సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సీఎం రేవంత్, మంత్రులు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య వాడీవేడి చర్చ నడిచింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. దీంతో, ఆరోపణలు నిజమైతే రాజీనామాలకు సిద్ధమని జగదీష్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ చేసుకున్నారు.
కాగా, విద్యుత్ అంశంపై చర్చలో భాగంగా గత ప్రభుత్వంపై సీఎం రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్‌కు కౌంటరిచ్చారు.
జగదీష్ రెడ్డి కామెంట్స్..
సంచుల మూటలు పట్టుకుని దొరికిన వ్యక్తి.
చర్లపల్లి జైలుకు వెళ్లిన విషయాలను రేవంత్ గుర్తు చేసుకుంటున్నారు.
మేము తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లాను.
మేము తెలంగాణ కోసం ఎన్నో మంచి పనులు చేశాను.
జగదీష్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్..
జగదీష్ రెడ్డి సూర్యాపేటలో దారుణాలు చేశారు.
ఆయనపై మర్డర్ కేసులు కూడా ఉన్నాయి.
మా జిల్లా నుంచి ఏడాది బహిష్కరించారు.
దీంతో, సభలో గందరగోళం నెలకొంది.
నేను చెప్పిన కేసులో జగదీష్ రెడ్డి 16 ఏళ్లు కోర్టుల చుట్టూ తిరిగాడు.
జగదీష్ రెడ్డి కౌంటర్..
నాపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే, రాజకీయాల నుంచి తప్పుకుంటాను.
సభలో ముక్కు నేలకు రాసి వెళ్లిపోతాను.
కోమటిరెడ్డి తన ఆరోపణలు నిరూపించాలి.
నాపై కాంగ్రెస్ ప్రభుత్వం మూడు కేసులు పెట్టింది.
మూడు కేసుల్లో కోర్టు నన్ను నిర్దోషిగా ప్రకటించింది.
సభలో ఆరోపణలపై హౌస్ కమిటీ వేయండి.
మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడు.
మీలాగా డబ్బుల సంచులు పట్టుకుని తిరగలేదు.
కోమటిరెడ్డి మాటలను రికార్డు నుంచి తొలగించాలి.
కోమటిరెడ్డి కామెంట్స్..
జగదీష్ రెడ్డి ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నాను.
నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.
నేను చేసిన ఆరోపణలను నిరూపిస్తాను.
ఒకవేళ నిరూపించలేకపోతే మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను.
అంతకుముందు సీఎం రేవంత్ మాట్లాడుతూ..
- కరెంట్ కొనుగోళ్లపై ఎంక్వైరీ చేయమని అడిగింది మీరే.
- సత్యహరిశ్చంద్రుడు మా నాయకుడి రూపంలో పుట్టారన్నట్టు మాట్లాడారు.
- జ్యుడీషియల్ కమిషన్ ముందుకెళ్లి మీ వాదన వినిపించి ఉంటే మీ నిజాయితీ తెలిసేది.
- కానీ, మీరు కమిషన్ విచారణే వద్దు చేయాలని హైకోర్టుకు వెళ్లారు.
- కోర్టు దాన్ని కొట్టేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు.
- విచారణ కొనసాగించాల్సిదేనని సుప్రీంకోర్టు కూడా చెప్పింది.
- కమిషన్ ఛైర్మన్‌ను మాత్రమే మార్చాలని సుప్రీంకోర్టు చెప్పింది.
- సాయంత్రంలోగా విద్యుత్ కమిషన్‌కు కొత్త ఛైర్మన్ పేరును ప్రకటిస్తాం.
- తెలంగాణను సంక్షోభం నుంచి కాపాడింది సోనియా గాంధీ, జైపాల్ రెడ్డి మాత్రమే.
- సోనియా గాంధీ దయ వల్ల రాష్ట్రం కరెంట్ సమస్య నుంచి గట్టెక్కింది.
- లేనిపక్షంలో తెలంగాణ చీకటిమయమయ్యేది.
- నాడు నేను టీడీపీలో ఉన్నా అసెంబ్లీలో వాస్తవాలు చెప్పాను.
- దీంతో, నన్నుమార్షల్స్‌ను పెట్టి బయటకు ఇడ్చుకెళ్లారు.
- సోలార్ పవర్‌లో ప్రైవేటు పెట్టుబడులు వచ్చాయి. దీంతో, కరెంట్ ఉత్పత్తి పెరిగింది.
- సిగ్గులేకుండా ఇంకా మేము విద్యుత్ ఉత్పత్తి చేశామని చెప్పుకుంటున్నారు.
- బీహెచ్‌ఈఎల్ నుంచి సివిల్ వర్క్‌లు వాళ్లకు కావాల్సిన వాళ్లకు ఇచ్చారు.
- ఆఖరికి అటెండర్ పోస్టులు కూడా వాళ్ల బినామీలకే ఇచ్చారు.
- ఈ సందర్భంగా వాళ్లకు కావాల్సిన వాళ్లకు అనుమతులు ఇచ్చారు. ఇక్కడే
- విచారణ అంటే భయపడి కోర్టుకు వెళ్లారు.
- టెండర్ ఇచ్చి తొమ్మిదేళ్లు అయినా ఇంకా విద్యుత్ ఉత్పత్తి కాలేదు.
- ఇండియా బుల్స్ నుంచి రూ.1000 కోట్లు దండుకున్నారు.
- భద్రాద్రి పవర్ ప్లాంట్ ఇప్పటికీ నీళ్లలో మునిగిపోతోంది.
Comments
Please login to add a commentAdd a comment