jagadesh reddy
-
ప్రజలకు ఏం చేశారు.. సీఎంను హెలికాప్టర్ అడగలేరా?: జగదీష్ రెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే అని మండిపడ్డారు. హెలికాప్టర్ కోసం ప్రయత్నం చేసినా రాలేదని ఓ మంత్రి చెప్పడం సిగ్గుచేటు అంటూ ఘాటు విమర్శలు చేశారు.కాగా, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో 20 జిల్లాల్లో వర్షం ప్రభావం ఉంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వం నిన్న మొత్తం మొద్దు నిద్ర పోయింది. గంటల తరబడి బాధితులు ప్రభుత్వం సహాయం కోసం చూశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే. సీఎం నిన్న ఉదయం నుండి సాయంత్రం వరకు ఏం చేశారు?. ప్రజలే రెస్క్యూ ఆపరేషన్ చేసుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. హెలికాప్టర్ కోసం ప్రయత్నం చేసినా రాలేదని ఓ మంత్రి చెప్తున్నారు. మంత్రిగా మీరు ఫెయిల్యూర్ అయ్యారు.. రాజీనామా చేయండి.హెలికాప్టర్ మాట్లాడకుండా నిన్న ముఖ్యమంత్రి ఏం చేశారు. ఖమ్మంలో సహాయం కోసం ప్రజలు 9 గంటలు వేచి చూసినా సహాయం అందలేదు. ఒక మంత్రి హెలికాప్టర్ కోసం ఏపీ సీఎంతో మాట్లాడాను అని అంటున్నారు. తెలంగాణ సీఎంతో ఎందుకు మాట్లాడలేదు. వర్షాలపై సీఎస్ హెచ్చరికను ఫాలో అయ్యి సీఎం, మంత్రులు బయటకు రాకుండా ఉన్నారా?. పరిపాలన మాకు చేతకావడం లేదని మంత్రులు అంటున్నారు. ప్రభుత్వానికి పరిపాలించే నైతిక హక్కు లేదు. సీఎంతో అమిత్ షా, మోదీ మాట్లాడితే తెలంగాణకు హెలికాప్టర్ కావాలని ఎందుకు అడగలేదు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లాలన్నా హెలికాప్టర్ 🚁 దొరుకుతుంది కానీ ప్రజలకు హెలికాప్టర్ దొరకదా❓ప్రజల ప్రాణాలను ప్రకృతికి వదిలేస్తారా❓ప్రజల ప్రాణాలంటే లెక్క లేదా❓వరదలతో సంభవించిన మరణాలకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే❗- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @jagadishBRS… pic.twitter.com/N2qXHnoznh— BRS Party (@BRSparty) September 2, 2024ప్రభుత్వం వైపు నుండి హెచ్చరికలు ఉంటే ప్రజలు బయటకురారు. ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉండి ఏం చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారు. మంత్రులు ఎక్కడికి వెళ్లాలన్నా హెలికాప్టర్ దొరుకుతుంది కానీ ప్రజలకు హెలికాప్టర్ దొరకదా?. వర్షాలతో సంభవించిన మరణాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25లక్షల రూపాయలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి గతంలో పీసీసీ అధ్యక్షుడుగా అన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా అమలు చేయాలని కోరుతున్నాం. బాధితులకు ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం ప్రజల మధ్యన ఉండాలి. నిన్న జరిగిన సంఘటనలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ప్రభుత్వం సోయితో పని చేయాలి. వరదలపై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యల్లో ఒక్క రాజకీయ పదం కనిపించిందా?. ఖమ్మంలో ప్రజలు గజ ఈతగాళ్లకు డబ్బులు ఇచ్చి ప్రాణాలు రక్షించుకున్నారు. కోదాడలో ఎవరి హయాంలోకబ్జాలు జరిగాయో ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చకు సిద్దం’ అని సవాల్ విసిరారు. -
కాంగ్రెస్ చిల్లర వేషాలకు భయపడం: జగదీష్ రెడ్డి
సాక్షి, నల్లగొండ: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అలాగే, ఇది కాంగ్రెస్ చేసిన పనే అంటూ తీవ్ర ఆరోపణలు చేశారుకాగా, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి శనివారం నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల చిల్లర వేషాలకు మేము భయపడం. ఎంతో మంది రాక్షసులకు తరమికొట్టాం. రుణమాఫీ విషయంలో అన్నదాతలను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని పక్కదారి పట్టించేలా ఈ దాడులు మొదలు పెట్టింది. రుణమాఫీ విషయంలో రైతులను నమ్మించి గొంతు కోశారు.సీఎం రేవంత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. బీజేపీతో రేవంత్ దొంగ సంబంధాలు పెట్టుకున్నాడు. బీజేపీతో రేవంత్ కుమ్మకయ్యాడు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు పెద్ద దొంగలా బీజేపీతో ములాఖత్ అయ్యావు. రాష్ట్రంలో హింస ప్రేరేపించేలా రేవంత్ ప్రయత్నం చేస్తున్నాడు. అన్నదాతలను దొంగల్లాగా క్రియేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. జిల్లాలో అన్ని పార్టీల్లానే మేం ఆఫీసును కట్టుకున్నాం. మా పార్టీ ఆఫీసును కులుస్తా అనడం సమంజసం కాదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
సభలో సవాల్.. జగదీష్ రెడ్డి Vs మంత్రి కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సీఎం రేవంత్, మంత్రులు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య వాడీవేడి చర్చ నడిచింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. దీంతో, ఆరోపణలు నిజమైతే రాజీనామాలకు సిద్ధమని జగదీష్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ చేసుకున్నారు.కాగా, విద్యుత్ అంశంపై చర్చలో భాగంగా గత ప్రభుత్వంపై సీఎం రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్‌కు కౌంటరిచ్చారు.జగదీష్ రెడ్డి కామెంట్స్..సంచుల మూటలు పట్టుకుని దొరికిన వ్యక్తి.చర్లపల్లి జైలుకు వెళ్లిన విషయాలను రేవంత్ గుర్తు చేసుకుంటున్నారు.మేము తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లాను.మేము తెలంగాణ కోసం ఎన్నో మంచి పనులు చేశాను. జగదీష్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్..జగదీష్ రెడ్డి సూర్యాపేటలో దారుణాలు చేశారు.ఆయనపై మర్డర్ కేసులు కూడా ఉన్నాయి.మా జిల్లా నుంచి ఏడాది బహిష్కరించారు.దీంతో, సభలో గందరగోళం నెలకొంది.నేను చెప్పిన కేసులో జగదీష్ రెడ్డి 16 ఏళ్లు కోర్టుల చుట్టూ తిరిగాడు. జగదీష్ రెడ్డి కౌంటర్..నాపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే, రాజకీయాల నుంచి తప్పుకుంటాను.సభలో ముక్కు నేలకు రాసి వెళ్లిపోతాను.కోమటిరెడ్డి తన ఆరోపణలు నిరూపించాలి.నాపై కాంగ్రెస్ ప్రభుత్వం మూడు కేసులు పెట్టింది.మూడు కేసుల్లో కోర్టు నన్ను నిర్దోషిగా ప్రకటించింది.సభలో ఆరోపణలపై హౌస్ కమిటీ వేయండి.మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడు.మీలాగా డబ్బుల సంచులు పట్టుకుని తిరగలేదు.కోమటిరెడ్డి మాటలను రికార్డు నుంచి తొలగించాలి. కోమటిరెడ్డి కామెంట్స్..జగదీష్ రెడ్డి ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నాను.నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.నేను చేసిన ఆరోపణలను నిరూపిస్తాను.ఒకవేళ నిరూపించలేకపోతే మంత్రి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. అంతకుముందు సీఎం రేవంత్ మాట్లాడుతూ.. కరెంట్ కొనుగోళ్లపై ఎంక్వైరీ చేయమని అడిగింది మీరే.సత్యహరిశ్చంద్రుడు మా నాయకుడి రూపంలో పుట్టారన్నట్టు మాట్లాడారు.జ్యుడీషియల్ కమిషన్ ముందుకెళ్లి మీ వాదన వినిపించి ఉంటే మీ నిజాయితీ తెలిసేది.కానీ, మీరు కమిషన్ విచారణే వద్దు చేయాలని హైకోర్టుకు వెళ్లారు.కోర్టు దాన్ని కొట్టేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు.విచారణ కొనసాగించాల్సిదేనని సుప్రీంకోర్టు కూడా చెప్పింది.కమిషన్ ఛైర్మన్‌ను మాత్రమే మార్చాలని సుప్రీంకోర్టు చెప్పింది.సాయంత్రంలోగా విద్యుత్ కమిషన్‌కు కొత్త ఛైర్మన్ పేరును ప్రకటిస్తాం.తెలంగాణను సంక్షోభం నుంచి కాపాడింది సోనియా గాంధీ, జైపాల్ రెడ్డి మాత్రమే.సోనియా గాంధీ దయ వల్ల రాష్ట్రం కరెంట్ సమస్య నుంచి గట్టెక్కింది.లేనిపక్షంలో తెలంగాణ చీకటిమయమయ్యేది.నాడు నేను టీడీపీలో ఉన్నా అసెంబ్లీలో వాస్తవాలు చెప్పాను. దీంతో, నన్నుమార్షల్స్ను పెట్టి బయటకు ఇడ్చుకెళ్లారు. సోలార్ పవర్లో ప్రైవేటు పెట్టుబడులు వచ్చాయి. దీంతో, కరెంట్ ఉత్పత్తి పెరిగింది. సిగ్గులేకుండా ఇంకా మేము విద్యుత్ ఉత్పత్తి చేశామని చెప్పుకుంటున్నారు.బీహెచ్ఈఎల్ నుంచి సివిల్ వర్క్‌లు వాళ్లకు కావాల్సిన వాళ్లకు ఇచ్చారు.ఆఖరికి అటెండర్ పోస్టులు కూడా వాళ్ల బినామీలకే ఇచ్చారు.ఈ సందర్భంగా వాళ్లకు కావాల్సిన వాళ్లకు అనుమతులు ఇచ్చారు. ఇక్కడేవిచారణ అంటే భయపడి కోర్టుకు వెళ్లారు.టెండర్ ఇచ్చి తొమ్మిదేళ్లు అయినా ఇంకా విద్యుత్ ఉత్పత్తి కాలేదు.ఇండియా బుల్స్ నుంచి రూ.1000 కోట్లు దండుకున్నారు.భద్రాద్రి పవర్ ప్లాంట్ ఇప్పటికీ నీళ్లలో మునిగిపోతోంది. -
కాంగ్రెస్ Vs జగదీష్ రెడ్డి.. అసెంబ్లీలో ‘పవర్’ వార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ విద్యుత్ రంగంపై చర్చ జరుగుతోంది. ఈ సందర్బంగా కాంగ్రెస్ నేతలు వర్సెస్ జగదీష్ రెడ్డి అనే విధంగా చర్చ నడుస్తోంది. నేతల మధ్య పవర్ వార్ జరుగుతోంది.విద్యుత్ రంగంపై చర్చను మొదట కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు.రాజగోపాల్ రెడ్డి కామెంట్స్..గత ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది.అందుకే పవర్ సెక్టార్ గందరగోళంగా మారింది.రైతులకు ఉచిత కరెంట్ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే.విద్యుత్ రంగం అస్తవ్యస్తమైంది.యూపీఏ ప్రభుత్వం నిర్ణయం వల్ల 1800 మెగావాట్ల అదనపు కరెంట్ రాష్ట్రానికి వచ్చింది.కేసీఆర్ ఎందుకు రాలేదంటే, మీ స్థాయికి మేము చాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు.ఇంత పెద్ద విషయంపై చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ సభకు రాలేదు.మీ స్థాయి ఏంటో ప్రజలు మీకు చెప్పారు.కనీసం అధికారులు కూడా మిమ్మల్ని పట్టించుకోలేదు.చేసిన తప్పులు చాలవని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.విద్యుత్ సంస్థలు ఎందుకు నష్టాల్లోకి వెళ్లాయి?.ఉచిత కరెంట్ ఇచ్చామని బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటోంది.ప్రతిపక్షంలో ఉండి ఇప్పటికైనా ప్రభుత్వానికి సహకరించాలి.విద్యుత్ సంస్థలు ఎందుకు నష్టాల్లోకి వెళ్లాయి?.ఉచిత కరెంట్ ఇచ్చామని బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటోంది.ప్రతిపక్షంలో ఉండి ఇప్పటికైనా ప్రభుత్వానికి సహకరించాలి.గనులకు 250 కి.మీలకు దూరం ఉన్న దామెరచెర్ల దగ్గర పవర్ ప్లాంట్ ఎందుకు పెట్టారు?.యాదాద్రి పవర్ ప్లాంట్ ఇప్పటికీ వినియోగంలోకి రాలేదు.పవర్ ప్లాంట్‌లో టెండర్ వ్యవస్థ లేదు. పారదర్శకత లేదు. అనంతరం, జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..ఇప్పటి వరకు డిమాండ్ బుక్స్ ఇవ్వలేదు.దేనిపై మాట్లాడాలో అర్థం కావడం లేదుచర్చించడానికి సమయం లేదంటున్నారు.పది రోజుల ముందే సభ పెడితే ఏమయ్యేది: జగదీష్ రెడ్డి.ఒకేరోజు 19 పద్దులపై చర్చ పెట్టడం సమంజసమేనా?.మీటర్ల విషయంలో సీఎం రేవంత్ సభను తప్పుదోవ పట్టించారు.కరెంట్ తలసరి వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది.ఉదయ్ స్కీమ్‌లో 27 రాష్ట్రాలు చేరాయి.స్మార్ట్ మీటర్లతో డిస్కంలు చేరాయి. మీటర్ల విషయంలో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు.ఒప్పందంలో వాళ్లకు అనుకూలమైన అంశాలను మాత్రమే చెప్పారు.తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో 24 గంటలు విద్యుత్ అందించామన్నారు.అంతకుముందు మధ్యలో..డిమాండ్ బుక్స్ నిన్నే రాత్రే పంపించామని స్పీకర్ చెప్పారు.మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. డిమాండ్ బుక్స్ ఇప్పటికే పంపించాం.పదేళ్లలో రేపు చర్చ ఉండే ఈరోజు రాత్రి 10 గంటలకు వచ్చి మాకు బుక్స్ ఇచ్చేవారు. ఇదే సమయంలో హరీష్ రావు మాట్లాడటంతో శ్రీధర్ బాబు ఫైర్.హరీష్ రావు బుల్డోడ్ చేసేపని పెట్టుకున్నారు.ఇది మానుకోవాలి. సభను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు.మీరు త్వరగా ఇంటికి వెళ్తే మేమేం చేస్తాం అంటూ కౌంటర్.. -
సీనియర్ కాంగ్రెస్ నాయకుడి మృతి
సాక్షి, మహబూబ్ నగర్: మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగదీశ్వర్ రెడ్డి మృతి చెందారు. అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా హైద్రాబాద్ నీమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం తుది శ్వాస విడిచారు. జగదీశ్వర్ రెడ్డి.. రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా పనిచేశారు. -
జగదీష్ రెడ్డి మంత్రి హోదాను మరిచిపోయారు
సాక్షి, హైదరాబాద్ : ‘తెలంగాణ రాష్ట్రం సోనియాగాంధీ ప్రజలకు ఇచ్చిన బహుమతి. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం తప్ప ఎవ్వరూ బాగుపడలేదు. గత ఆరేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు అబద్ధాలు మాట్లాడుతూ దబాయించడం అలవాటు అయింది’ అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘ప్రతి విషయంలో టీఆర్ఎస్ నేతలు బూటకపు మాటలు చెబుతూ వస్తున్నారు. నిన్న నల్గొండలో నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మంత్రి జగదీష్ రెడ్డి నాపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఈ ఏడాది రైతులకు ఒక్క రూపాయి రుణమాఫీ జరగలేదు. రుణామఫీపై ప్రశ్నిస్తే జగదీష్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రుణంలేని వాళ్లకు కూడా ఎకరానికి ఇంత అని కూడా ఇచ్చింది. రుణమాఫీ ఏకకాలంలో చేయాలని కాంగ్రెస్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. 1.82లక్ష కోట్ల బడ్జెట్లో రుణమాఫీ ఏకకాలంలో ఎందుకు చేయదో ప్రభుత్వం చెప్పదు. ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వం ఏర్పాటైన గంటలోపే రూ.11వేల కోట్ల రుణమాఫీ ఏకకాలంలో చేసింది. (నువ్వెంత.. నువ్వెంత?) 2018 ఎన్నికల్లో గెలుపు కోసమే ఆనాడు 90శాతం రుణమాఫీ చేశారు. ఎన్నికల తర్వాత ఎప్పుడూ రుణమాఫీ పూర్తిస్థాయిలో జరగలేదు. నల్గొండ డివిజన్లో రైతు రుణబంధు కింద రూ.62 కోట్లు అయితే 35 కోట్లు మాత్రమే అయింది. ఇక రబీ సీజన్లో ఒక్క డివిజన్‌లోనే 75 కోట్లు కావాలంటే 50కోట్లు మాత్రమే ఇచ్చారు. ధాన్యం 1కోటి 4లక్షల మెట్రిక్ టన్నులకు 50లక్షలు మాత్రమే కొనుగోలు చేశారు. 30వేల కోట్లు కేటాయిస్తే, కేవలం 10వేల కోట్లు మాత్రమే ఖర్చు అయ్యాయి. గత ఏడాది నాలుగు లక్షల ఎకరాల్లో పత్తి పెడితే రైతులు అమ్మడానికి ఇబ్బంది పడ్డారు. ఈ ఏడాది 70లక్షల ఎకరాల్లో పత్తి పెట్టాలని సీఎం అంటున్నారు. పత్తి కొనుగోళ్లు విషయంపై ప్రభుత్వం రైతులకు స్పష్టమైన హామీ, ప్రణాళిక ఇవ్వాలి. ఛత్తీస్‌గఢ్ రైతులు తెలంగాణకి వచ్చి పంట అమ్ముకుంటున్నారనేది పచ్చి అబద్ధం. (కాంగ్రెస్‌లో మళ్లీ పీసీసీ ‘లొల్లి’!) రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా సన్న రకాల ధాన్యం పండించాలని అంటుంది కానీ రైతులకు హామీ ఇవ్వడం లేదు. మూడు నెలల క్రితం ప్రభుత్వం కొన్న కందుల రైతులకు నిధులు ఇవ్వలేదు. వెంటనే బకాయిలు విడుదల చేయాలి. పసుపు రైతుల విషయంలోనూ సీఎం కేసీఆర్ మాట తప్పారు. నల్గొండ జిల్లా బత్తాయి రైతుల సమస్యలకు ముఖ్యమంత్రితో పాటు మంత్రి జగదీష్ రెడ్డే కారణం. టీఆరెస్ ప్రభుత్వం ఏర్పాటు తరువాత ఇరిగేషన్ అభివృద్ధి జరిగినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనే 75లక్షల ఎకరాల ఇరిగేషన్ ఆయకట్టు ఉంది. 2009లో నాపై పోటీ చేసి ఓడిపోయిన బాధ ఇంకా జగదీష్ రెడ్డి మర్చిపోనట్లు ఉన్నారు. నేను కూడా మంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశారు. జగదీష్ రెడ్డి నిన్నమంత్రి హోదాను మరిచి వ్యవహరించారు. రుణమాఫీ చేయలేదు అని నేను ప్రశ్నించాను. మేము నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నాము’ అని అన్నారు. (ప్రభుత్వానికి సోయి వస్తలేదు) -
‘ఎక్స్ అఫీషియో ఓటు నమోదు’పై వివాదం
సాక్షిప్రతినిధి, సూర్యాపేట: నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో సభ్యునిగా ఓటు హక్కు నమోదుపై నెలకొన్న వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్‌రావు ఇక్కడ ఓటు హక్కు నమోదుకోసం దరఖాస్తు పెట్టుకోగా జాబితాలో ఆయన పేరులేదని కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగింది. మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందనే ఉద్దేశంతో కావాలనే మంత్రి జగదీశ్‌రెడ్డి, అధికారులు కుమ్మకై ఆయన పేరును తొలగించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. కేవీపీ పేరును తొలగించి అధికార యంత్రాంగం నిబంధనలను ఉల్లంఘించిందని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూర్యాపేటలోని కలెక్టర్ క్యాం పు కార్యాలయం ఎదుట ఆదివారం రాత్రి 10.30 గంటలకు కాంగ్రెస్ శ్రేణులతో కలసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి జగదీశ్‌రెడ్డి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నేరేడుచర్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉందన్న అక్కసుతో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారన్నారు. -
నిమ్స్‌లో జగదీశ్ రెడ్డికి కేటీఆర్ పరామర్శ
సాక్షి, హైదరాబాద్ : నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని బుధవారం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. హై ఫీవర్‌తో నిమ్స్‌లో చికిత్స పొందుతున్న మంత్రిని పరామర్శించిన కేటీఆర్... ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేటీఆర్‌తో పాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్‌తో పాటు పలువురు పార్టీ నేతలు జగదీశ్ రెడ్డిపి పరమర్శించారు. -
రెండోసారి విద్యాశాఖ
సాక్షిప్రతినిధి, సూర్యాపేట : ‘గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా..లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నాకర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్పా ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను.’ అని రాజ్‌భవన్‌లో గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుతం ఆయనకు సీఎం కేసీఆర్విద్యాశాఖను కేటాయించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొలువుదీరిన టీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలోనూ జగదీశ్‌రెడ్డికి విద్యాశాఖను కేటాయించారు. ఆ తర్వాత ఆ శాఖను కడియం శ్రీహరికి ఇచ్చి జగదీశ్‌రెడ్డికి విద్యుత్‌శాఖను అప్పగించారు. ఇప్పుడు మళ్లీ విద్యాశాఖను ఇస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రాజ్‌భవన్‌లో మంగళవారం పది మంది మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించగా అందులో మూడో వ్యక్తి జగదీశ్‌రెడ్డి ఉన్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు జగదీశ్‌రెడ్డి దంపతులిద్దరూ సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయనకు ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, నోముల నర్సింహయ్య, మాజీ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, తిప్పన విజయసింహారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళ్లిక, మార్కెట్ కమిటీ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, నాయకులు బండా నరేందర్‌రెడ్డి, కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, గండూరి ప్రకాశ్, ఓయూ జేఏసీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజుయాదవ్, మున్సిపల్ కౌన్సిలర్లు అభినందనలు తెలిపారు. అనంతరం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఆయనకు కుటుంబ సభ్యులు హారతిపట్టారు. మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సూర్యాపేట పట్టణంలో మున్సిపల్ కౌన్సిలర్లు, నేతలు భారీ ఎత్తున బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కొత్త జిల్లాలో రెండోసారి మంత్రిగా.. సూర్యాపేట నియోజకవర్గ చరిత్రలో ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి, రెండో సారి మంత్రి పదవి దక్కించుకున్న ఏకైక ఎమ్మెల్యేగా జగదీశ్‌రెడ్డి నిలిచారు. ఉమ్మడి జిల్లా పరంగా చూస్తే రెండు, అంతకన్నా ఎక్కువ సార్లు మంత్రులుగా చేసిన వారిలో కొండా లక్ష్మణ్‌బాపూజీ, ఎలిమినేటి మాధవరెడ్డి, రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, కుందూరు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు ఉన్నారు. వీరి తర్వాత ప్రస్తుతం గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచి రెండో సారి మంత్రి పదవి దక్కించుకున్న వారిలో ఉన్నారు. విద్యాశాఖ..మంత్రిగా తెలంగాణ ప్రభుత్వ తొలి కేబినెట్లో తొలి విద్యాశాఖ మంత్రిగా జగదీశ్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. 2014 జూలై 2 నుంచి 2015 జనవరి 29 వరకు విద్యాశాఖ మంత్రిగా కొనసాగారు. ఆతర్వాత ఈ శాఖను కడియం శ్రీహరికి ఇచ్చి.. విద్యుత్ శాఖను జగదీశ్‌రెడ్డికి ఇచ్చారు. అనంతరం ఎస్సీ కులాల అభివృద్ధి శాఖను కూడా ఆయనకు కేటాయించారు. మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వ రెండో కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా ఆయనకు బాధ్యతలు అప్పగించారు. విద్యారంగంపై ఆయనకు పూర్తిగా అవగాహన ఉండడంతో ఈశాఖ ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యమంత్రి అభీష్టం మేరకు.. ఏ శాఖ అయినా మంత్రి మండలిదే సమష్టి బాధ్యతని, ముఖ్యమంత్రి కేసీఆర్ అభీష్టం మేరకే నడుచుకుంటానని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. వ్యవసాయదారుడిగా విద్యుత్‌శాఖ మంత్రిగా విధులు నిర్వహించడం సంతృప్తినిచ్చిందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సీఎం కేసీఆర్ తన మీద పెట్టిన బాధ్యతలతో సత్ఫలితాలు సాధిస్తానన్నారు. రెండోసారి మంత్రి పదవి ఇచ్చినందుకు సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. -
తొలి విడతలోనా.., మలి విడతలోనా?
