
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం నాటి తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం అద్భుతంగా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశంసించారు. ముఖ్యమంత్రి స్పీచ్లో అప్పులు, వడ్డీలు లెక్కలు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పారన్నారు కోమటిరెడ్డి. అసెంబ్లీ లాబీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో ముచ్చటించారు. ‘ఈ 15 నెలల్లో మేము చేసిన అప్పు 4500కోట్లే. రేపట్నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే కార్యకర్తలే చేసుకుంటారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాస్తే చర్యలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. సోషల్ మీడియా పేరుతో అడ్డు అదుపు లేకుండా పోయింది. శ్రీశైలంలో చిన్న మాట దొర్లితే సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా నన్ను ట్రోల్ చేశారు’ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.
తప్పులు, అప్పులు చేసి మీరే ముంచేశారు..
ఈరోజు సీఎం రేవంత్ ప్రసంగంలో బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తప్పులు.. అప్పులు చేసి మీరు ముంచేశారని, ఆ శిక్ష ప్రజలు అనుభవించాలా? అని రేవంత్ బీఆర్‌ఎస్ నేతలను ఉద్దేశించి అన్నారు. ‘‘తెలంగాణలో ఎవరు చనిపోయినా ఆ మామా, అల్లుళ్లు డ్యాన్సులు చేస్తున్నారు. తెలంగాణలో ఎక్కడ ప్రమాదం జరిగినా వాళ్ల కళ్లలోనే మెరుపు కనిపిస్తోంది. పైశాచికత్వంలో వాళ్లు ఉగాండా అధ్యక్షుడితో పోటీ పడుతున్నారు’ అని రేవంత్ విమర్శించారు. కేసీఆర్ రూ. 8. 19 లక్షల కోట్లు అప్పులు చేశారని, తాము వచ్చాక రూ. రూ. 1.53 లక్షల కోట్లు వడ్డీ చెల్లించామన్నారు సీఎం రేవంత్,. ప్రస్తుత తెలంగాణ అప్పు రూ. రూ. 7. 38 లక్షల కోట్లు అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment