ఎంసెట్ వివాదంపై గవర్నర్తో జగదీశ్ భేటీ | telangana minister jagadesh reddy meets governor narasimhan | Sakshi
Sakshi News home page

ఎంసెట్ వివాదంపై గవర్నర్తో జగదీశ్ భేటీ

Published Fri, Jan 2 2015 12:55 PM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM

telangana minister jagadesh reddy meets governor narasimhan

హైదరాబాద్ : తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి శుక్రవారం గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఎంసెట్ వివాదంపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.  కాగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి నేతృత్వంలో ఎంసెట్-2015తో పాటు ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సెట్)ల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. గవర్నర్ ను కలిసిన అనంతరం జగదీష్ రెడ్డి... ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. గవర్నర్ తో భేటీ వివరాలను మంత్రి ఈ సందర్భంగా కేసీఆర్ కు తెలియచేశారు.

తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి చైర్మన్‌గా ఉండే ఎంసెట్ ప్రవేశాల కమిటీలో ఏపీ సర్కారు ప్రతినిధిని కూడా చేర్చాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ బుధవారం జీవో 33 జారీ చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. ఎంసెట్ నిర్వహణపై రెండు రాష్ట్రాలు పట్టువీడకపోవటంటో ఈ పంచాయితీ గవర్నర్ వద్దకు చేరింది. ఈ నేపథ్యంలో జగదీశ్ రెడ్డి...గవర్నర్తో భేటీ కావటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement