
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్నవి ప్రతిపక్ష పార్టీలు కావని.. ఆ పార్టీల నేతలు ప్రగతి నిరోధకులని విద్యుత్‌శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి దుయ్యబట్టారు. అర్థం చేసుకునే విజ్ఞత ప్రజలకు ఉందని, అందుకే బారులు కట్టి మరీ టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు.
నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పలువురు నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణభవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో మంత్రి వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
సీఎల్పీ నేత జానారెడ్డికి ప్రధాన అనుచరుడైన నిడమనూరు మండల అధ్యక్షుడు దాసరి నరసింహ టీఆర్‌ఎస్‌లో చేరారు. అదే నియోజకవర్గంలోని పెద్దవూర మండలం కొత్తలూరు సర్పంచ్ ఒద్దిరెడ్డి రవీందర్‌రెడ్డి, సిరసనగండ్ల సర్పంచ్ పవన్‌కుమార్‌లతో పాటు నెల్లికల్ మాజీ సర్పంచ్ జఠావత్ పంతులు నాయక్, త్రిపురారం మండల టీడీపీ అధ్యక్షుడు కె.వెంకటేశ్వర్లు కూడా గులాబీ కండువా కప్పుకున్నారు.