తేదీ వరకు విశ్రాంతి తీసుకోవచ్చు. ఆ రోజున వెలువడే ఫలితాలు రాష్ట్ర రాజకీయాలను మార్చబోతున్నాయి. సాక్షి, బెంగళూరు: 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు పార్టీల భవితవ్యం ఇమిడి ఉంది. యడియూరప్ప సర్కారు మనుగడను తేల్చే ఉప ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. మినీ అసెంబ్లీ ఎన్నికలు మినీ అసెంబ్లీ ఎన్నికలుగా పేరుపొందిన ఈ సమరంలో మూడు ప్రధాన రాజకీయ పారీ్టల నుంచి సీనియర్ నాయకులు పోటీలో ఉన్నారు. ఒకేసారి 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగడం కూడా రికార్డే. మొత్తం 165 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా వారిలో 9 మంది మహిళలు ఉన్నారు. కాగా శివాజీనగర నుంచి అత్యధికంగా 19 మంది పోటీ చేస్తుండగా, కృష్ణరాజపేటె, యల్లాపుర నుంచి అత్యల్పంగా ఏడుగురు చొప్పున బరిలో ఉన్నారు. ఓటరు కార్డు లేదా ఆధార్, రేషన్, డ్రైవింగ్ లైసెన్సు, పాస్‌పోర్టు, పాన్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు తదితర 11 రకాల కార్డుల్లో ఏదైనా తీసుకుని వెళ్లి ఓటు వేయవచ్చు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ఎన్నికల అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలని సీఎం యడియూరప్ప సూచించారు. బుధవారం ఉదయం ఆయన నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలింగ్ బాగానే జరుగుతుందని అన్ని పార్టీలు ఆశాభావంతో ఉన్నాయి. నిర్భయంగా ఓటేయండి : సీఎం సూచన సాక్షి బెంగళూరు: నేడు గురువారం జరిగే ఉప ఎన్నికల పోలింగ్‌లో ఓటర్లందరు నిర్భయంగా పాల్గొనాలని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సూచించారు. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటు వేయాలని తెలిపారు. వానాగాలీ, చలి ఉన్నా పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లాలని పిలుపునిచ్చారు. సుమారు 85 శాతం పోలింగ్ నమోదు దాటితే ప్రజాస్వామ్యానికి బలమని బుధవారం సాయంత్రం అన్నారు. -
ఆ టేపులూ సాక్ష్యాలే: సుప్రీం
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో 17 మంది కాంగ్రెస్–జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత కేసు మలుపు తిరిగింది. తమపై అనర్హత విధించడం సబబు కాదని ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉండటం తెల్సిందే. ఈ నేపథ్యంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలను తామే ముంబైకి పంపించామని సీఎం యడియూరప్ప చెబుతున్న ఆడియో, వీడియోలు ఇటీవల బయటకు వచ్చాయి. ఆ టేపులనూ సాక్ష్యాలుగా తీసుకుంటామని సుప్రీంకోర్టు సోమవారం ప్రకటించింది. దీనికి ముందు ఈ టేపులను తీర్పు సందర్భంగా పరిగణలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ వాదించింది. ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్–జేడీఎస్‌ల ప్రభుత్వాన్ని కూల్చారని సుప్రీంకు కాంగ్రెస్ కర్ణాటక విభాగం నివేదించింది. -
అనర్హత ఎమ్మెల్యేలతో సంబంధం లేదు: యెడ్డీ
సాక్షి, బెంగళూరు: గతంలో కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అనర్హత వేటుకు గురైన కాంగ్రెస్– జేడీఎస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలతో తమకు ఎలాంటి సంబంధం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప అన్నారు. సొంత రాజకీయ భవిష్యత్తు కోసం ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి అనర్హత వేటుకు గురయ్యారన్నారు. అనర్హత ఎమ్మెల్యేలు బీజేపీ సర్కారు ఏర్పడడానికి కృషి చేశారని, ఉప ఎన్నికల్లో వారికే టికెట్లు ఇస్తామని యడియూరప్ప చెబుతున్న ఆడియో, వీడియోలు వైరల్ అయిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
తిరుగుబాటు వ్యూహం అమిత్షాదే
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చడంలో కీలకపాత్ర పోషించిన 17 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. దీనికి సంబంధించి యడియూరప్ప మాట్లాడిన ఆడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. జేడీఎస్ అధినేత, మాజీ సీఎం కుమారస్వామి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఈ 17 మంది విశ్వాస పరీక్షకు హాజరుకాకుండా ముంబైలోని ఓ స్టార్ హోటల్‌కు తరలించడం సహా అన్ని ఏర్పాట్లను బీజేపీ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్‌షా పర్యవేక్షించారని యడియూరప్ప చేసిన వ్యాఖ్యలు వివాదమయ్యాయి. బీజేపీ కార్యకర్తలతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆ 17 మంది ఎమ్మెల్యేలు తమ కుటుంబాలను వదిలి రెండు మూడు నెలల పాటు ముంబైలో ఉన్నారు. వారంతా మన ప్రభుత్వ ఏర్పాటుకు సహాయం చేశారు. నన్ను నమ్మి వారంతా తమ పదవులకు రాజీనామా చేశారు. వాళ్లకు అన్యాయం చేసి సీఎం అయ్యి నేరం చేశాననే భావన నాలో కలుగుతుంది. మీకు ఈ విషయాలన్నీ తెలియవు. మనం వాళ్లకి అండగా ఉండాలి’అని యడియూరప్ప వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టును ఆశ్రయిస్తా: కుమారస్వామి యడియూరప్ప వ్యాఖ్యలతో బీజేపీ నిజస్వరూపం బయటపడిందని కుమారస్వామి ఆరోపించారు. రెబల్ ఎమ్మెల్యేల విషయంలో యడియూరప్ప తనంతట తానే వాస్తవాలను బయటపెట్టారని అన్నారు. ఈ విషయంలో వీడియో క్లిప్పింగుల ఆధారంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని శనివారం చెప్పారు. -
రెండు నెలల్లో సర్కార్ పతనం తథ్యం
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సర్కార్ రెండు నెలల్లో పతనం కాకతప్పదని జేడీఎస్ మాజీ సీఎం కుమారస్వామి జోస్యం చెప్పారు. మంగళవారం ఆయన నగరంలో దాసరహళ్లిలో నిధుల కోతను వ్యతిరేకిస్తూ జేడీఎస్ నిర్వహించిన ఆందోళనలో పాల్గొని మాట్లాడారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా భయపడే ప్రసక్తే లేదన్నారు. తను అభివృద్ధి కోసం మాత్రమే తల వంచుతానన్నారు. ఇదీ ఇప్పటికి నిర్వహిస్తున్న ధర్నా మాత్రమేనని, ప్రభుత్వంలో మార్పు రాకుంటే వచ్చే రోజుల్లో విధానసౌధను కూడా ముట్టడిస్తామన్నారు. శికారిపురకు సీఎం బీఎస్ యడియూరప్ప రూ. 800 కోట్లను విడుదల చేశారు. అయితే తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్ని నియోజకవర్గాలకు సమానంగా నిధులను విడుదల చేసినట్లు కుమార గుర్తు చేశారు. ఇది ఒక విధంగా సిగ్గులేని ప్రభుత్వామని ఎదురుదాడి చేశారు. వరదలతో రెండన్నర లక్షల మంది నిరాశ్రయులైతే వారికి సాయం అందించటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ అమెరికాకు వెళ్లి ప్రసంగిస్తారు. వరద బాధితుల సమస్యలను మా త్రం పట్టించుకోవటంలేదని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్‌పై ఎవరితో విచారణ చేసినా భయపడేది లేదన్నారు. పార్టీ అధ్యక్షుడ హెచ్ కే కుమారస్వామి, ఎమ్మెల్యే ఆర్ మంజునాథ్‌తో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
అనర్హత ఎమ్మెల్యేలకు బీజేపీ టికెట్లు
శివమొగ్గ : ఒకవైపు అనర్హత, మరోవైపు కోర్టులో విచారణతో తమ రాజకీయ భవితవ్యం ఏమవుతుందోనని మథనపడుతున్న అనర్హత ఎమ్మెల్యేలకు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప అభయమిచ్చారు. 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికల్లో అనర్హత ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తామని యడియూరప్ప తెలిపారు. సోమవారం జిల్లాలోని శికారిపుర పట్టణంలో నిర్వహించిన జనతాదర్శన్ కార్యక్రమంలో ప్రజల నుంచి సమస్యల అర్జీలు స్వీకరించిన అనంతరం మాట్లాడారు. ఇటీవల ఢిల్లీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో సమావేశమై ఉపఎన్నికల్లో అనర్హత ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా అందుకు అంగీకరించారని చెప్పారు. అనర్హత ఎమ్మెల్యేలు తమ భవిష్యత్తు గురించి బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఇద్దరు ఇంచార్జ్‌లను నియమించి అనర్హత ఎమ్మెల్యేలను గెలిపించుకోవడానికి వ్యూహాలు కూడా సిద్ధం చేస్తున్నామన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడాలి అనర్హత ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడానికి అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలని ఉపఎన్నికల్లో అనర్హత ఎమ్మెల్యేలను గెలిపించడానికి సహకరించాలని సూచించారు. పారీ్టలోని కీలకనేతలకు సముచిత స్థానం కలి్ప స్తామని ఇదే విషయంపై తదుపరి మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామన్నారు. అదేవిధంగా గత ఎన్నికల్లో తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన నేతలకు నిగమ మండళి స్థానాలు కట్టబెడతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గెలిస్తే కరెక్టా? ఈవీఎంల ట్యాంపరింగ్ అవుతాయేమోనని మాజీ సీఎం సిద్ధరామయ్య అనుమానం వ్యక్తం చేయడాన్ని యడియూరప్ప తప్పుపట్టారు. కాంగ్రెస్ గెలిస్తే సరిగ్గా పనిచేసే ఈవీఎంలు బీజేపీ గెలిచినపుడు మాత్రం ఎలా ట్యాంపరింగ్ అవుతాయో సిద్దరామయ్యే చెప్పాలని కోరారు. అనర్హత ఎమ్మెల్యేల విషయంలో ఇక ఎవరిదారి వారిదే అని ఉమేశ్ కత్తి చేసిన వ్యాఖ్యలపై త్వరలోనే ఆయన భేటీ అయి చర్చిస్తానని చెప్పారు. చకచకా శివమొగ్గ ఎయిర్‌పోర్టు శివమొగ్గ నగర శివార్లలోని సోనగానహళ్లిలో నిలిచిపోయిన విమానాశ్రయ నిర్మాణ పనులను పునఃప్రారంభిస్తామంటూ సీఎం తెలిపారు. అతి త్వరలో విమానాశ్రయ పనులను పునఃప్రారంభించనున్నామని అందుకోసం రూ.45 కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. పదినెలల్లో విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేస్తామని విమానాశ్రయంతో పాటు జిల్లా యువతకు ఉపాధి కల్పించడానికి పరిశ్రమలు స్థాపనపై కూడా దృష్టి సారించామన్నారు. -
యడ్డీ దూకుడుకు బీజేపీ బ్రేక్!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం తనదైన శైలిలో వ్యవహరిస్తోంది. యడ్డీకి బ్రేక్ చెప్పేందుకు ఇప్పటికే ముగ్గురు ఉప ముఖ్యమంత్రులను నియమించిన కేంద్ర నాయత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం సలహాదారుగా సంఘ్నేత గణేష్ కార్నిక్ను నియమించింది. మాజీ ఎమ్మెల్సీ, ఆర్ఎస్ఎస్ ప్రముఖునిగా పేరున్న గణేష్ కార్నిక్ త్వరలోనే ఈ బాధ్యతలను చేపట్టనున్నారు. త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో కార్నిక్ నియామకాన్ని ఆమోదించనున్నారు. కాగా ఈ పరిణామం యడియూరప్పను కొంత ఇబ్బంది పెట్టేదే అని రాజకీయ వర్గాల్లో చర్చజరుగుతోంది. యడ్డీపై నమ్మకం లేకనే ఇలా సంఘ్నేతని సీఎం సలహాదారుడిడి నియమించినట్లు తెలిసింది. కార్నిక్ అనుమతి లేకుండా యడియూరప్ప ఒక్క పేపర్‌పై కూడా సంతకం చేయరాదని ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. కాగా యడ్డీ ఇటీవల ఓ సమావేశంలో మాట్లాడుతూ.. అమిత్ షా హిందీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా స్వరం వినిపించిన విషయం తెలిసిందే. అయితే దీనిలో దృష్టిలో ఉంచుకున్న కేంద్ర పెద్దలు యడియూరప్ప సొంతంగా ముఖ్య నిర్ణయాలు తీసుకోకుండా అరికట్టేందుకు ఈ జాగ్రత్త తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ప్రతి ఫైలూ ఆయన చూశాకే పార్టీ నాయకత్వం గణేష్‌ను సీఎం పేషీలోకి పంపడం ప్రత్యేకత చోటుచేసుకుంది. మంగళూరు ప్రాంతానికి చెందిన ఈయనను తేవడం వెనుక అనేక లెక్కాచారాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంలో యడియూరప్ప సంతకం చేసే ప్రతి ఫైల్ గణేష్ కార్నిక్ పరిశీలించి ఆమోదం తెలిపిన తరువాతనే సీఎం వద్దకు వెళ్తుందని సమాచారం. ఆయనకు ప్రత్యేక అధికారాలతో పాటు అధికారుల బదిలీలు, నియామకాలు, కేఐఏడీబీ ద్వారా వ్యాపారవేత్తలకు భూములను ఇవ్వడం, డి నోటిఫికేషన్‌కు సంబంధించిన అంశాలను కార్నిక్ పరిలించాకే సీఎం సంతకం చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. -
హైదరాబాద్-కర్ణాటక ప్రాంతం పేరు ఇకపై..
బెంగళూర్ : చారిత్రక ప్రాధాన్యత కలిగిన హైదరబాద్-కర్ణాటక ప్రాంతాన్ని ఇకపై కళ్యాణ-కర్ణాటకగా వ్యవహరిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ప్రకటించారు. ఎంతో కాలంగా ప్రజలు కోరుతున్న మేరకు కళ్యాణ-కర్ణాటకగా ఈ ప్రాంతం పేరును మార్చుతున్నట్టు ఆయన వెల్లడించారు. కలబురిగిలో మంగళవారం సీఎం యడియూరప్ప మాట్లాడుతూ కళ్యాణ-కర్ణాటక ప్రాంత సమగ్రాబివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సచివాలయం ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. గుల్బర్గ, బీదర్, రాయచూర్, యాదగిరి, బళ్లారి, కొప్పళ జిల్లాలతో కూడిన ఈ ప్రాంతాన్ని దశాబ్ధాలుగా హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంగానే వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాంతం గతంలో హైదరాబాద్ కేంద్రంగా నిజాం రాజ్యంలో అంతర్భాగంగా ఉండేది. సంస్ధానాల విలీనం అనంతరం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుతో కర్ణాటకలో కలిసినప్పటికీ ఆరు జిల్లాలతో కూడిన ఈ ప్రాంతాన్ని హైదరాబాద్-కర్ణాటకగానే వ్యవహరిస్తున్నారు. -
అమిత్ షాతో విభేదించిన కర్ణాటక సీఎం
సాక్షి, బెంగళూరు: ఒక దేశం ఒక భాష అంటూ కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ కార్యదర్శి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వ్యతిరేక స్వరాలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో పాటు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప.. అమిత్ షా హిందీ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. కేంద్ర నిర్ణయంతో ఏకీభవించేదిలేదని తేల్చిచెప్పారు. ‘దేశంలోని భాషలన్నీ సమానమే. దానిలో భాగంగానే కర్ణాటకకు కూడా కన్నడ చాలా ముఖ్యం. హిందీని అమలుచేయలన్న కేంద్ర నిర్ణయంతో ఏకీభవించేదిలేదు’ అంటూ యడియూరప్ప స్పష్టం చేశారు. తమపై హిందీని బలవంతంగా రుద్దాలని చూస్తే మరో ప్రతిఘటన ఎదుర్కొక తప్పదని మక్కళ్నిధీమయ్యం అధినేత కమల్‌హాసన్ కేంద్ర ప్రభుత్వాన్ని ఇదివరకే హెచ్చరించారు. కాగా హిందీ దివస్ సందర్భంగా అమిత్ షా ప్రసంగిస్తూ.. భారత్‌లో అత్యధికులు మాట్లాడే హిందీ భాష దేశాన్ని ఐక్యమత్యంగా ఉంచడానికి తోడ్పడుతుందని పేర్కొన్న విషయం తెలిసిందే. షా వ్యాఖ్యలపై పలు రాష్ట్రాలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. All official languages in our country are equal. However, as far as Karnataka is concerned, #Kannada is the principal language. We will never compromise its importance and are committed to promote Kannada and our state's culture. — CM of Karnataka (@CMofKarnataka) September 16, 2019 -
ట్రాఫిక్ చలాన్లను తగ్గించనున్న మరో రాష్ట్రం!
యశవంతపుర: ఈ నెల ఒకటో తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన మోటారు వాహన చట్టంతో వాహనదారులపై భారీ జరిమానాలు పడుతున్నాయి. రవాణా అధికారులు, ట్రాఫిక్ పోలీసులు రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు చలానాలు రాస్తున్నారు. దీనిపై ప్రజలలో వ్యతిరేకత వ్యక్తం కావటంతో గుజరాత్ మాదిరిగా కన్నడనాట కూడా చలాన్లను సగానికి తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం బీఎస్ యడియూరప్ప బుధవారం ఈ విషయమై రవాణాశాఖ అధికారులకు సూచనలు చేశారు. తగ్గింపునకు సంబంధించి అధికారులతో చర్చించి సీఎం చేసిన ఆదేశాలను గట్టిగా పరిశీలిస్తున్నట్లు డీసీఎం, రవాణా శాఖమంత్రి లక్ష్మణ సవది తెలిపారు. ఇప్పటికే గుజరాత్లో మోటారు వాహన చట్టంలో మార్పులు తెచ్చి జరిమానాలను సగం వరకూ తగ్గించారు. దీంతో వాహనదారులకు కొంతైనా ఊరట దక్కింది. రాష్ట్రంలో కూడా చలాన్ల బాదుడుపై అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్ మాదిరిగా వ్యవహరించాలని సంకల్పించింది. గుజరాత్ తరహాలో ట్రాఫిక్ చలాన్లు తగ్గిస్తామని సీఎం బీఎస్ యడ్యూరప్ప మీడియాతో పేర్కొన్నారు. 2 రోజుల్లో నివేదిక ఇతర రాష్ట్రాలలో విధిస్తున్న జరిమానాల విధానాన్ని కర్ణాటక అధికారులు అధ్యయనం చేశారు. రెండు రోజుల్లో సంపూర్ణ నివేదికను సీఎంకు అందజేయనున్నారు. ఆ తరువాత జరిమానాలను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. జరిమానాల విధానంపై అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చినట్లు డీసీఎం లక్ష్మణ సవది తెలిపారు. బెంగళూరులో కొత్త ట్రాఫిక్ జరిమానాలపై ఆవేదన వ్యక్తమవుతోంది. గుజరాత్లో హెల్మెట్ ధరించకుంటే రూ. వెయ్యికి బదులు రూ.500, సీట్ బెల్ట్ పెట్టుకోకుంటే రూ.500 జరిమానాగా వసూలు చేస్తున్నారు. త్రిబుల్ రైడ్‌కు కేంద్రం వేయి రూపాయిల జరిమానాను విధించగా గుజరాత్ ప్రభుత్వం నూరు రూపాయలను వసూలు చేస్తోంది.ఇదే విధానాన్ని కర్ణాటకలోనూ అమలు చేయాలని సీఎం యడియూరప్ప నిర్ణయించారు. గుజరాత్లో మొదటి సారి సగమే విధించినా రెండోసారి అవే ఉల్లంఘనలకు పాల్పడితే కేంద్రం విధించిన జరిమానాలను వసూలు చేస్తున్నారని కర్ణాటక అధికారుల బృందం చేసిన సర్వేలో తెలింది. ఎలాంటి విధానం అవలంబించాలన్న దానిపై పూర్తి నివేదిక వచ్చాక చర్చించి వారం నుండి తగ్గింపు జరిమానాలను అమలు చేసే అవకాశం ఉంది. జరిమానాల వసూలుపై సీఎం ఆరా రాష్ట్రంలో ఇప్పటివరకు వసూలైన కొత్త జరిమానాల వివరాలను సీఎం యడియూరప్ప అధికారులను అడిగి తెలుసుకున్నారు. 10 రోజుల్లో కోటి రూపాయిల వరకు జరిమానాలు వసూలు చేసిన్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే ఐదు వందలకు మించి వసూలు చేస్తే ప్రజలపై భారం పడటంతో పాటు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని అధికారులు వివరించినట్లు తెలిసింది. చదవండి: ట్రాఫిక్ జరిమానాలు సగానికి తగ్గించారు -
కర్ణాటక ఫోన్‌ట్యాపింగ్‌పై సీబీఐ విచారణ షురూ
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ అంశంపై సీబీఐ విచారణ ప్రారంభించింది. ఈ మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అధికారులు తెలిపారు. మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేసిందంటూ పలువులు రెబెల్ ఎమ్మెల్యేలు ఆరోపించిన సంగతి తెలిసిందే. సంకీర్ణ ప్రభుత్వం కూలి బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కర్ణాటకలోని 300 మందికి పైగా నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఎమ్మెల్యేలు ఆరోపించడంతో యడియూరప్ప ప్రభుత్వం దీనిపై సీబీఐ విచారణ కోరింది. ఇలా ఉండగా, కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్‌ను ఈడీ సుదీర్ఘంగా విచారిస్తోంది. రెండోరోజు రాత్రి 8.30 గంటల తర్వాత కూడా విచారించారు. -
అమాత్యులు కాలేక ఆక్రోశం
సాక్షి, బెంగళూరు: అధికార బీజేపీలో కొత్తగా మంత్రి పదవుల సెగ అలముకొంటోంది. మంత్రివర్గంలో చోటు దక్కని వారు కొందరు బహిరంగంగా ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. మంత్రి పదవి వరించినవారు మంచి శాఖ కావాలని ప్రయత్నాలు సాగిస్తుండగా, అసలు పదవే లేనివారు కినుక వహించారు. అసంతృప్తిని చల్లార్చేందుకు ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప అధిష్టానం సహాయం కోరారు. రెండో విడతలో మంత్రి పదవి ఇస్తే సరి, లేని పక్షంలో ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధహని పలువురు ఎమ్మెల్యేలు సంకేతాలిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కూడా తన సోదరుడు రమేశ్ కత్తికి టికెట్ ఇవ్వలేదని, తాజాగా మంత్రివర్గంలో తనకు చోటు ఇవ్వలేదని సీనియర్ ఎమ్మెల్యే ఉమేశ్‌కత్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అథణి నుంచి పోటీ చేసి ఓడిపోయిన లక్ష్మణ సవదికి మంత్రి పదవి ఎలా కట్టబెడతారని ప్రశ్నించారు. క్రమశిక్షణ చర్యలు తప్పవు మంత్రి పదవులు రాలేదని కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు, బెదిరింపులకూ దిగుతున్నారని పార్టీ నాయకత్వానికి సీఎం యడియూరప్ప ఫిర్యాదు చేశారు. దీంతో సీఎంతో బీజేపీ కార్యాధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్లో మాట్లాడారు. ఎమ్మెల్యేలు బెదిరింపులకు దిగకుండా చూసుకోవాలని, క్రమశిక్షణను పాటించాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటి నుంచి తిరుగుబాటు చేస్తే భవిష్యత్తులో ప్రభుత్వానికి ప్రమాదం ఉంటుందని చెప్పారు. రెండు డజన్ల ఆశావహులు ఈ తరుణంలో రెండోవిడత విస్తరణ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు పెద్ద సవాల్‌గా మారింది. బీజేపీ నుంచి మొత్తం 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా ప్రస్తుతం 20 మంది పైగా ఆశావహులు ఉన్నారు. దీనికి తోడు కాంగ్రెస్ –జేడీఎస్ నుంచి అనర్హతకు గురైన 17 మంది ఎమ్మెల్యేలు కూడా మంత్రి పదవిపై ఆశలు పెంచుకొన్నారు. బీజేపీ సీనియర్లు ఉమేశ్ కత్తి, యత్నాళ్, తిప్పారెడ్డి, గూళిహట్టి శేఖర్, కేజీæ బోపయ్య, అప్ప చ్చు రంజన్, పూర్ణిమ, మురుగేశ్ నిరాణి, శివన గౌడ నాయక్, అభయపాటిల్, దత్తాత్రేయ పాటి ల్, అంగార, బాలచంద్ర జార్కిహోళి, రేణుకాచా ర్య, హాలాడి శ్రీనివాసశెట్టి, విశ్వనాథ్ తదితరులు పదవులు దక్కక గుర్రుగా ఉన్నట్లు సమాచారం. -
ఎట్టకేలకు యడియూరప్ప కేబినెట్
సాక్షి, బెంగళూరు: గత నెల 26వ తేదీన కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి యడియూరప్ప ఎట్టకేలకు మంగళవారం కేబినెట్‌ను ఏర్పాటు చేశారు. సుమారు నెల రోజులపాటు సాగిన తిరుగుబాటు పర్వం తరువాత కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ సర్కారును సాగనంపి బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కడం తెలిసిందే. అనేక కసరత్తుల అనంతరం 17 మంది సభ్యులతో కూడిన మంత్రివర్గం మంగళవారం ఏర్పాటయింది. బెంగళూరులోని రాజ్‌భవన్‌లో గవర్నర్ వజుభాయివాలా వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. 16 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాగా, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే ఉన్నారు. నాటి ముఖ్యమంత్రి, నేటి మంత్రి బీజేపీ విజయంలో కీలక పాత్ర పోషించిన వీరశైవ–లింగాయత్, ఒక్కలిగ, బ్రాహ్మణ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఎక్కువ పదవులు దక్కాయి. 2008లో కర్ణాటక సీఎంగా పనిచేసిన జగదీశ్ శెట్టర్ ఈసారి మంత్రిగా ప్రమాణం చేశారు. రాష్ట్ర చరిత్రలో ఒక మాజీ ముఖ్యమంత్రి మళ్లీ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. మాజీ డిప్యూటీ సీఎంలు కేఎస్ ఈశ్వరప్ప, ఆర్.అశోక కేబినెట్లో ఉన్నారు. మరో 16 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా 17 జిల్లాలకు కేబినెట్లో ప్రాతినిధ్యం దక్కలేదు. -
యడియూరప్ప మంత్రివర్గం ఏర్పాటు
-
యడ్డీ కేబినెట్ ఇదే..
సాక్షి, బెంగళూరు: ప్రతిపక్షాల విమర్శలకు తెరదించుతూ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఎట్టకేలకు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. తన క్యాబినేట్లో మొత్తం 17 మందికి అవకాశం కల్పించారు. వీరంతా మంగళవారం గవర్నర్ వాజూభాయ్ వాలా సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కావస్తున్నా ఇంతవరకు మంత్రివర్గం ఏర్పాటు కాలేదనే విమర్శలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక కసరత్తుల తరువాత మంత్రివర్గం ఏర్పాటు చేస్తానని సోమవారం సీఎం యడియూరప్ప ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి కేంద్రం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. వీరే మంత్రులు.. సోమన్న రవి, బసవరాజు, నివాస్ పుజారి, మధుస్వామి, చిన్నప్పగౌడ, నగేష్, ప్రభు చవాన్, శశికళ, అన్నాసాహెబ్, గోవింద్, అశ్వస్థ నారాయణ్, ఈశ్వరప్ప, అశోక్, జగదీష్ షెట్టర్, శ్రీ రాములు, సురేష్ కుమార్, చంద్రకాంత్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. -
20న మంత్రివర్గ విస్తరణ
సాక్షి, బెంగళూరు: కర్ణాటక కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20న తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు సీఎం యడియూరప్ప. బీజేపీ చీఫ్ అమిత్ షా ఆమోదముద్రతో.. ఆగస్ట్ 20వ తేదీ మధ్యాహ్నం కేబినెట్ విస్తరణ చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య ఆధారంగా మొత్తం 34 మందిని మంత్రులుగా నియమించేందుకు వీలుంది. అయితే యెడ్డీ తన తొలి కేబినెట్లో 13మంది మంత్రులను మాత్రమే తీసుకునే అవకాశముందని బీజేపీ వర్గాలు తెలిపాయి. మిగతా ఖాళీలను త్వరలోనే భర్తీ చేస్తామని వెల్లడించాయి. కర్ణాటక ముఖ్యమంత్రిగా జూలై 26న ప్రమాణస్వీకారం చేశారు బీఎస్ యడియూరప్ప. భారీ వర్షాలు, వరదలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన నేపథ్యంలో కేబినెట్ విస్తరణ ఆలస్యమైంది. -
మంత్రివర్గ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్!
సాక్షి, బెంగళూరు: కొత్త ప్రభుత్వం ఏర్పాటై 20 రోజులు దాటినా మంత్రివర్గం జాడలేదని విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీఎం యడియూరప్ప వచ్చే సోమవారం 18 – 20 మంది తో మంత్రిమండలి ఏర్పాటుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆయన శనివారం ఢిల్లీ యాత్రలో పార్టీ చీఫ్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశమై మంత్రివర్గం ఏర్పాటు గురించి చర్చించనున్నారు. అన్ని వర్గాలకూ పెద్దపీట వేసేలా లింగాయత్ 5, ఒక్కళిగ 4, ఎస్సీ 3, ఎస్టీ 3, కురుబ, బ్రాహ్మణ, బిల్లవ కులాలకు ఒక్కొక్కటి చొప్పున మంత్రిపదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది. బలమైన నేతలకే చాన్స్ మంత్రివర్గంలో ఎవరికి చోటు ఇవ్వాలనే దానిపై ఢిల్లీ నుంచి డైరెక్షన్ చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. వారి ఆదేశాల మేరకు యడియూరప్ప తరచూ జాబితా సవరించి తీసుకెళ్తున్నారు. శని, ఆదివారాల్లో జాబితాను ఖరారు చేసే అవకాశముంది. ప్రతిపక్షంలో కుమారస్వామి, సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వంటి సీనియర్ నేతలు ఉన్నందున వారిని ఢీకొనగలిగే నాయకుకే కేబినెట్లో చోటు దక్కుతుందని సమాచారం. తొలి విడతలో 20 మందికి పోస్టు లు కల్పించినా, ఇంకా 13 ఖాళీగా ఉంటాయి. అనర్హత ఎమ్మెల్యేలకు అవకాశం కోసం వాటిని కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. తొలివిడతలో వీరికేనా? గోవింద కారజోళ, కేఎస్ ఈశ్వరప్ప, ఆర్.అశోక్, జగదీశ్ శెట్టర్, వి.సోమణ్ణ, జేసీ మాధుస్వామి, బి.శ్రీరాములు, ఉమేశ్ కత్తి, డాక్టర్ అశ్వర్థనారా యణ్, శశికళా జొల్లె, రేణుకాచార్య, సీటీ రవి, బాలచంద్ర జార్కిహోళి, శివనేగౌడనాయక్, అంగార, బోపయ్య, కోటా శ్రీనివాసపూజారి, జి.కరుణాకర్‌రెడ్డి తదితరులకు తొలివిడతలో మంత్రులుగా అవకాశం ఇస్తారని సమాచారం. -
కర్ణాటక నూతన స్పీకర్‌గా విశ్వేశ్వర హెగ్డే
సాక్షి, బెంగళూరు: కర్ణాటక నూతన ప్రభుత్వంలో విధానసభ స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విశ్వేశ్వర హెగ్డే కాగేరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి బుధవారం జరగనున్న ఎన్నికలకు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు నామినేషన్లకు గడువు ఉండగా కాగేరి ఒక్కరే నామినేషన్ సమర్పించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, జేడీఎస్‌ల నుంచి ఒక్కరూ కూడా నామినేషన్ వేయలేదు. దీంతో విశ్వేశ్వర హెగ్డే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విశ్వాస పరీక్షలో యడియూరప్ప ప్రభుత్వం విజయం సాధించడంతో కేఆర్ రమేష్ కుమార్ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో విశ్వేశ్వర్‌ను నూతన సభాపతిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎంతో సహా బీజేపీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. అంకోలా నుంచి రాజకీయ ప్రస్థానం 1961 జులై 10న జన్మించిన కాగేరి, న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1994 నుంచి ఉత్తర కన్నడ జిల్లా అంకోలా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాగేరి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పునర్విభజన కారణంతో 2008లో సిర్సి–సిద్ధాపుర నియోజకవర్గం నుంచి తొలిసారిగా, ఆ తరువాత 2013, 2018లో అక్కడి నుంచే ఎన్నికయ్యారు. 2008లో యడియూరప్ప మంత్రిమండలిలో ప్రాథమికోన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి వచ్చిన కాగేరి 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే గతంలో స్పీకర్‌గా పనిచేసిన కే.జీ.బోపయ్యను సోమవారం వరకు అనుకున్నారు. అయితే హఠాత్తుగా మంగళవారం ఉదయం బోపయ్యకు బదులుగా కాగేరిని ఎంపిక చేశారు. పార్టీ అధినేత అమిత్ షా సూచనల ప్రకారమే ఈ మార్పు జరిగిందని బీజేపీ వర్గాలు తెలిపాయి. -
కర్ణాటక స్పీకర్ రాజీనామా
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కే.ఆర్.రమేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. గతకొంత కాలంగా రాష్ట్రంలో సాగుతోన్న రాజకీయ సంక్షోభానికి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన స్పీకర్ సోమవారం తన పదవి నుంచి తప్పుకున్నారు. అసెంబ్లీలో యుడియూరప్ప విశ్వాస పరీక్షలో విజయం సాధించిన విషయం తెలిసిందే. అనంతరం సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లుకు ఆమోదం లభించిన వెంటనే ఆయన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సభలోనే ఆయన రాజీనామా లేఖను సభ్యులందరికీ చదవి వినిపించారు. కాగా స్పీకర్ రాజీనామాకు ఒక్కరోజు ముందు (ఆదివారం) 14 మంది సభ్యులపై అనర్హత వేటు వేస్తూ.. సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసి.. సభా నియమాలను ఉల్లంఘించినందుకు వారిపై వేటు వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. కాగా కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడియూరప్ప ప్రమాణస్వీకారం చేసి అనంతరం.. స్పీకర్‌ను దింపేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ స్పీకర్ కే.ఆర్.రమేశ్ కుమార్ వెంటనే బాధ్యతల నుంచి తప్పుకోవాలని సందేశాన్ని పంపింది. స్వచ్ఛందంగా తప్పుకోకుంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి బలవంతంగా సాగనంపాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సోమవారం సభలో జరిగిన విశ్వాస పరీక్షలో యడియూరప్ప సర్కార్ విజయం సాధించడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో బీజేపీ నూతన స్పీకర్‌ను ఎన్నుకోనుంది. -
14 మంది రెబెల్స్‌పై కొరడా
సాక్షి, బెంగళూరు/పుణే : కర్ణాటకలో రెబెల్ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ ఆదివారం షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 11 మంది, జేడీఎస్‌కు చెందిన ముగ్గురు రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. వీరంతా కర్ణాటక అసెంబ్లీ కాలపరిమితి ముగిసేవరకూ(2023) ఎన్నికల్లో పోటీకి అనర్హులని స్పష్టం చేశారు. తాజా నిర్ణయంతో అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేల సంఖ్య 17కు చేరుకుంది. ఈ నెల 25న ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. రమేశ్ కుమార్ నిర్ణయంతో యడియూరప్ప ప్రభుత్వం సోమవారం విశ్వాసపరీక్షను సులభంగా గట్టెక్కేందుకు అవకాశమేర్పడింది. కాగా, స్పీకర్ నిర్ణయాన్ని కాంగ్రెస్, జేడీఎస్ స్వాగతించగా, ఓ పార్టీ నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే రమేశ్ రెబెల్స్‌పై వేటేశారని బీజేపీ విమర్శించింది. నోటీసులిచ్చినా స్పందించలేదు.. చట్టాన్ని అనుసరించి, మనస్సాక్షి ఆధారంగా తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హతవేటు వేసినట్లు స్పీకర్ రమేశ్ కుమార్ తెలిపారు. ఆదివారం బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ..‘ప్రస్తుత రాజకీయ సంక్షోభం నన్ను తీవ్రమైన డిప్రెషన్లోకి నెట్టేసింది. ఇది నా రాజకీయ జీవితంలో చివరిదశ కావొచ్చు. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో నాపై వచ్చిన విమర్శలు నూటికి నూరుశాతం బాధించాయి. రెబెల్ ఎమ్మెల్యేలు విప్ ఉల్లంఘించినట్లు కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఫిర్యాదు చేశాయి. దీంతో మూడు రోజుల్లోగా నా ముందు హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీచేశాను. వారు స్పందించకపోవడంతో ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఎమ్మెల్యేలు ప్రతాప్‌గౌడ పాటిల్, బీసీ పాటిల్, శివరామ్ హెబ్బర్, ఎస్టీ సోమశేఖర్, జేడీఎస్ ఎమ్మెల్యేలు గోపీనాథ్, ఎ.హెచ్.విశ్వనాథ్, నారాయణ గౌడ, తదితరుల్ని అనర్హులుగా ప్రకటించాను’ అని చెప్పారు. ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే ఎన్.మహేశ్‌పై అనర్హత వేటేయాలని బీఎస్పీ కోరిందనీ, దీనిపైనా నిర్ణయం తీసుకుంటానన్నారు. తనపై బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతుందన్న వార్తలపై స్పందిస్తూ..‘నేనే సభాపతిగా ఉంటా. వాళ్లను(బీజేపీ) రానివ్వండి. నేను రాజీనామా చేయను. నా విధులను బాధ్యతతో నిర్వర్తిస్తాను’ అని తెలిపారు. విశ్వాసపరీక్షతో పాటు ఆర్థికబిల్లుకు ఆమోదం నేపథ్యంలో సోమవారం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మరణంపై స్పీకర్ రమేశ్ భావోద్వేగానికి లోనయ్యారు. ‘జైపాల్ రెడ్డి నాకు పెద్దన్నలాంటివారు. నాకు మార్గదర్శి. మాది 40 ఏళ్ల అనుబంధం ’ అని చెప్పారు. ‘సుప్రీం’లో సవాల్ చేస్తాం: రెబెల్స్ స్పీకర్ రమేశ్ కుమార్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సోమవారం సవాలు చేస్తామని రెబెల్ ఎమ్మెల్యేలు ప్రకటించారు. అనర్హత విషయంలో స్పీకర్ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించారని జేడీఎస్ రెబెల్ ఎమ్మెల్యే ఎ.హెచ్.విశ్వనాథ్ ఆరోపించారు. ఓ వీడియోను విడుదలచేసిన తిరుగుబాటు ఎమ్మెల్యే ప్రతాప్‌గౌడ పాటిల్..అనర్హత వేటుపై సుప్రీంకోర్టుకు వెళతామనీ, న్యాయపోరాటంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అన్ని తెలుసుకునే పదవులకు రాజీనామా చేశామనీ, ఈ విషయాన్ని చట్టపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. స్పీకర్ పక్షపాతంతో వ్యవహరించారని ఎమ్మెల్యే శివరామ్ హెబ్బర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బలాబలాలు కర్ణాటక అసెంబ్లీలో 224 మంది సభ్యులు(స్పీకర్ కాకుండా) ఉన్నారు. స్పీకర్ 17 మందిపై అనర్హతవేటు వేయడంతో అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 207కు చేరుకుంది. అదే సమయంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య 104కు తగ్గింది. ప్రస్తుతం బీజేపీకి 105 మంది బలం ఉండగా, ఓ స్వతంత్ర ఎమ్మెల్యే కూడా మద్దతు ఇస్తున్నారు. ఇక కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి 100 మంది(నామినేటెడ్‌తో కలిపి) ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే బలపరీక్షలో బీజేపీ విజయం సాధించడం నల్లేరుపై నడకేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సోమవారం బలపరీక్ష నేపథ్యంలో అసెంబ్లీకి తప్పనిసరిగా హాజరుకావాలని తమ ఎమ్మెల్యేలకు బీజేపీ విప్ జారీ చేసింది. ఇక మిషన్ మధ్యప్రదేశ్! జైపూర్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ బీజేపీ నేత కైలాశ్ విజయవర్గీయ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయిన నేపథ్యంలో బీజేపీ మధ్యప్రదేశ్‌పై దృష్టిసారించబోతోందన్న వార్తలపై ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యడియూరప్ప కేబినెట్ ఏర్పాటయ్యాక కొత్త మిషన్ ప్రారంభిస్తామని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రభుత్వాలు కూల్చాలన్నది మా ఉద్దేశం కాదు. కానీ మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య అనేక విభేదాలు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత ఎమ్మెల్యేలకే నమ్మకం లేదు. కాంగ్రెస్‌తో పోల్చుకుంటే ప్రధాని మోదీ నాయకత్వం మంచిదని వారంతా భావిస్తున్నారు. అంతర్గత కలహాలు, కుమ్ములాటలతోనే కాంగ్రెస్ ప్రభుత్వాలు కూలిపోతున్నాయి’ అని విజయవర్గీయ అన్నారు. 100% విజయం: యడియూరప్ప సోమవారం జరిగే విశ్వాసపరీక్షలో విజయం సాధిస్తామని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప విశ్వాసం వ్యక్తం చేశారు. ‘సోమవారం అసెంబ్లీలో మెజారిటీని 100 శాతం నిరూపించుకుంటా. ఆర్థిక బిల్లును ఆమోదించకుంటే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేం. కాబట్టి అసెంబ్లీ ప్రారంభంకాగానే విశ్వాసపరీక్షను ముగించి, ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలుపుతాం. కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వం తయారుచేసిన ఆర్థిక బిల్లునే సభలో ప్రవేశపెట్టబోతున్నాం. ఇందులో చిన్న కామా, ఫుల్‌స్టాప్‌ను కూడా మార్చలేదు’ అని అన్నారు. -
కర్ణాటక రాజకీయాల్లో మరో ట్విస్ట్
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేశ్ కుమార్ ఆదివారం అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కుమారస్వామి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 14 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. వీరిలో 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు జేడీ(ఎస్)కు చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. అనర్హత వేటు వేయడం చట్టవిరద్దమని, రేపు సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని జేడీ(ఎస్) రెబల్ ఎమ్మెల్యే విశ్వనాథ్ తెలిపారు. తమపై అనర్హత వేటు వేయడాన్ని చట్ట విరుద్ధంగా భావిస్తున్నానని, అందుకే ఈ విషయమై తాను సుప్రీంను ఆశ్రయిచంనున్నట్లు స్పష్టం చేశారు. స్పీకర్ నిర్ణయం చట్టవిరుద్ధంగా ఉందని, సుప్రీంకోర్టులోనే తమకు న్యాయం జరుగుతుందని మరో రెబల్ ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ ఓ వీడియో విడుదల చేశారు. (చదవండి : కర్ణాటక స్పీకర్ సంచలన నిర్ణయం) కాగా స్పీకర్ తాజా నిర్ణయంతో వేటు పడిన మొత్తం సభ్యుల సంఖ్య 17కి చేరింది(ఇదివరకే ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు వేశారు). మరోవైపు సోమవారం అసెంబ్లీలో బలనిరూపణ ఉంటుందని, సభ్యులంతా దీనికి హాజరుకావాలంటూ స్పీకర్ ఆదేశాలు జారీచేశారు. శుక్రవారం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన యడియూరప్ప.. సోమవారం అసెంబ్లీలో బలనిరూపణ చేయాల్సి ఉన్న విషయం తెలిసిందే. 17 మంది ఎమ్మెల్యేలపై వేటు పడటంతో కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 207కు పడిపోయింది. బల నిరూపణకు కావల్సిన బలం 105. భాజపాకి 105మంది సొంత పార్టీ సభ్యులతో పాటు ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దీంతో రేపు బల పరీక్షలో సీఎం యడియూరప్ప నెగ్గేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. -
కర్ణాటక స్పీకర్ సంచలన నిర్ణయం
సాక్షి, బెంగళూరు: గత కొంతకాలంగా ఉత్కంఠ రాజకీయాలకు వేదికయిన కర్ణాటకలో అసెంబ్లీ స్పీకర్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. కుమారస్వామి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన మొత్తం 14 మంది రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేస్తూ.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇదివరకే ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు వేసిన స్పీకర్.. తాజాగా 13 మంది కాంగ్రెస్, ఓ స్వతంత్ర సభ్యుడిపై అనర్హత వేటు వేశారు. దీంతో వేటు పడిన మొత్తం సభ్యుల సంఖ్య 17కి చేరింది. స్పీకర్ తాజా నిర్ణయం తక్షణమే అమల్లోకి రానుంది.. దీంతో వారంత నాలుగేళ్లపాటు ఎన్నికల్లో పోటీకి దూరం కానున్నారు. మరోవైపు సోమవారం అసెంబ్లీలో బలనిరూపణ ఉంటుందని, సభ్యులంతా దీనికి హాజరుకావాలంటూ స్పీకర్ ఆదేశాలు జారీచేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినా తాను మాత్రం స్పీకర్ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు. శుక్రవారం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన యడియూరప్ప.. సోమవారం అసెంబ్లీలో బలనిరూపణ చేయాల్సి ఉన్న విషయం తెలిసిందే. 17 మంది సభ్యులపై అనర్హత వేట పడడంతో.. సభలో మొత్తం సభ్యుల సంఖ్య 208కి పడిపోయింది. దీంతో మేజిక్ ఫిగర్ 104కి చేరింది. బీజేపీకి ప్రస్తుతం 105 మంది సభ్యులు ఉండగా.. ఓ స్వతంత్ర ఎమ్మెల్యే మద్దతు ప్రకటించారు. దీంతో విశ్వాస పరీక్షలో బీజేపీ సునాయాసంగా నెగ్గే అవకాశం ఉంది. అనర్హత వేటుకు గురయిన ఎమ్మెల్యేలు వీరే.. కాంగ్రెస్ బస్వరాజు మునిరత్నం సోమశేఖర్ రోషన్‌బేగ్ ఆనంద్‌సింగ్ నాగరాజు బీసీ పాటిల్ ప్రతాప్ గౌడ్ సుధాకర్ శివరాం హెబ్బర్ మంత్ పాటిల్ రమేష్ జార్జ్‌హోళి మహేష్ జేడీఎస్ గోపాలయ్య నారాయణ గౌడ్ విశ్వనాథ్ శంకర్(స్వతంత్ర) -
మర్యాదగా తప్పుకోకుంటే అవిశ్వాసమే!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బీఎస్ యడియూరప్ప ప్రమాణస్వీకారం చేసి 24 గంటలు కూడా కాకముందే బీజేపీ జోరుపెంచింది. కాంగ్రెస్ నేత, కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్.రమేశ్ కుమార్ వెంటనే బాధ్యతల నుంచి తప్పుకోవాలని సందేశాన్ని పంపింది. స్వచ్ఛందంగా తప్పుకోకుంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి బలవంతంగా సాగనంపాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు బీజేపీ తరఫు ప్రతినిధి ఒకరు ఈ విషయాన్ని నేరుగా స్పీకర్‌కు చేరవేసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ విషయమై బీజేపీ సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ.. ‘రమేశ్ కుమార్ స్వచ్ఛందంగా తప్పుకోకుంటే ఆయనపై అవిశ్వాసం పెట్టక తప్పదు. అయితే మా తొలిప్రాధాన్యం సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష నెగ్గడం, ఆర్థిక బిల్లుకు ఆమోదం తెలపడమే. ఇది పూర్తయ్యాక స్పీకర్ విషయమై నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు. కాంగ్రెస్–జేడీఎస్ కూటమికి లబ్ధి చేకూర్చేలా స్పీకర్ వ్యవహరించవచ్చన్న అనుమానంతోనే బీజేపీ దూకుడు పెంచినట్లు తెలుస్తోంది. మరోవైపు యడియూరప్ప ప్రభుత్వానికి తాము మద్దతిచ్చే ప్రసక్తే లేదని జేడీఎస్ చీఫ్ దేవెగౌడ చెప్పారు. అనర్హతపై రెబెల్స్ న్యాయపోరాటం.. స్పీకర్ అనర్హతవేటు వేసిన నేపథ్యంలో ముగ్గురు కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు. స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టుతో పాటు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాలని ఎమ్మెల్యేలు రమే శ్ జార్కిహోళి, మహేశ్ కుమటహళ్లి, శంకర్లు నిర్ణయించారు. సుప్రీంలో రమేశ్, మహేశ్‌ల పిటిషన్లు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నందున స్పీకర్ కనీసం నోటీసు ఇవ్వకుండా, తమ వివరణ తీసుకోకుండా అనర్హులను చేయడంపై వీరిద్దరూ అఫిడవిట్లు దాఖలు చేస్తారని సమాచారం. స్వతంత్ర ఎమ్మెల్యే ఆర్.శంకర్‌ను కాంగ్రెస్ సభ్యుడిగా పరిగణిస్తూ స్పీకర్ అనర్హతవేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శంకర్ సోమవారం హైకోర్టును ఆశ్రయిస్తారని తెలుస్తోంది. తాను స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందినందున ఫిరాయింపుల చట్టం కింద వేటువేయడం కుదరదని శంకర్ చెబుతున్నారు. తమిళనాడులో 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినప్పటికీ, 6 నెలల్లోపు జరిగిన ఉపఎన్నికల్లో పోటీచేసేందుకు సుప్రీంకోర్టు, ఈసీ అనుమతించిన విషయా న్ని గుర్తుచేస్తున్నారు. కాబట్టి అసెంబ్లీ ముగిసేవరకూ (2023) అనర్హత వేటేస్తూ స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వులు కోర్టులో నిలబడవని స్పష్టం చేస్తున్నారు. -
‘రాజకీయం’లో అందరూ దొంగలేనా!
