టిక్‌టాక్ వీడియోలో పవిత్ర
సాక్షి, బొమ్మనహళ్లి: బెళగావి జిల్లాలోని రాయదుర్గ తాలూకాలోని నరసాపుర గ్రామానికి చెందిన శేఖవ్వ అనే మహిళకు రెండి కిడ్నీలు దెబ్బతినడంతో భర్త ఒక కిడ్నీ దానం చేయగా ఆమెకు అమర్చారు. జనవరిలో ఆపరేషన్ జరగ్గా, ఇంట్లో ఔషధాలు వాడుతూ విశ్రాంతి తీసుకుంటోంది. 20 రోజుల నుంచి లాక్‌డౌన్ వల్ల ఆమెకు కావాలసిన మందులు దొరకడం లేదు.
ఫలితంగా రోజురోజుకూ నీరసించి ఆరోగ్యం విషమిస్తోంది. దీంతో కూతురు పవిత్ర తన తల్లి బాధను వివరిస్తూ టిక్‌టాక్ వీడియో చేసింది. దీంతో సీఎం యడియూరప్ప సూచన మేరకు జిల్లా అధికారులు శనివారం ఆమె ఇంటికి వెళ్లి నెల రోజులకు సరిపడా మందులను అందజేశారు. ఏదైనా సమస్య ఉంటే తెలియజేయాలని సూచించారు. చదవండి: లాక్‌డౌన్: అయ్యా..బాబూ.. ఆదుకోండయ్యా!
Comments
Please login to add a commentAdd a comment