
సాక్షి, బెంగళూరు: ప్రతిపక్షాల విమర్శలకు తెరదించుతూ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ఎట్టకేలకు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. తన క్యాబినేట్‌లో మొత్తం 17 మందికి అవకాశం కల్పించారు. వీరంతా మంగళవారం గవర్నర్ వాజూభాయ్ వాలా సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కావస్తున్నా ఇంతవరకు మంత్రివర్గం ఏర్పాటు కాలేదనే విమర్శలు వినిపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక కసరత్తుల తరువాత మంత్రివర్గం ఏర్పాటు చేస్తానని సోమవారం సీఎం యడియూరప్ప ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి కేంద్రం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు.
వీరే మంత్రులు..
సోమన్న రవి, బసవరాజు, నివాస్ పుజారి, మధుస్వామి, చిన్నప్పగౌడ, నగేష్, ప్రభు చవాన్, శశికళ, అన్నాసాహెబ్, గోవింద్, అశ్వస్థ నారాయణ్, ఈశ్వరప్ప, అశోక్, జగదీష్ షెట్టర్, శ్రీ రాములు, సురేష్ కుమార్, చంద్రకాంత్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment