ponnam prabhkar
-
దుబ్బాకలో గెలిచింది బీజేపీ కాదు..
సాక్షి, ఖమ్మం : దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవాలనే కసితో ప్రజలు బీజేపీకి ఓట్లు వేశారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే టీఆర్ఎస్లోకి పోతాడని బీజేపీ దుష్ర్పచారం చేసిందని, అందుకే బీజేపీ గెలిచిందని ఆరోపించారు. బుధవారం ఆయన పొన్నాల లక్ష్మయ్యతో కలిసి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో చేపట్టిన రైతు ట్రాక్టర్ల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నికల్లో సానుభూతితో రఘునందన్‌రావు గెలిచాడే తప్ప బీజేపీ గెలువలేదన్నారు. మాజీ పీసీసీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య మాట్లాతుడూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో నియంతృత్వ సాగువిధానం తీసుకురావటంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. కౌలు రైతులను నిండా ముంచిన ప్రభుత్వానికి వారి ఉసురు తగులుతుందని విమర్శించారు. భట్టి ర్యాలీకి ఘన స్వాగతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన రైతు వ్యతిరేక బిల్లులపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో చేపట్టిన రైతు ట్రాక్టర్ల ర్యాలీలో ప్రజలు, రైతులు కదం తొక్కారు. ఒక్కరుగా మొదలై వేల సంఖ్యలో రైతులు తమ ట్రాక్టర్లతో సహా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. భట్టి విక్రమార్క ర్యాలీకి ప్రజలు అడుగడుగునా జన నీరాజనం పలికారు. ప్రతి గ్రామంలో భట్టి బృందానికి పూలు జల్లుతూ.. డప్పులతో మోత మోగిస్తూ ఘన స్వాగతం పలికారు. మధిరలో మొదలైన ర్యాలీకి ప్రతి గ్రామంలో రైతులు తమంతకు తాముగా చేరారు. ఒకానొక దశలో ర్యాలీ అనుకన్న సమయం కన్నా ఆలస్యంగా ముందుకు సాగింది.సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు సారధ్యంలో జరుగుతున్న ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, మాజీ పీసీసీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య, కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ పోరుబాట
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు సిద్ధమవుతున్నట్లు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈనెల 29 నుంచి జూలై 3 వరకు ప్రజా సమస్యలపై నిరసనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం గాంధీభవన్‌లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఉత్తమ్ రాష్ట్రంలోని సమస్యలపై పార్టీ నేతలతో చర్చించారు. తెలంగాణ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ ఆర్.సి. కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, సంపత్‌కుమార్, ఎంపీ రేవంత్‌రెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, ఏఐసీసీ ట్రైనింగ్ సెల్ ఇన్చార్జి సచిన్ రావ్, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్‌రెడ్డిలతో పాటు పలువురు డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలు కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ఈనెల 28న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించాలని కోరారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా ఈనెల 29న జిల్లా కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈనెల 30న కరోనా వైరస్ నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో విలేకరుల సమావేశాలు నిర్వహించాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో పెరిగిన కరెంటు బిల్లులను నిరసిస్తూ జూలై 3న నల్ల బ్యాడ్జీలతో జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేయాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల నిర్వహణకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, ప్రధాన కార్యదర్శులు మహేష్‌కుమార్ గౌడ్, బొల్లు కిషన్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్‌లతో కూడిన ఒక కమిటీని కూడా ఉత్తమ్ ప్రకటించారు. -
దీనికి కేటీఆర్ సమాధానం చెప్పాలి: పొన్నం
సాక్షి, రాజన్న సిరిసిల్లా: మిడ్ మానేరు నుంచి కొండపోచమ్మ, రంగనాయక సాగర్ ప్రాజెక్టులకు నీరు ఎలా తరిలిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ను టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ ప్రాజెక్టుల కన్నా ముందే ప్రతిపాదించబడిన అప్పర్ మానేరు ప్రాజెక్టుకు ఎందుకు నీటిన తరలించడం లేదన్నారు. ఇది మీ అసమర్థతనా లేక ఉద్దేశపూర్వకంగానే ఇక్కడి ప్రాంత రైతులకు అన్యాయం చేస్తున్నారా అని మండిపడ్డారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. (నిర్మల.. యాక్సిడెంటల్ మినిస్టర్!) ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పర్ మానేరు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని చెప్పే మీరు, తెలంగాణ రాష్ట్రం సాధించుకొని 6 ఏళ్లు గడిచినా ఆ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాకపోతే ఎవరిది బాధ్యత అని ధ్వజమెత్తారు. ఈ విషయమై మంత్రి కేటీఆర్ ఎదురుదాడి కాకుండా, అప్పర్ మానేరు ప్రాజెక్టు పర్యటనకు వచ్చి నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారో ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. లేకపోతే కాంగ్రెస్ పక్షాన కార్యాచరణ రూపొందిస్తామని, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి పుర్వవైభవం వస్తుందని పేర్కొన్నారు. కష్టకాలంలో పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ప్రాధాన్యత ఇస్తామని ఆయన వ్యాఖ్యానించారు. -
‘కల్వకుంట్ల రాజ్యాంగం చెల్లదు’
హైదరాబాద్: కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేల విలీనం లేఖపై ఎంపీ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాం గం చెల్లుతుందే గానీ కల్వకుంట్ల రాజ్యాంగం చెల్లదంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మల్కాజిగిరిలో గురువారం ఆయన పర్యటించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ప్రగతిభవన్‌ను సీఎం అధికారికంగా ఉపయోగిస్తున్నప్పుడు కేటీఆర్ అక్కడ ఉండటమే తప్పన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రగతిభవన్‌లో కేటీఆర్ విందుకు ఆహ్వానించడం అధికార దుర్వినియోగమేనన్నారు. కేసీఆర్‌కు 88 ఎమ్మెల్యే సీట్లనిచ్చి గెలిపించారని అయితే ఆయన అభివృద్ధిపై కాకుండా ఫిరాయింపులపై దృష్టి సారిస్తున్నారన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 70ఏళ్లలో పలు ప్రభుత్వాలు ప్రతిపక్షాలు లేకుండా పాలన సాగించలేకపోయాయన్నారు. ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఫిరా యింపు చేయని వారినే గెలిపించారన్నారు. నిజామాబాద్, కరీంనగర్లో కర్రు కాల్చి ప్రజలు వాతపెట్టారని ఆ ఓటమి నుంచి టీఆర్ఎస్ పాఠాలు నేర్చుకోవాలన్నారు. ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలి: పొన్నం కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ కొనుగోలు చేయడం సిగ్గుచేటని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఒక దళితుడు ప్రతిపక్ష నేతగా ఉండడాన్ని జీర్ణించుకోలేని టీఆర్ఎస్, ప్రతిపక్షం లేకుండా చేయడానికి కుట్ర చేస్తోందని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని ఆయన డిమాండ్ చేశారు. కోర్టులో అనర్హత పిటిషన్ పెండింగ్‌లో ఉండ గా విలీన ప్రక్రియ ప్రయత్నాలు చేయడమేమిటని ప్రశ్నించారు. దీనిపై మా ఎమ్మెల్యేలు నిరసనలు చేస్తే అరెస్టు చేసి కేసులు పెడతారా అని నిలదీశారు. గతంలో మేము చేసిన అనేక ఫిర్యాదులపై ఇప్పటివరకు స్పీకర్ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు పార్టీలో ఉంటారో చెప్పలేని పరిస్థితి: విజయశాంతి వేసే ఓట్లు ఏమౌతున్నాయో, ఓట్లు వేశాక గెలిచే అభ్యర్థులు ఎటు పోతారో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజానీకం సతమతమవుతూ ఉందని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి పేర్కొన్నారు. గెలిచాక ఈ అభ్యర్థి మన పార్టీలోఉంటారా..? అనే కార్యకర్తల ఆవేదనకు సమాధానం చెప్పలేని స్థితిలో తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విలీనంపై సుప్రీంని ఆశ్రయిస్తాం: కుసుమ కుమార్(టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కుసుమ కుమార్) సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అసెంబ్లీ సాక్షిగా చంపేశారని టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు జెట్టి కుసుమ కుమార్ విమర్శించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేకుండా 12 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీ సమావేశం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉండగా సీఎల్పీ విలీన లేఖను స్పీకర్ ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ అప్రజాస్వామిక విధానాలపై సుప్రీంకోర్టుకు వెళతామని ఆయన స్పష్టం చేశారు. -
దావాను ఎదుర్కొంటా: పొన్నం
-
దావాను ఎదుర్కొంటా: పొన్నం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి తనపై వేసిన పరువు నష్టం దావాను న్యాయపరంగా ఎదుర్కొంటానని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. జగదీశ్‌రెడ్డిపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ జరిపితే ఆధారాలతో సహా రుజువు చేస్తానని చెప్పారు. కరీంనగర్లో గురువారం మీడియాతో మాట్లాడుతూ జగదీశ్‌రెడ్డికి లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహిస్తే వాస్తవాలు బయటకొస్తాయన్నారు. ఒకవేళ తన తప్పుందని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బోగస్ అని, తాను హిట్లర్‌కు అయ్యనని చెప్పిన కేసీఆర్ ఆ నిధులను ఎందుకు విడుదల చేశారని ప్రశ్నించారు. నిధులు విడుదల చేయడం వెనుక జరిగిన బాగోతానికి సంబంధించి తన దగ్గర అన్ని ఆధారాలున్నాయని, ప్రభుత్వం దీనిపై ఓ కమి టీ వేసి విచారణ జరిపితే నిరూపిస్తానని చెప్పారు. రైల్వే బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పాలని టీఆర్ఎస్ నేతలను డిమాం డ్ చేశారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను సా ధించుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నిరసన తెలపలేని దుస్థితిలో ఉన్న టీఆర్ఎస్ నేతలు ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు.