సాక్షి, నల్లగొండ: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి హేయమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. అలాగే, ఇది కాంగ్రెస్ చేసిన పనే అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు
కాగా, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి శనివారం నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల చిల్లర వేషాలకు మేము భయపడం. ఎంతో మంది రాక్షసులకు తరమికొట్టాం. రుణమాఫీ విషయంలో అన్నదాతలను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని పక్కదారి పట్టించేలా ఈ దాడులు మొదలు పెట్టింది. రుణమాఫీ విషయంలో రైతులను నమ్మించి గొంతు కోశారు.
సీఎం రేవంత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. బీజేపీతో రేవంత్ దొంగ సంబంధాలు పెట్టుకున్నాడు. బీజేపీతో రేవంత్ కుమ్మకయ్యాడు. బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుందని పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు పెద్ద దొంగలా బీజేపీతో ములాఖత్ అయ్యావు. రాష్ట్రంలో హింస ప్రేరేపించేలా రేవంత్ ప్రయత్నం చేస్తున్నాడు. అన్నదాతలను దొంగల్లాగా క్రియేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. జిల్లాలో అన్ని పార్టీల్లానే మేం ఆఫీసును కట్టుకున్నాం. మా పార్టీ ఆఫీసును కులుస్తా అనడం సమంజసం కాదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment