
సాక్షి, బెంగళూరు: గతంలో కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అనర్హత వేటుకు గురైన కాంగ్రెస్– జేడీఎస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలతో తమకు ఎలాంటి సంబంధం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప అన్నారు. సొంత రాజకీయ భవిష్యత్తు కోసం ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి అనర్హత వేటుకు గురయ్యారన్నారు. అనర్హత ఎమ్మెల్యేలు బీజేపీ సర్కారు ఏర్పడడానికి కృషి చేశారని, ఉప ఎన్నికల్లో వారికే టికెట్లు ఇస్తామని యడియూరప్ప చెబుతున్న ఆడియో, వీడియోలు వైరల్ అయిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.