సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పరువునష్టం కేసు దాఖలైంది. తన పరువుకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వ్యాపారవేత్త సూదిని సృజన్‌రెడ్డి శనివారం నాంపల్లిలోని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజి్రస్టేట్ వద్ద పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ వచ్చే వారం జడ్జి ముందుకు వచ్చే అవకాశం ఉంది.
షోధా కన్‌స్ట్రక్షన్ కంపెనీతో తనకు లింక్ చేస్తూ కేటీఆర్ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంతర్‌రెడ్డి తన సొంత బావ అని, అందుకే షోధా కంపెనీకి రూ.2 కోట్ల లాభాన్ని ఇచ్చారని, అర్హతలేని కాంట్రాక్టులను పొందానని కేటీఆర్ తప్పుడు వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఆ కంపెనీలో తనకు ఎలాంటి షేర్లు లేవని, తాను ఆ సంస్థకు డైరెక్టర్‌ను కూడా కాదని చెప్పారు. ఈ సంస్థకు ఎండీగా కందాల దీప్తిరెడ్డి ఉన్నారని సృజన్‌రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇండియన్ హ్యూమ్ పైప్ కంపెనీ పేరుతో రూ.1,137.77 కోట్ల ప్రజా ధనాన్ని వృ«థా చేశారంటూ కేటీఆర్ తప్పుడు ప్రకటనలు చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment