
మంత్రి గంటా విజ్ఞతకే వదిలేస్తున్నాం...
హైదరాబాద్ : రాష్ట్ర విభజన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి విషయంలోనూ గిల్లికజ్జాలు పెట్టుకుంటోందని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం చేసిన చట్టాలు నచ్చినా, నచ్చకున్నా తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఉంటుందన్నారు. ఏపీ ప్రభుత్వమే ప్రతి విషయాన్ని రాద్దాంతం చేస్తోందని ఆయన విమర్శించారు.
ఏకపక్షంగా ఎంసెట్ షెడ్యూల్ విడుదల చేసి తమను తప్పుపట్టడాన్ని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. ఎంసెట్ సహా అన్ని సెట్ల షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. తెలంగాణలో ఎంసెట్ నిర్వహిస్తూనే ఏపీలో కూడా నిర్వహిస్తామని, విభజన చట్టం ప్రకారం అన్ని హక్కులు తమకే ఉన్నాయని జగదీశ్ రెడ్డి తెలిపారు.