సాక్షి, రాజన్న సిరిసిల్లా: మిడ్ మానేరు నుంచి కొండపోచమ్మ, రంగనాయక సాగర్ ప్రాజెక్టులకు నీరు ఎలా తరిలిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ను టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ ప్రాజెక్టుల కన్నా ముందే ప్రతిపాదించబడిన అప్పర్ మానేరు ప్రాజెక్టుకు ఎందుకు నీటిన తరలించడం లేదన్నారు. ఇది మీ అసమర్థతనా లేక ఉద్దేశపూర్వకంగానే ఇక్కడి ప్రాంత రైతులకు అన్యాయం చేస్తున్నారా అని మండిపడ్డారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. (నిర్మల.. యాక్సిడెంటల్ మినిస్టర్!)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పర్ మానేరు ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారని చెప్పే మీరు, తెలంగాణ రాష్ట్రం సాధించుకొని 6 ఏళ్లు గడిచినా ఆ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాకపోతే ఎవరిది బాధ్యత అని ధ్వజమెత్తారు. ఈ విషయమై మంత్రి కేటీఆర్ ఎదురుదాడి కాకుండా, అప్పర్ మానేరు ప్రాజెక్టు పర్యటనకు వచ్చి నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారో ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. లేకపోతే కాంగ్రెస్ పక్షాన కార్యాచరణ రూపొందిస్తామని, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి పుర్వవైభవం వస్తుందని పేర్కొన్నారు. కష్టకాలంలో పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ప్రాధాన్యత ఇస్తామని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment