mlas suspension
-
కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
సిమ్లా: రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి బీజేపీ అభ్యర్థి గెలుపునకు కారకులైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరుగురిపై హిమాచల్ ప్రదేశ్ శాసనసభ స్పీకర్ కుల్దీప్ సింగ్ పథాలియా అనర్హత వేటు వేశారు. వారిని ఎమ్మెల్యేలుగా అనర్హులుగా ప్రకటించారు. ఈ వివరాలను స్పీకర్ గురువారం మీడియా సమావేశంలో చెప్పారు. ‘‘బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభకు తప్పకుండా హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ విప్ జారీచేసింది. అయినా సరే ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు ఆ రోజు అసెంబ్లీకి రాలేదు. బడ్జెట్‌పై ఓటింగ్‌లో పాల్గొనలేదు. పార్టీ విప్‌ను ఉల్లంఘించారు. అందుకే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వీరిని అనర్హులుగా ప్రకటించాలని పార్లమెంటరీ వ్యవహారాల రాష్ట్ర మంత్రి హర్షవర్ధన్ ఇచి్చన ఫిర్యాదు మేరకు వీరిని అనర్హులుగా ప్రకటిస్తున్నా. రాజ్యసభలో క్రాస్ ఓటింగ్ ఘటనతో ఈ అనర్హతకు ఎలాంటి సంబంధం లేదు’ అని స్పీకర్ పథాలియా చెప్పారు. అనర్హులైన వారిలో రాజీందర్ రాణా, సు«దీర్శర్మ, ఇందర్ దత్ లఖాన్‌పూర్, దేవీందర్ కుమార్ భుట్టో, రవి ఠాకూర్, చేతన్య శర్మ ఉన్నారు. ఇరువైపుల వాదనలు విన్న స్పీకర్ బుధవారం తన తీర్పును రిజర్వ్‌చేసి గురువారం వెల్లడించారు. కాగా, స్పీకర్ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానని అనర్హతకు గురైన ఒక ఎమ్మెల్యే రాజీందర్ రాణా చెప్పారు. రెబల్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాక అసెంబ్లీలో ప్రస్తుత సభ్యుల మొత్తం సంఖ్య 68 నుంచి 62కు తగ్గింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం 40 నుంచి 34కు దిగి వచ్చింది. పార్టీ ఫిరాయింపుల చట్టం ద్వారా హిమాచల్‌లో ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
కేసీఆర్ సైగలతో సభ నడుపుతారా?
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ సైగలతో శాసనసభను నడపడం దుర్మార్గమని, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన వ్యవహారశైలి మార్చుకోవాలని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. సోమవారం గాంధీభవన్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్క, నేతలు కోదండరెడ్డి, అనిల్ యాదవ్‌లతో కలిసి రేవంత్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ విద్యార్థులను, అమరులను అవమానించిందని.. అమరుల కుటుంబాలకు అణా పైసా కేటాయించలేదని విమర్శించారు. నిరుద్యోగులకు రూ.3,016 భృతి ఇస్తామని గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని.. అది ఏమైందని రేవంత్ నిలదీశారు. సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకుంటే రూ.5 లక్షలు ఇస్తామన్న టీఆర్ఎస్ సర్కారు.. దాన్ని రూ.3 లక్షలకు కుదించిందని మండిపడ్డారు. శాసనమండలి రెండు, మూడు రోజులే నడపడం అన్యాయమని పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ బడ్జెట్ ప్రసంగం సమయంలో నిరసనలు తెలిపిన సభ్యుల మీద చర్యలు తీసుకున్న సందర్భాలు లేవని.. కానీ ఇప్పుడు స్పీకర్ తీరు దారుణమని వ్యాఖ్యానించారు. ఒక పార్టీ సభ్యులందరినీ సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం సిగ్గుచేటని, దాన్ని కాంగ్రెస్ ఖండిస్తోందని స్పష్టం చేశారు. నిరసన తెలపడం ప్రజాస్వామిక హక్కు అని, నిరసనలతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్న విషయం గుర్తులేదా అన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ సభ్యుల పట్ల కూడా స్పీకర్ తీరు సరిగా లేదని.. దీనిపై మంగళవారం గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని రేవంత్ తెలిపారు. స్పీకర్ వైఖరికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో అంబేద్కర్ విగ్రహాల దగ్గర నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని ఆందోళన వ్యక్తం చేస్తామని ప్రకటించారు. కాగా అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని.. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పక్షనేత పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే స్పీకర్ కన్నెత్తి చూడకపోవడం అవమానకరమని, దళితుడిని సీఎల్పీ లీడర్‌గా సహించలేకపోతున్నారని విమర్శించారు. అలాగే రాష్ట్రం రాజుల చెరలో ఉన్నట్టుగా.. సభాపతి బంట్రోతుగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే సీతక్క వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగం ఉంటే సభ్యులు ప్రజాసమస్యలను ప్రస్తావించే అవకాశం ఉండేదని స్పష్టం చేశారు. చట్టసభా.. టీఆర్ఎస్ పార్టీ ఆఫీసా?: భట్టి విక్రమార్క అప్రజాస్వామికంగా, నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీ నడుస్తోందని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే స్పీకర్ కనీసం పట్టించుకోలేదని.. ఇలా ఏకపక్షంగా వ్యవహరించడం దారుణమని వ్యాఖ్యానించారు. ‘‘ఇది చట్టసభనా? లేక టీఆర్ఎస్ పార్టీ ఆఫీసా? ప్రతిపక్ష సభ్యులను తీవ్రంగా అవమానిస్తున్నారు. సభా సంప్రదాయం ఉండదా..? మేం కూడా సభ నడిపించామంటూ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తితే స్పీకర్ పట్టించుకోలేదు. ప్రజా సమస్యలను లేవనెత్తకుండా గొంతు నొక్కుతున్నారు. కనీస విధానాలు తెలియని సభాపతిని చూసి సిగ్గుపడాల్సి వస్తోంది. ఇది మీ ఇల్లు కాదు. మేం కూడా ప్రజల నుంచి గెలిచి వచ్చాం. ప్రజా సమస్యలను ప్రస్తావించి తీరుతాం. స్పీకర్ తీరుపై రాష్ట్రపతికి లేఖ రాస్తాం’’అని స్పష్టం చేశారు. -
ఇది ప్రజాస్వామ్యాన్ని బతికించే చారిత్రక నిర్ణయం
సాక్షి, ముంబై: అసెంబ్లీ సమావేశాల సమయంలో ఓబీసీ రిజర్వేషన్‌పై గందరగోళం సృష్టించినందుకు వేటుపడిన 12 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ తీర్పుతో బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ స్వాగతించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని బతికించే ఒక చారిత్రాత్మక నిర్ణయమని ఆయన ట్వీట్ చేశారు. అంతేగాకుండా పక్షపాతం లేకుండా తీర్పునిచ్చినందుకు సుప్రీంకోర్టుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే సస్పెన్షన్ రద్దయినందుకు 12 బీజేపీ ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపారు. అసలేం జరిగింది.. 2021లో జరిగిన వర్షాకాల అసెంబ్లీ సమావేశంలో ఓబీసీ రిజర్వేషన్‌పై చర్చ జరుగుతుండగా బీజేపీ ఎమ్మెల్యేలు రిజర్వేషన్‌కు అనుకూలంగా గళం విప్పారు. ఓబీసీ రిజర్వేషన్ కల్పించాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో అధికార, ప్రతిపక్షం మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అదే సమయంలో అధికార మహావికాస్ ఆఘాడికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సభలో విపక్ష సభ్యులపై తీవ్రంగా స్పందించారు. ఆ సమయంలో స్పీకర్ సీటులో కూర్చున్న భాస్కర్ జాదవ్‌ను బీజేపీ ఎమ్మెల్యేలు దూషించారని, ఆయనపై దాడిచేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలపై సంవత్సరకాలం పాటు సస్పెండ్ వేటు పడింది. అప్పటినుంచి ఈ ఎమ్మెల్యేలు అసెంబ్లీ భవనం మెట్లు ఎక్కలేదు. బీజేపీ శాసనసభ్యులు స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చదవండి: (ఒక సెషన్‌కు మించి సస్పెన్షన్) మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్టబద్ధంగా లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఒక ఎమ్మెల్యేను 60 రోజులకంటే ఎక్కువ సస్పెండ్ చేయడమంటే, ఒక విధంగా ఎమ్మెల్యే పదవి రద్దు చేయడంతో సమానమని కోర్టు పేర్కొంది. ఎలాంటి నియోజకవర్గమైనా ఆరు నెలలకంటే ఎక్కువ కాలం ప్రజాప్రతినిధి లేకుండా ఉండరాదు. దీంతో సంవత్సర కాలంపాటు సస్పెండ్ వేటు వేయడం తప్పని పేర్కొంటూ 12 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్ వేటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అధికార బలంతో విపక్షాలను అణచివేయాలని ప్రయత్నించిన ప్రభుత్వానికి ఈ తీర్పు చెంపపెట్టని విపక్షాలు వ్యాఖ్యానించాయి. సుప్రీంకోర్టు పెత్తనం తగదు: రావుత్ అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై శివసేన ఎంపీ సంజయ్ రావుత్ శుక్రవారం ఓ మీడియా చానెల్‌తో మాట్లాడుతూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు విధాన్ సభ అధికారాలను ఆక్రమించుకుందని, పాలనా వ్యవస్థలో న్యాయవ్యవస్థ జోక్యం సరికాదని వ్యాఖ్యానించారు. గతంలో రాజ్యసభలో మా పార్టీకి చెందిన కొందరు ఎంపీలు సస్పెండ్‌కు గురయ్యారు. ఆ సమయంలో సుప్రీం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. గవర్నర్ ద్వారా నామినేట్ అయ్యే 12 మంది ఎమ్మెల్యేల జాబితాకు ఇంతవరకు క్లియరెన్స్ ఇవ్వక పోవడంతో గత రెండు సంవత్సరాల నుంచి వారు వేచి చూస్తున్నారు. ఆ ఫైల్ ఇంతవరకు గవర్నర్ వద్దే పడి ఉందని, ఇప్పటికీ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయారని పేర్కొన్నారు. నిర్ణయం తీసుకునే అధికారం గవర్నర్‌కే ఉన్నప్పటికీ దీనిపై సుప్రీంకోర్టు ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని రావుత్ ప్రశ్నించారు. రిజర్వేషన్ చర్చ సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు సభలో గందరగోళం సృష్టించారు. స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లి నానా రభస చేశారు. సభా నియమాలు ఉల్లంఘించడమేకాకుండా, కార్యకలాపాలు సాగకుండా అడ్డుకున్నారు. అందువల్లే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవల్సి వచ్చిందన్నారు. కానీ సు ప్రీంకోర్టు తీర్పు సభా నియమాలపై ఆధిపత్యంగా భా విస్తున్నామన్నారు. చట్టసభల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న సుప్రీంకోర్టు గవర్నర్ వద్దనన్న మా 12 మంది ఎమ్మెల్యేల ఫైల్ విషయంలో ఎందుకు స్పం దించడం లేదని, జోక్యం చేసుకుని ఎందుకు క్లియరెన్స్ ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. -
మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
ముంబై: బీజేపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను ఏడాదిపాటు సభ నుంచి బహిష్కరిస్తూ మహారాష్ట్ర అసెంబ్లీలో సోమవారం తీర్మానాన్ని ఆమోదిం చింది. వారు స్పీకర్ చాంబర్లో ప్రిసైడింగ్ అధికారి భాస్కర్ జాదవ్‌తో అనుచితంగా ప్రవర్తించారని ప్రభుత్వం ఆరోపించింది. ఆ 12 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ సభా వ్యవహారాల మంత్రి అనిల్ పరబ్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. సస్పెన్షన్ అమల్లో ఉన్నంతకాలం 12 మంది ఎమ్మెల్యేలు ముంబై, నాగపూర్‌లోని రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణాల్లోకి అడుగు పెట్టడానికి వీల్లేదని అనిల్ పరబ్ స్పష్టం చేశారు. అయితే, ప్రభుత్వ ఆరోపణలను ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ ఖండించారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తమ సభ్యులను సస్పెండ్ చేయడం కాదు, సభా వ్యవహారాలను తామే బహిష్కరిస్తామని చెప్పారు. స్థానిక సంస్థల్లో ఓబీసీ కోటా అమలు విషయంలో ప్రభుత్వ నిర్వాకాన్ని తాము బయ టపెడుతు న్నామని, అందుకే సభలో ప్రతిపక్ష బలాన్ని తగ్గించేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ప్రిసైడింగ్ అధికారి భాస్కర్ జాదవ్‌ను బీజేపీ ఎమ్మెల్యేలు దూషించలేదన్నారు. అధికార శివసేన ఎమ్మెల్యేలే ఆయన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఫడ్నవిస్ చెప్పారు. భాస్కర్ జాదవ్ ఘటనపై సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీ అట్టుడికింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో నాలుగు సార్లు సభ వాయిదా పడింది. -
సభ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
సాక్షి, అమరావతి : పరిపాలనా వికేంద్రీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా టీడీపీ శాసన సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగానికి అడుగడుగునా అడ్డు తగిలారు. దీంతో సీఎం జగన్ సందేశం ప్రజలకు చేరకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్న టీడీపీ ఎమ్మెల్యేలపై శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని వాపోయారు. వారిని సస్పెండ్ చేయాలని స్పీకర్‌కు విఙ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుగ్గన ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించిన స్పీకర్ తమ్మినేని సీతారాం సభా నియమాలు ఉల్లంఘించిన పలువురు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, కరణం బలరాం, బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి భవాని, చిన రాజప్ప, వాసుపల్లి గణేష్, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, వెంకట్‌రెడ్డి నాయుడు, జోగేశ్వరరావు, గద్దె రామ్మోహన్‌ను నేటి సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. -
అనర్హత ఎమ్మెల్యేలతో సంబంధం లేదు: యెడ్డీ
సాక్షి, బెంగళూరు: గతంలో కాంగ్రెస్– జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అనర్హత వేటుకు గురైన కాంగ్రెస్– జేడీఎస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలతో తమకు ఎలాంటి సంబంధం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప అన్నారు. సొంత రాజకీయ భవిష్యత్తు కోసం ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి అనర్హత వేటుకు గురయ్యారన్నారు. అనర్హత ఎమ్మెల్యేలు బీజేపీ సర్కారు ఏర్పడడానికి కృషి చేశారని, ఉప ఎన్నికల్లో వారికే టికెట్లు ఇస్తామని యడియూరప్ప చెబుతున్న ఆడియో, వీడియోలు వైరల్ అయిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
స్పీకర్, రేవంత్‌ల మధ్య స్వల్ప వాగ్వాదం
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కమార్‌ల సభ్యత్వ రద్దు విషయంలో హైకోర్టు తీర్పు అమలు చేయడంలేదంటూ సీఎల్పీ బృందం సోమవారం స్పీకర్ మధుసూదనచారిని కలసి ఫిర్యాదు చేశారు. కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వాన్ని పునరుద్దరించాలని వారు స్పీకర్‌ను కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస నేతలు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జనారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్పీకర్, అసెంబ్లీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని స్పీకర్‌కు సలహాలు ఇవ్వాలని సూచించారు. కోర్టు తీర్పును ఎందుకు అమలు చేయడంలేదని స్పీకర్‌ను అడిగినట్టు వారు పేర్కొన్నారు. కోర్టు తీర్పును అమలు చేయకుంటే జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామన్నారు. అవసరమైతే సుప్రీం కోరుఓటను కూడా ఆశ్రయిస్తామని హెచ్చరించారు. స్పీకర్, రేవంత్ మధ్య స్వల్ప వాగ్వాదం కాంగ్రెస్ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తున్న సమయంలో స్పీకర్‌కు, రేవంత్‌కు మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. హైకోర్టు తీర్పును అమలు చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని రేవంత్ స్పీకర్‌ని ప్రశ్నించారు. దీంతో అక్కడి వాతావరణం కొద్దిగా వేడెక్కింది. ఒకింత అసహనానికి లోనైన స్పీకర్ రేవంత్ ఇలా మాట్లాడితే తాను ఇక్కడి నుంచి వెళ్లిపోతానని తెలిపారు. దీంతో కొందరు కాంగ్రెస్ నేతలు స్పీకర్‌ను సముదాయించారు. -
‘సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలి’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే యత్నం చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలను ఎలా సస్పండ్ చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ జరుగుతోందని అర్థం చేసుకోవచ్చన్నారు. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. హైకోర్టు తీర్పుతో న్యాయం గెలిచిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి న్యాయస్థానం, వ్యవస్థలపైన సంపూర్ణ విశ్వసం ఉందిని తెలిపారు. ఇప్పటికైనా స్పీకర్ న్యాయస్థానాల తీర్పులను గౌరవించి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ల సభ్యత్వాలను పునరుద్ధరించాలన్నారు. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్నారు. అన్యాయం జరిగింది: జైపాల్ రెడ్డి ప్రభుత్వం చేసిన చర్యను హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టుకు వెళ్ళరు.. హైకోర్టు తీర్పు ను అమలు చేయరు. తాను చేసింది రాజ్యాంగ విరుద్ధమని కేసీఆర్‌కు తెలుసు కాబట్టే అప్పీల్‌కు వెళ్లడం లేదు. రాజ్యాంగపరంగా అన్యాయం జరిగింది. ఇలాంటి పరిస్థితి 70 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదు. ఇదంతా చూస్తుంటే తెలంగాణాలో రాజ్యాంగం ఉందా అనిపిస్తుంది. -
రాజీనామాపై కోమటిరెడ్డి నాతో చర్చించలేదు
-
ముందు నేనే రాజీనామా చేస్తా: జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని దీటుగా ఎదుర్కోలేకపోయిందన్న విమర్శలను ప్రతిపక్షనేత కె. జానారెడ్డి కొట్టిపారేశారు. తనతో మూకుమ్మడి రాజీనామా చేద్దామని కోమటిరెడ్డి అననేలేదని, ఒకవేళ అధిష్టానమే గనుక ఆదేశిస్తే అందరికంటే ముందు తానే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. (చదవండి: టీ సర్కార్‌కు కోమటిరెడ్డి డెడ్‌లైన్) ఆ ముచ్చటే నాకు చెప్పలేదు: ‘‘మావాళ్లలోనే కొంతమంది ఒత్తిడితోనో, ఆవేదనతోనో నాయకత్వంపై ఆరోపణలు చేసిఉండొచ్చు. అందుకు ఎవరినీ తప్పుపట్టడంలేదు. సీఎల్పీ తరఫున చట్టబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలేమైనా ఉంటే తప్పకుండా పరిశీలిస్తాం. సభ్యత్వాల రద్దు విషయంలో ఇంకాస్త గట్టిగా ప్రతిస్పందించాల్సి వస్తే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. అధిష్టానం సూచనల మేరకు ముందడుగు వేస్తాం. ప్రచారంలో ఉన్నట్లు రాజీనామాల అంశమేదీ మా మధ్య చర్చకు రాలేదు. ఒకవేళ అధిష్టానమే గనుక ఆ నిర్ణయం తీసుకుంటే, ముందు నేనే రాజీనామా చేస్తా. నిజానికి రాజీనామాల గురించి కోమటిరెడ్డి నాతో చెప్పనేలేదు. అలా చెప్పినట్లు ఎవరైనా అంటే.. ఆ వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నా. జానారెడ్డి ఎప్పుడైనా దేనికైనా రెడీగానే ఉంటాడని మరోసారి సవాల్ చేస్తున్నా. నాపైనగానీ, మరొకరిపైనగానీ ప్రతిసారి ఇలా మాట్లాడటం సరికాదు. ఈ కేసీఆర్ ప్రభుత్వపు కక్ష, అనైతికత, నిరంకుశత్వం అందరిపట్లా ఒకే విధంగా ఉంది. అందుకు నేను మినహాయింపు కాదు. వ్యక్తులను, పార్టీలను అణిచివేసేందుకు టీఆర్ఎస్ సర్కార్ ప్రయత్నిస్తున్నది’’ అని జానా వివరించారు. (చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మళ్లీ ఊరట) కోర్టు తీర్పుపై హర్షం: కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేత తీర్పును సవాలు చేస్తూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంపై జానా హర్షం వ్యక్తం చేశారు. ‘‘మొన్న కర్ణాటకలో, ఇప్పుడు తెలంగాణలో కోర్టులు ఇచ్చిన తీర్పులు.. ప్రజాస్వామ్య స్ఫూర్తిని మరింతగా చాటాయి. సస్పెన్షన్‌ను ఎత్తివేయాలన్న కోర్టు గత తీర్పును అనుసరించాల్సిందిగా స్పీకర్‌ను విజ్ఞప్తి చేస్తున్నా. అసెంబ్లీ కార్యదర్శి కూడా చొరవతీసుకోవాలి. లేదంటే కోర్ట్ కంటెప్ట్‌కు వెళ్లాల్సి వస్తుంది’’ అని జానా పేర్కొన్నారు. పంచాయితీ రాజ్ చట్టానికి నగుబాటు తప్పదు: తెలంగాణ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన పంచాయితీరాజ్ చట్టానికి కూడా కోర్టులో ఎదురుదెబ్బ తగలడం ఖాయమని జనారెడ్డి అన్నారు. తక్షణమే అసెంబ్లీని లేదా అఖిలపక్షం సమావేశాన్ని ఏర్పాటుచేసి పీఆర్ చట్టంపై అందరి అభిప్రాయాలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘‘సర్కారు రూపొందించిన పంచాయితీ రాజ్ చట్టంలో చాలా లోపాలున్నాయి. ఇలాగే కోర్టుకు వెళితే ఎదురుదెబ్బ తప్పదు. కీలకమైన చట్టం కాబట్టి విపక్షాల సూచనలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. అందుకోసం తక్షణమే ప్రభుత్వం ముందుకురావాలి’’ అని వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులు అయినా, కాకపోయినా ప్రాణహాని ఉన్నవారికి రక్షణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని జానా గుర్తుచేశారు. -
చెల్లని ‘బహిష్కరణ’
కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఏ. సంపత్‌కుమార్‌లను సభ నుంచి బహిష్కరిస్తూ గత నెల 13న తెలంగాణ శాసనసభ తీసుకున్న నిర్ణయం చెల్లదంటూ హైకోర్టు మంగళవారం వెలువరించిన తీర్పు సహజంగానే సంచలనం సృష్టించింది. ఆ శాసనసభ్యులిద్దరూ ప్రాతినిధ్యం వహిస్తున్న నల్గొండ, అలంపూర్ స్థానాలు ఖాళీ అయినట్టు జారీ అయిన ప్రక టనను రద్దు చేయడంతోపాటు, వారి సభ్యత్వాలను కూడా హైకోర్టు పున రుద్ధరించింది. ఈ తీర్పు లోతుపాతులు, దాని పర్యవసానాలేమిటన్న విచికిత్స కన్నా ముందు హైకోర్టును ఒకందుకు అభినందించాలి. తమకు అన్యాయం జరి గిందని ఆశ్రయించిన శాసనసభ్యులకు సత్వర న్యాయం కలగజేయడానికి న్యాయ స్థానం కృషి చేసింది. కోమటిరెడ్డి, సంపత్‌ల బహిష్కరణకు దారితీసిన పరిస్థితులు దురదృష్టకరమైనవి. ప్రజాస్వామ్యప్రియులను కలవరపెట్టేవి. అసెంబ్లీ, శాసనమండలి ఉమ్మడి సమావేశాన్నుద్దేశించి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగిస్తుండగా కాంగ్రెస్, ఇతర పక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. అంతవరకూ అభ్యంతరపెట్టాల్సిందేమీ లేదు. రాష్ట్రాన్ని పీడిస్తున్న సమస్యలను గవర్నర్ ప్రసంగం విస్మరించిందనుకున్నప్పుడు నిరసనలు వ్యక్తం చేయడం మామూలే. కానీ ఆనాటి నిరసన కట్టు తప్పింది. నిరసన వ్యక్తం చేస్తున్నవారివైపు నుంచి హెడ్ ఫోన్ సెట్ పడగా అది శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి తగిలింది. దీన్ని అధికార టీఆర్ఎస్ తీవ్రంగా తీసుకుంది. ఆ మర్నాడు ప్రతిపక్ష నాయకుడు కె. జానారెడ్డిసహా 11మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బడ్జెట్ సమా వేశాలు ముగిసేవరకూ సస్పెండ్ చేయడంతోపాటు కోమటిరెడ్డి, సంపత్‌లను బహిష్కరిస్తూ ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టడం, అది ఆమోదం పొందడం అయింది. మన చట్టసభల్లో సర్వసాధారణంగా అధికార పక్షం ఏమనుకుంటే అదే జరుగుతుంది. అంతమాత్రాన ఏదైనా అనుకోవడం, దాన్ని అమలు చేయడానికి పూనుకోవడం సరైంది కాదు. ఏ నిర్ణయమైనా విచక్షణాయుతంగా ఉండాలి. హేతుబద్ధమైనదన్న భావన అందరిలో కలగాలి. ఇప్పుడు చట్టసభల కార్య కలాపాలు ప్రత్యక్ష ప్రసారమవుతున్నాయి. ఎవరేం మాట్లాడుతున్నారు... ఎవరి ప్రవర్తనెలా ఉన్నదన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు హేతుబద్ధంగా ఉన్నారో, ఎవరు పిడివాదం చేస్తున్నారో సులభంగా విశ్లేషించుకుంటున్నారు. అందువల్ల చట్టసభల్లో చర్చలైనా, విమర్శలైనా నిర్మాణాత్మకంగా ఉండాలి. సభ్యుల వ్యవహారశైలి హుందాగా ఉండాలి. సభ తీసుకునే నిర్ణయాలు సహే తుకంగా అనిపించాలి. బహిష్కరణ వంటి తీవ్ర నిర్ణయం తీసుకునే ముందు సంబంధిత సభ్యులకు నోటీసులిచ్చి, వారి అభిప్రాయాలను కూడా వింటే ఉంటే వేరుగా ఉండేది. అలా జరగకపోవడంతో తమపై అకారణంగా బహిష్కరణ వేటు వేశారని కోమటిరెడ్డి, సంపత్‌లు చేస్తున్న ఆరోపణలకు విలువ పెరిగింది. స్వామి గౌడ్‌కు అసలు గాయమే కాలేదని వారు వాదిస్తున్నారు. ఆ ఫుటేజ్ ఉంటే బహి ర్గతం చేయమని సవాలు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జవాబు చెప్పకపోగా... హైకోర్టు అడిగినప్పుడు తత్తరపడటం, పరస్పర విరుద్ధమైన వాదనలు చేయడం... చివరకు అడ్వొకేట్ జనరల్ రాజీనామా బహిష్కృత ఎమ్మెల్యేల వాదనకు బలం చేకూర్చాయి. ఇలాంటి ఉదంతాలు జరిగినప్పుడు ఫుటేజ్ విడుదల చేస్తే తమ ఎమ్మెల్యే ప్రవర్తన ఎలా ఉన్నదో, దాని పర్యవసానమేమిటో జనం చూస్తారు. అంతిమంగా అది ప్రభుత్వానికే లాభిస్తుంది. ఫుటేజ్ విడుదలపై నిర్ణయించాల్సింది శాసనసభే తప్ప తాము కాదని ప్రభుత్వం చెప్పడం... సభేమో మౌనంగా ఉండిపోవడం ఎవరి ప్రతిష్టనూ పెంచదు. మన రాజ్యాంగం న్యాయ, కార్యనిర్వాహక, శాసనవ్యవస్థలకు పరిధుల్ని నిర్దేశించింది. ఒకదాని పరిధిలోకి మరొకటి జొరబడరాదని స్పష్టంగా చెప్పింది. అది వ్యవస్థల మధ్య సంఘర్షణను నివారించడానికి, రాజ్యాంగ పాలన సజావుగా సాగడానికే తప్ప ఆ పరిధులను చూపించి ఏ వ్యవస్థకా వ్యవస్థ తప్పించుకు తిరగడానికి కాదు. కానీ ఆచరణలో జరుగుతున్నది అదే. ఎలాంటి విమర్శలనైనా పట్టించుకోకుండా బండబారినట్టుండటం లేదా దబాయించడం కార్యనిర్వాహక వ్యవస్థ ఒక కళగా అభివృద్ధి చేసుకుంది. ఇక శాసనవ్యవస్థ తీరు విస్తుగొలిపేదిగా తయారైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గత నాలుగేళ్లకాలంలో జోరుగా సాగిన ఎమ్మెల్యేల ఫిరాయింపులే ఇందుకు నిదర్శనం. పార్టీ మారిన ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేయొచ్చునని ఫిరాయింపుల నిరోధక చట్టం స్పష్టంగా చెబుతున్నా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పట్టనట్టు వ్యవహరిస్తారు. పార్టీల నుంచి ఫిర్యాదులంది ఏళ్లు గడుస్తున్నా వాటి సంగతి తేల్చరు. ఫిరాయింపుదార్లకు మంత్రి పదవులు కట్టబెడుతున్నా వారికేమీ అనిపించదు. చిత్రమేమంటే ఫిరాయింపు ఎంపీల విషయంలో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సైతం మౌనంగా ఉండి పోతున్నారు. చట్టసభల ప్రత్యక్ష ప్రసారాల్లో స్పీకర్ల తీరు... ముఖ్యంగా ఉద్రి క్తతలు, గందరగోళస్థితి ఏర్పడినప్పుడు ఓపిగ్గా సభ్యులకు నచ్చజెప్పడం, ఉద్రిక్తతలు నివారించడం గమనిస్తే ముచ్చటేస్తుంది. ఇలాంటివారికి ఫిరాయింపు జరిగిందో లేదో తేల్చడం ఎందుకంత కష్టమనిపిస్తున్నది? న్యాయవ్యవస్థ నిల దీసినప్పుడు దాన్ని జోక్యం చేసుకోవడంగా భావించే శాసనవ్యవస్థ తన బాధ్యతను ఎందుకు విస్మరిస్తున్నట్టు? పరిధుల గురించి, అధికారాల గురించి, తమ స్వతంత్రత గురించి పట్టుబట్టే వ్యవస్థలు... అవి రాజ్యాంగం ద్వారా సంక్ర మించాయే తప్ప గాల్లోంచి ఊడిపడలేదని గుర్తించాలి. వాటి సారాంశం ప్రజా స్వామిక వ్యవస్థ పటిష్టతేనని తెలుసుకోవాలి. ఆ ఔన్నత్యాన్ని నిలబెట్టుకోవాలి. సామాన్యులకే సహేతుకమనిపించని నిర్ణయాలు తీసుకుని లేదా నిర్ణయరాహి త్యాన్ని ప్రదర్శించి తమనెవరూ ప్రశ్నించవద్దంటే చెల్లదు. -
సెమీ ఫైనల్‌కు సిద్ధం; కోమటిరెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: తన శాసనసభ సభ్యత్వాన్ని నేరుగా రద్దు చేసే అధికారం అసెంబ్లీ స్పీకర్‌కు లేదని నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ వ్యవహారంలో నిర్ణయం తీసుకోవాల్సింది గవర్నరేనని, ఒకవేళ ఆయన కూడా తమపై అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నికకూ సిద్ధమేనని ప్రకటించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వాల రద్దు, సస్పెన్షన్లను నిరసిస్తూ సంపత్‌కుమార్‌తో కలిసి గాంధీభవన్‌లో ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’ దీక్ష చేస్తోన్న ఆయన బుధవారం ‘సాక్షి’తో మాట్లాడారు. సెమీస్‌కు సిద్ధం : ‘కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు. సభలో ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం లేకుండా చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా మాపై వేటు వేశారు. దీనిపై గవర్నర్ విచారణ చేయాలి. ఒకవేళ అక్కడ కూడా వ్యతిరేక నిర్ణయం వస్తే ప్రజల దగ్గరికెళ్లి తేల్చుకుంటాం. ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేస్తామంటోన్న టీఆర్ఎస్.. ఉప ఎన్నికలంటూ హడావిడి చేస్తోందికదా, వాళ్లకిదే నా సవాల్.. మేం సెమీ ఫైనల్స్ కు సిద్ధంగా ఉన్నాం. 2019లో జరిగే ఫైనల్స్‌లో 100కుపైగా సీట్లు సాధిస్తాం’ అని కోమటిరెడ్డి అన్నారు. పోలీస్ రాజ్యమిది : షబ్బీర్ ఫైర్ తమ ఎమ్మెల్యేలు సంపత్, కోమటిరెడ్డిల దీక్షకు సంఘీభావం తెలిపేందుకు గాంధీభవన్‌కు వెల్లువలా వస్తోన్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారని షబ్బీర్ అలీ మండిపడ్డారు. ‘కేసీఆర్ పోలీసుల రాజ్యాన్ని నడిపిస్తున్నారు. అన్యాయంగా మమ్మల్ని సస్పెండ్ చేయడమేకాక, ఎక్కడికక్కడ కార్యకర్తల్ని అడ్డుకుంటున్నారు’ అని ఆయన మండిపడ్డారు. -
‘కేసీఆర్‌కు ఇవే చివరి సమావేశాలు’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రిగా కె. చంద్రశేఖర్‌రావుకు, అబద్ధాల ప్రసంగాలు చదివే గవర్నర్‌కు ఇవే చిట్టచివరి అసెంబ్లీ సమావేశాలని కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి అన్నారు. ఉభయ సభల్లో కాంగ్రెస్ సభ్యులపై చర్యలు గర్హనీయమని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రజాగ్రహానికి గురికాకతప్పదన్నారు. మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన రేవంత్.. ముఖ్యమంత్రి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘గడిచిన మూడున్నరేళ్లలో 5వేల మంది రైతులు చనిపోయారు. పంటలకు గిట్టుబాట ధరలు లేవు. రైతాంగం ఇంతటి దారుణ స్థితిలో ఉంటే గవర్నర్ ప్రసంగంలో మాటమాత్రమైనా చెప్పరా? సమస్యలపై ఆందోళనకు దిగితే మా సభ్యులపై వేటేస్తారా? నిరసన తెలిపే హక్కును కాదనడానికి మీరెవరు? గతంలో టీఆర్ఎస్ గవర్నర్‌పై దాడి చెసిన సంగతి గుర్తుకులేదా, పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు నిరసనలు చేస్తున్న సంగతి మర్చిపోయారా?’’ అని రేవంత్ ప్రశ్నించారు. బీసీలను వ్యతిరేకం చేయాలనే.. : శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై అసలు దాడి జరగనేలేదని, సీఎం డ్రామాలో భాగంగానే వార్తలు ప్రసారం చేశారని రేవంత్ మండిపడ్డారు. ‘‘స్వామిగౌడ్ కంటికి దెబ్బతగిలిందంటున్నారు. కానీ వీడియోను చూపెట్టట్లేదు. అఖిలపక్షాన్నైనా పిలిపించి వీడియోలు చూపిస్తే నిజం బయటపడుతుంది. హరీశ్‌రావు కనుసైగతో లోపలికొచ్చిన మార్షల్స్.. కాంగ్రెస్ సభ్యులను కొట్టారు. ఇదంతా బీసీలను కాంగ్రెస్‌కు వ్యతిరేకం చేయాలన్న కేసీఆర్ పన్నాగం. నల్లగొండలో కేసీఆర్‌పై పోటీ చేస్తానన్నందుకే కోమటిరెడ్డిపై కక్ష పెంచుకున్నారు. సీఎం ఆదేశాల మేరకే ఆస్పత్రిలో చేరానని స్వయంగా స్వామిగౌడే చెప్పడం ఈ డ్రామాలో కీలక అంశం’’ అని రేవంత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ గర్జన.. రేవంత్ ఎక్కడ? : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజునుంచే కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తూ, ఆందోళనలు నిర్వహించడం, రెండోరోజుకు సస్పెన్షన్‌కు గురికావడం, ఆ వెంటనే మూకుమ్మడి రాజీనామాలు ప్రకటించడం తెలిసిందే. ‘ఇంత జరుగుతున్నా రేవంత్ ఎక్కడా కనిపించరేం?’ అని సోషల్ మీడియాలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన సందర్భంలో రేవంత్ తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామాచేశారు. అందుకే ఆయన బడ్జెట్ సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. రాజీనామా ఇంకా ఆమోదం పొందనప్పటికీ సభకు రాకూడదని ఆయన నిర్ణయం తీసుకున్నారు. -
‘దమ్ముంటే అన్ని వీడియోలు బయటపెట్టండి’
సాక్షి, హైదరాబాద్ : తమను సస్సెండ్ చేసే అధికారం అధికారపక్షానికి లేనేలేదని విపక్ష కాంగ్రెస్ వాదిస్తోంది. గవర్నర్ ప్రసంగం సదర్భంగా జరిగిన ఘటనలపై నిర్ణయాధికారం గవర్నర్దేతప్ప అసెంబ్లీదో, రాష్ట్రప్రభుత్వానిదో కాదని ప్రతిపక్షనేత జానారెడ్డి అన్నారు. నియంతృత్వ ధోరణిలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా మూకుమ్మడి రాజీనామాలు చేయనున్నట్లు తెలిపారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. అసలు చైర్మన్ స్వామిగౌడ్‌పై దాడి జరగనేలేదని, దమ్ముంటే వీడియోలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో టీఆర్ఎస్ తీరుకు నిరసనగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. అన్ని నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్ధం చేయాలని శ్రేణులకు సూచించింది. అది గవర్నర్ పరిధిలోని అంశం : ‘‘నిన్న సభలో జరిగిన ఘటన గవర్నర్ పరిధిలోని అంశం. చర్యలు తీసుకునే అధికారం ఆయనకు మాత్రమే ఉంది. అందరినీ సస్పెండ్ చేయడం రాజ్యంగ విరుద్ధం. సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది కాబట్టే ప్రజల దృష్టిని మరల్చేందుకు సస్పెన్షన్లను తెరపైకి తెచ్చింది. ప్రభుత్వం అవలంభిస్తోన్న అప్రజాస్వామిక చర్యలను అందరూ ఖండించాలి’’ అని సీఎల్పీనేత జానారెడ్డి అన్నారు. దమ్ముంటే వీడియోలు బయటపెట్టండి : ‘‘కావాలనే మమ్మల్ని సభ నుంచి గెంటేశారు. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశాడు. సభలో జరిగిందివేరు.. బయట సీఎం నడిపిన డ్రామా వేరు. మండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై దాడి జరిగిందనడం అవాస్తవం. మావాళ్లు హెడ్సెట్ విసిరిన దృశ్యాలే చూపెడుతున్నారుగానీ, వేరే దృశ్యాలు చూపెట్టట్లేదంటే ఏమిటి అర్థం? దమ్ముంటే అన్ని వీడియోలు బయటపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సభ ముగిశాక చైర్మన్.. గవర్నర్‌ను కారుదాకా తీసుకెళ్లి, నవ్వుతూ సాగనంపారని, ఆ తర్వాత సీఎం పథకం ప్రకారం నాటకానికి తెరలేచింది. ఈ సస్పెన్షన్లకు ప్రభుత్వం మూల్యం చెల్లించుకోకతప్పదు. న్యాయం కోసం ప్రజల్లోకి వెళతాం..’ అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ అన్నారు. -
ఎమ్మెల్యే సస్పెన్షన్‌పై న్యాయ సమీక్ష చేయవచ్చు
సస్పెన్షన్‌కు కారణమైన ఆధారాలను సభ్యునికి ఇవ్వాల్సిందే అలా ఇవ్వకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం దీనికి విరుద్ధంగా సస్పెన్షన్ ఉంటే దాన్ని రద్దు చేయవచ్చు తమిళనాడు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు రోజా సస్పెన్షన్ నేపథ్యంలో ఈ తీర్పునకు ప్రాముఖ్యత సాక్షి, హైదరాబాద్: సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా శాసనసభ వర్గాలు ఓ శాసనసభ్యుడిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంటే, ఆ నిర్ణయంపై న్యాయ సమీక్ష చేయవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏ కారణంతో శాసనసభ్యుడిని సస్పెండ్ చేశారో ఆ కారణానికి సంబంధించిన వీడియో ఫుటేజీలు ఉంటే, వాటిని ఆ శాసనసభ్యునికి అందచేయకపోవడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. శాసనసభ్యుని సస్పెన్షన్ సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉంటే ఆ సస్పెన్షన్‌ను రద్దు చేయవచ్చునంది. సభాహక్కులకు భంగం కలిగించేటట్లు వ్యవహరించారంటూ సినీనటుడు విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకె పార్టీకి చెందిన ఆరుగురు శాసనసభ్యులపై సస్పెన్షన్ వేటు వేస్తూ తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. వారిని తరువాతి అసెంబ్లీ సెషన్లో పది రోజులపాటు సస్పెండ్ చేయాలని, అలాగే వారి జీతభత్యాలను కూడా నిలిపేయాలని సభా హక్కుల కమిటీ సిఫారసు చేసింది. వీటన్నింటినీ సవాలు చేస్తూ సస్పెండ్ అయిన శాసనసభ్యులు అలగాపురం ఆర్.మోహన్‌రాజ్, మరికొందరు రాజ్యాంగంలోని అధికరణ 32 కింద సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ అభయ్ మనోహర్ సప్రేలతో కూడిన ధర్మాసనం మూడు రోజుల క్రితం దీనిపై కీలక తీర్పు వెలువరించింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు రోజాపై సస్పెన్షన్ వేటు వేసిన తరువాత కూడా ఆమెకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వకుండా, వీడియో కాపీలను అందచేయకుండా అసెంబ్లీ వర్గాలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తాజా తీర్పునకు అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది. సహజ న్యాయం కాదు పార్లమెంట్, శాసనసభలో సభ్యులకు వాక్ స్వాతంత్య్రమన్నది రాజ్యాంగపరమైన హక్కని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ‘ప్రస్తుత కేసులో పిటిషనర్లను సస్పెండ్ చేయడం ద్వారా అధికరణ 194 ప్రకారం వారికి సంక్రమించిన వాక్ స్వాతంత్యపు హక్కును అడ్డుకున్నట్లయింది. మొదట 19 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన హక్కుల కమిటీ ఆ తరువాత ఆరుగురు పిటిషనర్లనే ఎందుకు సస్పెండ్ చేసిందో అర్థం కావడం లేదు. వీడియో ఆధారంగానే పిటిషనర్లపై సభా హక్కుల కింద చర్యలు తీసుకున్నట్లు శాసనసభ వర్గాలు చెబుతున్నారు. వీడియో చూసిన తరువాతనే పిటిషనర్లపై చర్యలు తీసుకున్నట్లు హక్కుల కమిటీ మినిట్స్ ద్వారా కూడా తెలుస్తోంది. వీడియో ఆధారంగా తమపై చర్యలు తీసుకునే ముందు తమ వాదనలు వినాలని, ఆ వీడియో ప్రామాణికతను ప్రశ్నించే అవకాశం ఇవ్వాలని పిటిషనర్లు కోరినా ప్రయోజనం లేకపోయింది. ఈ కేసులో పిటిషనర్లకు వీడియో చూపడమన్నది సహజ న్యాయ సూత్రం. వీడియో కాపీ ఇవ్వడం ద్వారా సభా హక్కుల కమిటీ వారికి తమ వాదన వినిపించే అవకాశం ఇచ్చి ఉండాల్సింది. ఇది సభా హక్కుల కమిటీ చట్టపరమైన బాధ్యత. వీడియో ఇవ్వకపోవడమన్నది స్పష్టంగా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. కాబట్టి వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ తమిళనాడు అసెంబ్లీ జారీ చేసిన తీర్మానాన్ని రద్దు చేస్తున్నాం. సస్పెన్షన్ తీర్మానమే రద్దయింది కాబట్టి, వారి జీతభత్యాలను గతంలో వలే యథాతథంగా పునరుద్దరించాలి’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. -
కేసీఆర్‌ది అసమర్థ పాలన
టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎమ్మెల్యేల సస్పెన్షన్‌కు నిరసనగా జనగామలో ధర్నా ఎర్రబెల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు జనగామ : సీఎం కేసీఆర్‌ది తుగ్లక్ పాలన.. హిట్లర్ పాలన.. కుటుంబపాలన.. బంధువుల రాజ్యం అం టూ టీడీఎల్పీ నేత, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెం బ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను నిరసిస్తూ జనగామ ఆర్టీసీ చౌరస్తాలో టీడీపీ ఆధ్వర్యంలో శుక్రవా రం నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసులు ఎర్రబెల్లిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆయన ఎర్రవిలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సభకు క్షమాపణ చెప్పాలంటూ తమను సస్పెండ్ చేయడం అనైతికమన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను ఆంగ్లో ఇండియన్స్.. ఆంధ్రా ఏజెంట్లు అని వర్ణించి న మంత్రి కేటీఆర్ ముందుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కరె ంట్ కష్టాలకు కేసీఆర్ అసమర్థతే కారణమన్నారు. అప్పుల బాధతో రైతులు చేసుకుంటున్న ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. తెల్లబట్టలు వేసుకున్నోళ్లకు పింఛన్లు రావు, రేషన్‌కార్డులు ఇవ్వరాదని జీఓలో పేర్కొనడం దారుణమన్నారు. ప్రజా సమస్యలపై గట్టిగా నిలదీస్తున్నారనే అక్కసుతో తమ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారన్నారు. అయినా తాము పోరాటం ఆపేది లేద ని.. జిల్లాలన్నీ తిరిగి ప్రభుత్వ తీరును ఎండగడతామన్నారు. ఎంపీ కవిత సమగ్ర సర్వేలో రెండు చోట్ల నమోదు చేసుకుందని.. తాము విషయం బయటకు తీయడంతో అధికారులతో చెప్పి ఒక చోట తొలగిం చుకున్నట్లు ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కా రం.. కేసీఆర్ మొండివైఖరిపై టీడీపీ ఎమ్మెల్యేలందరం శుక్రవారం సాయంత్రం గవర్నర్‌ను కలిసి వి న్నవించనున్నట్లు ఎర్రబెల్లి తెలిపారు.అలాగే శనివా రం డిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామ ని, అవసరమైతే ప్రధాన మంత్రి, రాష్ట్రపతిలను కూ డా కలుస్తామన్నారు. కాగా, ఎర్రబెల్లిపై సెక్షన్ 151 సీఆర్పీసీ కింద (ప్రివెంటివ్ అరెస్ట్) కేసు నమోదు చేసినట్లు ఎస్సై కరుణాకర్ తెలిపారు. అలాగే 30 మందిపె కూడా కేసు నమోదైనట్లు చెప్పారు. -
15 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
-
15 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
సమైక్యాంధ్ర గొంతును వినిపించేందుకు ప్రయత్నించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలను ఒకరోజు పాటు.. అంటే గురువారం నాడు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. సభా నిర్వహణకు అడ్డుపడుతున్నారన్న కారణంతో వీరిని సస్పెండ్ చేశారు. ఓటింగ్ జరిపేందుకు స్పీకర్ నిరాకరించడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వెళ్లి సమైక్యాంధ్ర నినాదాలు వినిపించారు. దీంతో శాసన సభ వ్యవహారాల మంత్రి సాకే శైలజానాథ్ మొత్తం 15 మంది సభ్యులను ఒక రోజు పాటు సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని మూజువాణీ ఓటుతో ఆమోదించి, అందరినీ సభ నుంచి బయటకు వెళ్లాల్సిందిగా స్పీకర్ నాదెండ్ల మనోహర్ సూచించారు. అయితే.. తమ పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంతో అందుకు నిరసనగా తాము కూడా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తెలిపారు. కాగా సభ నుంచి తమను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన మార్షల్స్ నుంచి విడిపించుకుని మళ్లీ సభలోకి ప్రయత్నించేందుకు కొందరు ఎమ్మెల్యేలు ప్రయత్నించారు. దాంతో వారిని మార్షల్స్ సభ నుంచి ఈడ్చుకొచ్చారు. ఆ సమయంలో పలువురు ఎమ్మెల్యేలకు గాయాలయ్యాయి. అసెంబ్లీ ఇన్నర్ లాబీల్లో ఎమ్మెల్యేలు బైఠాయించి, సమైక్య నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. సస్పెండైన ఎమ్మెల్యేలు వీరే.. అమర్ నాథరెడ్డి, గొల్ల బాబూరావు, తెల్లం బాలరాజు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, గుర్నాథరెడ్డి, భూమన, ధర్మాన కృష్ణదాసు, కాపు రామచంద్రారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, శోభా నాగిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కె.శ్రీనివాసులు, మేకతోటి సుచరిత, వెంకట్రామిరెడ్డి