
బెంగళూరు: మరాఠ అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ్ సవాడి ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పతో సోమవారం సమావేశమయ్యారు. లింగాయత్‌లు సైతం తమకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నందున ‘వీరశైవ లింగాయత్ బోర్డు’ ఏర్పాటు చేయాలని ఆయన సీఎంను కోరారు. ఇదే అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎం పాటిల్, జేడీఎస్ ఎమ్మెల్సీ బసవరాజ్ హొరాట్టి సైతం ముఖ్యమంత్రికి ఇంతకు ముందే లేఖ రాశారు. (చదవండి: నితీష్‌పై ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర ట్వీట్)
మరాఠ అభివృద్ధి బోర్డు ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి లింగాయత్‌లకు సైతం ప్రత్యేక అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పలు కన్నడ అనుబంధ సంస్థలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. మరాఠి మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్న ఉత్తర కర్ణాటకలో త్వరలో ఉప ఎన్నికలు జరగొచ్చనే ఊహాగానాల నేపథ్యంలో యడ్యూరప్ప సర్కార్ మరాఠ బోర్డు ఏర్పాటుకు రూ.50 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. బసవకళ్యాణ్, మస్కీ అసెంబ్లీ స్థానాలతో పాటు బెల్గావి లోక్‌సభ ఉప ఎన్నికలకు త్వరలో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గతంలోనూ సీరా, ఆర్‌ఆర్ నగర్ ఉప ఎన్నికల సందర్భంగా ‘కడుగొల్ల అభివృద్ధి సంస్థ’ ఏర్పాటు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రతో సరిహద్దు వివాదాలున్న కారణంగా కన్నడ ఉద్యమ నాయకుడు వి నాగరాజ్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. (చదవండి: 35 ఏళ్లుగా పోటీకి దూరం.. ఏడోసారి సీఎం)
Comments
Please login to add a commentAdd a comment