సాక్షి, బెంగళూరు : కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా బీఎస్ యడ్యూరప్ప గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో అంగరంగ వైభవంగా జరిగిన ప్రమాణస్వీకారోత్సవంలో యడ్యూరప్పతో గవర్నర్ వజుభాయ్ వాలా ప్రమాణం చేయించారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప పగ్గాలు చేపట్టడం ఇది మూడోసారి. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు జేపీ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్, ప్రకాశ్ జవదేకర్‌తోపాటు పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. యెడ్డీ ప్రమాణం అనంతరం బీజేపీ కార్యకర్తలు శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై.. మోదీ, మోదీ అంటూ నినాదాలు చేశారు.
తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104 స్థానాలను సాధించి.. అతిపెద్ద పార్టీగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, మెజారిటీకి ఆ పార్టీ 8 స్థానాల దూరంలో నిలిచింది. ఈ క్రమంలో జేడీఎస్-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చినప్పటికీ... గవర్నర్ వజుభాయ్ వాలా మాత్రం మొదట యడ్యూరప్పకు అవకాశం ఇచ్చారు. అసెంబ్లీలో బలనిరూపణ చేసుకునేందుకు యడ్యూరప్ప గవర్నర్ 15 రోజుల సమయం ఇచ్చారు. సుప్రీంకోర్టులో సైతం యడ్యూరప్ప ప్రమాణస్వీకారానికి లైన్‌క్లియర్ అయింది. అయితే, యడ్యూరప్పకు మెజారిటీ ఎమ్మెల్యేల బలం లేకపోయినప్పటికీ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేసి.. గవర్నర్ ఆయనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారని కాంగ్రెస్, జేడీఎస్ ఆరోపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment