ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముంగిట రాష్ట్రంలో అధికారుల తనిఖీలు ముమ్మరం చేశారు. సాధారణ పౌరులతోపాటు ప్రముఖ రాజకీయ నేతల వాహనాలను క్షణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే, శిసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే, సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ దేవేంద్ర ఫడ్నవీస్‌ల వాహనాలను సైతం తనిఖీ చేశారు.
తాజాగా హింగోలి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం కోసం వచ్చిన హోంమంత్రి అమిత్ షా హెలికాప్టర్‌లో ఎన్నికల సంఘం అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఆయన బ్యాగ్‌లను చెక్ చేశారు. ఈ విషయాన్ని అమిత్ షా నే స్వయంగా వెల్లడించారు. తనిఖీలకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు.
‘ఎన్నికల ప్రచారం మహారాష్ట్రలోని హింగోలి అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చిన క్రమంలో నా హెలికాప్టర్‌ను ఈసీ అధికారులు తనిఖీ చేశారు. నిష్పక్షపాత, ఆరోగ్యకరమైన ఎన్నికల వ్యవస్థను బీజేపీ విశ్వసిస్తోంది. ఎన్నికల సంఘం రూపొందించిన అన్ని నిబంధనలను పాటిస్తుంది. ఎన్నికల నిర్వహణ సజావుగా సాగేందుకు మనమంతా సహకరించాలి. ప్రపంచంలో శక్తిమంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థగా భారత్‌ను కొనసాగించడంలో మన బాధ్యతలను నిర్వర్తించాలి’ అని అమిత్ షా పేర్కొన్నారు.
आज महाराष्ट्र की हिंगोली विधानसभा में चुनाव प्रचार के दौरान चुनाव आयोग के अधिकारियों के द्वारा मेरे हेलिकॉप्टर की जाँच की गई।
भाजपा निष्पक्ष चुनाव और स्वस्थ चुनाव प्रणाली में विश्वास रखती है और माननीय चुनाव आयोग द्वारा बनाए गए सभी नियमों का पालन करती है।
एक स्वस्थ चुनाव… pic.twitter.com/70gjuH2ZfT— Amit Shah (@AmitShah) November 15, 2024
Comments
Please login to add a commentAdd a comment