సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కమార్‌ల సభ్యత్వ రద్దు విషయంలో హైకోర్టు తీర్పు అమలు చేయడంలేదంటూ సీఎల్పీ బృందం సోమవారం స్పీకర్ మధుసూదనచారిని కలసి ఫిర్యాదు చేశారు. కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వాన్ని పునరుద్దరించాలని వారు స్పీకర్‌ను కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస నేతలు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జనారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్పీకర్, అసెంబ్లీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని స్పీకర్‌కు సలహాలు ఇవ్వాలని సూచించారు. కోర్టు తీర్పును ఎందుకు అమలు చేయడంలేదని స్పీకర్‌ను అడిగినట్టు వారు పేర్కొన్నారు. కోర్టు తీర్పును అమలు చేయకుంటే జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామన్నారు. అవసరమైతే సుప్రీం కోరుఓటను కూడా ఆశ్రయిస్తామని హెచ్చరించారు.
స్పీకర్, రేవంత్ మధ్య స్వల్ప వాగ్వాదం
కాంగ్రెస్ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తున్న సమయంలో స్పీకర్‌కు, రేవంత్‌కు మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. హైకోర్టు తీర్పును అమలు చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని రేవంత్ స్పీకర్‌ని ప్రశ్నించారు. దీంతో అక్కడి వాతావరణం కొద్దిగా వేడెక్కింది. ఒకింత అసహనానికి లోనైన స్పీకర్ రేవంత్ ఇలా మాట్లాడితే తాను ఇక్కడి నుంచి వెళ్లిపోతానని తెలిపారు. దీంతో కొందరు కాంగ్రెస్ నేతలు స్పీకర్‌ను సముదాయించారు.
Comments
Please login to add a commentAdd a comment