సాక్షి, న్యూఢిల్లీ : ‘మేము 12 మందిని మంత్రులను చేస్తాం. ఆరు నుంచి ఎనిమిది మందికి చైర్మన్ పదవులు ఇస్తాం. ఎవరికైతే మంత్రి పదవులు ఇస్తామో, వారు తిరిగి ఎన్నికల్లో గెలిచేందుకు సహకరిస్తాం. అందుకు ప్రతి ఒక్కరికి పదేసి కోట్ల రూపాయలు ఇస్తాం. రేపు సాయంత్రం వరకల్లా 12, 14 మంది ఎమ్మెల్యేలు మన వెంట ఉంటారు’ అన్న మాటలు కర్ణాటక రాజకీయాలకు సంబంధించినవంటే వెంటనే ఈ మాటలు ఎవరన్నదో కూడా మనకు స్ఫురించక తప్పదు. గత ఫిబ్రవరి నెలలో ఓ జనతాదళ్ (సెక్యులర్) పార్టీ ఎమ్మెల్యే కుమారుడితో మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్ప ఫోన్లో మాట్లాడిన విషయాలు అంటూ నాడు ఓ ఆడియో టేప్ వెలుగులోకి వచ్చింది. ఇదంతా అబద్ధమని నాడు యెడియూరప్ప ఈ టేపును తీవ్రంగా ఖండించారు. ఇది ఎవరో తనపై పన్నిన కుట్ర తప్పించి, ప్రభుత్వాన్ని పడగొట్టాలనే కుట్ర, కుతంత్రం తనకు లేనే లేదని వాదించారు. నీతి నియమాలకు కట్టుబడిన పార్టీ బీజేపీ అని కూడా చెప్పారు. ఐదు నెలల తర్వాత జరిగిన పరిణామాలను గమనిస్తే నాటి ఆయన ఆడియో టేపు మాటలు నేడు అక్షరాల నిజమనిపించక తప్పదు. జేడీఎస్–కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, వారిలో పది మంది ఎమ్మెల్యేలు బీజేపీ రాజ్యసభ సభ్యుడు రమేశ్‌కు చెందిన ఓ ముంబై హోటల్లో మకాం పెట్టడం, హెచ్డీ కుమారస్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, అది వీగిపోవడం, ఆయన స్థానంలో యెడియూరప్ప కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడం తదితర పరిణామాలు రాజకీయ నాటకంలో రసవత్తర సన్నివేశాలని తెల్సినవే. కుమారస్వామి తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నిందంటూ పదే పదే ఆరోపణలు చేసినా, 20, 25, 30 కోట్ల రూపాయలకు కూడా ఇస్తామంటూ బీజేపీ నేతలు ఆశ పెడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య సభాముఖంగా ఆరోపణలు చేసినా బీజేపీ శాసన సభ్యులు మౌనం వహించడంలో మర్మమేమి ? బీజేపీ జాతీయ నాయకులు, కేంద్ర కమిటీ సభ్యులకు 1800 కోట్ల రూపాయలకు పైగా పంచినట్లు తెలియజేస్తున్న యెడియూరప్ప డైరీ ఆదాయం పన్ను శాఖ చేతికి చిక్కిందంటూ ‘ది కారవాన్’ పత్రిక (మార్చి 22న) ఓ వార్తను ప్రచురించడం, 2008, మే నెలలో యెడ్యూరప్ప తన ప్రభుత్వం సుస్థిరత కోసం కాంగ్రెస్ నుంచి నలుగురు, జేడీఎస్ నుంచి ముగ్గురు శాసన సభ్యులను కొనుగోలు చేయడం, దాన్ని మీడియా ‘ఆపరేషన్ కమలా’గా అభివర్ణించడం తదితర పరిణామాలు దేన్ని సూచిస్తున్నాయి? ఎమ్మెల్యేల బేరసారాలతో ప్రభుత్వాలను పడగొట్టడం కొత్త ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం లేదా ఉన్న ప్రభుత్వాలను బలోపేతం చేసుకోవడం ఒక్క కర్ణాటకకు, ఒక్క గోవాకే పరిమితం కాలేదు. అనేక రాష్ట్రాల్లో అనేక పార్టీలు ఇలా అడుసు తొక్కాయనే విషయం మనకు తెల్సిందే. అయితే దేశంలో నల్లడబ్బును వెలికి తీస్తామని, అవినీతి అంతు చూస్తామని, ఆదర్శ ప్రభుత్వాన్ని అందిస్తామని, తమది భిన్నమైన పార్టీ అంటూ చెప్పుకుంటూ వచ్చిన కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ నాయకులు నేడేమయ్యారన్నదే ప్రశ్న. గోవాలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిపోవడం, వారిలో ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడం తెల్సిందే. గోవా అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడైన చంద్రకాంత్ కావ్లేకర్ను ‘మట్కా’ కింగని దూషించిన బీజేపీ నాయకులు, ఆయనపై సమగ్ర దర్యాప్తు జరపాల్సిందిగా కూడా అధికారులను కోరారు. అలాంటి వ్యక్తిని పార్టీలో కలుపుకోవడమే కాకుండా డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టడంలో అర్థం ఏమిటీ? బీజేపీలోకి తీసుకున్న గోవా మాజీ కాంగ్రెస్ నాయకుడు అతనాసియో మాన్సేర్రాట్ (బాబుష్)పై భూ ఆక్రమణ కేసులే కాకుండా ‘మైనర్ బాలికపై అత్యాచారం’ కేసులో కూడా విచారణ జరుగుతోంది. ‘సేవ్ గోవా ఫ్రమ్ బాబుష్’ అన్నది బీజేపీ గత ఎన్నికల నినాదం. ఈ రాజకీయ శక్తుల నుంచి ‘సేవ్ భారత్’ అన్న నినాదం ప్రజల నుంచి ఎప్పుడు వినిపిస్తుందో..! (చదవండి: బీజేపీకి కుమారస్వామి మద్దతు!) -
బీజేపీకి కుమారస్వామి మద్దతు!
సాక్షి, బెంగళూరు: రాజకీయ సంక్షోభంలో ఉన్న కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. తదుపరి బలపరీక్షపై వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో యడియూరప్ప చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాల్సి ఉంది. ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హతతో కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 221 (స్పీకర్‌ను మినహాయించి)కి చేరుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 112 అయింది. బీజేపీకి ప్రస్తుతం 106 మంది సభ్యుల (బీజేపీ 105, ఓ స్వతంత్ర ఎమ్మె ల్యే) బలముంది. ఈ నేపథ్యంలో మిగిలిన ఆరుగురిని బీజేపీ ఎలా సంపాదిస్తుందన్నది ఇప్పు డు ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో జేడీఎస్ సభ్యుల మద్దతును కోరతారా అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు శుక్రవారం రాత్రి జేడీఎస్ ఎమ్మెల్యేలు ఓ హోటల్లో సమావేశం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ముఖ్యంగా రెండు ప్రతిపాదనలు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం మాజీ మంత్రి జీవీ దేవెగౌడ ఈ వివరాలను వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వానికి మద్దతునిచ్చి ప్రభుత్వంలో భాగస్వామి కావడమా? లేక ప్రజల్లో ఉంటూ యడియూరప్పపై పోరాటం చేయడమా? అనే అంశాలపై చర్చ జరిగినట్లు తెలిపారు. అయితే ఈ భేటీలో పలువురు ఎమ్మెల్యేలు బీజేపీకి బయటినుంచి మద్దతు ఇచ్చేందుకు సుముకంగా ఉన్నారని వెల్లడించారు. తనతో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యే మద్దతుకు సిద్ధంగా ఉన్నామని.. దీనిపై కుమారస్వామి తుది నిర్ణయం తీసుకోవల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో కుమారస్వామి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్‌తో జేడీఎస్ చెలిమిని కొనసాగిస్తుందా? బీజేపీకి పరోక్షంగా మద్దతు తెలుపుతుందా? కాంగ్రెస్‌తో చెలిమికి గుడ్‌బై చెప్పి, బీజేపీ ప్రభుత్వంపై ఒంటరిగానే పోరాటం చేస్తుందా? అనే అంశాలు ఆసక్తిగా మారాయి. మరోవైపు బీజేపీ కూడా జేడీఎస్ సభ్యుల మద్దతు కోరడంపై ఆలోచనలు చేస్తున్నట్ల తెలిసింది. వారితోపాటు రెబల్స్‌ను కూడా తమవైపునకు తిప్పుకునేందుక ప్రయత్నలను ముమ్మరం చేస్తోంది కమళ దళం. ఈ నేపథ్యంలో సోమవారం జరిగే విశ్వాస పరీక్షపై ఉత్కంఠ రోజురోజుకూ పెరుగుతోంది. -
కర్ణాటక సీఎంగా యెడియూరప్ప
సాక్షి, బెంగళూరు : రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్, మాజీ సీఎం యెడియూరప్ప శుక్రవారం ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. పార్టీ శ్రేణులు వెంటరాగా ర్యాలీగా రాజ్‌భవన్‌కు చేరుకున్న యెడియూరప్ప చేత.. గవర్నర్ వాజూభాయ్ వాలా ప్రమాణ స్వీకారం చేయించారు. తద్వారా ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే బీజేపీ బలనిరూపణ చేసుకున్న తర్వాతే మంత్రివర్గ కూర్పు జరుగనుంది. ప్రస్తుతం బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు ఉండగా కాంగ్రెస్- జేడీఎస్ కూటమికి 99 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న సంగతి తెలిసిందే. ఇక ప్రమాణ స్వీకారోత్సవానికి కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు, కాంగ్రెస్ అసంతృప్త నేత రోషన్ బేగ్ తదితరులు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ కార్యక్రమాన్ని బహిష్కరించింది. ఇక ప్రమాణస్వీకారం నేపథ్యంలో జ్యోతిష్కుడి సలహా మేరకు యడ్యూరప్ప తన పేరును యెడియూరప్పగా మార్చుకున్న విషయం తెలిసిందే. ఇక 2007లో మొదటిసారి, 2008లో రెండోసారి, 2018లో మూడోసారి, ఇప్పుడు నాలుగోసారి యడ్యూరప్ప ప్రమాణస్వీకారం చేశారు. అయితే, గతంలో మూడుసార్లు ఆయన పూర్తికాలం పదవిలో కొనసాగలేకపోయారు. మరోవైపు ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆర్.శంకర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రమేష్ జార్జ్‌హోళి, మహేష్... 2023 వరకూ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేశారు. 2023 వరకు వారు పోటీ చేయడానికి కూడా వారిని అనర్హులుగా ప్రకటించారు. -
పేరు మార్చిన యడ్డీ.. మరి రాత మారుతుందా?
సాక్షి, బెంగళూరు: ఆటలో అచ్చిరావడంలేదని ఆటగాళ్లు, సినిమాళ్లో కలిసి రావడంలేదని సినీ నటులు పేర్లు మార్చుకోవడం సహజంగా చూస్తూఉంటాం. తాజాగా రాజకీయాల్లో తనకు అదృష్టం కలిసిరావడం లేదని భావించిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తన పేరును మార్చుకున్నారు. నేడు సాయంత్రం ఆయన సీఎంగా ప్రమాణం చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జ్యోతిష్కుడి సలహా మేరకు ఆయన పేరు మార్చుకున్నారు. ఇప్పటివరకు ఆయన పేరు (BS Yaddyurappa) అని ఉండగా.. తాజాగా యడియూరప్ప (BS Yadiyurappa)గా మార్చుకున్నారు. 2007లో తొలిసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టినప్పుడు ఆయన పేరులో మార్పులు చేసుకున్నారు. యడియూరప్ప(BS Yediyurappa)ను యడ్యూరప్ప( BS Yeddyurappa)గా మార్చుకున్నారు. రాజకీయంగా ఆ సమయంలో కాస్త గడ్డుకాలాన్ని ఎదుర్కోవడంతో జ్యోతిష్కుడి సలహా ప్రకారం పేరులో అక్షరాలను మార్పు చేసుకున్నారు. కానీ ఆ ఫార్ములా వర్కవుట్ కాలేదని భావించిన యడ్డీ.. తాజాగా మళ్లీ పేరులో మార్పు చేశారు. అందుకే శుక్రవారం గవర్నర్ వాజుభాయ్ వాలాకిచ్చిన లేఖలో తన పేరును తిరిగి యడియూరప్ప(Yediyurappa) అనే పేర్కొన్నారు. కొత్తపేరు తనను రాజకీయంగా ముందుకు తీసుకెళ్తుందని యడ్డీ గట్టిగా నమ్ముతున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సీఎంగా ప్రమాణం చేస్తుండగా.. ఈనెల 31న ఆయన బలపరీక్షను ఎదుర్కొనున్నారు. యడ్యూరప్ప ఇప్పటి వరకు మూడుసార్లు సీఎంగా ఎన్నిక కాగా.. ఒక్కసారి కూడా పూర్తికాలం పదవిలో కొనసాలేకపోయారు. ఆరోజు ప్రమాణం చేస్తే ఆయన నాలుగోసారిగా ఆ పదవీ బాధ్యతలు చేపట్టినట్లు అవుతుంది. మరి ఈసారైనా ఆయనకి అదృష్టం కలిసివస్తుందో లేదో వేచి చూడాలి. -
యడ్యూరప్ప బల పరీక్షకు డెడ్‌లైన్ ఫిక్స్
సాక్షి, బెంగళూరు: రాజకీయ సంక్షోభంలో ఉన్న కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ సిద్ధమయింది. ఈరోజు సాయంత్రం ఆరుగంటలకు రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్పీకారం చేయనున్నారు. దీనికి గవర్నర్, కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. అయితే సీఎంగా యడ్యూరప్ప ప్రమాణం చేసిన అనంతరం అసెంబ్లీలో బల నిరూపణ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న రాజకీయ సంక్షోభం కారణంగా విశ్వాస నిరూపణకు గవర్నర్ అనూహ్యాంగా వారికి ఏడు రోజుల సమయం ఇచ్చారు. జూలై 31న శాసనసభలో యడ్యూరప్ప బల పరీక్షను ఎదుర్కోనున్నారు. గవర్నర్ వారికి ఏడు రోజుల సమయం కేటాయించడంపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శాసనసభను బీజేపీ ఓ ప్రయోగశాలగా మార్చిందని మండిపడింది. రాజ్యాంగంలో ఏ అధికారణ ప్రకారం గవర్నర్ మెజార్టీకి తక్కువగా ఉన్న పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని ప్రశ్నించింది. ఈచర్య సిగ్గుచేటని ఘటుగా స్పందించింది. ఈ మేరకు పార్టీ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసింది. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్‌ను పావుగా ఉపయోగించుకుంటోందని విమర్శించింది. గతంలోలా అసెంబ్లీలో బలం సరిపోక మరోసారి యడ్యూరప్ప రాజీనామా చేయక తప్పదని కాంగ్రెస్ జోస్యం చెప్పింది. మరోవైపు యడ్యూరప్ప విశ్వాసపరీక్షపై బీజేపీ నేతలు ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టారు. రెబల్ ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకునేందుకు కేంద్ర నాయకత్వం ఆపార్టీ నేతలను రంగంలోకి దింపింది. కాంగ్రెస్ కూడా మరోసారి రెబల్స్‌ను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తోంది. ఇదిలావుండగా రెబల్స్‌పై స్పీకర్ తీసుకునే నిర్ణయం ఉత్కంఠగా మారింది. ఇదివరకే ముగ్గురు సభ్యులపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. -
సీఎంగా నేడు యడ్యూరప్ప ప్రమాణం!
సాక్షి, బెంగళూరు: అనేక ఉత్కంఠ పరిణమాల అనంతరం కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ నాయకత్వం అడుగులు వేస్తోంది. శుక్రవారం ఉదయం రాజ్‌భవన్‌లో ఆ రాష్ట్ర గవర్నర్‌తో బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో గవర్నర్ దానికి సానుకూలంగా స్పందించారని, ఆరోజు సాయంత్రం 6గంటలకు కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప ప్రమాణ స్పీకారం చేస్తారని సమాచారం. గవర్నర్‌తో భేటీ అనంతరం యడ్యూరప్ప మాట్లాడుతూ.. రాష్ట్రంలో నూతన ప్రభుత్వాన్ని బీజేపీ ఏర్పాటు చేయనుందని తెలిపారు. ఈరోజు సాయంత్రం 6 గంటలకు సీఎంగా తాను ప్రమాణం చేస్తానని యడ్డీ స్పష్టం చేశారు. ఇదిలావుండగా కాంగ్రెస్–జేడీఎస్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన 17 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ కె.ఆర్.రమేశ్ కుమార్ అనర్హత వేటు వేయడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలైన రమేశ్ జార్కిహోళి, మహేశ్ కుమటల్లి, శంకర్‌లపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేసినట్లు స్పీకర్ తెలిపారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా రాజీనామాలు ఇవ్వలేదనీ, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్(ఫిరాయింపుల నిరోధక చట్టం)ను ఉల్లంఘించారని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజా పరిస్థితిపై ఆచితూచి అడుగులు వేస్తోన్న బీజేపీ కేంద్రనాయకత్వం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవల్సిందిగా యడ్డీకి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు మిగిలిన రెబల్స్‌పై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని ఆసక్తిగా మారింది. -
కర్ణాటక నూతన సీఎంగా యడ్యూరప్ప!
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మరికాసేట్లో బీజేపీ శాసనసభ పక్షనేత, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప గవర్నర్‌ను కలవనున్నారు. ప్రస్తుతం బీజేపీకి 105 మంది సభ్యులున్న విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా యడ్యూరప్ప గవర్నర్‌ను కోరే అవకాశం ఉంది. కాగా అసెంబ్లీలో బలపరీక్ష అనంతరం సభలోనే బీజేపీ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ.. తర్వాతి ప్రభుత్వం తమదేనని సంకేతమినిచ్చారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. యడ్యూరప్ప మరోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. బల పరీక్షలో కుమారస్వామి ఓటమి అనంతరం.. యడ్యూరప్ప స్పందించారు. ఇది కర్ణాటక ప్రజల విజయమన్నారు. కన్నడ ప్రజలను అభివృద్ధి పథం వైపు నడిపిస్తామని అన్నారు. రాష్ట్రానికి పట్టిన శని వదిలిందని, 105 మంది సభ్యులతో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. జేడీఎస్- కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారని చెప్పుకొచ్చారు. సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మరోవైపు ప్రభుత్వం కూలిపోవడంతో తన ముఖ్యమంత్రి పదవికి కుమారస్వామి రాజీనామా చేశారు. విశ్వాస పరీక్ష అనంతరం గవర్నర్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అయితే రెబల్ ఎమ్మెల్యేలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇంకా తేలాల్సిఉంది. -
కర్నాటకం; అసెంబ్లీలోనే భోజనం, నిద్ర
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. కుమారస్వామి సర్కారు ఈరోజు బలపరీక్ష ఎదుర్కొనుంది. శానససభలో గురవారమే బలనిరూపణ ఉంటుందని భావించినా శుక్రవారానికి వాయిదా పడింది. తక్షణమే బలపరీక్ష నిర్వహించాలంటూ బీజేపీ నాయకులు రాత్రంతా నిరసన కొనసాగించారు. అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత కూడా బీఎస్ యడ్యూరప్ప, బీజేపీ ఎమ్మెల్యేలు విధానసౌధలోనే భోజనాలు చేసి, అక్కడే నిద్రపోయాయి. కొంత మంది శాసనసభ్యులు ఉదయమే లేచి అసెంబ్లీ ప్రాంగణంలోనే మార్నింగ్ వాక్ చేశారు. వెంటనే బలపరీక్ష నిర్వహించేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని బీజేపీ భావిస్తున్నట్టు సమాచారం. కాగా, ముంబైలోని ఆసుపత్రిలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీమంత్ పాటిల్ స్టేట్మెంట్ను నమోదు చేసేందుకు బెంగళూరు పోలీసులు ముంబైకు వెళ్లారు. (చదవండి: కర్నాటకం క్లైమాక్స్ నేడే) -
అవిశ్వాస తీర్మానికి మేం రె‘ఢీ’: యడ్యూరప్ప
సాక్షి, బెంగళూరు: కర్నాటకం రసవత్తరంగా సాగుతోంది. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ఇచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప స్పష్టంచేశారు. సోమవారం వరకు చూసి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ఆయన ప్రకటించారు. రమదా రిసార్ట్‌లో బీజేపీ ఎమ్మెల్యేలతో లంచ్ భేటీ తర్వాత యడ్యూరప్ప మీడియాతో మాట్లాడారు. సోమవారం వరకూ వేచిచూస్తామని.. రెబల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. స్పీకర్ వెంటనే బలపరీక్షకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. మళ్లీ రిసార్టు రాజకీయాలు.. విశ్వాసపరీక్షకు రంగం సిద్ధమైన వేళ.. కర్ణాటకలో మళ్లీ రిసార్టు రాజకీయాలకు తెరలేచింది. కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీ తమ ఎమ్మెల్యేలను వేర్వేరు రిసార్టులకు తరలించాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యశవంతపురలోని తాజ్వివాంత హోటల్లో, క్లార్స్ ఎక్సోటికా కన్వెన్షన్ రిసార్ట్స్‌లో క్యాంప్ చేస్తున్నారు. జేడీఎస్ ఎమ్మెల్యేలు గత నాలుగు రోజులుగా దేవనహళ్లి సమీపంలోని ఓ రిసార్టులో మకాం వేశారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలకు కూడా అక్కడినుంచి వచ్చి తిరిగి అక్కడికే వెళ్లిపోయారు. సీఎం కుమారస్వామి విశ్వాసపరీక్షకు సిద్ధం అనగానే, బీజేపీ కూడా అప్రమత్తమైంది. తక్షణమే తన ఎమ్మెల్యేలను క్యాంప్‌కి తరలించింది. రాజానుకుంటె సమీపంలోని రమదా రిసార్టులో బీజేపీ శాసనసభ్యులు బస చేస్తున్నారు. ఇక్కడ వీరి కోసం 30 గదులు బుక్‌చేసినట్టు సమాచారం. సుప్రీంకోర్టు తీర్పు వెలువడేవరకు తమ పార్టీ సభ్యులంతా ఒక్క చోట ఉండాలని రిసార్టులో ఉంచినట్టు మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. తీర్థయాత్రలో రెబెల్ ఎమ్మెల్యేలు ఇక ముంబైలో క్యాంప్ చేసిన కాంగ్రెస్-జేడీఎస్ రెబల్ ఎమ్మెల్యేలు ఆలయాలను దర్శించుకుంటున్నారు. బీసీ పాటిల్, శివరామ్ హెబ్బార్, బసవరాజ్, సోమశేఖర్ నిన్న ముంబైలోని ప్రసిద్ధి సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. ఇవాళ అసంతృప్త ఎమ్మెల్యేలంతా ప్రత్యేక విమానంలో షిర్డీ వెళ్లారు. సాయిబాబాను దర్శించుకుని అక్కడి నుంచి శనిసింగనాపూర్ వెళ్లారు. విప్ జారీచేసినప్పటికీ అసమ్మతి ఎమ్మెల్యేలు శుక్రవారం అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టారు. -
కుమారస్వామి రాజీనామా చేస్తారా?
సాక్షి బెంగళూరు: సంకీర్ణ ప్రభుత్వం డోలాయమానంలో పడడంతో రాష గవర్నర్ వజూభాయ్‌వాలా తదుపరి ఏం చేస్తారనే దానిపై అందరి దృష్టి మళ్లింది. ఆపరేషన్ పక్కాగా నిర్వహిస్తున్న యడ్యూరప్ప, ఇతర బీజేపీ కేంద్రమంత్రులు, సీనియర్లు దీనిపై నోరు మెదపడం లేదు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ రద్దయి మధ్యంతర ఎన్నికలు వస్తాయా? లేక రాష్ట్రపతి పాలన తప్పదా? అనేది సస్పెన్స్‌గా మారింది. సీఎం కుమారస్వామి బెంగళూరుకు రాగానే ఏం చేస్తారనేది తెలుస్తుంది. చదవండి: కన్నడ సంక్షోభం సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి జరుగుతున్న అసమ్మతి ఒక్కసారిగా తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యేల నుంచి రాజీనామాలు లేఖలు అందుకున్న గవర్నర్ వజూభాయ్‌వాలా ఏం నిర్ణయం తీసుకోబోతున్నారనేది అనేది కీలకంగా మారింది. సంకీర్ణ సర్కారును బలం నిరూపించుకోమంటారా?, అతిపెద్ద పార్టీ అయిన బీజేపీకి అవకాశమిస్తారా? అనేదానిపై రాజకీయ పండితు లు సైతం ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు. కేంద్ర హోంశాఖతో ఆయన ఎప్పటికప్పుడు సంప్రదింపుల్లో ఉన్నారు. నైతికంగా బాధ్యత వహించి ఈ నేపథ్యంలో సీఎం కుమారస్వామి రాజీనామా చేస్తారా? లేక కొనసాగుతారా? అనేది చర్చనీయంగా మారింది. మాకు సంబంధం లేదు: యడ్డి కాంగ్రెస్ – జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాతో తనకు ఎలాంటి సంబంధం లేదని యడ్యూరప్ప స్పష్టం చేశారు. గవర్నర్‌ను కలవనని, స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. అంతేకానీ ప్రభుత్వ ఏర్పాటుకు ఇప్పటి వరకు ఎలాంటి కసరత్తు చేయలేదన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో గందరగోళం కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటు పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభాపతి కార్యాలయానికి మంత్రి డీకే శివకుమార్ వెళ్లి ఒక ఎమ్మెల్యే రాజీనామా పత్రం చింపివేయడాన్ని ప్రజలు చూస్తున్నారని అన్నారు. యడ్యూరప్పే సీఎం : డీవీఎస్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తే యడ్యూర ప్ప సీఎంగా బీజేపీ సర్కారును ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రమంత్రి డీవీ సదానందగౌడ తెలిపారు. అసమ్మతి నేపథ్యంలో నైతిక బాధ్యతగా కుమారస్వామి సీఎం పదవికి రాజీనామా చేయాలని కోరారు. కాంగ్రెస్ మంతనాలు కాంగ్రెస్ ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ సమక్షంలో జరిగిన సమావేశంలో మాజీ సీఎం సిద్ధరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఈక్రమంలో మంత్రులు కృష్ణభైరేగౌడ, యూటీ ఖాదర్, కేజే జార్జి, దేశపాండే, డీకే శివకుమార్‌తో రాజీనామా చేయించి వారి స్థానంలో అసంతృప్తులకు మంత్రి పదవులు కట్టబెట్టాలని తీర్మానించినట్లు సమాచారం. అయితే మంత్రులు రాజీనామా చేస్తారా? దీంతో సద్దుమణుగుతుందా? అనేది తేలాల్సి ఉంది. కాగా, దీనంతటికీ కారణం సిద్ధరామయ్యేనని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజీనామా చేసిన వారిలో సిద్ధరామయ్య అనుచరులుగా పేరుపొందిన వారు ఎక్కువ మంది ఉండటం విశేషం. -
కర్ణాటక సంక్షోభం.. నాకు ఆదేశాలు అందాయి: యెడ్డీ
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టవద్దంటూ తనకు ఢిల్లీ పెద్దల నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయని కర్ణాటక బీజేపీ కీలక నేత బీఎస్ యడ్యూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఎలాంటి ప్రయత్నాల్లో భాగం కావొద్దని బీజేపీ అధిష్టాన పెద్దలు తనకు సూచించారని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన అనంతరం ఆయన బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. ‘ఢిల్లీ నుంచి తిరిగొచ్చాను. రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టే ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని మా నేతలు నాకు సూచించారు’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరికొంతకాలం వేచిచూస్తామని, కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో ఏదైనా జరగవచ్చునని, ఏదిఏమైనా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టే, పడగొట్టే చర్యలకు పాల్పడవద్దని మాకు స్పష్టంగా సూచనలు అందాయని తెలిపారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్-జేడీఎస్ దిగ్గజాలు ఓటమిపాలవుతారని, దీంతో ఆ రెండు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలుతుందని, ఆ రెండు పార్టీల అంతర్గత కుమ్ములాటలు తీవ్రస్థాయికి చేరుకుంటాయని బీఎస్ యడ్యూరప్ప పేర్కొన్నారు. ఆయన పేర్కొన్నట్టుగానే జేడీఎస్ సుప్రీం దేవెగౌడ, ఆయన మనవడు నిఖిల్ గౌడ సహా పలువురు సీనియర్ నేతలు లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. దీంతో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ తమ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా.. పొలిటికల్ మైలేజ్ కోసం సిద్దరామయ్యనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ వద్దకు పంపిస్తున్నారని యడ్యూరప్ప విమర్శిస్తున్నారు. -
శోభక్కా, గాజులు పంపించు: శివకుమార్
సాక్షి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్ష నేతలు సై అంటే సై అంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకురాలు శోభ కరంద్లాజే వ్యాఖ్యలపై నీటిపారుదలశాఖ మంత్రి డీకే శివకుమార్ ఆక్రోశం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు చేతుల గాజులు వేసుకోవాలని చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఖండిస్తూనే గాజులను పంపితే తాము వేసుకోవటానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అయన నిన్న కుందగోళలో విలేకర్లతో మాట్లాడారు. కుందగోళను దత్తతకు తీసుకోవాలని నిర్ణయించినట్లు మంత్రి వివరించారు. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ప్రజలు ఆశించిన దానికంటే అధికంగా అభివృద్ధి చేస్తామన్నారు. శోభా చేసిన గాజుల వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ శోభక్క ఎప్పుడు పంపుతుందోనని తాను ఎదురు చూస్తున్నాన్నారు. సిద్ధరామయ్య రేవణ్ణపై ట్విట్టర్లో చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. 23 తర్వాత ‘సంకీర్ణం’ పతనం రాష్ట్రంలో ప్రభుత్వం బదిలీ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.. లోక్‌సభ ఫలితాల అనంతరం కర్ణాటకలోని కాంగ్రెస్ – జేడీఎస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని ప్రతిపక్ష నేత బీఎస్ యడ్యూరప్ప జోస్యం చెప్పారు. గురువారం ఆయన హుబ్బళి విమానాశ్రమంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ – జేడీఎస్ మధ్య సమన్వయ లోపమే సంకీర్ణ ప్రభుత్వానికి కారణం అవుతుందని చెప్పారు. గత 2018 విధానసభ ఎన్నికల్లో 104 స్థానాలు సాధించిన బీజేపీ ప్రతిపక్షంలో ఉండగా.. కేవలం 37 సీట్లు సాధించిన జేడీఎస్ సీఎం కుర్చీ ఎక్కడం ఏంటని ప్రశ్నించారు. అలాగే రెండోస్థానంలో నిలిచిన కాంగ్రెస్ డిప్యూటీ సీఎం పీఠంపై ఉండటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా? అన్నారు. కాంగ్రెస్‌కు నైతిక విలువలు లేవని మండిపడ్డారు. కాగా బీజేపీకి ప్రస్తుతం ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిపి 106 మంది సభ్యుల బలం ఉందన్నారు. ప్రస్తుతం చించోళి, కుందగోళలో కూడా బీజేపీ గెలిచే అవకాశం ఉందని.. అనంతరం బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 108కు చేరుతుందన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్‌లోని అసంతృప్త ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని.. ఫలితంగా 23వ తేదీ తర్వాత సంకీర్ణ ప్రభుత్వం పతనం దిశగా అడుగులు వేయడం ఖాయమన్నారు. అయితే బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందా? అన్ని విలేకరుల ప్రశ్నకు బీఎస్ యడ్యూరప్ప స్పందించారు. తమకు సంపూర్ణ బలం ఉన్ననాడే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. ఏ పార్టీతోనూ కుమ్మక్కయ్యే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. అయితే లోక్‌సభ ఫలితాల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం మారడం మాత్రం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
యడ్యూరప్పకు కోపం వచ్చింది!!
గుల్బర్గా: కర్ణాటక బీజేపీ చీఫ్ బీఎస్ యడ్యూరప్ప విలేకరుల సమావేశంలో సహనం కోల్పోయి.. ఓ విలేకరిపై చిందులు తొక్కారు. గత ఐదేళ్లలో కేంద్రంలోని బీజేపీ సర్కారు పనితీరుపై ఓ విలేకరి పలుమార్లు ప్రశ్నించడంతో ఆయనపై యడ్యూరప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. గుల్బర్గాలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ విలేకరి.. గడిచిన ఐదేళ్లలో నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలేమిటి? ఇచ్చిన హామీలను ఏమేరకు నెరవేర్చిందని యడ్యూరప్పను ప్రశ్నించారు. దీంతో భవిష్యత్తులో అన్ని హామీలు నెరవేరుస్తామని ఆయన చెప్పుకొచ్చారు. అయినా, విలేకరి మళ్లీ అదే ప్రశ్న అడుగడంతో యడ్యూరప్పకు కోపం వచ్చింది. ‘విను.. ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో హామీలు నెరవేరుస్తాం. మేం అన్ని హామీలు నెరవేర్చామని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఐదేళ్లలో హామీలు అమలుచేస్తామని నేను చెప్పలేదు. నేను చెప్పానా?.. ఎందుకు చేయలేదని నువ్వు అడిగితే.. ఏం చెప్తాం. భవిష్యత్తులో చేస్తాం. కేవలం ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ప్రతిదీ చేయలేం. కొన్ని పరిమితులు ఉంటాయి. దయచేసి.. వాదించకు. ప్రతిదీ చేశామని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఇంకా ఎంతో చేయాల్సి ఉంది. దేశమంతటా చేయాల్సిన పని మొదలైంది. ఇక్కడ కూడా చేసేందుకు మేం ప్రయత్నిస్తాం. మేం ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత మాపై ఉంది’ అని యడ్యూరప్ప ఆగ్రహంగా చెప్పుకొచ్చారు. మరిన్ని ఉద్యోగాలు కల్పించాలని, మరింత అభివృద్ధి చేయాలని ప్రధాని మోదీని, ఎంపీలను తాను కోరతానని ఆయన పేర్కొన్నారు. -
‘ఐఏఎఫ్ దాడుల్లో కుట్ర ఉందేమో’
బెంగళూరు/ఇండోర్: పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతికి ప్రతీకారంగా పాక్ భూభాగంలోని ఉగ్ర శిబిరాలపై ఐఏఎఫ్ జరిపిన దాడుల్లో కుట్ర కోణం ఉందేమోనని కర్ణాటక మంత్రి ఒకరు అనుమానం వ్యక్తం చేశారు. ‘44 మందికి 22 సీట్లు అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప చేసిన ప్రకటనతో ప్రజల్లో అనుమానాలున్నాయి. సైనికుల త్యాగాలను వాడుకుని కర్ణాటకలోని 22 సీట్లు గెలుచుకోవచ్చని ఆ పార్టీ భావిస్తోంది’అని మంత్రి ప్రియాంక్ ఖర్గే అన్నారు. పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై ఐఏఎఫ్ జరిపిన దాడితో ప్రధాని మోదీ ఆదరణ పెరిగిపోయిందనీ, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 28 లోక్‌సభ సీట్లలో 22 తమ పార్టీనే గెలుచుకుంటుందంటూ యడ్యూరప్ప ప్రకటన చేశారు. దీంతో బీజేపీపై ఆరోపణలు వెల్లువెత్తాయి. -
సర్జికల్ దాడులు బీజేపీకి లాభం
యశవంతపుర : సరిహద్దు వెంట పాక్ భూభాగంలోని జైషే ఉగ్రస్థావరాలపై భారత్ చేసిన సర్జికల్ దాడులు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూరుస్తాయని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప అన్నారు. సర్జికల్ దాడుల కారణంగా కర్ణాటకలో కనీసం 22 సీట్లను గెలుచుకోగలుగుతామని యడ్యూరప్ప చేసి న వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. బుధవారం చిత్రదుర్గంలో జరిగిన బీజేపీ సమావేశంలో మీడియాతో ఆయన మాట్లాడారు. దాడులు బీజేపీకి లా భం చేకూరుస్తాయన్న వ్యాఖ్యలు ప్రచారం కావడంతో రాష్ట్ర సీఎం కుమారస్వామి, సీఎల్పీ నేత సిద్ధరామయ్య తదితరులు యడ్యూరప్పపై మండిపడ్డారు. బీజేపీ నాయకు ల నిజస్వరూపం బయటపడిందని కుమారస్వామి విమర్శించారు. యడ్యూరప్ప మాటల వీడియోను ట్విట్టర్లో సిద్ధరామయ్య పోస్ట్ చేశారు. సర్జికల్ దాడులపై అనుమానంగా ఉందని వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో యడ్యూరప్ప గురువారం స్పందించారు. ఉగ్రవాదులపై దాడులను రాజకీయాలకు ఉపయోగించుకోవడం తన అభిమతం కాదని వివరణ ఇచ్చారు. -
సర్జికల్ స్ట్రైక్స్-2: మేం 22 సీట్లు గెలుస్తాం!
బెంగళూరు: పాకిస్థాన్ బాలకోట్‌లోని జైషే మహహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై భారత్ జరిపిన వైమానిక మెరుపు దాడులతో దేశంలో పరిస్థితి ఒక్కసారిగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అనుకూలంగా మారిపోయిందట. ఈ మెరుపు దాడుల దెబ్బతో కర్ణాటకలోని 28 స్థానాల్లో 22 స్థానాల్లో బీజేపీ గెలువబోతోందని ఆ పార్టీ కర్ణాటక చీఫ్ యడ్యూరప్ప చెప్పుకొచ్చారు. ‘రోజురోజుకు వాతావరణం.. గాలి బీజేపీకి పెద్ద ఎత్తున అనుకూలంగా మారిపోతోంది. నిన్న పాకిస్థాన్‌లోకి ప్రవేశించి.. అక్కడి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంతో దేశంలో మోదీ అనుకూల వాతావరణం ఏర్పడింది. ఈ ప్రభావం రానున్న లోక్‌సభ ఎన్నికల్లో చూడవచ్చు’ అని ఆయన బుధవారం పేర్కొన్నారు. మెరుపు దాడులు యువతలో ఉత్సాహాన్ని నింపాయని, దీని కారణంగా కర్ణాటకలో 22 స్థానాలు గెలువబోతున్నామని ఆయన చెప్పారు. కర్ణాటకలో బీజేపీకి ప్రస్తుతం 16 లోక్‌సభ సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పది సీట్లు, జేడీఎస్ రెండు సీట్లు సాధించింది. రాష్ట్ర ప్రభుత్వంలో సంకీర్ణ భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ ఈసారి కలిసి ఎన్నికలకు వెళుతామని ప్రకటించాయి. సీట్ల పంపకాల్లో భాగంగా జేడీఎస్ 10 నుంచి 12 సీట్లు కోరుతుండగా... కాంగ్రెస్ మాత్రం అన్ని సీట్లు ఇచ్చేందుకు సిద్ధపడటం లేదని తెలుస్తోంది. -
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర అక్రమాలు..!
సాక్షి, బెంగళూరు : ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్రస్థాయిలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప లేఖ రాశారు. విజయపూర్ జిల్లాలోని ఓ షెడ్డులో పెద్ద ఎత్తున ఓటర్ వెరీఫయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ) యంత్రాలు లభించడంతో ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ‘కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛాయుత పారదర్శక వాతావరణంలో జరిగాయన్న ఎన్నికల సంఘం వ్యాఖ్యలు ఉత్త డొల్లేనని ఈ ఘటన నిరూపిస్తోంది’ అని యడ్యూరప్ప ఈసీ ప్రధాన అధికారి ఓపీ రావత్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడంతో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే, తగినంత సాధారణ మెజారిటీ లేకపోవడంతో ఆయన విశ్వాసపరీక్షకు ముందే రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వీవీపీఏటీ యంత్రాలు ఓ షెడ్డులో దొరకడం కలకలం రేపుతోంది. అయితే, వీవీపీఏటీ నిజమైన యంత్రాలు కాదని, ఆ యంత్రాలను తీసుకెళ్లే బాక్సులు మాత్రమే షెడ్డులో దొరికాయని కర్ణాటక ఎన్నికల సంఘం ప్రధానాధికారి సంజీవ్ కుమార్ తెలిపారు. వీవీపీఏటీ యంత్రాల్లో సిక్స్ డిజిట్ బార్ కోడ్ ఉంటుందని, అందులో ఒక ఇంగ్లిష్ అక్షరం, ఐదు అంకెలు ఉంటాయని, ఇవి ఎక్కడ ఉన్నా కంప్యూటర్‌తో గుర్తించవచ్చునని ఆయన తెలిపారు. షెడ్డులో దొరికిన యంత్రాల్లో సిక్స్ డిజిట్ బార్ కోడ్ లేదని స్పష్టం చేశారు. -
దేవుని సాక్షిగా
అధికార పక్షం, విపక్షం, కొద్దిసేపట్లో ఎవరు అటు ఇటు అవుతారో తెలియని ఉత్కంఠ, అధికారం నిలుపుకోవాలని ఒకరు, చేజిక్కించుకోవాలని మరొకరి ఆరాటం. అందరి మనసుల్లోనూ ఒకటే కలవరం, ఈ పరిస్థితుల్లో కర్ణాటక అసెంబ్లీ శనివారం తొలిసారిగా కొలువు తీరింది. నూతన సభ్యులు దేవుని సాక్షిగా, రైతుల సాక్షిగా, ఒకరిద్దరు సత్యం సాక్షిగా ప్రమాణం గావించారు. సాక్షి, బెంగళూరు: ఎన్నో నాటకీయ పరిణామాల నేపథ్యంలో శనివారం కొత్త ఎమ్మెల్యేలతో శాసనసభ సమావేశం అయింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ ఎంతో ఉద్వేగంగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. శనివారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ప్రారంభమైంది. కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు సమయానికే అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ ప్రారంభమైన 10 నిమిషాలకు హెచ్డీ కుమారస్వామి నేతృత్వంలో జేడీఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష„ý స్థానంలో, బీజేపీ ఎమ్మెల్యే అధికారపక్షం వైపు కూర్చొన్నారు. సభలో హెచ్డీ రేవణ్ణ మాట్లాడుతూ ఐదుగురు చొప్పున ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతించాలని ప్రొటెం స్పీకర్‌ను కోరగా, ఆ మేరకు అనుమతించారు. మధ్యాహ్నం కల్లా ప్రధాన నేతలు సిద్ధరామయ్య, పరమేశ్వర్, జమీర్ అహ్మద్ తదితరులు ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. ఎమ్మెల్యేలు ఆనంద్‌సింగ్, సోమశేఖర్‌రెడ్డి, ప్రతాప్గౌడలు మధ్యాహ్నం వరకు శాసనసభకు హాజరు కాలేదు. మధ్యాహ్నం ఒంటి గంటలోపల చాలా మంది ఎమ్మెల్యేలు ప్రమాణం పూర్తి చేశారు. మీడియా గ్యాలరీలో కూర్చొని జాతీయ నేతలు అనంత్‌కుమార్, శోభ, గులాంనబీ ఆజాద్, మునియప్ప తదితరులు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాన్ని వీక్షించారు. ఎమ్మెల్యేలందరూ దేవుడు, రైతుల సాక్షిగా ప్రమాణం చేశారు. మధ్యాహ్నం 1.30 గంటలకల్లా దాదాపు 195 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం పూర్తి చేశారు. అనంతరం తాత్కాలిక స్పీకర్ గోపయ్య సభను మధ్యాహ్నం 3.30 గంటలకు వాయిదా వేశారు. ఇక మధ్యాహ్నం వరకు కూడా ఆనంద్‌సింగ్, ప్రతాప్ గౌడ ఆచూకీ లభించకపోవడంతో వారు అసెంబ్లీకి వస్తారా లేదా అనే అనుమానం అందరిలో వ్యక్తమయింది. గత బడ్జెట్ సమావేశాల అనంతరం అసెంబ్లీ సమావేశమవడంతో ఎమ్మెల్యేలందరితో శాసనసభ కళకళలాడింది. ఎమ్మెల్యేల ముఖాల్లో ఉత్సాహంతో పాటు ఉద్విగ్నత కూడా కనిపించింది. యడ్యూరప్ప బలపరీక్షలో నెగ్గుతారా?, ఓడిపోతారా?అనే సందిగ్ధం అందరిలోనూ వ్యక్తమైంది. యడ్యూరప్ప దేవునిపై, సిద్ధరామయ్య సత్యంపై సభ ప్రారంభమైన కొద్దిసేపటికి ‘ముఖ్యమంత్రి’ యడ్యూరప్ప మొదటగా ఎమ్మెల్యేగా.. దేవుని పేరిట ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత సిద్ధరామయ్య సత్యప్రమాణంగా ప్రమాణ స్వీకారం గావించారు. కొత్త ఎమ్మెల్యేలతో విధానసభ కార్యదర్శి ఎస్.మూర్తి ప్రమాణం చేయించారు. సాయంత్రం నాలుగు గంటలకు బలనిరూపణ పరీక్ష ముగించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంతో మధ్యాహ్నం 03.30గంటలకు 221 మంది ఎమ్మెల్యేలు చకచకా ప్రమాణం చేశారు. కనిపించకుండా పోయి కాంగ్రెస్‌ను కలవరపెట్టిన ఎమ్మెల్యేలు ఆనంద్‌సింగ్, ప్రతాప్‌గౌడ పాటిల్‌లు సభ ప్రారంభమవడానికి అర్ధగంట ముందు విధానసౌధలో ప్రత్యక్షమవడంతో హమ్మయ్య అనుకున్నారు. కుమార, డీకే ఒకేసారి జేడీఎస్ నుంచి కుమారస్వామి, కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత డీకే శివకుమార్‌లు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయగా, అందరూ ఆసక్తిగా గమనించారు. గత మూడు రోజులుగా తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో వీరిద్దరూ కీలకపాత్ర పోషించారు. డీకే శివకుమార్ పేరిట ప్రమాణం అసెంబ్లీలో అందరూ దైవం, సత్యం, రైతుల సాక్షిగా ప్రమాణం చేస్తే ఒక్క ఎమ్మెల్యే మాత్రం కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ పేరు మీద ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కుణిగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ రంగనాథ్. డీకేకు అత్యంత ఆప్తునిగా పేరు పొందిన రంగనాథ్ ఆయన పేరు మీద ప్రమాణం చేయడంతో అందరు ఆసక్తిగా చూశారు. మొదటి సారి ఎన్నికల్లో గెలుపొందిన కేజీఎఫ్ ఎమ్మెల్యే రూపా శశిధర్ ఎవరి పేరు మీద ప్రమాణం చేయాలో తెలియక కాసేపు సందిగ్ధంలో పడ్డారు. -
ఏ నిమిషానికి ఏమౌనో
సాక్షి, బెంగళూరు: బలనిరూపణ సందర్భంగా శనివారం విధానసౌధలోని అధికార, ప్రతిపక్షాల శిబిరాల్లో ఎటు చూసినా చర్చోపచర్చలే దర్శనమిచ్చాయి. ఎమ్మెల్యేలు గుంపులు గుంపులుగా చేరి చెవులు కొరుక్కోవడంలో బిజీ అయ్యారు. 15వ విధానసభ సమావేశాల్లో మొదటిరోజు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయా పార్టీల ఎమ్మేల్యేలు తమ శిబిరాల్లో బలనిరూపణపై ఆసక్తిగా చర్చించుకున్నారు. తమ ఎమ్మెల్యేలందరూ సభకు హాజరు కావడంతో కాంగ్రెస్–జేడీఎస్ శిబిరంలో ఉత్సాహం నెలకొంది, పథకాలు పారలేదని బీజేపీ ఎమ్మెల్యేల మోములు వాడిపోయాయి. పరీక్షలో తమదే విజయమంటూ బీజేపీ నేతలు శనివారం ఉదయం కూడా ధీమా వ్యక్తం చేయడంతో అటు కాంగ్రెస్–జేడీఎస్ శిబిరంలో కొంత ఆందోళన మొదలైంది. అద్భుతమేమీ జరగదని తెలిసి బీజేపీ శిబిరంలో నైరాశ్యత నెలకొంది. ఒకవేళ కాంగ్రెస్–జేడీఎస్‌ల సంకీర్ణ ప్రభుత్వం వచ్చినా ఎన్ని రోజులు ఉంటుందోనంటూ నేతలు చర్చించుకున్న సన్నివేశాలు కూడా దర్శనమిచ్చాయి. ఓటింగ్ జరిగే సమయానికి బీజేపీ తమ ఎమ్మెల్యేలను లాక్కోవడానికి ప్రయత్నిస్తోందనే భయంతో కాంగ్రెస్ నేతలు భోజనాలు కూడా చేయకుండా తమ ఎమ్మేల్యేలను రక్షించుకునే పనిలో పడ్డారు. బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప, కేంద్రమంత్రులు అనంత్‌కుమార్, సదానందగౌడ, బీజేపీ నేత మురళీధరరావులు విధానసౌధలోని తమ శిబిరంలోను భుజించగా జేడీఎస్ ఎమ్మేల్యేలు తాము బసచేసిన హోటళ్లకు వెళ్లారు. -
ఎమ్మెల్యేలకు యడ్డి ఆఫర్?
సాక్షి, బెంగళూరు: ముఖ్యమంత్రి యడ్యూరప్ప కాంగ్రెస్ ఎమ్మెల్యే బీసీ పాటిల్‌కు మంత్రి పదవి ఆశ చూపించి ప్రలోభాలకు గురి చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఆడియో టేపు విడుదల చేసింది. కొచ్చికి వెళ్లవద్దని, తనపై నమ్మకం లేదా అంటూ యడ్యూరప్ప అందులో మాట్లాడారు. బీజేపీకి మద్దతిస్తే తనకొచ్చే లాభం ఏమిటని పాటిల్ ప్రశ్నిస్తూ, తనతో పాటు మరో ముగ్గురు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వారిని కూడా తీసుకు రమ్మని యడ్యూరప్ప కోరారు. కాంగ్రెస్ నుంచి బయటకు వస్తే మంత్రి పదవి ఇస్తానని, ఒక్కసారి కొచ్చికి వెళితే తిరిగి రావడం కుదరదని యడ్యూరప్ప చెబుతారు. మంత్రి పదవితో పాటు ఏ సహాయం కావాలన్నా చేసి పెడతామని హామీ ఇచ్చారు. యడ్యురప్ప కుమారుడు విజయేంద్ర కూడా తమ ఎమ్మెల్యేకు రూ. 5 కోట్లు డబ్బు, మంత్రి పదవి ఆశ చూపించారని కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు విజయేంద్ర మాట్లాడినట్లుగా ఉన్న ఆడియో టేపులను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.