విద్యా ప్రమాణాలు పెంచడంపై తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ : విద్యా ప్రమాణాలు పెంచడంపై తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. అందరికీ నాణ్యమైన విద్య అనే అంశంపై శనివారమిక్కడ నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ కొన్ని ప్రైవేటు పాఠశాలలు పరీక్షలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు చదువు చెబుతున్నాయని అన్నారు. పరీక్షల్లో తప్పితే జీవితమే లేదన్నట్లు విద్యాసంస్థలు చేస్తున్నాయని జగదీష్ రెడ్డి అన్నారు. ప్రయివేట్ విద్యాసంస్థల ఒత్తిడి వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. నాణ్యమైన విద్య అంటే ప్రశ్నలు...సమాధానాలే కాదని ఆయన అన్నారు.