కాంగ్రెస్‌ Vs జగదీష్‌ రెడ్డి.. అసెంబ్లీలో ‘పవర్‌’ వార్‌ | Political Comments Exchange Between Congress And BRS At Assembly Session, More Details Inside | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ Vs జగదీష్‌ రెడ్డి.. అసెంబ్లీలో ‘పవర్‌’ వార్‌

Published Mon, Jul 29 2024 11:30 AM | Last Updated on Mon, Jul 29 2024 12:14 PM

Political Comments Exchange Between Congress And BRS At Assembly

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అసెంబ్లీ విద్యుత్ రంగంపై చర్చ జరుగుతోంది. ఈ సందర్బంగా కాంగ్రెస్‌ నేతలు వర్సెస్‌ జగదీష్‌ రెడ్డి అనే విధంగా చర్చ నడుస్తోంది. నేతల మధ్య పవర్‌ వార్‌ జరుగుతోంది.

విద్యుత్‌ రంగంపై చర్చను మొదట కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ప్రారంభించారు.

రాజగోపాల్‌ రెడ్డి కామెంట్స్‌..

  • గత ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది.

  • అందుకే పవర్ సెక్టార్‌ గందరగోళంగా మారింది.

  • రైతులకు ఉచిత కరెంట్‌ తెచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వమే.

  • విద్యుత్‌ రంగం అస్తవ్యస్తమైంది.

  • యూపీఏ ప్రభుత్వం నిర్ణయం వల్ల 1800 మెగావాట్ల అదనపు కరెంట్‌ రాష్ట్రానికి వచ్చింది.

  • కేసీఆర్‌ ఎందుకు రాలేదంటే, మీ స్థాయికి మేము చాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అంటున్నారు.

  • ఇంత పెద్ద విషయంపై చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్‌ సభకు రాలేదు.

  • మీ స్థాయి ఏంటో ప్రజలు మీకు చెప్పారు.

  • కనీసం అధికారులు కూడా మిమ్మల్ని పట్టించుకోలేదు.

  • చేసిన తప్పులు చాలవని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

  • విద్యుత్‌ సంస్థలు ఎందుకు నష్టాల్లోకి వెళ్లాయి?.

  • ఉచిత కరెంట్‌ ఇచ్చామని బీఆర్‌ఎస్‌ గొప్పలు చెప్పుకుంటోంది.

  • ప్రతిపక్షంలో ఉండి ఇప్పటికైనా ప్రభుత్వానికి సహకరించాలి.

  • విద్యుత్‌ సంస్థలు ఎందుకు నష్టాల్లోకి వెళ్లాయి?.

  • ఉచిత కరెంట్‌ ఇచ్చామని బీఆర్‌ఎస్‌ గొప్పలు చెప్పుకుంటోంది.

  • ప్రతిపక్షంలో ఉండి ఇప్పటికైనా ప్రభుత్వానికి సహకరించాలి.

  • గనులకు 250 కి.మీలకు దూరం ఉన్న దామెరచెర్ల దగ్గర పవర్‌ ప్లాంట్‌ ఎందుకు పెట్టారు?.

  • యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ ఇప్పటికీ వినియోగంలోకి రాలేదు.

  • పవర్‌ ప్లాంట్‌లో టెండర్‌ వ్యవస్థ లేదు. పారదర్శకత లేదు. 

అనంతరం, జగదీష్‌ రెడ్డి మాట్లాడుతూ..

  • ఇప్పటి వరకు డిమాండ్‌ బుక్స్‌ ఇవ్వలేదు.

  • దేనిపై మాట్లాడాలో అర్థం కావడం లేదు

  • చర్చించడానికి సమయం లేదంటున్నారు.

  • పది రోజుల ముందే సభ పెడితే ఏమయ్యేది: జగదీష్‌ రెడ్డి.

  • ఒకేరోజు 19 పద్దులపై చర్చ పెట్టడం సమంజసమేనా?.

  • మీటర్ల విషయంలో సీఎం రేవంత్‌ సభను తప్పుదోవ పట్టించారు.

  • కరెంట్‌ తలసరి వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది.

  • ఉదయ్‌ స్కీమ్‌లో 27 రాష్ట్రాలు చేరాయి.

  • స్మార్ట్‌ మీటర్లతో డిస్కంలు చేరాయి. మీటర్ల విషయంలో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు.

  • ఒప్పందంలో వాళ్లకు అనుకూలమైన అంశాలను మాత్రమే చెప్పారు.

  • తెలంగాణలో బీఆర్‌ఎస్‌ హయాంలో 24 గంటలు విద్యుత్‌ అందించామన్నారు.


అంతకుముందు మధ్యలో..

  • డిమాండ్‌ బుక్స్‌ నిన్నే రాత్రే పంపించామని స్పీకర్‌ చెప్పారు.

  • మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. డిమాండ్‌ బుక్స్‌ ఇప్పటికే పంపించాం.

  • పదేళ్లలో రేపు చర్చ ఉండే ఈరోజు రాత్రి 10 గంటలకు వచ్చి మాకు బుక్స్‌ ఇచ్చేవారు.  

  • ఇదే సమయంలో హరీష్ రావు మాట్లాడటంతో శ్రీధర్‌ బాబు ఫైర్‌.

  • హరీష్‌ రావు బుల్డోడ్‌ చేసేపని పెట్టుకున్నారు.

  • ఇది మానుకోవాలి. సభను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు.

  • మీరు త్వరగా ఇంటికి వెళ్తే మేమేం చేస్తాం అంటూ కౌంటర్‌..
     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement