
యడ్యూరప్పపై అక్రమాస్తుల కేసు విచారణ
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ యడ్యూరప్పను ఆదాయానికి మించి ఆస్తుల కేసు వెంటాడుతోంది.
బెంగళూరు: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ యడ్యూరప్పను ఆదాయానికి మించి ఆస్తుల కేసు వెంటాడుతోంది. బెంగళూరు హైకోర్టులో ఆయనకు చుక్కెదురైంది. అక్రమాస్తుల కేసులో పిటిషన్ను స్వీకరించి విచారణ చేయాలని హైకోర్టు షిమోగా కోర్టును ఆదేశించింది.
యడ్యూరప్ప షిమోగాలో అటవీ భూమిని ఆక్రమించినట్టు ఆరోపణలు వచ్చాయి. కాగా కేసు విచారణకు గతంలో షిమోగా కోర్టు నిరాకరించింది. కేసు విచారణకు అనుమతి లేదంటూ ఎఫ్ఐఆర్ను కొట్టివేసింది. అయితే ఈ కేసును కొత్తగా విచారించాల్సిందిగా హైకోర్టు షిమోగా కోర్టును ఆదేశించింది. గతంలో అవినీతి ఆరోపణలు రావడంతో యడ్యూరప్ప కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అనంతరం బీజేపీని వీడిన యడ్యూరప్ప కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం మళ్లీ సొంతగూటికి వెళ్లారు.