సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్‌లో చేరికలపై సీనియర్లలో అసంతృప్తి నెలకొందని వస్తున్న ఊహాగానాలపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్పందించారు. స్థానిక నేతలను సంప్రదించకుండా.. ఎవరినీ పార్టీలోకి తీసుకోబోమని స్పష్టం చేశారాయన. బుధవారం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన నివాసంలో కలిసిన రేవంత్.. చేరికలు ఇతర పరిణామాలపై చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..
చేరికలపై ఎలాంటి విభేదాలు లేవు. పొంగులేటికి నల్లగొండకు ఏం సంబంధం?. నల్లగొండలో కాంగ్రెస్‌లో చేరికలపై రకరకాల కథనాలు వస్తున్నాయి. కానీ, అలాంటిదేమైనా ఉంటే కోమటిరెడ్డి, ఉత్తమ్, జానారెడ్డిలతో చర్చిస్తాం. ఈ ముగ్గురిని సంప్రదించాకే.. ఎవరినైనా పార్టీలోకి తీసుకుంటాం. చాలామంది పార్టీలో చేరతామని వస్తున్నారు. కానీ, స్థానిక నేతలను అడగకుండా ఎవరినీ తీసుకోం. కోమటిరెడ్డి, నేనూ కలిసి పని చేస్తాం. రాహుల్‌ను ప్రధానిని చేసేంత వరకూ కలిసి పని చేస్తాం. లోక్‌సభ ఎన్నికల్లో 15 సీట్లు గెలిపించేందుకు కృషి చేస్తాం అని తెలిపారాయన.
అధికారంలోకి వచ్చినా.. కలిసే ఉంటామన్నారు పార్టీ సీనియర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. అధికారంలోకి వచ్చాక కూడా కలిసే ఉంటాం. రేవంత్ నేనూ సోదరులుగా ఉంటాం. ఉత్తమ్, జానారెడ్డికి తెలియకుండా చేరికలు ఏవీ జరగవు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే మా లక్ష్యం అని పేర్కొన్నారాయన.
భేటీ అనంతరం ఇద్దరూ కలిసి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటికి వెళ్లారు. అక్కడ జూపల్లి మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ భూస్థాపితం అవడం ఖాయం. కేసీఆర్ పాలన ఇక చాలని ప్రజలు అనుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
ఇక వేముల వీరేశం, శశిధర్‌రెడ్డి చేరికలపై(ప్రయత్నాలపై) అలకబూనినట్లుగా జరుగుతున్న ప్రచారంపై మరో సీనియర్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పందించాల్సి ఉంది.
ఇదీ చదవండి: ఓరుగల్లులో డైలాగ్ వార్
Comments
Please login to add a commentAdd a comment