
'క్షమాపణ చెప్పకుంటే...క్రిమినల్ కేసు పెడతా'
తనపై అసత్య ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు.
హైదరాబాద్ : తనపై అసత్య ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే క్రిమినల్ కేసు పెడతానని ఆయన ఆదివారమిక్కడ హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు విద్యాశాఖకు సంబంధంలేదన్న మంత్రి.. కనీస పరిజ్ఞానం లేకుండా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏ అంశం ఏ శాఖ కిందకు వస్తుందో ముందుగా పొన్నం ప్రభాకర్ తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు.