రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి తనపై వేసిన పరువు నష్టం దావాను న్యాయపరంగా ఎదుర్కొంటానని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి తనపై వేసిన పరువు నష్టం దావాను న్యాయపరంగా ఎదుర్కొంటానని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. జగదీశ్‌రెడ్డిపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ జరిపితే ఆధారాలతో సహా రుజువు చేస్తానని చెప్పారు. కరీంనగర్‌లో గురువారం మీడియాతో మాట్లాడుతూ జగదీశ్‌రెడ్డికి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహిస్తే వాస్తవాలు బయటకొస్తాయన్నారు. ఒకవేళ తన తప్పుందని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బోగస్ అని, తాను హిట్లర్‌కు అయ్యనని చెప్పిన కేసీఆర్ ఆ నిధులను ఎందుకు విడుదల చేశారని ప్రశ్నించారు. నిధులు విడుదల చేయడం వెనుక జరిగిన బాగోతానికి సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలున్నాయని, ప్రభుత్వం దీనిపై ఓ కమి టీ వేసి విచారణ జరిపితే నిరూపిస్తానని చెప్పారు. రైల్వే బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పాలని టీఆర్‌ఎస్ నేతలను డిమాం డ్ చేశారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను సా ధించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నిరసన తెలపలేని దుస్థితిలో ఉన్న టీఆర్‌ఎస్ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.