
సాక్షి, బెంగళూరు : బీజేపీ స్టార్ క్యాంపెయినర్, సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్ప అనుకున్నది సాధించారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని ముందుండి విజయతీరాలకు చేర్చిన ఆయన మరోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో బీజేపీ విజయంపై యెడ్డీ మొదటినుంచి ధీమాగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు ఈ నెల 17న ముఖ్యమంత్రిగా తాను ప్రమాణం స్వీకారం చేయబోతున్నట్టు యెడ్డీ ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
ఎన్నికల తర్వాత బీజేపీకి 125-130 స్థానాలు వస్తాయని అంచనా వేశారు. ఆయన అంచనాకు దగ్గరదగ్గరగా బీజేపీ సాధారణ మెజారిటీని సాధించింది. వ్యక్తిగతంగా షికారిపుర నియోజకవర్గంలో 20వేలకుపైగా ఓట్ల మెజారిటీతో యడ్యూరప్ప ఘనవిజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఉత్సాహంగా ఉన్న యడ్యూరప్ప మంగళవారం బీజేపీ అధినేత అమిత్‌షాతో ఫోన్‌లో మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా యడ్యూరప్పకు అమిత్ షా అభినందనలు తెలిపారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఢిల్లీలో భేటీ కానుంది. ఈ భేటీలో కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే అవకాశముంది. ముందే బీజేపీ సీఎం అభ్యర్థిగా యడ్యూరప్పను ప్రకటించడంతో ఆయన ఎంపిక లాంఛనమేనని భావిస్తున్నారు. వ్య