సాక్షిప్రతినిధి, నల్లగొండ: అమాత్య పదవులపై జిల్లాలో జోరుగా చర్చ జరుగుతోంది. సరిగ్గా నెల రోజుల ముందటే ముగిసిన శాసనసభ ముందస్తు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాలకు గాను, ఏకంగా తొమ్మిది చోట్ల టీఆర్ఎస్ విజయదుందుభి మోగించింది. ఈ తొమ్మిది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో కంచర్ల భూపాల్‌రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్ మాత్రమే తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. గతంలో ఇతర పార్టీల్లోనూ ఎమ్మెల్యేలుగా గెలిచి ఈసారి టీఆర్ఎస్ నుంచి మూడో విజయాన్ని అందుకున్న వారిలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, రెండో విజయాన్ని అందుకున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు ఉన్నారు. ఇక, టీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, గాదరి కిశోర్, గొంగిడి సునిత, పైళ్ల శేఖర్‌రెడ్డి , ఎన్.భాస్కర్‌రావు రెండోసారి విజయాలు సాధించారు. వీరిలో ఈసారి కేబినెట్లో బెర్త్ ఎవరికి ఖరారు అవుతుందన్నదే ఇప్పుడు ప్రధానంగా సాగుతున్న చర్చ. గత 2014 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన జి.జగదీశ్‌రెడ్డి తెలంగాణ తొలి కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఇప్పుడు రెండోసారి కూడా విజయం సాధించారు కాబట్టి ఆయనకు తిరిగి అమాత్య పదవికి దక్కుతుందని, రెండోసారి మంత్రి కావడం ఖాయం అన్నది పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయం. ఉమ్మడి జిల్లా ప్రాతిపదిక మంత్రులను తీసుకుంటారా..? లేక, కొత్త జిల్లాల ప్రాతిపదికన ఎంపిక చేస్తారా అన్న ప్రశ్నపై సరైన సమాధానం ఎవరి వద్దా లేదు. ఒకవేళ నల్లగొండ జిల్లా నుంచి కూడా మంత్రిని తీసుకోవాల్సి వస్తే అవకాశం ఎవరికి తలుపు తడుతుందన్న అంశం చర్చకు ఆస్కారం ఇస్తోంది. రేసులో.. జగదీశ్‌రెడ్డి.. గుత్తా సుఖేందర్‌రెడ్డి ? గతంతో పోలిస్తే.. ఈసారి జిల్లా నుంచి మూడు స్థానాలు అధికంగా టీఆర్ఎస్ గెలుచుకుంది. గత ఎన్నికల్లో గెలిచిన రెండు స్థానాలు నకిరేకల్, మునుగోడును కోల్పోయినా, తొలిసారి మిర్యాలగూడ, కోదాడ, నాగార్జున సాగర్, దేవరకొండ, నల్లగొండ స్థానాలను దక్కించుకుంది. ఇద్దరు ఎమ్మెల్యేలు మినహా మిగిలిన వారంతా సీనియర్లుగానే కనిపిస్తుండడంతో మంత్రి పదవి ఎవరికి దక్కుతుందో అన్న ఉత్కంఠ నెలకొన్నా.. ప్రధానంగా రేసులో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఉన్నారని చెబుతున్నారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రస్తుతం రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా కేబినెట్ ర్యాంకులో రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌కు బాధ్యత వహిస్తున్నారు. శాసన మండలి సభ్యుడిగా ఆయనకు అవకాశం కల్పించి, మంత్రి వర్గంలోకి తీసుకుంటారని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది. దీంతో ఉమ్మడి జిల్లాలో ఇద్దరు నాయకులు మంత్రి పదవి రేసులో ఉన్నట్లు అవుతోంది. ఈ ఇద్దరు నేతలకు అవకాశం కల్పిస్తారా..? ఒకవేళ కల్పిస్తే తొలి విడతలో ఎవరిని తీసుకుంటారు..? మలి విడత దాకా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏ నేత ఎదుర్కోనున్నారు అన్న ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి. పార్లమెంటరీ కార్యదర్శులను నియమిస్తే...? తెలంగాణ తొలి ప్రభుత్వంలో మంత్రులకు తోడు పార్లమెంటరీ కార్యదర్శుల పోస్టులను క్రియేట్ చేసి బాధ్యతలు అప్పజెప్పారు. మంత్రులకు సహాయకంగా (ఒక విధంగా సహాయ మంత్రులు) వీరికి శాఖలు కూడా కేటాయించారు. కానీ, కోర్టు కేసు వల్ల ఈ వ్యవస్థను రద్దు చేశారు. ఈసారి చట్టాన్ని మార్చి, కోర్టు గొడవలేం లేకుండా, పార్లమెంటరీ కార్యదర్శుల వ్యవస్థకు ఊపిరి పోస్తారన్న వార్తలు వెలువడుతున్నాయి. ఒకవేళ ఈ అంశం నిజరూపం దాలిస్తే.. అవకాశం ఎవరికి దక్కుతుందన్న చర్చా నడుస్తోంది. గతంలో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కు పార్లమెంటరీ కార్యదర్శి పదవి దక్కింది. మరోవైపు గత శాసన సభలో ప్రభుత్వ విప్‌గా ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునిత బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుత ప్రభుత్వంలో వీరికి ఏ పదవులు దక్కుతాయన్న అంచనాలు మొదలయ్యాయి. ఈనెల 18వ తేదీన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయన్న వార్తల నేపథ్యంలో జిల్లాలో నేతల అవకాశాలపై జోరుగా చర్చ జరుగుతోంది. -
‘ఉత్తమ్‌ను సొంత పార్టీ వారే నమ్మడం లేదు’
సాక్షి, సూర్యాపేట : కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే 2014కు ముందు జరిగిన పరిణామాలే పునరావృతమవుతాయని టీఆర్ఎస్ నాయకుడు, ఆపద్ధర్మ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనపై ఢిల్లీ పెత్తనమేంది, తెలుగు వారి ఆత్మగౌరవం కాపాడుకోవాలి అంటూ కాంగ్రెస్‌ను వ్యతిరేకిస్తూ పురుడు పోసుకున్న టీడీపీ ఇప్పుడు వారితోనే అంటకాగడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు కుట్రలో కాంగ్రెస్ బందీ అయిందని... ఆయనతో పొత్తు పెట్టుకున్న పార్టీకి ఓటేస్తే 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్ వద్దని అగ్రిమెంట్ చేసుకున్నట్టే అవుతుందని వ్యాఖ్యానించారు. ఇక టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిని సొంత పార్టీ వారే నమ్మడం లేదని, ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఏం చెబుతారో ఎవరికీ అర్థం కాదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకుల పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని పేర్కొన్నారు. -
పేదల అభ్యున్నతికి కృషి
సూర్యాపేట : పేదల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖామాత్యులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన బడుగుల లింగయ్యయాదవ్ తొలిసారిగా సూర్యాపేటకు రావడంతో ఆయన ఆత్మీయ ఆహ్వానం పలికారు. అనంతరం స్థానిక తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడారు. పక్క రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు అంటేనే వందల కోట్ల రూపాయలు చేతులు మారాయన్నారు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే ఆర్థికంగా భయపడే వారినే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపిక చేశారని చెప్పారు. ఇంటి పేరులోనే బడుగుల ఉన్న బడుగు బలహీన వర్గాలకు టీఆర్ఎస్ పార్టీ ప్రాధాన్యం కల్పిస్తుందనడానికి బడుగుల లింగయ్యయాదవ్ ఎంపికే నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. మరో అభ్యర్థి బండా ప్రకాష్ కూడా బడుగు బలహీన వర్గానికి చెందిన అది ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే అన్నారు. కేసీ ఆర్కు నీడలా ఉండే జోగినేపల్లి సంతో ష్‌కుమార్ మూడో అభ్యర్థని చెప్పారు. రాజ్యసభకు ఈ తరహా అభ్యర్థులను ఎంపిక చేసి రాజకీయాల్లో పారదర్శకతను నిరూపించుకున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలోనే ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగంలో 51 శాతం బడుగు, బలహీన , హరిజన, గిరిజన మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్లను రూపొందించుకున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ మాత్రమే అని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివా స్‌గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక, మార్కెట్ చైర్మన్ వైవి, నాయకులు గండూరి ప్రకాష్, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, వర్ధెల్లి శ్రీహరి, వట్టె జానయ్యయాదవ్, పోలెబోయిన నర్సయ్యయాదవ్, చనగాని రాంబాబుగౌడ్, ఉప్పల ఆనంద్, బైరు దుర్గయ్యగౌడ్, కక్కిరేణి నాగయ్యగౌడ్, జీడి భిక్షం, బైరబోయిన శ్రీనివాస్, గోదల రంగారెడ్డి, పుట్టా కిషోర్‌నాయు డు, రమాకిరణ్‌గౌడ్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
‘20 ఏళ్లుగా కోమటిరెడ్డి రౌడీయిజం’
సాక్షి, హైదరాబాద్: నల్లగొండలో ఎప్పుడు ఉపఎన్నిక జరిగినా టీఆర్ఎస్దే గెలుపని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ కనీసం 40 వేల మెజార్టీతో గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 20 ఏళ్లుగా కోమటిరెడ్డి నల్లగొండలో రౌడీయిజం చేస్తున్నారని విమర్శించారు. ఈ రౌడీయిజానికి ఫుల్స్టాప్ పడే సమయం వచ్చిందని ఆయన తెలిపారు. కాగా, అధికార పార్టీలో ఉప ఎన్నికల హడావిడి మొదలైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, కోమటిరెడ్డిల సభ్యత్వాల రద్దు అనంతరం.. వారిద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలంపూర్, నల్లగొండ స్థానాలు రెండూ ఖాళీ అయినట్టు తెలంగాణ ప్రభుత్వం మంగళవారమే ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందించింది. దీంతో ఉప ఎన్నికపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ వ్యవహారంపై ఈసీ ఇంకా స్పందిచనప్పటికీ టీఆర్ఎస్లో మాత్రం టికెట్ల వ్యవహారం తారాస్థాయికి చేరింది. -
వాళ్లు ప్రగతి నిరోధకులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్నవి ప్రతిపక్ష పార్టీలు కావని.. ఆ పార్టీల నేతలు ప్రగతి నిరోధకులని విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి దుయ్యబట్టారు. అర్థం చేసుకునే విజ్ఞత ప్రజలకు ఉందని, అందుకే బారులు కట్టి మరీ టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పలువురు నేతలు టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణభవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో మంత్రి వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎల్పీ నేత జానారెడ్డికి ప్రధాన అనుచరుడైన నిడమనూరు మండల అధ్యక్షుడు దాసరి నరసింహ టీఆర్ఎస్లో చేరారు. అదే నియోజకవర్గంలోని పెద్దవూర మండలం కొత్తలూరు సర్పంచ్ ఒద్దిరెడ్డి రవీందర్‌రెడ్డి, సిరసనగండ్ల సర్పంచ్ పవన్‌కుమార్‌లతో పాటు నెల్లికల్ మాజీ సర్పంచ్ జఠావత్ పంతులు నాయక్, త్రిపురారం మండల టీడీపీ అధ్యక్షుడు కె.వెంకటేశ్వర్లు కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. -
దావాను ఎదుర్కొంటా: పొన్నం
-
దావాను ఎదుర్కొంటా: పొన్నం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి తనపై వేసిన పరువు నష్టం దావాను న్యాయపరంగా ఎదుర్కొంటానని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. జగదీశ్‌రెడ్డిపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ జరిపితే ఆధారాలతో సహా రుజువు చేస్తానని చెప్పారు. కరీంనగర్లో గురువారం మీడియాతో మాట్లాడుతూ జగదీశ్‌రెడ్డికి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహిస్తే వాస్తవాలు బయటకొస్తాయన్నారు. ఒకవేళ తన తప్పుందని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బోగస్ అని, తాను హిట్లర్‌కు అయ్యనని చెప్పిన కేసీఆర్ ఆ నిధులను ఎందుకు విడుదల చేశారని ప్రశ్నించారు. నిధులు విడుదల చేయడం వెనుక జరిగిన బాగోతానికి సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలున్నాయని, ప్రభుత్వం దీనిపై ఓ కమి టీ వేసి విచారణ జరిపితే నిరూపిస్తానని చెప్పారు. రైల్వే బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పాలని టీఆర్ఎస్ నేతలను డిమాం డ్ చేశారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను సా ధించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నిరసన తెలపలేని దుస్థితిలో ఉన్న టీఆర్ఎస్ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. -
పొన్నంపై జగదీశ్‌రెడ్డి దావా
సూర్యాపేట: కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌పై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పరువు నష్టం కేసు దాఖలు చేశారు. కొద్దిరోజులుగా నిరాధార ఆరోపణలు చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్న పొన్నంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గురువారం ఆయన నల్లగొండ జిల్లా సూర్యాపేట ప్రథమశ్రేణి న్యాయమూర్తి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేశారు. స్వతహాగా న్యాయవాదైన జగదీశ్‌రెడ్డి.. సూర్యాపేటలో సొంతంగా కేసు దాఖలు చేశారు. అనంతరం కోర్టు ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 21 నుంచి పొన్నం ప్రభాకర్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నాడని తెలిపారు. ఈ విషయమై ఆరోపణలు రుజువు చేయాలని, లేకుంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ ఆయన వైఖరిలో మార్పు కనిపించడం లేదన్నారు. పైగా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. పొన్నం ప్రభాకర్‌పై ఐపీసీ సెక్షన్ 499, 500 కింద చర్యలు తీసుకోవాలని ప్రథమ శ్రేణి న్యాయమూర్తి డి.కిరణ్‌కుమార్‌కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. కేసును స్వీకరించిన న్యాయస్థానం పరిశీలన అనంతరం తగిన ఉత్తర్వులు వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపినట్టు ఆయన తెలిపారు. -
'క్షమాపణ చెప్పకుంటే...క్రిమినల్ కేసు పెడతా'
-
'క్షమాపణ చెప్పకుంటే...క్రిమినల్ కేసు పెడతా'
హైదరాబాద్ : తనపై అసత్య ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే క్రిమినల్ కేసు పెడతానని ఆయన ఆదివారమిక్కడ హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు విద్యాశాఖకు సంబంధంలేదన్న మంత్రి.. కనీస పరిజ్ఞానం లేకుండా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ అంశం ఏ శాఖ కిందకు వస్తుందో ముందుగా పొన్నం ప్రభాకర్ తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. -
మంత్రి గంటా విజ్ఞతకే వదిలేస్తున్నాం...
హైదరాబాద్ : రాష్ట్ర విభజన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి విషయంలోనూ గిల్లికజ్జాలు పెట్టుకుంటోందని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం చేసిన చట్టాలు నచ్చినా, నచ్చకున్నా తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఉంటుందన్నారు. ఏపీ ప్రభుత్వమే ప్రతి విషయాన్ని రాద్దాంతం చేస్తోందని ఆయన విమర్శించారు. ఏకపక్షంగా ఎంసెట్ షెడ్యూల్ విడుదల చేసి తమను తప్పుపట్టడాన్ని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ఎంసెట్ సహా అన్ని సెట్ల షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. తెలంగాణలో ఎంసెట్ నిర్వహిస్తూనే ఏపీలో కూడా నిర్వహిస్తామని, విభజన చట్టం ప్రకారం అన్ని హక్కులు తమకే ఉన్నాయని జగదీశ్ రెడ్డి తెలిపారు. -
ఎంసెట్ వివాదంపై గవర్నర్‌తో జగదీశ్ భేటీ
హైదరాబాద్ : తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి శుక్రవారం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఎంసెట్ వివాదంపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి నేతృత్వంలో ఎంసెట్-2015తో పాటు ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సెట్)ల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. గవర్నర్ ను కలిసిన అనంతరం జగదీష్ రెడ్డి... ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. గవర్నర్ తో భేటీ వివరాలను మంత్రి ఈ సందర్భంగా కేసీఆర్ కు తెలియచేశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి చైర్మన్‌గా ఉండే ఎంసెట్ ప్రవేశాల కమిటీలో ఏపీ సర్కారు ప్రతినిధిని కూడా చేర్చాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ బుధవారం జీవో 33 జారీ చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఎంసెట్ నిర్వహణపై రెండు రాష్ట్రాలు పట్టువీడకపోవటంటో ఈ పంచాయితీ గవర్నర్ వద్దకు చేరింది. ఈ నేపథ్యంలో జగదీశ్ రెడ్డి...గవర్నర్‌తో భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది. -
జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు అనాగరికం: గంటా
-
జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు అనాగరికం: గంటా
హైదరాబాద్ : తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలను మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు సరికావని, ఆయన వాడిన పదాలు అనాగరికంగా ఉన్నాయన్నారు. విద్యార్థుల భవిష్యత్ కోసం రెండడుగులు వెనక్కి వేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు బుధవారం ఏపీ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఓ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉండి అలా మాట్లాడటం సరికాదని అన్నారు. ఎంసెట్‌ను ఉమ్మడిగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని, సమస్యను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని, అక్కడ కూడా పరిష్కారం కాకపోతే కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి గంటా అన్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణలో కూడా తెలంగాణ ప్రభుత్వం ఇలాగే వ్యవహరించిందన్నారు. తెలంగాణ ఉన్నత విద్యామండలికి గుర్తింపు లేదని...ఇక పరీక్షలు ఎలా నిర్వహిస్తారని మంత్రి ప్రశ్నించారు. -
మేమే నిర్వహించుకుంటాం
తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌పై మంత్రి జగదీశ్‌రెడి ఎంసెట్ ప్రవేశాల నోటిఫికేషన్‌తో మాకు సంబంధం లేదు సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌ను మేమే నిర్వహించుకుంటాం.. ఈ విషయంలో ఉన్నత విద్యామండలి ప్రకటించిన షెడ్యూల్‌తో మాకు సంబంధం లేదు. ఆ కౌన్సెలింగ్‌లో తెలంగాణ విద్యార్థులు పాల్గొనాల్సిన అవసరం లేదు.. తెలంగాణ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, విద్యామండలి చైర్మన్ కలిసి ఆడుతున్న నాటకమిది..’’ అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అసలు కాలేజీలకు అనుమతులు ఇవ్వకముందే కౌన్సెలింగ్ ప్రక్రియ ఏమిటని ప్రశ్నించింది. తెలంగాణలోని కళాశాలలను తనిఖీ చేసి, అఫిలియేషన్ ఇచ్చిన అనంతరం ప్రవేశాల ప్రక్రియను చేపడతామని తెలిపింది. ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ధ్రువపత్రాల పరిశీలనకు ఎంసెట్ కన్వీనర్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో... ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మంత్రి జగదీశ్ రెడ్డి సమావేశమయ్యారు. గత నాలుగేళ్లలో ఎప్పుడూ ప్రవేశాలు ఆగస్టు కంటే ముందు జరగలేదని ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి సీఎంకు తెలియజేశారు. ఉన్నత విద్యా మండలికి, ప్రభుత్వానికి మధ్య వివాదం వచ్చినపుడు... ప్రభుత్వానిదే అంతిమ నిర్ణయం అవుతుందని ‘ఉన్నత విద్యామండలి చట్టం-1988’ సెక్షన్ 18 (2)లోనే ఉందని వివరించారు. ఏపీ ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఉన్నత విద్యా మండలి తీసుకుంటున్న నిర్ణయాలపై సీఎంతో దాదాపు మూడు గంటలపాటు చర్చించారు. అనంతరం జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రా, ఇతర రాష్ట్ర విద్యార్థులకంటే తెలంగాణ విద్యార్థులకు మెరుగైన, నాణ్యమైన విద్య అందిస్తామని... ఇందుకు సీఎం కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారని వివరించారు. కౌన్సెలింగ్ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ ఉన్నత విద్యా మండలి గందరగోళం సృష్టిస్తోందని పేర్కొన్నారు. తెలంగాణలో సీట్లు కేటాయించే అధికారం ఏపీకి, ఏపీ ఉన్నత విద్యా మండలికి లేదని.. ఆంధ్రా ప్రభుత ్వం నిర్వహించే కౌన్సెలింగ్‌లో తెలంగాణ విద్యార్థులు పాల్గొనాల్సిన అవసరం లేదని చెప్పారు. మండలి ప్రకటనపై వివరణ ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా... ఇక్కడి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దనే ఉద్ధేశంతో చెబుతున్నామని జగదీశ్‌రెడ్డి వెల్లడించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు తదుపరి చర్యలు ఉంటాయన్నారు. జేఎన్టీయూ నుంచి అనుమతులు వచ్చాకే తెలంగాణలో కౌన్సెలింగ్ ఉంటుదన్నారు. సీఎంను కలిసిన వారిలో మంత్రితో పాటు విద్యాశాఖ అధికారులు ఉన్నారు. -
ప్రైవేటు స్కూల్స్ వల్లే విద్యార్థుల ఆత్మహత్యలు
హైదరాబాద్ : విద్యా ప్రమాణాలు పెంచడంపై తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. అందరికీ నాణ్యమైన విద్య అనే అంశంపై శనివారమిక్కడ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ కొన్ని ప్రైవేటు పాఠశాలలు పరీక్షలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు చదువు చెబుతున్నాయని అన్నారు. పరీక్షల్లో తప్పితే జీవితమే లేదన్నట్లు విద్యాసంస్థలు చేస్తున్నాయని జగదీష్ రెడ్డి అన్నారు. ప్రయివేట్ విద్యాసంస్థల ఒత్తిడి వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. నాణ్యమైన విద్య అంటే ప్రశ్నలు...సమాధానాలే కాదని ఆయన అన్నారు. -
'చంద్రబాబు పట్ల అప్రమత్తంగా ఉండాలి'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఎంసెట్ కౌన్సిలింగ్‌పై చంద్రబాబు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జగదీష్ రెడ్డి మంగళవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులను మోసం చేస్తున్న చరిత్ర చంద్రబాబుది అన్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ ఆలస్యానికి బాబే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు పట్ల అప్రమత్తంగా ఉండాలని జగదీష్ రెడ్డి సూచించారు. రుణమాఫీ సాధ్యం కాదని ఎన్నికలకు ముందే కొన్ని పార్టీలు చెప్పినా... తాను ఆర్థిక నిపుణుడని చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలపై ఆ రాష్ట్ర జనాలు నిలదీస్తారనే భయంతోనే బాబు తెలంగాణపై అకారణంగా నిందలు వేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేస్తారో లేదో ముందు చంద్రబాబు తేల్చాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థుల స్థానికతను చంద్రబాబు ఎలా నిర్ణయిస్తారని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణలో స్థానికతపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అవసరమేంటని అడిగారు. తాము ఫీజు రియింబర్స్‌మెంట్ పథకాన్ని కొనసాగించడం లేదనిచ ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తామని జగదీష్ రెడ్డి మరోసారి పునరుద్ఘాటించారు. పేద విద్యార్థులను ఎలా ఆదుకోవాలో తమకు స్పష్టత ఉందన్నారు. తెలంగాణ హక్కుల పరిరక్షణ కొరకు తమ ప్రభుత్వం ఏ పోరాటానికైనా సిద్ధమని తేల్చిచెప్పారు. తమ హక్కులు, భూములు, ఉద్యోగ అవకాశాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని జగదీష్ రెడ్డి అన్నారు. తమ హక్కుల పరిరక్షణ ఎంతటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నామని ఆయన తేల్చి చెప్పారు.