సాక్షి, హైదరాబాద్: నల్లగొండలో ఎప్పుడు ఉపఎన్నిక జరిగినా టీఆర్‌ఎస్‌దే గెలుపని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ కనీసం 40 వేల మెజార్టీతో గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 20 ఏళ్లుగా కోమటిరెడ్డి నల్లగొండలో రౌడీయిజం చేస్తున్నారని విమర్శించారు. ఈ రౌడీయిజానికి ఫుల్‌స్టాప్ పడే సమయం వచ్చిందని ఆయన తెలిపారు.
కాగా, అధికార పార్టీలో ఉప ఎన్నికల హడావిడి మొదలైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, కోమటిరెడ్డిల సభ్యత్వాల రద్దు అనంతరం.. వారిద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలంపూర్, నల్లగొండ స్థానాలు రెండూ ఖాళీ అయినట్టు తెలంగాణ ప్రభుత్వం మంగళవారమే ఎన్నికల కమిషన్‌కు సమాచారం అందించింది. దీంతో ఉప ఎన్నికపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ వ్యవహారంపై ఈసీ ఇంకా స్పందిచనప్పటికీ టీఆర్‌ఎస్‌లో మాత్రం టికెట్ల వ్యవహారం తారాస్థాయికి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment