
సాక్షి, హైదరాబాద్ : నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్ రెడ్డిని బుధవారం టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. హై ఫీవర్‌తో నిమ్స్‌లో చికిత్స పొందుతున్న మంత్రిని పరామర్శించిన కేటీఆర్... ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేటీఆర్‌తో పాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల‍్క సుమన్‌తో పాటు పలువురు పార్టీ నేతలు జగదీశ్ రెడ్డిపి పరమర్శించారు.