
సాక్షి, బెంగళూరు: కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప గురువారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం రాష్ట్రంలో కీలక మార్పులు చేశారు. కాంగ్రెస్, జేడీఎస్ శిబిరాల వద్ద పోలీస్ బందోబస్తును తొలగించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న ఈగల్‌టన్ రిసార్ట్ వద్ద బందోబస్తును ఎత్తివేశారు. దీంతో కాంగ్రెస్ శిబిరం వద్ద స్థానిక కార్యకర్తలు రక్షణగా ఉన్నారు. అలాగే జేడీఎస్ ఎమ్మెల్యేలు ఉన్న శాంగ్రిలా హోటల్ వద్ద కూడా బందోబస్తును ఎత్తివేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు, జేడీఎస్ ఎమ్మెల్యేలను కొచ్చికి తరలించే యోచనలో యడ్యూరప్ప ఉన్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే బీఎస్ యడ్యూరప్ప పలువురు పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీగా అమర్‌కుమార్ పాండేను నియమించారు. ఇంటెలిజెన్స్ డిప్యూటీ ఐజీగా సందీప్ పాటిల్‌ను నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment