సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి. మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సహా దాదాపు 30 మంది నేతలు హాజరయ్యారు.
ఉమ్మడి కార్యాచరణ, జనంలోకి ఎలా వెళ్లలనేదానిపై కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు. ఉచిత విద్యుత్ అంశం, పార్టీలో చేరికల అంశం చర్చలోకి రానుంది. ఇక కర్ణాటకలో ఎన్నికల సక్సెస్ స్ట్రాటజీని తెలంగాణలో అమలు చేసే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయిదు అంశాలతో ప్రజలకు గ్యారంటీ కార్డు ఇచ్చేందుకు హస్తం యోచిస్తున్నట్లు సమాచారం.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌లో చేరికలపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. పార్టీ నేతలంతా 119 నియోజకవర్గాలు తిరిగేలా ప్లాన్ చేస్తే బాగుంటుందన్నారు. బస్సు యాత్ర చేపట్టాలని సలాహా ఇస్తానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తామని కోమటిరెడ్డి తెలిపారు.
చదవండి: సందీప్ సుల్తానియా వ్యవహారశైలిపై అధికారులు, ఉద్యోగుల ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment